gandhi talks: మూకీ సినిమా ‘గాంధీ టాక్స్’.. ఇప్పుడు వర్కవుట్ అవుతుందా?

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఇంటర్నెట్‌డెస్క్: ‘పుష్పక విమానం’.. భారతీయ సినీ చరిత్రలో అద్భుతమైన ప్రయోగం. మాస్, కమర్షియల్ కథలు రాజ్యమేలుతున్న సమయంలో సింగీతం శ్రీనివాసరావు, నటుడు కమల్ హాసన్ చేసిన ప్రయోగానికి ప్రేక్షకలోకం ఫిదా అయింది. విశేష ఆదరణ సొంతం చేసుకుంది. ఇప్పుడు సినిమాల్లో ఆ కమర్షియాలిటీ రెట్టింపు అయింది. హీరో సెంట్రిక్ కథలే బాక్సాఫీస్‌కు కాసుల గలగలలు. ఇలాంటి సమయంలో ప్రయోగాలకు దిగే నటీనటులు, దర్శకులు చాలా అరుదు. ఇటీవల ‘భ్రమయుగం’ అంటూ మమ్ముట్టి బ్లాక్ అండ్ వైట్ మూవీతో అలరించారు. ఇప్పుడు తాము కూడా అలాంటి సాహసమే చేస్తామంటోంది ‘గాంధీ టాక్స్’ (Gandhi Talks) టీమ్. విజయ్ సేతుపతి, అదితి రావు హైదరీ, అరవిందస్వామి, సిద్ధార్థ్ జాదవ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న మూకీ చిత్రమిది. కిషోర్ పి. బెలేకర్ దర్శకుడు. ‘వాళ్లు మౌనంగా ప్రేమిస్తారు. వారు మౌనంగా పాపం చేస్తారు.. వారు మౌనంగానే ఇబ్బందులు పడతారు’ అంటూ టీమ్ టీజర్‌ను పంచుకుంది.
అసలు బాధ్యత సంగీత దర్శకుడిదే..!
‘మ్యూజిక్‌ను ఎక్కడ వాడాలో కాదు.. ఎక్కడ ఆపాలో తెలిసిన వాడే అసలైన సంగీత దర్శకుడు’ అంటారు దేవిశ్రీ ప్రసాద్. ‘గాంధీ టాక్స్’కు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాలకు ఊపిరిలూదేది సంగీతమే. సన్నివేశాలకు తగినట్టు అది ఎంత హృద్యంగా ఉంటే, ప్రేక్షకుడు కథలో అంత లీనమవుతాడు. తాజాగా విడుదల చేసిన టీజర్‌లో ఏఆర్ రెహమాన్ మేజిక్ కనపడుతోంది. ‘రఘుపతి రాఘవ రాజారాం’ పాటను వాయిద్య పరికరాలపై వినిపించిన తీరు వినసొంపుగా ఉంది. చివరిలో కాయిన్ సౌండ్‌ను బట్టి చూస్తే, నేటి సమాజంలో డబ్బు, మనషుల అవసరాలు చుట్టూ తిరిగే ఓ సరికొత్త కథాంశంతో దీన్ని తీర్చిదిద్దినట్లు అర్థమవుతోంది. జనవరి 30న (gandhi talks release date) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ సేతుపతి, అరవింద స్వామిలాంటి నటులు నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. మరి మాటలు లేకుండా రాబోతున్న ఈ ‘గాంధీ టాక్స్’ వర్కవుట్ అవుతుందా? లేదా? అన్నది కాలమే సమాధానం చెబుతుంది.
► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :
గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- మరో చారిత్రకగాథతో సంజయ్ లీలా భన్సాలీ.. ‘జై సోమనాథ్’ భారతీయ సినీ ప్రేక్షకులను అలరించడానికి మరో చారిత్రక కథ సిద్ధమవుతోంది. లార్జర్ దేన్ లైఫ్ కథలను అందించడంలో బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ సిద్ధహస్తులు.
- చిన్న ఛేంజ్.. థియేటర్లలోకి ‘సాంప్రదాయిని సుప్పిని..’రిలీజ్ ఆ రోజే.. సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ (ఎస్‌ఎస్‌ఎస్) విడుదలలో చిన్న మార్పు చోటుచేసుకుంది.
- ఆ జాబితాలోకి ‘ది ప్యారడైజ్’.. కొత్త విడుదల తేదీ వచ్చేసింది నాని హీరోగా తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ సినిమా విడుదల వాయిదా పడింది.
- దర్శకురాలిగా వరలక్ష్మీ శరత్‌కుమార్.. అలరిస్తున్న ప్రమోషనల్ వీడియో నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. దర్శకురాలిగా ఓ సినిమాని ప్రకటించారు.
- అందుకే మా సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్ : ‘కపుల్ ఫ్రెండ్లీ’ నిర్మాత ‘కపుల్ ఫ్రెండ్లీ’ విషయంలో సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పిందని ధీరజ్ మొగిలినేని తెలిపారు.
- వాలెంటైన్స్ డే స్పెషల్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే! వాలెంటైన్స్ డే సందర్భంగా పలు ఆసక్తికర చిత్రాలు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నాయి. అటు థియేటర్‌తో పాటు, ఇటు ఓటీటీలోనూ అలరించే చిత్రాలేంటో చూసేయండి.
- 2027 సంక్రాంతికి అక్కినేని హీరో మూవీ.. ‘అన్నపూర్ణ స్టూడియోస్’ ఆసక్తికర పోస్టు తమ నిర్మాణ సంస్థ నుంచి వచ్చే ఏడాది సంక్రాంతికి ఓ సినిమా వస్తుందని ‘అన్నపూర్ణ స్టూడియోస్’ ప్రకటించింది.
- ఈ కథ చిరంజీవికి బాగా తెలుసు.. విజయ్ సేతుపతిని అనుకున్నా కానీ: అర్జున్ తాను డైరెక్ట్ చేసిన ‘సీతాపయనం’ గురించి అర్జున్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
- పవర్‌ఫుల్ టైటిల్‌తో తరుణ్ భాస్కర్ మూవీ.. ‘జీపీఎస్’ అంటే ఇదే తరుణ్ భాస్కర్ కొత్త టైటిల్‌ను ప్రకటించారు. ఆయన హీరోగా తెరకెక్కుతున్న రెండో చిత్రమిది.
- రామ్‌చరణ్ ‘పెద్ది’ వాయిదా.. కొత్త విడుదల తేదీ ఇదే రామ్‌చరణ్ సినిమా ‘పెద్ది’ విడుదల వాయిదా పడింది.
- పవన్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’.. రిలీజ్ డేట్ ఫిక్స్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ విడుదల తేదీ ఖరారైంది.
- ‘డెకాయిట్’ మరోసారి వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే అడివి శేష్ ప్రధాన పాత్రలో రానున్న ‘డెకాయిట్’ మరోసారి వాయిదా పడింది
- ‘వారణాసి’కి ‘అవతార్’తో పోలిక.. రాజమౌళి ఏమన్నారంటే! ‘వారణాసి’ కోసం రాజమౌళికి ప్రియాంక చోప్రా ఒక విజ్ఞప్తి చేశారు. తాజా ఇంటర్వ్యూలో ఆమె దాని గురించి వివరించారు.
- వేసవిలో ‘బైకర్’.. శర్వా మూవీ కొత్త విడుదల తేదీ ఇదే శర్వానంద్ హీరోగా తెరకెక్కిన ‘బైకర్’ సినిమా విడుదల తేదీ ఖరారైంది.
- ధనుష్- సాయి పల్లవి జోడీ.. మరోసారి.. ఆ హిట్ డైరెక్టర్‌తో ధనుష్, సాయి పల్లవి మరో సినిమాలో సందడి చేయనున్నారు.
- ఈ వారం థియేటర్‌లో చిన్న చిత్రాలదే హవా.. ఓటీటీలో వినోదం వాటిదే! 2026లో మరో నెల ముగిసింది. ఫిబ్రవరి మొదటి వారంలో ప్రేక్షకులను అలరించడానికి పలు ఆసక్తికర చిత్రాలు రాబోతున్నాయి. ఓటీటీలో ఆసక్తికర చిత్రాలు వస్తున్నాయి. మరి అవేంటో చూసేయండి.
- 94 ఏళ్ల వయసులో సింగీతం కొత్త మూవీ.. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ వైవిధ్యంగా సినిమాలు తీయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.. ప్రయోగాత్మక చిత్రాలకే కేరాఫ్ అడ్రస్.. మాటలే లేకుండా మూవీ తీసిన సినీ రుషి.
- ‘వారణాసి’ విడుదల అప్పుడే.. ప్రకటించిన రాజమౌళి ‘వారణాసి’ (Varanasi) విడుదల తేదీపై క్లారిటీ వచ్చింది.
- టాలీవుడ్‌కు కొత్తందం.. రషా థడానీ ఫస్ట్‌లుక్ చూశారా! ‘శ్రీనివాస మంగాపురం’ నుంచి రషా థడానీ లుక్‌ను రిలీజ్ చేశారు.
- ‘ఓం శాంతి శాంతి శాంతిః’ టికెట్స్.. ఒకటి కొంటే మరొకటి ఫ్రీ.. వారికి మాత్రమే! ‘ఓం శాంతి శాంతి శాంతిః’ చిత్ర బృందం టికెట్లపై ఆఫర్ ప్రకటించింది.