BJLP Maheshwar Reddy Serious Comments On Congress

సాక్షి, హైదరాబాద్‌:తెలంగాణకు అన్యాయం జరిగింది అంటే మొదటి ముద్దాయి కాంగ్రెస్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేఎల్పీ నేత మహేశ్వర్‌ రెడ్డి. బీఆర్‌ఎస్‌ పాలనలో సాగు నీళ్ల ముసుగులో నిధులు మహా దోపిడీకి గురయ్యాయి. అదే బాటలో రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది అంటూ విమర్శలు గుప్పించారు. సభను భజన మండలిగా మార్చారు అంటూ మండిపడ్డారు.

కృష్ణ జలాలపై మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో సభ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు వాకౌట్‌ చేశారు. అనంతరం, బీజేఎల్పీ మహేశ్వర్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణకు పటేల్ వరం అయితే.. నెహ్రూ శాపం. పటేల్ రజాకర్ల నుంచి విముక్తి చేస్తే.. నెహ్రూ తెలంగాణను ఆంధ్రాలో కలిపి ద్రోహం చేశారు. జల దోపిడికి నెహ్రూ చేసిన పనితోనే శ్రీకారం పడింది. బీఆర్‌ఎస్‌ పాలనలో సాగు నీళ్ల ముసుగులో నిధులు మహా దోపిడీకి గురయ్యాయి. అదే బాటలో రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోంది. దేశ రాజకీయాలలో చక్రం తిప్పాలని దురాశతో ఏపీకి సాగు నీళ్ళను దారాదత్తం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఆస్థాన గుత్తదారుల జేబులు నింపడానికి అదే పని చేస్తుంది. నాగార్జున సాగర్ తెలంగాణకు వచ్చే ఎడమ కాల్వను పైకి కట్టి, కుడి కాల్వను కిందకు కట్టి దోపిడిని ఆరోజే ప్రారంభించారు. తెలంగాణ కోసం చేపట్టిన ఎస్‌ఎల్‌బీసీ అంతా గందరగోళం.. ఇంకా పూర్తి కాలేదు.

సభలో కాంగ్రెస్‌ తరఫున 25 మంది ఎమ్మెల్యేలు మాట్లాడారు. బీజేపీ నుండి ఒక్కరికీ మాత్రమే ఇచ్చారు. బీజేపీ నుండి మరొకరికి అవకాశం అడిగితే ఇవ్వలేదు. బీఆర్ఎస్ ఎలాగో సభలో లేనే లేదు.. ప్రతిపక్షంగా మాకు అవకాశం ఇవ్వచ్చు కదా?. ఎంఐఎం, సీపీఐతో డబ్బా కొట్టించుకున్నారు. సభను భజన మండలిగా మార్చారు’ అంటూ సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు. 


English Translation
BJLP Maheshwar Reddy Serious Comments On Congress

Sakshi, Hyderabad:Injustice to Telangana. BJLP leader Maheshwar Reddy made sensational comments that what happened means Congress is the first defendant. Under the regime of BRS, funds were looted under the guise of irrigation water. He criticized the Revanth Congress government for running on the same path. They said that the House has been turned into a Bhajan Mandali.

BJP MLAs walked out of the House as they were not given a chance to speak on Krishna Jal. Later, Maheshwar Reddy of BJLP spoke to the media. If Patel is freed from Razakars... Nehru betrayed Telangana by merging it with Andhra. It was Nehru's work that started water exploitation. Under the regime of BRS, funds were looted under the guise of irrigation water. The Revanth Congress government is running on the same path. If the Congress government steals irrigation water from AP out of greed to turn the wheel of the country's politics, the Congress government will do the same to fill the pockets of the court monopolists. Nagarjuna Sagar tied up the left canal coming to Telangana and tied down the right canal and started looting on the same day. All the SLBC undertaken for Telangana is a mess.. it has not been completed yet.

25 MLAs spoke on behalf of Congress in the House. Only one person was given from BJP. If someone else from BJP was asked for a chance, it was not given. Somehow BRS is not in the House.. Can we be given a chance as the opposition? They clashed with MIM and CPI. He made satirical comments saying that the assembly has been turned into a bhajan council.