
రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన డిజిటల్ సేవల విభాగం జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకి సిద్ధమవుతున్నవేళ జియో (Jio) పుట్టుకకు సంబంధించిన ఆసక్తికరమైన కథనాన్ని రిలయన్స్ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇషా అంబానీ (Isha Ambani) పంచుకున్నారు. జియో ప్రారంభం వెనుక కథ ఇపుడు నెట్టింట విశేషంగ ఆనిలుస్తోంది.
జియో ప్లాట్‌ఫామ్స్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) కోసం రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (RHP) దాఖలు చేసిన తర్వాత విలేకరుల సమావేశంలో ఇషా అంబానీ జియో కంపెనీ ఆవిర్భావానికి తన సోదరుడు ఆకాష్ అంబానీతో పంచుకున్న ఒక అనుభవమే కారణమని పేర్కొన్నారు.
అమెరికాలో చదువుకుంటున్న ఈషా అంబానీ, ఆకాశ్ అంబానీలు సెలవులకు ముంబైలోని తమ ఇంటికి వచ్చినప్పుడు ఒక ఘటన జరిగింది. ఈషా తన కాలేజీ అసైన్మెంట్ను ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉండగా, ఇంటర్నెట్ సరిగ్గా పని చేయకపోవడంతో సబ్మిట్ చేయలేకపోయారు. దీంతో దేశంలో డేటాసేవలు, ఇంటర్నెట్ వేగం మీద ఆలోచన మొదలైంది. అమెరికాలో ఉన్న మెరుగైన ఇంటర్నెట్ కనెక్టివిటీ భారత్‌లో ఎందుకు లేదు? అనే విషయమై ఇషా అంబానీ, ఆకాశ్ అంబానీ మధ్య చర్చ జరిగింది. ఆ చర్చోపచర్చలే జియో ఆవిర్భావానికి నాంది పలికాయి.
భారత్‌లోని ఇంటర్నెట్ డిమాండ్‌ను తీర్చడానికి ఒక డిజిటల్ టెక్నాలజీ ప్లాట్‌ఫారమ్‌ను సృష్టించాలని ఆకాశ్ అంబానీ భావించారు. ఈ ఆలోచనే 2016 సెప్టెంబర్‌లో రిలయన్స్ జియో వాణిజ్య పరంగా ప్రారంభం కావడానికి మార్గం సుగమం చేసింది. ప్రారంభంలోనే జియో అన్లిమిడెట్ వాయిస్ ,డేటా సేవలతో మార్కెట్లోకి ప్రవేశించి, భారతదేశంలో మొబైల్ ఇంటర్నెట్ సేవల్లో విప్లవం సృష్టించింది. దాదాపు ఒక దశాబ్దం తరువాత, రిలయన్స్ జియో పబ్లిక్ మార్కెట్లలోకి ప్రవేశించడానికి సిద్ధమవుతోంది. దేశంలోనే అతిపెద్ద ఐపీఓతో చరిత్ర సృష్టించడానికి సిద్ధమవుతోంది.
ఇదీ చదవండి: చికాగోలో సామూహిక అత్యాచారం కలకలం : ‘నా టర్న్’ఎపుడు అంటూ రచ్చ?!
జియో ఐపీవో (IPO) విశేషాలు
జియో ప్లాట్‌ఫామ్స్ తన తొలి పబ్లిక్ ఆఫరింగ్ (IPO) కోసం రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ (RHP) ను ఇప్పటికే దాఖలు చేసింది. ఈ ఐపీఓ అక్టోబర్ 21న ప్రారంభమై, అక్టోబర్ 23న ముగియనుంది. ఈ సందర్భంగా జియో మేనేజింగ్ డైరెక్టర్ ఆకాష్ అంబానీ మాట్లాడుతూ భారతదేశాన్ని డేటా సమృద్ధిగా లభించే దేశంగా మార్చడమే జియో లక్ష్యమని పేర్కొన్నారు. జియో అత్యంత వేగవంతమైన 4G నుండి 5Gకి పరివర్తనను సాధించిందని ఆకాష్ అంబానీ పేర్కొన్నారు. సరఫరా పరిమితుల కారణంగానే దేశంలో గతంలో డేటా కొరత ఉండేదని, 14వ ఆపరేటర్‌గా 2016లో తాము మార్కెట్లోకి ప్రవేశించే నాటికి వన్ జీబీ డేటా సుమారు రూ. 228 ధర ఉండేదని, డౌన్లోడ్ వేగం 2.5 Mbps ఉండేదని గుర్తు చేశారు. ఐపీఓ ద్వారా వచ్చిన నిధులు అప్పులు తగ్గించడానికే ఉపయోగ పడతాయనీ, జియో అప్పులు లేని సంస్థగా మారే దిశగా పయనిస్తోందన్నారు.
ఇదీ చదవండి:జర్మనీలో అగ్నిప్రమాదం : ముగ్గురు భారతీయులు సజీవ దహనం
English Translation
Translation pending...