Pants unbeaten 67 propels Delhi to eight-wicket win over Services

విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో ఒడిశా చేతిలో అనుహ్యంగా ఓటమి చవిచూసిన ఢిల్లీ జట్టు తిరిగి విజయ బాటలో పడింది. ఈ టోర్నీలో భాగంగా శనివారం సర్వీసెస్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఢిల్లీ ఘన విజయాన్ని అందుకుంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన స‌ర్వీసెస్ 42.5 ఓవర్లలో 178 పరుగులకే కుప్పకూలింది. ఢిల్లీ స్పీడ్‌ స్టార్‌ హర్షిత్‌ రాణా 4 వికెట్లు పడగొట్టి సర్వీసెస్‌ పతనాన్ని శాసించాడు. అతడితో పాటు ప్రిన్స్‌ యాదవ్‌ మూడు, ఇషాంత్‌, సైనీ తలా వికెట్‌ సాధించారు. సర్వీసెస్‌ బ్యాటర్లలో వికాస్ హత్వాలా(26) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. పుల్కత్‌ నరాంగ్‌ 22 పరుగులు చేశాడు.

రాణా, పంత్‌ మెరుపులు..
అనంతరం 179 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం రెండు వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో ఊదిపడేసింది. ఓపెనర్‌ ప్రియాన్ష్‌ ఆర్య(45 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 72 నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. టీ20 తరహాలో బ్యాటింగ్‌ బ్యాటింగ్‌ చేశాడు. కేవలం 37 బంతులు మాత్రమే ఎదుర్కొన్న పంత్‌.. 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 67 పరుగులు చేశాడు.

ఈ ఏడాది సీజన్‌లో పంత్‌కు ఇది రెండో ఫిప్టీ. అంతకుముందు గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో పంత్ 70 పరుగులు చేశాడు. మిగితా మ్యాచ్‌లలో మాత్రం పెద్దగా రాణించలేకపోయాడు. 5 మ్యాచ్‌లలో ఇప్పటివరకు 188 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడిని భారత వన్డే జట్టు నుంచి తప్పించాలని చాలా మంది డిమాండ్ చేశారు. కానీ అతడిపై సెలెక్టర్లు మరోసారి నమ్మకం ఉంచారు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు పంత్‌ను సెలెక్టర్లు ఎంపిక చేశారు.



 

 


English Translation
Pants unbeaten 67 propels Delhi to eight-wicket win over Services

Vijay Hazare Trophy In 2025-26, the Delhi team, which suffered a shock defeat at the hands of Odisha, returned to winning ways. As part of this tournament, Delhi won by 8 wickets in the match against the Services team on Saturday.

In this match, Services who batted first collapsed for 178 runs in 42.5 overs. Delhi speed star Harshit Rana took 4 wickets and ruled the downfall of services. Along with him, Prince Yadav got three wickets, Ishant and Saini got one wicket each. Vikas Hatwala (26) was the top scorer among the services batsmen.. Pulkat Narang scored 22 runs.

Rana and Pant were brilliant..
Delhi then chased down the target of 179 runs in 19.4 overs with the loss of just two wickets. Opener Priyansh Arya (72 not out with 9 fours and 3 sixes in 45 balls) was the top scorer. Captain Rishabh Pant played a destructive innings. He batted in T20 format. Pant, who faced only 37 balls, scored 67 runs with 4 fours and 6 sixes.

This is the second fifty for Pant in this year's season. Earlier in the match against Gujarat, Pant scored 70 runs. He did not perform well in the rest of the matches. He has scored only 188 runs in 5 matches so far. Many people demanded that he should be dropped from the Indian ODI team. But once again the selectors have faith in him. Pant has been selected by the selectors for the ODI series against New Zealand.