Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/12/2025)

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

మేషం
కీలకమైన పనులను ప్రారంభిస్తారు. మీ ధర్మం మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. మొహమాటం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆహార నియమాలను పాటించాలి. శ్రీవేంకటేశ్వర స్వామిని సందర్శించడం మంచిది.
వృషభం
ప్రారంభించిన పనులు సులభంగా పూర్తవుతాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ ప్రతిభను పెద్దలు ప్రశంసిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆదిత్య హృదయ పారాయణ శుభప్రదం.
మిథునం
మీ మీ రంగాల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. బంధుప్రీతి ఉంది. ఒక ముఖ్యమైన పనిలో కదలిక వస్తుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. గోసేవ చేయాలి.
కర్కాటకం
ముఖ్యమైన విషయాల్లో పెద్దల ఆశీర్వచనాలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనవసర ధనవ్యయం సూచితం. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. నవగ్రహ స్తోత్రం పారాయణ శ్రేయస్కరం.
సింహం
ఉత్సాహభరితమైన వాతావరణం ఉంటుంది. పెద్దలు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. బంధువుల ఇళ్లలో సుఖ భోజనం చేస్తారు. కీలక విషయాల్లో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇష్టదైవ నామస్మరణ మంచిది.
కన్య
శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఒక వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి డబ్బు అందుతుంది. ఆదిత్య హృదయం చదవాలి.
తుల
మంచి ఫలితాలు ఉన్నాయి. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. బంధుమిత్రులతో కలిసి చేసే పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి. ఒక ముఖ్య వ్యవహారంలో మీరు ఆశించిన పురోగతి ఉంటుంది. ఆదిత్య హృదయం చదవాలి.
వృశ్చికం
శారీరక శ్రమ పెరగుతుంది. బంధువులతో వాదులాటకు దిగకపోవడమే మంచిది. అనవసర ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులను మెప్పించడానికి కాస్త కష్టపడాల్సి వస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.
ధనుస్సు
శుభకాలం. దూరదృష్టితో ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. కీలక అంశాల్లో పెద్దలను సంప్రదించడం ఉత్తమం. రుణ సమస్యలు తగ్గుతాయి. ఇష్టదేవతా ఆరాధన శుభప్రదం.
మకరం
ఏ పని ప్రారంభించినా నిర్విఘ్నంగా పూర్తవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మేలైన ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరమైన విషయాలలో మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.
కుంభం
మనోధైర్యంతో అనుకున్నది సాధిస్తారు. ఒక పనిలో అధికారుల నుంచి మీకు ప్రశంసలు లభిస్తాయి. అర్థ, వస్త్ర లాభాలు ఉన్నాయి. ఇష్టదేవతా శ్లోకాలు చదివితే బాగుంటుంది.
మీనం
మిశ్రమ వాతావరణం ఉంటుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. చంచలబుద్ధితో వ్యవహరించి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు.
► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/02/2026) ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
- ఏప్రిల్‌లో బెంగాల్, తమిళనాడు ఎన్నికలు..! బెంగాల్, తమిళనాడు సహా 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఏప్రిల్‌లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు ఎలక్షన్ కమిషన్ వర్గాలు వెల్లడించాయి.
- వాష్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరాలు.. కన్నడ నటి వీడియో రికార్డు చేసి, బ్లాక్‌మెయిల్ Kannada actress: ఒక కన్నడ నటికి చేదు అనుభవం ఎదురైంది. వాష్‌రూమ్‌లో రహస్య కెమెరాలు అమర్చి, ఆ వీడియోతో తనను బ్లాక్‌మెయిల్ చేశారంటూ ఆమె ఆరోపించారు.