వైకుంఠుడి ఏకాదశి

Eenadu icon
By Editorial Team Published : 29 Dec 2025 03:29 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

‘వికుంఠం’ అనే పదానికి ‘విష్ణులోకం’ అనే అర్థాన్ని చెబుతాయి నిఘంటువులు. ఆ విష్ణులోకంలో ఉండేవాడు కాబట్టి- శ్రీమన్నారాయణుడికి ‘వైకుంఠుడు’ అనే పేరు స్థిరపడింది. నిజానికి వికుంఠం అనేది అత్యున్నత ఆధ్యాత్మిక సాధనకు ఫలితంగా లభించే లోకోత్తర అనుభూతి. వికుంఠుడైన మనిషిలోని దైవత్వానికి స్థావరమే- వైకుంఠం. కుంఠుడు అనే మాటకు మూర్ఖుడని అర్థం. చెడు పట్ల విశేషంగా ఆకర్షితులై, లోకంలో దురాచారాలకు పాల్పడేవారంతా - కుంఠులే! రాక్షస అంశ మితిమీరినప్పుడు మానవుడు దానవుడు అవుతాడు. మురాసురుడికి అనుచరుడవుతాడు. ఆ మురాసురుణ్ని తుదముట్టించడానికి మనిషిలో ఆవిర్భవించే దైవశక్తికి సంకేతమే- ఏకాదశి!

మహావిష్ణువు దివ్యసంకల్పంలోంచి రాక్షస సంహారం నిమిత్తం ఆవిర్భవించిన స్త్రీ శక్తి స్వరూపాన్ని ఏకాదశిగా సంభావించాయి పురాణాలు. ధ్యాన, ఉపవాస, ఉపాసనాది ఆధ్యాత్మిక సాధనల ద్వారా లోపలి కుంఠుణ్ని సమూలంగా నిర్మూలించిన నాడు- హృదయ కమలంలో దైవాంశ విచ్చుకుంటుంది. ఆ పరమాద్భుత స్థితికి వికుంఠం అని పేరు. కుంఠుణ్ని సంహరించిన ప్రతి సాధకుడూ వికుంఠుడే. సిద్ధి పొందడం ద్వారా వికుంఠుడికి దక్కేది వైకుంఠం! అందుకే ‘వికుంఠ’ అనే పుణ్యస్త్రీకి జన్మించడం వల్ల శ్రీహరి వైకుంఠుడయ్యాడంది అమరకోశం.

సాధకుడికి సిద్ధిని అందించే గొప్ప తిథి - ఏకాదశి. అది పదకొండో తిథి. అంటే మనిషిని లోబర్చుకుని ఒక ఆట ఆడించే పది ఇంద్రియాల ప్రభావ తీవ్రతను నియంత్రిస్తుందని అర్థం. అలా ఏకాదశి నియమాలను ఏకాగ్రతతో, శ్రద్ధగా పాటించి, సిద్ధి పొందిన వైఖానసుడి కథను పురాణాలు వివరించాయి. తద్వారా ఆయన తన తండ్రికి స్వర్గాన్ని ప్రసాదించాడని చెప్పాయి. అలా స్వర్గసుఖాలకు కారణమయ్యే ధనుర్మాసంలోని ఏకాదశికి- సౌఖ్య‘ద’ ఏకాదశి అని, మోక్షప్రాప్తికి దోహదపడుతోందన్న అర్థంలో- ‘మోక్ష ఏకాదశి’ అనీ ప్రసిద్ధి ఏర్పడింది. 

దక్షిణాదిలో వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా వ్యవహరిస్తారు. దేవతల సంఖ్య మూడు కోట్లని, ముప్పది మూడు కోట్లని లెక్కలున్నాయి. నిజానికి కోటి అనేది సంఖ్యాశాస్త్ర సంకేతం కాదు. ఏకాదశ రుద్రులు(11), ద్వాదశ ఆదిత్యులు (12), అష్టవసువులు (8), ఇద్దరు అశ్వినీ దేవతలను కలిపి ఆ సంఖ్య ముప్పది మూడు అంది వేదం. సృష్టి నిర్వహణకు వారందరూ బాధ్యులే. వారినే ముక్కోటి దేవతలుగా పురాణాలు అభివర్ణించాయి. వారంతా ఒక్కటై మహావిష్ణువును సేవించడానికి తరలివచ్చే తిథిని ముక్కోటి ఏకాదశి అన్నాయి. వారికోసం ప్రత్యేకంగా తెరచుకునే ఉత్తర ద్వారం... స్వర్గ ద్వారం. అందుకే అది స్వర్గ ద్వార ఏకాదశి అయింది. మనిషికి జాగ్రత్, స్వప్న, సుషుప్తి అనే మూడు అవస్థలుంటాయి. వాటి అంచుకు ‘కోటి’ అని పేరు. ఆ అంచులు దాటించి జీవుడికి జీవన్ముక్తిని అనుగ్రహిస్తుందనే విశ్వాసంతో మనవారు దాన్ని ముక్కోటి ఏకాదశి అన్నారు. ఆనాడు ముక్కోటి దేవతలతోపాటు తామూ ఉత్తర ద్వారదర్శనం చేయాలని భక్తులు ఉవ్విళ్లూరుతారు. దర్శనమనేది మనం చేసేది కాదు- దేవుడిచ్చేది!

► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

English Translation

Ekadashi of Vaikuntu

Eenadu icon
By Editorial Team Published : 29 Dec 2025 03:29 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

The word 'Vishnu' means 'Vishnu'. Dictionaries. Since he was in that Vishnu world, the name 'Vaikuntha' was established for Srimannarayana. Vikuntam is actually a worldly experience resulting from the highest spiritual attainment. Vaikuntha is the base of the divinity in the human being. Lame means stupid. All those who are especially attracted to evil and commit evil deeds in the world - are lame! When the demonic element is excessive, a human becomes a demon. Follows Murasura. Ekadashi is a sign of the divine power that emerges in man to destroy that evil!

Ekadashi is considered by Puranas to be the form of female power that emerged from the divine will of Lord Vishnu to slay the demon. On the day when the inner kunth is completely eradicated through the spiritual practices of meditation, fasting and upasana - the divine essence is unleashed in the lotus of the heart. That supreme state is called Vikuntam. Every Sadhaka who kills a Kunth is a Vikunth. Vaikuntha is what a Vikuntha gets by attaining Siddhi! That is why Srihari became Vaikuntha Amarakosam due to the birth of a saintly woman named 'Vikuntha'.

Ekadashi is a great tithi that gives siddhi to the ascetic. It is the eleventh day. It means that the ten senses that control the influence of the ten senses that play a game on a human being. Thus the Puranas narrate the story of Vaikhanas who followed the rules of Ekadashi with concentration and diligence and attained Siddhi. They say that he granted heaven to his father. Thus, the Ekadashi of Dhanurmasam, which causes heavenly happiness, is known as Saukhya Ekadashi, and in the sense that it contributes to the attainment of salvation, it is known as Moksha Ekadashi. 

In South Vaikuntha Ekadashi is treated as Mukkoti Ekadashi. The number of deities is estimated to be three crores and thirty three crores. Actually Koti is not a numerical sign. Including Ekadasa Rudras (11), Dwadasa Adityas (12), Ashtavasus (8) and two Ashwini deities, the number is thirty three Andi Veda. They are all responsible for managing creation. Puranas describe them as the three deities. Mukkoti Ekadashi is the date when they all come together to worship Lord Vishnu. The northern gate which opens specially for them... the gate of heaven. Hence it became Ekadashi by Swarga. Man has three states namely waking, dream and sleep. Their edge is called 'Koti'. We called it Mukkoti Ekadashi with the belief that it crosses those boundaries and bestows Jivanmukti. On that day, the devotees are excited to visit the Northern Door along with the three deities. Darshan is not something we do - God gives!

► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :