Year Ender 2025: 2025లో మదుపర్ల సంపద రూ.30 లక్షల కోట్లు పైకి

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

Year Ender 2025 | దిల్లీ: విదేశీ మదుపర్ల అమ్మకాలు, టారిఫ్‌ల ఒత్తిడులు, రూపాయి పతనం వంటి ప్రతికూలతల నడుమ దలాల్ స్ట్రీట్ మదుపర్ల నమ్మకాన్ని నిలబెట్టుకుంది. 2025 క్యాలెండర్ సంవత్సరంలో బీఎస్‌ఈ బెంచ్‌మార్క్ ఇండెక్స్ 8 శాతం పెరిగి మదుపర్లకు రూ.30.20 లక్షల కోట్ల ప్రతిఫలాన్ని అందించింది. దేశీయ స్థూల ఆర్థిక పరిస్థితులు, దేశీయ మదుపర్ల కొనుగోళ్ల మద్దతుతో ఇది సాధ్యమైందని అనలిస్టులు పేర్కొంటున్నారు.
2025లో డిసెంబర్ 29 వరకు బీఎస్‌ఈ సెన్సెక్స్ 8.39 శాతం వృద్ధితో 6,556.53 పాయింట్లు పెరిగింది. డిసెంబర్ 1న అత్యధికంగా 86,159.02 పాయింట్ల వద్ద ఆల్‌టైమ్ రికార్డు గరిష్ఠాలను అందుకుంది. డిసెంబర్ 29 వరకు బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.30 లక్షల కోట్లు (రూ.30,20,376.68) పెరిగి రూ.472 లక్షల కోట్లకు చేరింది. గతేడాది ఏప్రిల్‌లో తొలిసారి బీఈఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.400 లక్షల కోట్ల మార్కును చేరుకుంది.
- 2024లో సెన్సెక్స్ 8.16 శాతం వృద్ధితో 5,898.75 పాయింట్లు పెరిగింది. ఆ ఏడాది బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.77.66 లక్షల కోట్లు వృద్ధి చెందింది.
- 2023లో బీఈఎస్‌ఈలో నమోదిత కంపెనీల మార్కెట్ విలువ రూ.81.90 లక్షల కోట్లు వృద్ధి నమోదైంది.
‘‘గడిచిన కొన్నేళ్లుగా సెన్సెక్స్, నిఫ్టీ 8-10 శాతం మేర డబుల్ డిజిట్ వృద్ధిని నమోదు చేస్తూ వచ్చాయి. దాంతో పోలిస్తే ఈసారి వృద్ధి కాస్త తక్కువగా కనిపించినప్పటికీ.. భౌగోళిక అనిశ్చిత పరిస్థితులు, విదేశీ మదుపర్ల అమ్మకాలు, వాల్యూషన్ దిద్దుబాటు అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి’’ - ఎన్‌రిచ్ మనీ సీఈఓ పొన్ముది
- రైల్వే టైమ్ టేబుల్ To క్రెడిట్ స్కోరు.. జనవరి నుంచి కీలక మార్పులు
2025లో దేశీయ ఈక్విటీ మార్కెట్‌ల నుంచి సుమారు రూ.1.6 లక్షల కోట్లను విదేశీ మదుపర్లు తరలించారు. అయినప్పటికీ దేశీయ మదుపర్ల మద్దతు, స్థిరమైన వృద్ధి, ప్రభుత్వ మూలధన వ్యయం వంటివి మన మార్కెట్‌ను నిలబెట్టాయని స్టాక్స్‌కార్ట్ సీఈఓ ప్రణయ్ అగర్వాల్ పేర్కొన్నారు. దీనికితోడు టాటా క్యాపిటల్ (రూ.15,512 కోట్లు), హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ (రూ.12,500 కోట్లు), ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా (రూ.11,607కోట్లు), హెక్సావేర్ టెక్నాలజీస్ (రూ.8,750కోట్లు), లెన్స్‌కార్ట్ (రూ.7,278 కోట్లు), గ్రో (రూ.6632 కోట్లు) వంటి ఐపీఓలు కూడా మార్కెట్స్ పెరగడానికి దోహదం చేశాయి. దీర్ఘకాలంలో మన మార్కెట్లు మెరుగైన ప్రతిఫలం ఇస్తుందన్న అంచనాలతో సిప్ ఇన్‌ఫ్లోస్ పెరిగాయి. దీంతో రిటైల్ మదుపర్ల భాగస్వామ్యం కూడా తోడైంది.
రిలయన్స్‌దే టాప్
2025లో అత్యధిక మార్కెట్ విలువ కలిగిన కంపెనీల జాబితాలో రిలయన్స్ అగ్రస్థానంలో నిలిచింది. రూ.20,91,173 కోట్ల మార్కెట్ విలువ దీని సొంతం. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (రూ.15,25,457.75 కోట్లు), భారతీ ఎయిర్‌టెల్ (రూ.11,86,978.75 కోట్లు), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (రూ.11,77,199.05 కోట్లు), ఐసీఐసీఐ బ్యాంక్ (రూ.9,60,478.36 కోట్లు) టాప్-5 స్థానాల్లో నిలిచాయి.
► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :English Translation
Year Ender 2025: Investors' wealth to rise to Rs.30 lakh crore in 2025

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

Year Ender 2025 | Delhi: Dalal Street has maintained investor confidence amid headwinds such as sell-off by foreign investors, pressure on tariffs and falling rupee. In the calendar year 2025, the BSE benchmark index increased by 8 percent and gave investors a reward of Rs 30.20 lakh crore. Analysts claim that this has been possible with the support of domestic macroeconomic conditions and purchases by domestic investors.
In 2025, the BSE Sensex rose 8.39 percent to 6,556.53 points till December 29. It hit an all-time record high of 86,159.02 points on December 1. Till December 29, the total value of companies registered in BSE increased by Rs.30 lakh crore (Rs.30,20,376.68) to reach Rs.472 lakh crore. For the first time in April last year, the total value of companies registered on BSE reached the Rs. 400 lakh crore mark. In that year, the total value of companies registered in BSE increased by Rs.77.66 lakh crore.
- Railway Time Table To Credit Score.. Key changes since January
In 2025, foreign investors have moved around Rs.1.6 lakh crore from the domestic equity markets. However, the support of domestic investors, steady growth and government capital expenditure have sustained our market, Stockskart CEO Pranay Agarwal said. Along with this, Tata Capital (Rs.15,512 crore), HDB Financial Services (Rs.12,500 crore), LG Electronics India (Rs.11,607 crore), Hexaware Technologies (Rs.8,750 crore), Lenskart (Rs.7,278 crore), Grow (Rs.6632 crore) etc. IPOs also contributed to the growth of the markets. SIP inflows have increased on expectations that our markets will yield better returns in the long run. This has also increased the participation of retail investors.
Reliance is the top
Reliance has topped the list of companies with the highest market value in 2025. It has a market value of Rs.20,91,173 crores. HDFC Bank (Rs. 15,25,457.75 crore), Bharti Airtel (Rs. 11,86,978.75 crore), Tata Consultancy Services (Rs. 11,77,199.05 crore) and ICICI Bank (Rs. 9,60,478.36 crore) are in the top-5 positions.
► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :