INDw Vs SLw: అదరగొట్టిన హర్మన్‌ప్రీత్ కౌర్.. శ్రీలంక లక్ష్యం 176

Eenadu icon
By Sports News Team Published : 30 Dec 2025 20:41 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

తిరువనంతపురం: శ్రీలంకతో ఐదు టీ20ల సిరీస్‌లో భారత మహిళల జట్టు వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచిన సంగతి తెలిసిందే. ఇవాళ చివరి మ్యాచ్ జరుగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్ (68; 43 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అలరించింది. చివర్లో అరుంధతి రెడ్డి (27*; 11 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుపులు మెరిపించింది. అమన్‌జ్యోత్ (21; 18 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించింది.

గత మూడు మ్యాచుల్లో అర్ధ శతకాలు చేసిన షెఫాలి వర్మ (5) ఈసారి నిరాశపర్చింది. ఈ మ్యాచ్‌తోనే అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేసిన జి.కమలిని (12) విఫలమైంది. వన్‌డౌన్‌లో వచ్చిన హార్లిన్ డియోల్ (13) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయింది. రిచా ఘోష్‌ (5), దీప్తి శర్మ (7) కూడా ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. దీంతో భారత్ 77 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో అమన్‌జ్యోత్‌తో కలిసి హర్మన్‌ ప్రీత్ ఆరో వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యం (37 బంతుల్లో) జోడించింది. శ్రీలంక బౌలర్లలో చమరి ఆటపట్టు, రష్మిక, కవిషా దిల్హరి రెండేసి వికెట్లు పడగొట్టగా.. నిమాషా మదుశనికి ఒక వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో స్మృతి మంధాన, పేసర్ రేణుకా సింగ్‌కు విశ్రాంతి ఇచ్చారు.

► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • వచ్చాడో బేబీ యువరాజ్‌ అతడి దేశంలో క్రికెట్‌కు అనుకూలమైన పరిస్థితుల్లేవ్‌.. ఏడాదికి మూడు నెలలే ఆట. అలాంటి చోట నుంచి క్రికెట్లో ఎదిగి జాతీయ జట్టుకు ఆడడమే గొప్ప. అలాంటిది ప్రపంచకప్‌లో బరిలో దిగే అవకాశం వచ్చింది.
  • అజేయమేనా? హ్యాట్రిక్‌ విజయాలు.. గత మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారీ గెలుపు.. టోర్నీలో మరే జట్టుకూ సాధ్యం కాని విధంగా అత్యధిక నెట్‌ రన్‌రేట్‌.. ఇలా టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా హవా మామూలుగా లేదు.
  • ఆస్ట్రేలియా ఔట్‌ మాజీ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాకు షాక్‌. మంగళవారం జింబాబ్వే, ఐర్లాండ్‌ మధ్య గ్రూప్‌-బి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కావడంతో కంగారూ జట్టు టీ20 ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు ఓడిన ఆసీస్‌..
  • కివీసూ ముందుకు టీ20 ప్రపంచకప్‌లో సమీకరణాలతో పని లేకుండా న్యూజిలాండ్‌ సూపర్‌-8కు దూసుకెళ్లింది. మంగళవారం గ్రూప్‌-డి పోరులో కివీస్‌ 8 వికెట్ల తేడాతో కెనడాను చిత్తు చేసింది. మొదట కెనడా 4 వికెట్లకు 173 పరుగులు చేసింది.
  • కంగారు పడింది.. ఎన్నోసార్లు ఐసీసీ టోర్నీలు గెలిచిన ఆస్ట్రేలియా, ప్రపంచకప్‌ అనగానే టాప్‌ ఫామ్‌ను అందుకునే జట్టు టీ20 ప్రపంచకప్‌ నుంచి ఇంత త్వరగా నిష్క్రమించడం ఏమాత్రం ఊహించనిదే.
  • పాక్‌ నిలుస్తుందా? టీ20 ప్రపంచకప్‌ నుంచి ఇప్పటికే ఆస్ట్రేలియా నిష్క్రమించింది. మరో పెద్ద జట్టు భవితవ్యం బుధవారం తేలిపోనుంది. గత మ్యాచ్‌లో భారత్‌ చేతిలో గట్టి దెబ్బ తిన్న పాకిస్థాన్‌.. తన చివరి గ్రూప్‌ పోరులో నమీబియాను ఢీకొనబోతోంది.
  • ముగింపులో నేపాల్‌ మెరుపు పెద్ద జట్టు ఇంగ్లాండ్‌పై విజయానికి అత్యంత చేరువగా వెళ్లి, త్రుటిలో ఓడిన నేపాల్‌.. టీ20 ప్రపంచకప్‌ను అదిరే విజయంతో ముగించింది. గ్రూప్‌-సిలో తొలి మూడు మ్యాచ్‌లూ ఓడి సూపర్‌-8 రేసు నుంచి నిష్క్రమించిన ఆ జట్టు.. స్కాట్లాండ్‌తో మంగళవారం చివరి పోరులో 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
  • సంక్షిప్త వార్తలు (5) రంజీ ట్రోఫీలో జమ్ముకశ్మీర్‌ చరిత్రకు చేరువైంది. బ్యాటింగ్‌.. బౌలింగ్‌లో స్ఫూర్తిమంతమైన ప్రదర్శనతో సత్తాచాటుతున్న ఆ జట్టు రంజీ చరిత్రలో తొలిసారిగా ఫైనల్‌ దిశగా అడుగులేస్తోంది.
  • శర్మా.. మొదట నువ్వు సింగిల్‌ తీసుకో: సునీల్‌ గావస్కర్‌ టీమ్ఇండియా (Team India) టీ20 స్పెషలిస్ట్‌ బ్యాటర్‌ అభిషేక్‌ శర్మ (Abhishek Sharma) బ్యాటింగ్‌లో తడబడుతున్నాడు. టీ20 వరల్డ్‌కప్‌లో అతడు ఇప్పటి వరకు రెండు మ్యాచులు ఆడితే రెండింట్లోనూ డకౌట్‌గా వెనుదిరిగాడు.
  • యువరాజ్‌ సింగ్‌ పేరు.. శతకంతో రికార్డ్‌: కెనడా ‘యువీ’ సెన్సేషన్‌ Yuvraj Samra: ప్రస్తుతం పొట్టి ప్రపంచకప్‌లో ఓ కుర్రాడి పేరు నెట్టింట మార్మోగుతోంది. అతి చిన్న వయసులో టీ20 ప్రపంచకప్‌లో శతకంతో అదరగొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు.