Anil Ravipudi: ఆ సినిమా నా కెరీర్‌ను మలుపుతిప్పింది: అనిల్ రావిపూడి

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఇంటర్నెట్ డెస్క్: ఏంటి బాసు సంగతీ.. అదిరిపోద్దీ సంక్రాంతీ.. అంటూ మరో హుషారైన పాటతో ‘మన శంకరవరప్రసాద్ గారు’ జోష్ నింపారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రానున్న ఈ సినిమాలో మూడో పాటను తాజాగా విడుదల చేశారు. గుంటూరులోని విజ్ఞాన్ కాలేజీలో ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈవెంట్‌లో విద్యార్థులతో కలిసి డ్యాన్స్ వేసి అనిల్ రావిపూడి (Anil Ravipudi) సందడి చేశారు.
‘‘నేను చదివిన కాలేజీలో నా సినిమా పాటనువిడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉంది. మీ అందరిలో కూడా ఏదో ఒక టాలెంట్ ఉండే ఉంటుంది. చదువుతో పాటు దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లండి. జీవితం ఏదీ మనకు ఎదురువచ్చి ఇవ్వదు.. మనమే ఎదురెళ్లి తీసుకోవాలి. బాధలో నుంచి సంతోషమైనా.. ఓటమి నుంచి గెలుపైనా ఏదైనా మనమే సాధించుకోవాలి’’
- దిష్టి తీయించుకోమని చిరంజీవికి చెప్పా: అనిల్ రావిపూడి
‘‘మన శంకరవరప్రసాద్ గారు’ నాకు చాలా ప్రత్యేకం. నా చిన్నప్పటి నుంచి చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున, బాలకృష్ణల సినిమాలు చూసి పెరిగాను. ఏదో ఒకరోజు వాళ్ల సినిమాలకు దర్శకత్వం వహించాలి అనుకున్నాను. వెంకటేశ్, బాలకృష్ణలతో చేశాను. ఇప్పుడు చిరంజీవితో చేశాను. నా మాటలు గుర్తుపెట్టుకోండి.. జనవరి 12న ఈ సినిమాను మీరంతా సెలబ్రేట్ చేసుకుంటారు. చిరంజీవిగారు ( Chiranjeevi) ఎంతో క్రమశిక్షణతో తన లుక్ మార్చుకున్నారు. ఈ విషయంలో ఆయనకు ధన్యవాదాలు చెప్పాలి. అడగ్గానే ఈ సినిమాలో అతిథి పాత్ర చేయడానికి వెంకటేశ్ అంగీకరించారు. చిరు, వెంకీలను ఒకే ఫ్రేమ్‌లో చూడాలనేది మనందరి కల. అది ఈ సినిమాతో నెరవేరబోతుంది. ఈ ఇద్దరూ చేసిన అల్లరి, డ్యాన్స్‌ను మీరు చాలా రోజులు గుర్తుపెట్టుకుంటారు. రానున్న సంక్రాంతి మీకు చాలా జ్ఞాపకాలను ఇస్తుంది. 2025 ‘సంక్రాంతికి వస్తున్నాం’తో మిమ్మల్ని పలకరించా. మీరంతా ఆ సినిమాపై చూపిన ప్రేమను మర్చిపోలేను. నా కెరీర్‌ను మలుపుతిప్పిన సినిమా అది. దానిలానే ‘మన శంకరవరప్రసాద్ గారు’ని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నా’’ అని అనిల్ పేర్కొన్నారు.
► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- వావ్..! ఏఐతో రజనీకాంత్ ‘కొచ్చడైయాన్’.. టీజర్ చూశారా? రజనీకాంత్ (Rajinikanth) కథానాయకుడిగా ఆయన కుమార్తె సౌందర్య దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘కొచ్చడైయాన్’.
- ‘మురారి’ శాపం వెనుక స్టోరీ ఇది.. క్లైమాక్స్‌లో ఆ పాట వద్దన్న కృష్ణ..! మహేశ్‌బాబు కథానాయకుడిగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘మురారి’. సోనాలి బింద్రే కథానాయిక. 2001 ఫిబ్రవరి 17న విడుదలైన ఈ సినిమా 25 ఏళ్లు పూర్తి చేసుకుంది.
- విజయ్ ఆంటోనీ మూవీ.. వాటి వల్లే నాకు ఛాన్స్: మంచు లక్ష్మి విజయ్ ఆంటోనీ ‘బూకి’ సినిమాలో తనకు ఎలా అవకాశం వచ్చిందో మంచు లక్ష్మి తెలిపారు.
- దోషులను అయ్యప్పస్వామి వదలి పెట్టడు: నటుడు జయరాం శబరిమల బంగారు తాపడాల అదృశ్యం కేసులో (Sabarimala gold theft case) నిజాన్ని బయటకు తీసుకురావడానికి అధికారులకు తాను అన్ని విధాలా సహకరిస్తున్నానని సినీ నటుడు జయరాం (Jayaram) అన్నారు.
- ‘లైకా’ కేసు.. విశాల్ పిటిషన్‌ను కొట్టివేసిన మద్రాస్ హైకోర్టు ప్రముఖ నిర్మాణ సంస్థ ‘లైకా ప్రొడక్షన్స్’కు సంబంధించిన కేసులో ఉత్తర్వులను పాటించేందుకు గడువు కోరుతూ నటుడు విశాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది.
- సర్‌ప్రైజ్.. 2026లో నెట్‌ఫ్లిక్స్‌లో అలరించే సినిమాలు/సిరీస్‌లివే! 2026లో వరుస చిత్రాలతో అలరించేందుకు ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ సిద్ధమైంది.
- 24 ఏళ్లుగా నరకం.. సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నా కానీ..: ప్రత్యూష తల్లి తన కుమార్తె, నటి ప్రత్యూష (Prathyusha) మృతి కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై సరోజినీదేవి (Prathyusha Mother) స్పందించారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పును స్వాగతిస్తున్నానని, కానీ తమకు పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదని అన్నారు.
- మరో చీకటి కోణం.. ‘ది కేరళ స్టోరీ2’ ట్రైలర్ చూశారా? న్నో వివాదాలు, విమర్శల మధ్య విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లను సొంతం చేసుకుంది ‘ది కేరళ స్టోరీ’. ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్‌గా ‘ది కేరళ స్టోరీ 2’ రాబోతోంది.
- అకౌంట్‌లో రూ.లక్ష చూస్తే చాలనుకున్నా..: విశ్వక్ సేన్ ఒకప్పుడు తన అకౌంట్‌లో రూ.50వేలు చూడటం కల అని విశ్వక్ సేన్ అన్నారు. ‘హిట్’ సినిమాకు అడ్వాన్స్ బ్యాంక్‌లో పడే వరకూ తన అకౌంట్‌లో అంత డబ్బు ఎప్పుడూ చూడలేదని గుర్తుచేసుకున్నారు.
- అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 రూల్స్.. క్షమాపణలు చెప్పిన కావేరి స్టార్ హీరో అల్లు అర్జున్‌ను (Allu Arjun) కలవాలంటే 42 నిబంధనలు తప్పకుండా పాటించాలంటూ బ్రాండ్ స్ట్రాటజర్ కావేరి బరూవా చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్ అయిన సంగతి తెలిసిందే.
- 4 ఏళ్లలో 12 సినిమాలు.. కెరీర్ పీక్‌లో ‘సూసైడ్’: నటి ప్రత్యూష కథ ఇది..! Actress Prathyusha: గ్లామర్ వెలుగుల సినీ ప్రపంచంలో తెర వెనుక చీకటి రహస్యాలెన్నో..! స్క్రీన్ మీద నవ్వులు చిందిస్తూ అభిమానులను అలరించే నటీనటుల జీవితాల్లో.. ఎవరికీ తెలియని విషాదగాథలు దాగి ఉంటాయి.
- మేకప్ వేసుకుని ఐదు గంటలకే బీచ్‌కు వెళ్తే.. తెలుగు ప్రేక్షకులకు అద్భుతమైన చిత్రాలను అందించి ప్రేక్షకులను అలరించిన దిగ్గజ నటులు ఎన్టీఆర్ (NTR), ఏయన్నార్ (ANR). ఇరువురు తమదైన నటనతో అన్ని జానర్‌ల సినిమాల్లోనూ నటించి
- చిక్కుల్లో ‘ధురంధర్ 2’.. అక్కడ షూటింగ్‌పై బ్యాన్! ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ‘ధురంధర్ 2’ చిక్కుల్లో పడింది.
- నటి ప్రత్యూష మృతి కేసు.. సిద్ధార్థరెడ్డి లొంగిపోవాలి: సుప్రీం Actress Prathyusha Case: రెండు దశాబ్దాల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు మంగళవారం తుది తీర్పు వెల్లడించింది. సినీ నటి ప్రత్యూష్ మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడు సిద్ధార్థ రెడ్డి లొంగిపోవాలని ఆదేశించింది.
- విడుదలకు ముందు ‘పేరు’ మార్పు.. మేకర్స్ నిట్టూర్పు! సినిమా పేరు మార్పు ఇటీవల ఎక్కువగా కనిపిస్తోంది. ఆ చిత్రాల వివరాలివీ..
- ఆ పాటలు వాడొద్దు.. ఇళయరాజాకు దిల్లీ హైకోర్టు ఆదేశాలు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా చట్టపరమైన ఇబ్బందుల్లో పడ్డారు.
- నేనూ వాళ్ల బాటలోనే...! సుహాస్ - శివానీ నాగారం జంటగా నటించిన ‘హే భగవాన్’ చిత్రం పేరు మార్చుకుంది. సెన్సార్ బోర్డు సూచనల మేరకు ఈ టైటిల్‌ని ‘హే బల్‌వంత్’గా మార్చినట్లు చిత్ర బృందం ప్రకటించింది.
- అట్లూరి జీవితం నేటి తరానికో పాఠం కష్టేఫలి అనే సూత్రానికి ప్రముఖ నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు నిలువెత్తు నిదర్శనమని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.
- ఏఐ.. నిశ్శబ్దంగా సినిమా భాషని తిరగరాస్తోంది చిత్రపరిశ్రమలో తదుపరి పెద్ద విభజన.. ఏఐ(కృత్రిమ మేధ)ని స్వీకరించేవారికి, వ్యతిరేకించేవారికి మధ్య ఉండదని, ఆ సాధనాలతో మేధో సంపత్తిని నిర్మించేవారికి, వాటిని ఉపయోగించేవారికి మధ్య ఉంటుందని అంటున్నారు హీరో రానా.
- ఓటీటీలో ఈ వారం కొత్త వారం మొదలైంది.. వినోదాల జాతరకి కూడా సమయం ఆసన్నమైంది. అదేనండీ.. ఓటీటీలో వచ్చే కొత్త కథల గురించే ఇదంతా. ఎప్పటిలాగే ఈ వారం కూడా నాన్‌స్టాప్‌గా ఎంటర్‌టైన్ చేయడానికి వైవిధ్యమైన సిరీస్‌లు, సినిమాల్ని అందుబాటులోకి తీసుకొచ్చాయి ఓటీటీలు.