Priyanka Gandhi son Engagement: ప్రియాంక గాంధీ ఇంట వేడుక.. కుమారుడి ఎంగేజ్‌మెంట్..!

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

దిల్లీ: కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, ఎంపీ ప్రియాంక గాంధీ, పారిశ్రామికవేత్త రాబర్ట్ వాద్రా కుమారుడు రేహాన్ వాద్రా (Priyanka Gandhi son Engagement) త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. తన స్నేహితురాలు అవీవా బేగ్‌తో రేహాన్ నిశ్చితార్థం జరిగినట్లు సమాచారం. రెండు రోజుల క్రితం వీరిద్దరూ దిగిన ఫొటోను అవీవా తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకున్నారు. తర్వాత అదే ఫొటోను ‘హైలైట్స్’ సెక్షన్‌లో ఉంచారు. దీంతో వీరి ఎంగేజ్‌మెంట్ వార్తలకు ఇది మరింత బలం చేకూర్చినట్లయ్యింది.
రేహాన్-అవీవా ఏడేళ్లుగా స్నేహితులు. ఇటీవల అవీవా ముందు రేహాన్ పెళ్లి ప్రతిపాదన తీసుకురాగా.. దానికి ఆమె ఆమోదించినట్లు సమాచారం. వీరి ప్రేమ బంధాన్ని ఇరు కుటుంబాలు అంగీకరించి నిశ్చితార్థం జరిపించినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే దీనిపై గాంధీ, వాద్రా కుటుంబాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అవీవా కుటుంబసభ్యులు దిల్లీకి చెందినవారని, వాద్రా కుటుంబంతో వీరికి సన్నిహిత సంబంధాలున్నాయని సమాచారం.
- మార్చిలో అల్లు శిరీష్ పెళ్లి
రేహాన్ వాద్రా విజువల్ ఆర్టిస్ట్. వైల్డ్‌లైఫ్, స్ట్రీట్, కమర్షియల్ ఫొటోగ్రఫీతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2021లో దిల్లీలోని బికనేర్ హౌస్‌లో ‘డార్క్ పర్సెప్షన్’ పేరుతో తన తొలి ఎగ్జిబిషన్ నిర్వహించారు. అవీవా కూడా ఫొటోగ్రాఫర్. ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ నుంచి జర్నలిజం అండ్ కమ్యూనికేషన్స్ పూర్తి చేశారు. ఓ ఫొటోగ్రఫిక్ స్టూడియో, ప్రొడక్షన్ కంపెనీకి సహ వ్యవస్థాపకురాలిగా వ్యవహరిస్తున్నారు.
► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 30 Dec 2025 10:52 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- రీల్ చేస్తూ డ్రైవింగ్ చేయడం వల్లే.. దిల్లీ ప్రమాదం వీడియో వైరల్ ఇటీవల దిల్లీలో జరిగిన కారు ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
- కమల్‌హాసన్ ‘ఎంఎన్‌ఎం’ పార్టీకి టార్చిలైట్ గుర్తు కమల్‌హాసన్ మక్కల్ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) పార్టీకి ఎన్నికల సంఘం టార్చిలైట్ గుర్తును కేటాయించింది.
- ‘ఎంతసేపు చదివామన్నది కాదు’: జేఈఈ మెయిన్ టాపర్ కబీర్ చిల్లర్ జేఈఈ మెయిన్‌లో 300కు 300 స్కోర్ తెచ్చుకొన్న హరియాణాకు చెందిన 17 ఏళ్ల కబీర్ స్థానిక మీడియాతో మాట్లాడారు. జేఈఈలో మంచి మార్కులు సాధించడానికి ఏ విధంగా సన్నద్ధమవ్వాలనే విషయంపై తోటి విద్యార్థులకు పలు సూచనలు చేశారు.
- డియర్ ఫ్రెండ్.. ముంబయిలో కలుద్దాం: మెక్రాన్‌కు ప్రధాని మోదీ స్వాగతం Emmanuel Macron India Visit: భారత పర్యటనకు వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్‌ను ప్రధాని మోదీ స్వాగతించారు.
- ప్రియురాలి ప్రాణం తీసి.. ఆపై తాంత్రిక పూజలు చేసి..! ఇటీవల ఇందౌర్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఎంబీఏ విద్యార్థిని కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
- మేక పాలతో సబ్బులు మేకపాలతో సబ్బులు తయారు చేస్తూ గ్రామీణ ప్రాంత మహిళలు ఉపాధి పొందుతున్నారు.
- ఈ శివలింగం పెరుగుతోంది.. జరుగుతోంది! బిహార్‌లోని నిరంజన నదిలో ఉన్న శివలింగం ఏటా అత్యంత స్వల్పంగా పెరుగుతోందని.. కదులుతోందని స్థానికులు చెబుతున్నారు.
- నేను రాహుల్‌వాదిని కాదు.. కేరళలో కాంగ్రెస్ అధికారంలోకి రాదు కేరళలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని వామపక్ష ప్రజాస్వామ్య కూటమి (ఎల్‌డీఎఫ్) విజయం సాధిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
- కర్ణాటకలో రూ.400 కోట్ల దారి దోపిడీ కట్టుకథే ఓ ట్రక్కులో హవాలా సొమ్ము తరలిస్తుండగా రూ.400 కోట్ల నగదు దోపిడీ జరిగిందంటూ ఆ వాహన డ్రైవర్ చేసిన ఫిర్యాదు బోగస్ అని తేలింది.
- ఏఐ ప్రయాణంలో ముందున్నాం కృత్రిమ మేధ (ఏఐ) రంగంపై విస్తృతంగా చర్చించేందుకు, అత్యాధునిక ఆవిష్కరణలపై అవగాహన కల్పించేందుకు భారత్ ఆతిథ్యమిస్తున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పో-2026, సమిట్‌లు సోమవారం దిల్లీలో ఘనంగా ప్రారంభమయ్యాయి.
- తొలి దఫా బోర్డు పరీక్షలకు ‘పది’ విద్యార్థుల హాజరు తప్పనిసరి పదో తరగతి విద్యార్థులు మంగళవారం నుంచి నిర్వహించే మొదటి దఫా బోర్డు పరీక్షలు తప్పనిసరిగా రాయాలని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) స్పష్టం చేసింది.
- పెళ్లికి ముందు ఎవరినీ నమ్మవద్దు పెళ్లికి ముందే శారీరక సంబంధాలు ఏర్పరచుకునే విషయంలో అబ్బాయిలు, అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని సుప్రీంకోర్టు సోమవారం హెచ్చరించింది.
- ‘పరిశ్రమ’ నిర్వచనాన్ని తేల్చేందుకు 9 మంది జడ్జీలతో విస్తృత ధర్మాసనం ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ‘పరిశ్రమ’ నిర్వచనం వివాదంపై 9 మంది జడ్జీలతో కూడిన సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం విచారణ జరపనుంది.
- 25-26 తేదీల్లో మోదీ ఇజ్రాయెల్ పర్యటన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 25-26 తేదీల్లో రెండ్రోజుల పాటు ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నారు.
- దేశంలోనే అత్యంత పొడవైన తొండ మహారాష్ట్రలోని కొల్హాపుర్ జిల్లాలో నిర్వహించిన వ్యవసాయ ప్రదర్శనలో దేశంలోనే అత్యంత పొడవైన తొండ(ఇగ్వానా) ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
- ముచ్చటగా మూడోసారి.. ఐఏఎస్‌తోనే మనువు మధ్యప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అవీ ప్రసాద్ తన పెళ్లితో తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు.
- సంక్షిప్తవార్తలు (3) ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ మంగళవారం భారత్ పర్యటనకు రానున్నారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముంబయిలో ఆయనతో సమావేశం అవుతారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
- ఆరోగ్య బీమా తీసుకునేటప్పుడు.. ఆరోగ్య బీమా తీసుకునేటప్పుడు మీకు ఉన్న అన్ని రకాల వ్యాధులను నిజాయతీగా వెల్లడించండి.
- ఉన్నత పదవుల్లో ఉన్నవారు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి త్రిష ఇంటి నుంచి నటుడు విజయ్ బయటకు రావాలంటూ భాజపా తమిళనాడు అధ్యక్షుడు, ఆ పార్టీ శాసనసభా పక్షనేత నయినార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలను నటి త్రిష ఖండించారు.
- వేలాడే తీగల మార్గమే దిక్కు! ఉత్తరాఖండ్‌లోని ఘరూధి, మాన్‌కోట్ గ్రామాలకు ఇంకా తీగల మార్గమే దిక్కుగా ఉంది. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో పిల్లలు, పెద్దలు ఈ తీగల ద్వారా గోరి నదిని దాటాల్సిందే.