Strict action will be taken against cab, auto drivers on occasion of New Year

సాక్షి, హైదరాబాద్:న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించే క్యాబ్, ఆటో డ్రైవర్లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు.  ఈ మేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌ తన ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు. 

ప్రధాన హెచ్చరికలు
న్యూ ఇయర్ సందర్బంగా క్యాబ్ లేదా ఆటో డ్రైవర్లు రైడ్ రావడానికి నిరాకరించినా, బుకింగ్ ధర కంటే ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసినా ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు మోటార్ వెహికల్ చట్టం సెక్షన్ 178(3)(b) ప్రకారం నిబంధనల ఉల్లంఘనగా పరిగణించబడతాయి. ఈ నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. 

ఎక్కడైనా ఇబ్బంది ఎదురైతే వెంటనే వాహనం నంబర్, సమయం/ప్రదేశం, రైడ్ వివరాల స్క్రీన్‌షాట్‌లను ప్రయాణికులు సేకరించి వాటిని పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ఈ వివరాలను హైదరాబాద్ పోలీసుల అధికారిక వాట్సాప్ నంబర్ 91 94906 16555 కు పంపాలని విజ్ఞప్తి చేశారు. 

 


English Translation
Strict action will be taken against cab, auto drivers on occasion of New Year

Sakshi, Hyderabad:New Year celebrations. Police announced that strict action will be taken against cab and auto drivers who cause trouble to passengers on the occasion.  To this extent, Hyderabad Police Commissioner Sajjanar tweeted on his X. 

Main Warnings
On the occasion of New Year, if cab or auto drivers refuse to come for a ride or demand more money than the booking price, there is nothing to ignore. Such acts are considered as violation of provisions under Section 178(3)(b) of the Motor Vehicle Act. The police have made it clear that strict action will be taken against those who violate these rules. 

In case of trouble anywhere, passengers should immediately collect screenshots of vehicle number, time/place, ride details and report them to the police. Suggested to inform. Requested to send these details to the official WhatsApp number of Hyderabad Police 91 94906 16555.