గుర్ల, డిసెంబరు 24 ( ఆంధ్రజ్యోతి):విద్యా విధానంలో మార్పులు రావాలని, ప్రతి విద్యార్థి బాగా చదవాలని విజయనగరం ఆర్జేడీ విజయ భాస్కర్‌ కోరారు. బుధవారం గుర్ల ఉన్నత పాఠ శాలను తనిఖీచేశారు. ఈసందర్భంగా మాట్లాడు తూ విద్యార్థులకు రుచికరమై మధ్యాహ్న భోజ నం అందజేయాలని కోరారు. మరుగుదొడ్లు, తాగునీరు సౌకర్యాలు బాగుండాలన్నారు. పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న వంద రోజు ల యాక్షన్‌ ప్లాన్‌ గురించి అడిగి తెలుసుకున్నా రు. స్లిప్‌ టెస్టు పేపర్లను వెరిపై చేసి వాల్యు యేషన్‌ చేయకూడదని, కరక్షన్‌ చేయాలని సూ చించారు. ఆయన వెంట ఎంఈవోలు భానుప్రకా ష్‌,శ్రీనివాసరావు, హెచ్‌ఎం తదితరులు ఉన్నారు.

ఫ గరివిడి, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): గరివిడిలోని కేజీబీవీ పాఠశాలను ఆర్జేడీ విజయభాస్కర్‌ బుధవారం తనిఖీ చేశారు. పదో తరగతికి సంబంధించి వంద రోజుల ప్రణాళిక ప్రకారం అమలవుతున్న పరీక్ష పత్రాలను పరిశీలించారు. మధ్యాహ్న భోజనం రుచికరంగా వండి వడ్డించాలన్నారు. పదోత్రరగతి విద్యార్థులు పుస్తకాలు చదవడం అలవాటుచేసుకోవాలని, జ్ఞానాన్ని పెంచు కోవాలన్నారు. ఆయన వెంట ఎంఈవో-2 పి.అప్పన్న, హెచ్‌ఎం ఈ.ధనలక్ష్మి ఉన్నారు.

యాక్షన్‌ ప్లాన్‌ను అమలుచేయాలి

జామి, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వోన్నతపాఠశాలల్లో పదో తరగతి విద్యార్థుల కోసంవందరోజుల యాక్షన్‌ ప్లాన్‌ను ఉపాధ్యాయులు అమలు చేయాలని మండల ప్రత్యేకాధికారి శారదదేవి కోరారు. బుధవారం కుమరాం ఉన్నతపాఠశాలను ఎంఈవో గంగరాజు ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో చర్చించి జామి మండలంలో పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాఽధించాలని కోరారు.

మెనూ ప్రకారం భోజనం పెట్టాలి

గజపతినగరం, డిసెంబరు24 (ఆంధ్రజ్యోతి): పాఠశాలల్లో విద్యార్థులకు అందజేస్తున్న మధ్యాహ్నభోజన పథకంలో నాణ్యతపై రాజీపడవద్దని, మెనూ ప్రకారం భోజనం పెట్టాలని మండల ప్రత్యేకాధికారి ఎం.రమేష్‌ తెలిపారు. బుధవారం మండలంలోని జిన్నాం పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. విద్యార్థుల నుంచి ఎటువంటి ఫిర్యాదులు వచ్చిన సంబందిత ప్రధానోపాధ్యాయులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులపై అడిగి తెలుసుకున్నారు.ఆయన వెంట హెచ్‌ఎం సన్యాసినాయుడు ఉన్నారు.

విద్యాభివృద్ధిపై దృష్టి సారించాలి

గుర్ల,డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి):విద్యాభివృద్ధిపై దృష్టిసారించాలని మెరకముడిదాం ఏఎంసీ వైస్‌చైర్మన్‌ దాసరి శివప్రసాద్‌ కోరారు.ఈమేరకు విజయనగరంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి, విద్యాభివృద్ధి కోసం ఎమ్మెల్సీ చిరంజీవికి వినతిపత్రం అందజేశారు. వెనుకబడిన జిల్లాను, తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఆయన కోరారు.


English Translation

Gurla, December 24 (Andhra Jyoti): Vijaya Bhaskar, RJD of Vizianagaram, urged that there should be changes in the education system and that every student should study well. Gurla High School was inspected on Wednesday. Speaking on this occasion, he asked to provide delicious mid-day meal to the students. Toilets and drinking water facilities should be good. Inquired about the 100 days action plan being conducted for the tenth class students. He suggested that the slip test papers should not be reprinted and the valuation should be done. He was accompanied by MEOs Bhanuprakash, Srinivasa Rao, HM and others.

F Garividi, December 24 (Andhra Jyoti): RJD Vijayabhaskar inspected the KGBV school in Garividi on Wednesday. Regarding the tenth class, the examination papers which are being conducted according to the hundred days plan have been examined. Lunch should be cooked and served deliciously. Students of Padotraragati should get used to reading books and increase their knowledge. He was accompanied by MEO-2 P. Appanna and HM E. Dhanalakshmi.

Action plan should be implemented

Jami, December 24 (Andhra Jyoti): Mandal Special Officer Sharada Devi asked the teachers to implement a hundred-day action plan for the tenth class students in government high schools. On Wednesday, Kumaram High School was inspected under the supervision of MEO Gangaraju. On this occasion, he discussed with the teachers and asked them to achieve the best results in class 10 in Jami mandal.

Meals should be provided according to the menu

Gajapatinagar, December 24 (Andhra Jyoti): Don't compromise on the quality of the mid-day meal scheme provided to students in schools, Mandal Special Officer M. Ramesh said that meals should be provided according to the menu. On Wednesday, the mid-day meal scheme was inspected at Jinnam School in the mandal. He warned that action would be taken against the concerned principals who received any complaints from the students. He inquired about the basic facilities needed by the students in the school. He was accompanied by HM Sanyasinayu.

Focus on educational development

Gurla, December 24 (Andhra Jyoti): Merakamudiam AMC Vice Chairman Dasari Sivaprasad asked to focus on educational development. A petition was handed over to MLC Chiranjeevi for the development of education. He asked them to develop the backward district and their region.