కూలిపోతోంది వారధి.. కదలిరావాలి సారథి..

- A
- A+
- A++
జిల్లాలో వంతెనల పరిస్థితి అధ్వానంగా మారింది. ఎప్పుడు ఏది కూలిపోతుందోనని బిక్కుబిక్కుమంటూ ప్రయాణాలు చేయాల్సిన దుస్థితి. ఏళ్లుగా వీటి నిర్వహణ పట్టించుకోకపోవడం.. పాతవంతెనలనీ కనికరం లేకుండా భారీ లోడ్‌తో ఇసుక, బుసక టిప్పర్లు దూసుకెళ్లడంతో ఇటీవల రెండు వారధులు కూలిపోయాయి. జిల్లాలో సుమారు 250 ఆర్‌అండ్‌బీ వంతెనలు ఉండగా.. అందులో 67కుపైగా కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయని అధికారులు గుర్తించారు. గత ప్రభుత్వంలో కనీసం మరమ్మతులు లేవు. కూటమి ప్రభుత్వం అయినా వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా వాసులు కోరుతున్నారు.

టెండర్లకే పరిమితం...
కైకలూరు, కలిదిండి, ముదినేపల్లి, గుడివాడ తదితర ప్రాంతాలకు విజయవాడ నుంచి వెళ్లాలంటే గుడివాడ ఆర్వోబీనే ఆధారం. దీనిపై రోజూ వేల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఏళ్లుగా నిర్వహణ లేకపోవడంతో చెట్లు పెరిగి.. క్రమంగా పగుళ్లు తేలి దెబ్బతింటోంది. దీని కిందే కొందరు పేదలు పాకలు వేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఫుట్‌పాత్ కుంగిపోవడంతో రోడ్డుపై నడవాల్సిన పరిస్థితి. రక్షణ గోడ శిథిలమై చువ్వలు తేలాయి. అక్కడక్కడా పూర్తిగా విరిగిపోయి ప్రమాదకరంగా మారింది. దీని మరమ్మతులకు రూ.35లక్షలు మంజూరైనా టెండర్ల దశలోనే మగ్గుతోంది. ఆలస్యం చేస్తే మరింత దెబ్బతిని కూలిపోయే ప్రమాదం ఉంది.
పట్టకుంటే..ముప్పుతో పెట్టుకున్నట్టే: భీమవరం, కైకలూరు, బంటుమిల్లి, ముదినేపల్లి తదితర ప్రాంతాల వారు విజయవాడకు వెళ్లాలంటే పెదపారుపూడి మండలం వెంట్రప్రగడ గ్రామంలోని దోసపాడు ఛానల్ పైవంతెన మీదుగా దగ్గర మార్గం. నిత్యం బస్సులు, లారీలు, వేల సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయి. స్లాబు, పిల్లర్లు దెబ్బతిన్నాయి. ఇది కూడా రేపోమాపో కూలేట్టుంది. అదే జరిగితే సుమారు 15 కి.మీ చుట్టూ తిరగకతప్పదు.

పాములపాడు గ్రామంలోఅధికలోడ్‌తో ఇసుక టిప్పర్ వెళ్లడంతో దోసపాడు కాలువ పైవంతెన కుప్పకూలింది.
- ఈదుమద్దాలిలోని చంద్రయ్య డ్రెయిన్ వారధి ఇలానే కూలిపోవడంతో తాత్కాలిక ఏర్పాట్లు చేశారు.
- పమిడిముక్కల మండలం మర్రివాడ గ్రామం వద్ద పుల్లేరు, రైవస్ కాలువలపై నిర్మాణాలు గోతులు పడ్డాయి.
- గుడివాడ పరిధిలోని సీపూడి, కాశీపూడి గ్రామాలకు అనుసంధానంగా బ్రిడ్జి శిథిలమైంది. ఇది కూలితే వీటికి ఇతర గ్రామాలతో సంబంధాలు తెగిపోయినట్లే.
- దెబ్బతిన్న వంతెనల జాబితా తయారు చేసి ప్రభుత్వానికి పంపించామని ఆర్‌అండ్‌బీ ఈఈ లోకేశ్వరరావు తెలిపారు.
గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- డీసీసీ బ్యాంక్ కార్యాలయం ఎదుట సహకార సంఘాల సిబ్బంది ధర్నా [ 18-02-2026] పట్టణంలో స్థానిక కేడీసీసీ బ్యాంక్ కార్యాలయం ఎదుట నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల సహకార సంఘాల సిబ్బంది ధర్నా నిర్వహించారు.
- గ్రంథాలయాల అభివృద్ధికి కృషి [ 18-02-2026] జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్ పర్సన్ భీమనేని వందనా దేవి అన్నారు.
- గుడివాడ సీసీఎస్ పీఎస్ గోదాములో అగ్నిప్రమాదం [ 18-02-2026] కృష్ణా జిల్లా గుడివాడ సీసీఎస్ పోలీస్‌స్టేషన్ గోదాములో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
- తవ్వుకో రేవంతా.. తోలుకో రోజంతా.. [ 18-02-2026] ఇసుకాసురుల ధన దాహానికి కృష్ణా నది గుల్లబారిపోతోంది. ఉచిత ఇసుక మాటున భారీ దందా సాగిస్తున్నారు. నేతలు.. అధికారులు ఏకమై ప్రకృతి వనరులను కొల్లగొడుతున్నారు. కళ్లముందే నిబంధనలకు పాతరేసినా అధికారులకు పట్టదు. నేతల అండతో రేవుల్లో అక్రమాలకు అంతేలేదు.
- నీరిస్తారా? నీరుగారుస్తారా? [ 18-02-2026] గుంటూరు నగర ప్రజలకు తాగునీటిని అందిస్తున్న వ్యవస్థల్లో లోపాలు ఇబ్బందికరంగా పరిణమించాయి. అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు సైతం సమస్యలను మరింతగా జటిలం చేస్తున్నాయి.
- మెప్మాలో రుణ బాగోతాలపై విచారణకు కలెక్టర్ ఆదేశం [ 18-02-2026] గత వైకాపా పాలనలో మెప్మా విభాగంలో చోటుచేసుకున్న అవినీతి అక్రమాలకు సంబంధించి ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనాలపై కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పందించి విచారణకు ఆదేశించారు.
- ఎయిమ్స్ ప్రస్థానం అద్వితీయం [ 18-02-2026] మంగళగిరి ఎయిమ్స్ ప్రస్థానం అద్వితీయం. బోధన, పరిశోధన, రోగి సంరక్షణ అనే మూడు స్తంభాలపై నిలిచి ఉంది. నమ్మకం అనే నాలుగో స్తంభాన్ని కూడా చేర్చాలని కోరుకుంటున్నానని రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ ఆకాంక్షించారు.
- రాజధానిలో భూసేకరణకు సిద్ధం [ 18-02-2026] నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి భూసమీకరణలో భూములివ్వని రైతుల నుంచి భూసేకరణ ద్వారా తీసుకునేందుకు ప్రణాళిక సిద్ధమైంది. కొంతమంది రైతులు వివిధ కారణాలతో ఇప్పటికీ భూసమీకరణలో భూములివ్వలేదు.
- చిట్టి తల్లులు.. చేదు నిజాలు.. [ 18-02-2026] చిట్టితల్లులు చిక్కుల్లో పడుతున్నారు.. కౌమార దశలోనే పెద్ద బాధ్యతను కడుపులో మోస్తున్నారు. తల్లిదండ్రుల అవగాహనా రాహిత్యం, అధికారుల నిర్లిప్తత.. కారణాలేమైనా టీనేజ్ ప్రెగ్నెన్సీతో ఇబ్బందులు పడుతున్నారు.
- సరఫరాలో జాప్యం.. స్పందిస్తే నయం [ 18-02-2026] ఉమ్మడి జిల్లాలో మిల్లర్లను ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ కొరత వేధిస్తోంది. కొన్నాళ్లుగా వీటి సరఫరా సరిగాలేక ఇబ్బందులు తప్పడంలేదు. అవి కలిపాకే బియ్యాన్ని మిల్లర్లు సరఫరా చేయాల్సి రావడంతో ఉమ్మడి జిల్లాలో భారీగా నిల్వలు మిల్లుల్లోనే నిలిచిపోయాయి.
- మునేరు కరకట్టకు మోక్షం..! [ 18-02-2026] 2024 వరదలు మునేరు వెన్ను విరిచాయి. కరకట్టకు 23చోట్ల గండ్లు పడ్డాయి. అనేకచోట్ల గట్లు బలహీనపడ్డాయి. భవిష్యత్తు దృష్ట్యా.. ముందు జాగ్రత్తగా కూటమి సర్కారు నడుం కట్టింది. గండ్లు పూడ్చే పనులకు రంగం సిద్ధం చేసింది.
- సిమ్‌లు మారుస్తూ.. సీన్ ఏమారుస్తూ! [ 18-02-2026] సంచలనం రేపిన పిల్లల విక్రయాల కేసులో కీలక నిందితురాలు ప్రియాంక తప్పించుకు తిరుగుతోంది. గత నెలలో మేరఠ్‌లో త్రుటిలో తప్పించుకున్న నిందితురాలు ఇంటికి రాకుండా ఇతర ప్రాంతాల్లో సంచరిస్తోంది. బెజవాడ పోలీసులు గట్టి నిఘా పెట్టడంతో..
- చేసేది మ్యూల్ వ్యవహారాలు.. చెప్పేది సాఫ్ట్‌వేర్ కొలువు [ 18-02-2026] తాను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ని అనీ, జీతం నెలకు రూ.30 వేలనీ.. ఇంట్లో అందరినీ నమ్మించాడు. కానీ చేసేది చట్టవిరుద్ధ కార్యకలాపాలే. ఇటీవల విజయవాడలో వెలుగు చూసిన మ్యూల్ ఖాతాల కేసులో కీలక సూత్రధారి రాజా వెంకట్ వ్యవహారమిది.
English Translation
The bridge is collapsing.. The captain should move..

- A
- A+
- A++
The condition of bridges in the district has become worse. It is a misery to travel worrying about when something will collapse. The maintenance of these has been ignored for years. Recently, two bridges have collapsed due to heavy loads of sand and dust tippers. While there are around 250 R&B bridges in the district, more than 67 of them are ready to collapse. At least there were no repairs under the previous government. District residents want the coalition government to pay special attention to these.

Limited to tenders...
Kaikalur, Kalidindi, Mudinepalli, If you want to go to Gudivada and other places from Vijayawada, Gudivada RVO is the base. Thousands of vehicles travel on it daily. Due to the lack of maintenance over the years, the trees have grown and are gradually getting damaged. Under this, some poor people are making a living. The condition of walking on the road as the footpath collapsed. The protective wall crumbled and the spokes floated. Here and there it has become completely broken and dangerous. Even though Rs.35 lakhs have been sanctioned for its repairs, it is still in the tender stage. If there is a delay, there is a risk of further damage and collapse.
If not caught..Threatened: People from Bhimavaram, Kaikaluru, Bantumilli, Mudinepalli etc. to go to Vijayawada, the nearest route is through the Dosapadu channel bridge in Ventrapragada village of Pedaparupudi mandal. Buses, lorries and thousands of vehicles are constantly moving. Slab and pillars are damaged. It also overthrew Repomapo. If that happens, it should be around 15 km.

In Pamulapadu village, a sand tipper with a heavy load overturned the Dospadu canal bridge. Collapsed.
- Temporary arrangements were made due to the collapse of the Chandraya Drain Bridge in Idumaddali.
- Structures on the Pulleru and Raivas canals at Marrivada village of Pamidimukkala Mandal collapsed. R&B EE Lokeswara Rao said that a list of damaged bridges has been prepared and sent to the government. href="https://www.eenadu.net/" target="_blank" rel="noopener">Telugu News► Follow us on Facebook, Twitter, href="https://www.instagram.com/eenadulivenews/?hl=en" target="_blank" rel="noopener">Instagram& Google News. Tags :Published : 23 Dec 2025 06:01 IST
Note:The commercial advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this regard.
More
- Dharna of co-operative societies staff in front of DCC Bank office [ 18-02-2026] In front of the local KDCC Bank office in the town, the staff of cooperative societies of Nandigama and Jaggayapet constituencies organized a dharna.
- Efforts for the development of libraries [ 18-02-2026] Vandana Devi, chairperson of district library organization Bhimane, said that efforts are being made for the development of libraries in the district. 18-02-2026] A fire broke out in the warehouse of CCS Police Station Gudivada, Krishna District. This caused a big fire.
- Dig all day.. Peel all day.. [ 18-02-2026] The Krishna River is overflowing due to the thirst for money of the Asukasuras. There is a huge rush for free sand. Leaders and officials are looting natural resources. Even if the rules are broken before the eyes, the authorities do not care. There is no end to the irregularities in the docks under the leadership.
- Water? Do you drink water? [ 18-02-2026] Defects in the systems providing drinking water to the people of Guntur city have become troublesome. The decisions taken by the authorities are also complicating the problems.
- Collector's order to inquire into loan defaults in Mepma [ 18-02-2026] Collector Tamim Ansaria responded to the articles published in 'Inadu' regarding the corruption irregularities in the MEPMA department during the previous Vaikapa regime and ordered an investigation. 18-02-2026] Mangalagiri AIIMS Prasthanam is unique. It stands on three pillars namely teaching, research and patient care. State IT and Education Minister Nara Lokesh wished to include the fourth pillar of trust as well.
- Preparation for land acquisition in the capital [ 18-02-2026] For the construction of Amaravati, the capital of Navyandhra, a plan has been prepared to acquire land from the farmers who did not give land in land acquisition. Some farmers are still not given land in land consolidation due to various reasons. 18-02-2026] Grandparents are getting into trouble.. They are carrying a big responsibility in their stomach at the stage of adolescence. Ignorance of parents, indifference of authorities.. Teens are suffering from pregnancy due to any reasons.
- Delay in supply. 18-02-2026] The shortage of fortified rice kernels is bothering the millers in the joint district. Due to lack of proper supply of these for some years, there is no shortage of problems. As the millers had to supply the rice they milled, huge reserves remained in the mills in the joint district. [ 18-02-2026] 2024 Floods broke front and back. 23 places of Karakatta were damaged. Ridges have weakened in many places. In view of the future, the alliance government has carefully prepared its waist. The ground has been prepared for the digging works.
- Changing sims. [ 18-02-2026] Priyanka, the key accused in the sensational child trafficking case, is on the run. The accused escaped from Meerut last month and is wandering in other places without coming home. As Bejawada police kept a tight vigil..
- Mule affairs are doing. 18-02-2026] He believed everyone in the house that he was a software engineer and his salary was Rs. 30 thousand per month. But doing illegal activities. The case of Raja Venkat, the key mastermind in the mule accounts case that came to light in Vijayawada recently.