Scrub Typhus: ‘తేవీటి పురుగు’... తేలిగ్గా తీసుకోవద్దు

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 24 Dec 2025 19:03 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
5 min read

పొల్లాల్లో, పొదల్లో.. పచ్చిక బయళ్లలో.. శుభ్రతలేని, తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సంచరించే ఓ చిన్న కీటకం చిగ్గర్‌ మైట్‌. కొన్ని ప్రాంతాల్లో దీన్ని ‘తేవీటి పురుగు’ అంటారు. తలలో పేను కంటే చిన్నగా ఉండే ఈ కీటకం కరిస్తే ‘స్క్రబ్‌ టైఫస్‌’ వ్యాధి సోకుతుంది. సకాలంలో చికిత్స తీసుకోకపోతే అనారోగ్యంపాలై ప్రాణాపాయ పరిస్థితులు ఎదురవుతాయి. రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటివరకు ఈ కేసులు 1,715 నమోదు కాగా, 12 మంది మరణించడం కలవరపెడుతోంది. అయితే డెంగీ, మలేరియా ఇతర వ్యాధుల్లా ‘స్క్రబ్‌ టైఫస్‌’ కేసులు కూడా ఏటా నమోదు అవుతుంటాయని, ఎవరూ ఆందోళన చెందవద్దని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ధైర్యం నింపుతున్నా.. ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలోనే మరణాలు నమోదు కావడం అందరూ అప్రమత్తం కావలసిన అవసరాన్ని సూచిస్తోంది. ఈ వ్యాధిపై అధ్యయానికి జాతీయ స్థాయి నిపుణులతో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కీటకం ప్రమాదకరంగా రూపాంతరం చెందడం వెనుక కారణాల అన్వేషణకు బ్యాక్టీరియా జన్యుక్రమంపై అధ్యయనం చేయాలని భావిస్తోంది.  

 

దిల్లీ, లద్దాఖ్, దాద్రా-నగర్‌ హవేలీ మినహా మిగతా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో స్క్రబ్‌ టైఫస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా తమిళనాడు (7,308), ఒడిశా (6,586), పశ్చిమ బెంగాల్‌ (4,674), రాజస్థాన్‌ (3,326), మధ్యప్రదేశ్‌ (2,551), కర్ణాటక (1,870), ఆంధ్రప్రదేశ్‌ (1,715), అస్సాం (1,555) కేసులు నమోదయ్యాయి. మరణాలు మాత్రం ఆంధ్రప్రదేశ్‌లోనే చోటుచేసుకోవడం గమనార్హం. 

  • ఈ కీటకం కుట్టినచోట ఓరియెంటియా సుట్సుగముషి బ్యాక్టీరియా ద్వారా శరీరంపై కాలినట్లు చిన్న మచ్చ ఏర్పడుతుంది. మచ్చ లేకున్నా వ్యాధి సోకిన లక్షణాలు 7 నుంచి 20 రోజుల్లో బయటపడతాయి. 
  • తలనొప్పి, ఒళ్లు నొప్పులు, జ్వరం, వణుకు లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. 
  • ఎలుకలను కుట్టిన తర్వాత ఈ కీటకాలు మనుషుల్ని కుడితే బ్యాక్టీరియా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 
  • రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులున్న వృద్ధులపై స్క్రబ్‌ టైఫస్‌ ప్రభావం ఎక్కువ ఉంటుంది. 
  • స్క్రబ్‌ టైఫస్‌ అనుమానిత లక్షణాలు ప్రాథమిక స్థాయిలో గుర్తిస్తే ఎలాంటి ఇబ్బందీ ఉండదని, డాక్సీసైక్లిన్, అజిత్రోమైసిన్‌ మాత్రలతో నయం చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. 
  • ఆలస్యం చేస్తే ఇన్ఫెక్షన్లు పెరిగి ప్రాణాంతకమయ్యే ప్రమాదం ఉంది. 

డ్డి పొదలు, శుభ్రతలేని తోటలు, నిర్వహణ లేని ప్రాంతాలు.. ఎలుకలు సంచరించే ప్రాంతాలే స్క్రబ్‌ టైఫస్‌ హాట్‌ స్పాట్లు. వర్షాకాలంలో మొదలై శీతాకాలం ముగిసేవరకు తేవీటి పురుగుల తాకిడి ఎక్కువ. ఇటీవల వరుస తుపాన్లతో వీటికి మరింత అనుకూల వాతావరణం ఏర్పడిందని నిపుణులు భావిస్తున్నారు.

  • చంకలు, తొడల మధ్య భాగాల్లో స్నానం చేశాక తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి.
  • శుభ్రమైన, బాగా దులిపి పరిశీలించిన తర్వాతే దుస్తులు, సాక్సులు, బూట్లు వేసుకోవాలి. 
  • కీటకాలు ఇంట్లోకి చొరబడకుండా, కుట్టకుండా జాగ్రత్తలు పాటించాలి.
  • వైద్యుల సూచన మేరకు చర్మానికి కీటక నివారిణి క్రీములు రాసుకోవడం ఉత్తమం.
  • ఆరుబయట పొదలు, గడ్డి ఉన్న ప్రాంతాలకు వెళ్లేటప్పుడు శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దస్తులు, పాదాలు కప్పి ఉంచేలా సాక్సులు, బూట్లు ధరించాలి. 
  • పొలాలు, పార్కులకు వెళ్లేటప్పుడు గడ్డి ప్రదేశాల్లో నేరుగా నేలపై కూర్చోవద్దు. కింద వస్త్రం వేసుకోవాలి. ఇంటికి వచ్చాక ఆ దస్తులు బాగా దులపాలి/ వేడి నీటిలో నానబెట్టి ఉతకాలి. 
  • ఇంటి పరిసరాల చుట్టూ పొదలు, గడ్డి ఎప్పటికప్పుడు తొలగించాలి. పచ్చదనం, పచ్చిక బయళ్లు, గృహోపకరణ సామగ్రి నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాలి.
  • ఈ కీటకాలు ఎలుకల శరీరానికి అతుక్కుని జీవించే అవకాశం ఉంటుంది. అందుకే ఇంట్లో ఎలుకలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
  • పెంపుడు జంతువులు బయట తిరిగి వస్తే వాటి శరీరంపై కీటకాలు లేకుండా జాగ్రత్తపడాలి.
  • కార్యాలయాలు, గోదాముల్లో శుభ్రత  పాటించాలి. వ్యర్థాలు, ఆహార వ్యర్థాల నిర్వహణ సమర్థంగా ఉండాలి.  
  • చెదల నివారణ తరహాలోనే ఎప్పటికప్పుడు ఎలుకలు, కీటకాల నివారణ చర్యలు చేపట్టాలి.

స్క్రబ్‌ టైఫస్‌కు కారణమైన చిగ్గర్‌ కీటకం తలలో పేను కంటే చిన్నగా ఉంటుంది. తల్లి కీటకం నుంచి బ్యాక్టీరియా గుడ్లలోని లార్వాకు చేరుతుంది. గుడ్ల నుంచి పిల్లలు బయటకు వచ్చి శరీరంలో చంకలు, గజ్జల్లో అతుక్కుపోయి రక్తం పీలుస్తుంటాయి. శరీరంపై దురద లేదా ఏదో కుట్టినట్లు అనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. ఒంటి నొప్పులు, జ్వరం వంటి లక్షణాలకు సాధారణ మాత్రలు వాడుతూ కొందరు నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో తాత్కాలికంగా జ్వరం తగ్గినా, ఆ తర్వాత ప్రభావం బయటపడుతోంది. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు సకాలంలో పరీక్షలు చేయించుకోకపోతే ఈ బ్యాక్టీరియా ప్రభావంతో ఇబ్బందులు ఎదురవుతాయి. ఐజీఎం ఎలీసా పరీక్షల ద్వారా పాజిటివ్‌ కేసులను గుర్తించే వీలుంది. ప్రభుత్వ వైద్యశాలల్లో మందులు, పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. చెమ్మ ఉన్నచోట కీటక సంచారానికి అవకాశం ఎక్కువ. కీటక నివారిణుల వంటివి వాడుతూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది కొత్తగా వచ్చిన వ్యాధి కాదు. సకాలంలో అప్రమత్తమైతే తక్కువ ఖర్చుతో సులువుగా నయం చేయవచ్చు.

► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 24 Dec 2025 19:02 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • విలువలు, విధానాలపై కుటుంబ సభ్యులకు స్పష్టత ఉండాలి వ్యాపార సంస్థల నిర్మాణంలో అనుసరించాల్సిన విధానాలు, పాటించాల్సిన విలువలపై కుటుంబ సభ్యులందరికీ స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే.. కుటుంబ వ్యాపారాలు దీర్ఘకాలం మనగలుగుతాయని మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఎండీ శైలజా కిరణ్‌ అన్నారు.
  • రాంబిల్లిలో మెగా ఔషధ కంపెనీ అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో మెగా ఔషధ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు సన్నాహాలు సాగుతున్నాయి.
  • విలేజ్‌ టు విరాట్‌ మీరు క్రికెట్‌ బాగా ఆడతారా..? మీ ప్రతిభకు తగిన గుర్తింపు, వేదిక కోసం చూస్తున్నారా..? అయితే.. మీ కోసమే ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) ‘విలేజ్‌ టు విరాట్‌’ ట్యాగ్‌తో ‘రూరల్‌ టాలెంట్‌ సెర్చ్‌ ప్రోగ్రాం’కు రూపకల్పన చేస్తోంది.
  • ‘ఆరెంజ్‌ ఎకానమీ’ అభివృద్ధికి త్వరలో వర్క్‌షాపులు సాంస్కృతిక, పర్యాటక, ఫిల్మ్‌ టూరిజం విభాగాల్ని సమన్వయం చేస్తూ ‘ఆరెంజ్‌ ఎకానమీ’ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆ శాఖల మంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు. ఇందుకోసం జూన్‌ లేదా జులై నెలల్లో ప్రత్యేక వర్క్‌షాపులు నిర్వహిస్తామని తెలిపారు.
  • పర్యాటకానికి ‘స్వర్ణ’ కళ! వైకాపా హయాంలో నిర్లక్ష్యానికి గురైన రాష్ట్ర పర్యాటక రంగం తిరిగి గాడిలో పడుతోంది. కూటమి ప్రభుత్వం దానికి పారిశ్రామిక హోదా కల్పించి ప్రోత్సాహకాలు ప్రకటించడంతో పెద్ద ఎత్తున పెట్టుబడులొస్తున్నాయి.
  • వైద్యులకు ఏఐ ప్రత్యామ్నాయం కాదు ‘వైద్యరంగంలో కృత్రిమ మేధ విప్లవాత్మక మార్పులు తెస్తోంది. వ్యాధుల నిర్ధారణ, ఆరోగ్య సేవల్లో క్లిష్ట సమస్యలకు ఏఐ టూల్స్‌ పరిష్కారాలు చూపిస్తున్నాయి.
  • వైభవంగా నూకతాత జాతర అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని రాజయ్యపేటలో మంగళవారం నూకతాత జాతర వైభవంగా సాగింది. నూకతాత ప్రతిమకు పూజారులు, భక్తులు బోయపాడు తీరంలో ఉదయం స్నానం చేయించి పూజలు నిర్వహించారు.
  • నందీశ్వరుడిపై సర్వాంతర్యామి సర్వాంతర్యామి అయిన సోమస్కందమూర్తి ఆయనకు ప్రియమైన నందీశ్వరుడిపై, జ్ఞానప్రసూనాంబిక అమ్మవారు కామధేనువుపై కొలువుదీరి శ్రీకాళహస్తి తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.
  • శ్రీశైలంలో శాస్త్రోక్తంగా పూర్ణాహుతి శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం పూర్ణాహుతి, చండీశ్వరునికి అవబృధ స్నానం, వసంతోత్సవ క్రతువులు ఘనంగా నిర్వహించారు.
  • తుది దశలో మూలపేట పోర్టు నిర్మాణం ఉత్తరాంధ్రకు గేమ్‌ ఛేంజర్‌గా శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేట వద్ద నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు పనులు చురుగ్గా సాగుతున్నాయి. నిర్మాణ పనులు 75 శాతం మేర పూర్తయినట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది.
  • 12వ పీఆర్సీ ప్రకటించకపోతే ‘చలో సచివాలయం’ వేతన సవరణ కోసం 12వ పీఆర్సీ కమిషన్‌ను తక్షణమే నియమించి, ఐఆర్‌ను 29 శాతం ప్రకటించాలని యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్‌.వెంకటేశ్వర్లు, కె.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు.
  • అమరావతిలో క్యాట్‌ శాశ్వత బెంచ్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వ చర్యలు అమరావతిలో సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌ సర్క్యూట్‌(క్యాట్‌) శాశ్వత బెంచ్‌ ఏర్పాటుకు భూ కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించిందని ఆ సంస్థ తెలిపింది.
  • బిల్‌గేట్స్‌ పర్యటన.. సీఎం విజన్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపు గేట్స్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ బిల్‌గేట్స్‌ అమరావతి పర్యటన.. సీఎం చంద్రబాబు విజన్‌కు ప్రపంచ స్థాయి గుర్తింపని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు.
  • 21 రోజుల్లో జనన మరణాల నమోదు తప్పనిసరి రాష్ట్రంలో జనన మరణాల నమోదుకు కొత్త నిబంధనలను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. 21 రోజుల్లో నమోదు తప్పనిసరి చేసింది.
  • అమర్‌నాథ్‌ బృందాన్ని కలవని అంబటి! రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్‌ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి, వైకాపా నేత అంబటి రాంబాబు తమ పార్టీకే చెందిన కొందరు నేతలను ములాఖత్‌లో కలిసేందుకు ఇష్టపడలేదు.
  • ఏపీలో వేగవంతమైన అభివృద్ధి ‘ఎక్స్‌’లో బిల్‌గేట్స్‌ ఏఐ, సాంకేతికతను ఉపయోగించుకుని వ్యవసాయం, విద్య, ఆరోగ్యరంగాల్లో ఆవిష్కరణలతో ఆంధ్రప్రదేశ్‌ వేగవంతంగా అభివృద్ధి చెందుతోందని గేట్స్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ బిల్‌గేట్స్‌ పేర్కొన్నారు.
  • మూలుగ మార్పిడి చికిత్స ఎప్పటికి వస్తుంది? రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో మూలుగ (బోన్‌మారో) మార్పిడి చికిత్స అందుబాటులో లేకపోవడాన్ని హైకోర్టు ఆక్షేపించింది.
  • అసెంబ్లీలో పని చేయని మైక్‌ సిస్టమ్‌ అసెంబ్లీలో మంగళవారం మైక్‌ సిస్టమ్‌ మొరాయించింది. శాసనసభలో ఉదయం 9 గంటలకు సమావేశాన్ని ప్రారంభించే సమయానికి ముందు సిబ్బంది పరిశీలించినపుడు మైకులు పని చేయడం లేదని గుర్తించారు. సాంకేతిక విభాగం హడావుడిగా సరిచేసే ప్రయత్నం చేసినా ఫలించలేదు.
  • ప్రాజెక్టు కొట్టుకుపోయినా పట్టించుకోని జగన్‌ మామిడి రైతులకు కష్టం వస్తే స్థిరీకరణ నిధి ద్వారా నిధులు కేటాయించి ఆదుకున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందని తెదేపా ఎమ్మెల్యే కె.మురళీమోహన్‌ పేర్కొన్నారు. అందులో పూతలపట్టు నియోజకవర్గానికి అధిక మొత్తం నిధులు దక్కాయని చెప్పారు.
  • వైకాపా పాలనలో ఇష్టారీతిన విద్యుత్తు రాయితీ విధానం వైకాపా హయాంలో ఆక్వా రంగంలో విద్యుత్తు రాయితీని ఇష్టానుసారంగా ఒక్కో రైతుకు ఒక్కో విధంగా అమలు చేశారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మండిపడ్డారు. వైకాపా సర్కారు దుర్మార్గాలను సరిచేయాల్సిన అవసరముందని పేర్కొన్నారు.

English Translation
> my-3">

Scrub Typhus: 'Teveti's bug'...don't take it lightly

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 24 Dec 2025 19:03 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
5 min read

Chigger mite is a small insect that roams in fields, bushes, pastures, unsanitary and humid areas. In some areas it is called 'Teveti Vyri'. The bite of this insect, which is smaller than a head louse, causes scrub typhus. If not treated in time, it can lead to illness and death. 1,715 cases have been registered in the state so far this year and 12 people have died. However, like Dengue, Malaria and other diseases, 'Scrub Typhus' cases are also registered every year, and although the medical and health officials are encouraging people not to worry, the record of deaths in our state like nowhere else indicates the need for everyone to be alert. The government has decided to form a task force with national level experts to study this disease. A study on the genome of the bacteria is expected to explore the reasons behind this insect's dangerous transformation.  

Except Delhi, Ladakh, Dadra-Nagar Haveli, other states and union territories have reported positive cases of scrub typhus. Tamil Nadu (7,308), Odisha (6,586), West Bengal (4,674), Rajasthan (3,326), Madhya Pradesh (2,551), Karnataka (1,870), Andhra Pradesh (1,715) and Assam (1,555) reported the highest number of cases. It is noteworthy that the deaths occurred in Andhra Pradesh itself. 

  • A small burn-like scar is formed on the body by the bacteria Orientia tsutsugamushi where this insect stings. Even if there is no scar, symptoms of infection will appear in 7 to 20 days. 
  • Symptoms like headache, sore throat, fever, shivering should be consulted immediately. 
  • If these insects bite humans after biting mice, the bacterial effect is greater. 
  • Scrub typhus affects children with weak immune system and elderly people with chronic diseases. 
  • Doctors say that there is no problem if the suspected symptoms of scrub typhus are recognized at the basic level and can be treated with doxycycline and azithromycin tablets. 
  • If delayed there is a risk of infections increasing and becoming fatal. 

Weedy bushes, unsanitary gardens, unmaintained areas... areas where rats roam are scrub typhus hot spots. The attack of these insects is high from the rainy season till the end of winter. Experts believe that the recent series of storms have created a more favorable environment for them.

  • After taking a bath, the areas between the armpits and thighs should be wiped clean without getting wet. 
  • Care should be taken not to get bitten by insects.
  • It is best to apply insect repellent creams to the skin as per doctor's advice.
  • When going outside to areas with bushes and grass, wear clothes that cover the body completely, socks and shoes to cover the feet. 
  • Do not sit directly on the ground in grassy areas while visiting fields and parks. Wear a cloth underneath. After coming home, the clothes should be washed well/soaked in hot water. 
  • Shrubs and grass around the house should be removed from time to time. Care should be taken in the management of greenery, lawns and household equipment.
  • These insects can survive by sticking to the body of mice. That's why care should be taken to keep the house free from mice.
  • If pets come back outside, make sure that there are no insects on their body.
  • Cleanliness should be observed in offices and warehouses. Waste and food waste management should be efficient.  
  • Measures for rodent and insect prevention should be taken from time to time in the same manner as pest prevention.

The chigger insect that causes scrub typhus is smaller than a head louse. Bacteria from the mother insect are transferred to the larvae in the eggs. The babies come out of the eggs and stick to the armpits and groin of the body and suck blood. If you feel itching or something stinging on your body, you should be alerted immediately. Some are neglecting to use common pills for symptoms like pain in the stool and fever. Even if the fever is reduced temporarily, after that the effect is revealed. People with chronic diseases can suffer from the effects of these bacteria if they are not tested on time. Positive cases can be identified by IgM ELISA tests. Medicines and tests are available in government hospitals. Where there is urine there is more chance of insect migration. Adequate precautions should be taken while using insecticides. This is not a new disease. Early warning can be easily cured at low cost.

► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 24 Dec 2025 19:02 IST

Note:Advertisements appearing on enadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.

More

  • Family members should be clear about values and policies. Margadarshi Chitfunds MD Shailaja Kiran said that when all the family members have a clear understanding of the values and procedures to be followed in the construction of business enterprises, family businesses can survive for a long time. Preparations are underway for setting up a mega pharmaceutical manufacturing industry in Rambilli mandal of Anakapalli district.
  • Village to Virat Do you play cricket well? Are you looking for a platform and recognition for your talent? But.. It is for you that Andhra Cricket Association (ACA) is designing a 'Rural Talent Search Programme' with the tag 'Village to Virat'.
  • Workshops for the development of 'Orange Economy' will be held soon. Kandula Durgesh, Minister of Culture, Tourism and Film Tourism, said that the aim of the government is to develop 'Orange Economy' by coordinating the departments of culture, tourism and film tourism. He said that special workshops will be held in June or July for this purpose.
  • 'Golden' art for tourism! The state's tourism sector, which was neglected during Vaikapa's regime, is back in the groove. With the alliance government giving it industrial status and announcing incentives, large scale investments are being made.
  • AI is not a substitute for doctors. Artificial intelligence is revolutionizing the field of medicine. AI tools are showing solutions to difficult problems in disease diagnosis and health services. On Tuesday, Nukatatha fair was held in Rajayyapet of Nakkapalli mandal of Anakapalli district. The priests and devotees bathed in the morning at Boyapadu beach and performed puja to the image of Nukatatha. Sarvantyami Somaskandamurthy appeared to the devotees on his beloved Nandishvara and Gnanaprasunambika on Kamadhenu while strolling through the streets of Srikalahasti in Koluvudiri. As part of the Mahashivratri Brahmotsavam in Srisaila Mahakshetra, Poornahuti, Avabrdha bathing and Vasantotsava rituals of Chandiswara were held on Tuesday. As a game changer for Uttarandhra, the greenfield port being constructed at Moolpet of Santabommali mandal of Srikakulam district is going on actively. The construction company announced that 75 percent of the construction work has been completed. UTF state president and general secretaries N.Venkateshwarlu and K.S.N.Prasad demanded that the 12th PRC commission be appointed immediately for wage revision and declare the IR as 29 percent. The organization said that the state government has already started the process of land allotment for setting up a permanent bench of the Central Administrative Tribunal Circuit (CAT) in Amaravati.
  • Bill Gates' visit.. Global recognition of CM vision Gates Foundation Chairman Bill Gates's visit to Amaravati..Tedpa State President Palla Srinivasa Rao said that CM Chandrababu's vision is a world class recognition.
  • Registration of births and deaths within 21 days is mandatory The government has brought new rules for registration of births and deaths in the state. Registration is mandatory within 21 days.
  • Ambati who did not meet Amarnath team! Former minister and Vikapa leader Ambati Rambabu, who is a remand prisoner in Rajamahendravaram Central Jail, did not want to meet some leaders of his own party in Mulakat. Gates Foundation Chairman Bill Gates said that Andhra Pradesh is developing rapidly with innovations in agriculture, education and health sectors using AI and technology.
  • When will transplant therapy come? The High Court objected to non-availability of bone marrow transplant treatment in government hospitals and medical colleges in the state.
  • Non-functioning mic system in assembly. The mic system blared in the assembly on Tuesday. When the staff checked before the session started at 9 am in the Legislative Assembly, they found that the microphones were not working. The technical department hastily tried to fix it but to no avail. TDEPA MLA K. Murali Mohan said that Chandrababu should be credited with allocating funds through the stabilization fund when mango farmers face difficulties. He said that Puthalapattu Constituency got the highest amount of funds. Sarvepalli MLA Somireddy Chandramohan Reddy said that during the Vaikapa regime, electricity subsidy was implemented in the aqua sector according to the will of each farmer. Vaikapa stated that it is necessary to correct the wrongdoings of the government.