Eesha Movie Review: రివ్యూ: ఈషా.. తెలుగు హారర్‌ థ్రిల్లర్‌ భయపెట్టిందా?

Eenadu icon
By Entertainment Team Published : 25 Dec 2025 00:06 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
4 min read

Eesha Movie Review || చిత్రం: ఈషా; నటీనటులు: త్రిగుణ్, అఖిల్‌ రాజ్, హెబ్బా పటేల్, సిరి హనుమంతు, పృథ్వీరాజ్, మైమ్‌ మధు తదితరులు; సంగీతం: ఆర్‌ఆర్‌ ధృవన్‌; రచన, దర్శకత్వం: శ్రీనివాస్‌ మన్నె; నిర్మాతలు: పోతుల హేమ వెంకటేశ్వరరావు; సమర్పణ: కేఎల్‌ దామోదర్‌ ప్రసాద్‌; విడుదల తేదీ: 25-12-2025

నిర్మాతలు బన్నీవాస్, వంశీ నందిపాటి మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇటీవల వాళ్ల నుంచి వచ్చిన ‘లిటిల్‌ హార్ట్స్‌’, ‘రాజు వెడ్స్‌ రాంబాయి’ ప్రేక్షకుల్ని మెప్పించాయి. ఈసారి సినీప్రియుల్ని భయపెట్టేందుకు ‘ఈషా’ అనే హారర్‌ చిత్రాన్ని బాక్సాఫీస్‌ ముందుకు తీసుకొచ్చారు. మరి ఈ చిత్ర కథేంటి? ఇది ప్రేక్షకుల్ని భయపెట్టిందా

కథేంటంటే..

Eesha movie stroy || కల్యాణ్‌ (త్రిగుణ్‌), వినయ్‌ (అఖిల్‌ రాజ్‌), నయన (హెబ్బా పటేల్‌), అపర్ణ (సిరి హనుమంతు) చిన్నప్పటి నుంచి మంచి మిత్రులు. దెయ్యాలు, ఆత్మలనేవి అసలు లేవని బలంగా నమ్ముతుంటారు. మూఢనమ్మకాల పేరుతో జనాల్ని దోచుకుంటున్న.. అమాయకుల చావులకు కారణమవుతున్న బురిడీ బాబాలు, దొంగ స్వామీజీల ఆటకట్టించడమే పనిగా పెట్టుకుంటారు. ఈ క్రమంలోనే వాళ్లకు ఆంధ్ర - ఒడిశా సరిహద్దులో జీవిస్తున్న ఆది దేవ్‌ (పృథ్వీరాజ్‌) బాబా గురించి తెలుస్తుంది. దీంతో అతని ఆట కట్టించేందుకు ఈ నలుగురు మిత్రులు సిద్ధమవ్వగా.. ‘ఆత్మలు ఉన్నాయని నిరూపిస్తే’ అనే సవాల్‌ అతడి నుంచి వాళ్లకి ఎదురవుతుంది. దీంతో ఆది దేవ్‌ విసిరిన సవాల్‌లో భాగంగా ఆ మిత్రులంతా మూడు రోజుల పాటు ఓ పాడుబడిన బంగ్లాలో జీవించేందుకు సిద్ధమవుతారు. మరి ఆ తర్వాత ఏమైంది? అక్కడ వాళ్లకి ఎదురైన భయానక అనుభవాలేంటి? నిజంగా ఆ పాడుబడ్డ బంగ్లాలో ఆత్మలున్నాయా? ఈ నలుగురి మిత్రుల్ని చంపాలన్న పగతో ఓ గిరిజనుడి (మైమ్‌ మధు) శరీరంలో దూరిన పుణ్యవతి ఆత్మ కథేంటి? అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి.

ఎలా ఉందంటే..

eesha telugu movie review || దెయ్యాలు, ఆత్మలనేవి ఉన్నాయని నమ్మే వాళ్లు ఎంతమంది ఉన్నారో.. లేవని వాదించే వాళ్లూ అంతేమంది ఉన్నారు. ఈ ‘ఈషా’ కూడా దెయ్యాలు, ఆత్మలు ఉన్నాయా? లేదా? అనే కోణంలో సాగే కథతోనే రూపొందింది. నిజానికి ఈ తరహా కథల్లో నాయకానాయికల్ని దెయ్యాలంటే నమ్మకం లేని వాళ్లుగా చూపించడం.. దాన్ని సైంటిఫిక్‌గా నిరూపించే క్రమంలో భాగంగా వాళ్లు ఎక్కడో మారుమూలన ఉన్న పాడుబడ్డ బంగ్లాల్లోకి వెళ్లి జీవించడం లాంటివి కనిపిస్తుంటాయి. ఇది కూడా అలాంటి రొటీన్‌ ఫార్మాట్‌లో సాగే కథే. నలుగురు మిత్రులు, వాళ్లు చేసే పనులతో సినిమా ప్రారంభించిన దర్శకుడు ఆది దేవ్‌ బాబాని వెతుక్కుంటూ వారు ప్రయాణం ప్రారంభించడం.. మార్గ మధ్యలో ఓ అనూహ్య ప్రమాదాన్ని ఎదుర్కోవడం కథను మలుపు తిప్పుతాయి. ఇక వాళ్లంతా ఆది సవాల్‌ మేరకు పాడుబడ్డ బంగ్లాలోకి అడుగు పెట్టడంతో కథలో సంఘర్షణ మొదలవుతుంది. (eesha telugu horror movie) అయితే కథకెంతో కీలకమై ఆ బంగ్లా నేపథ్యాన్ని.. అక్కడి వరుస చావులకు వెనకున్న కారణాల్ని సన్నివేశ రూపంలో చూపకుండా మాటలతో సరిపెట్టేయడం ఏమంత రుచించదు. ఆ బంగ్లాలో తొలిరోజు నాయనాయికలకు ఎదురయ్యే ఓ భయానక అనుభవంతో ప్రథమార్ధానికి విరామమిచ్చిన తీరూ ఊహలకు తగ్గట్లుగానే ఉంటుంది. 

ఇక మిగిలిన రెండు రోజులు ఆ బంగ్లాలో ఆ నలుగురు మిత్రులకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి.. వాళ్లని చంపాలని పగతో రగిలిపోతున్న పుణ్యవతి ఆత్మ నుంచి ఎదురైన సవాళ్లేంటి? ఆది దేవ్‌ బాబా నేపథ్యమేంటి? అన్నది ద్వితీయార్ధానికి కీలకం. కానీ, వీటిలో దేనికీ దర్శకుడు సంతృప్తికరమైన జవాబివ్వలేకపోయాడు.  భయపెట్టేందుకు అవకాశమున్న పుణ్యవతి ఎపిసోడ్‌ను కేవలం ఒక్క ట్రాక్‌కే పరిమితం చేయడం వల్ల కథలో థ్రిల్‌ మిస్సయింది. అలాగే న్యూరో సర్జన్‌ అయిన ఆది దేవ్‌ దెయ్యాల్ని వదిలించే బాబాగా ఎందుకు మారాల్సి వచ్చిందన్నది చూపించలేదు. అనూహ్యంగా మరణించిన వాళ్లు తాము చనిపోయామన్న విషయాన్ని ఎందుకు ఒప్పుకోరు? అసలు ఆత్మలుగా ఎందుకు మారతారు? అనే పాయింట్‌తో క్లైమాక్స్‌ సాగుతుంది. అది మాత్రం ప్రేక్షకులకు కాస్త థ్రిల్‌ పంచుతుంది.క్లైమాక్స్‌లో సీజన్‌-2 బాటలు వేశారు

ఎవరెలా చేశారంటే..

త్రిగుణ్, హెబ్బా పటేల్, అఖిల్‌ రాజ్, సిరి కథకు తగ్గట్లు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఆది దేవ్‌గా పృథ్వీరాజ్‌ ఆహార్యం కొత్తగా ఉన్నా.. ఆ పాత్రను మరింత శక్తిమంతంగా చూపించాల్సింది. పుణ్యవతి ఆత్మ ఆవహించిన గిరిజన వ్యక్తిగా మైమ్‌ మధు తెరపై కనిపించినప్పుడల్లా భయపెట్టేశాడు. ఆయన ఆహార్యం కూడా భీతిగొలిపేలా ఉంది. ఈ చిత్రానికి తన పాత్రే ప్రధాన ఆకర్షణ. దర్శకుడు ఎంచుకున్న కథలో కొత్తదనం లేదు. ధృవన్‌ సంగీతం, సంతోష్‌ విజువల్స్‌ అక్కడక్కడా ప్రేక్షకులకు హారర్‌ అనుభవాన్ని రుచి చూపించాయి. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లున్నాయి.

  • బలాలు
  • + ద్వితీయార్ధంలోని హారర్‌ అంశాలు
  • + థ్రిల్‌ పంచే క్లైమాక్స్‌
  • బలహీనతలు
  • - రొటీన్‌ కథ, కథనాలు
  • - ఊహలకందే సన్నివేశాలు (eesha telugu horror movie)
  • చివరిగా: ‘ఈషా’.. అక్కడక్కడా భయపెడుతుంది.. చివరిలో థ్రిల్‌ పంచుతుంది
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • రివ్యూ: సీతా ప‌య‌నం.. అర్జున్‌ దర్శకత్వం వహించిన మూవీ ఎలా ఉంది? ఐశ్వ‌ర్య అర్జున్‌ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేస్తూ స్వీయ ద‌ర్శ‌క‌నిర్మాణంలో ‘సీతాప‌య‌నం’ చిత్రాన్ని రూపొందించారు అర్జున్‌. మరి ఈ మూవీ ఎలా ఉంది?
  • రివ్యూ: కామెడీ డ్రామా ‘టీటీటీ’.. పెళ్లి ముఖ్యమా? అంతిమయాత్రా? జీవా హీరోగా తెరకెక్కిన లేటెస్ట్‌ మూవీ ‘టీటీటీ’. ప్రస్తుతం ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’లో స్ట్రీమింగ్‌ అవుతోంది.
  • ‘కపుల్‌ ఫ్రెండ్లీ’ రివ్యూ.. ప్రేమకథ మెప్పించిందా! ప్రేమికుల రోజు వచ్చిన ప్రేమకథ ‘కపుల్‌ ఫ్రెండ్లీ’ ప్రేక్షకులను మెప్పించిందా..
  • రివ్యూ: ఫంకీ.. విష్వక్‌సేన్‌కు విజయం దక్కిందా? విష్వక్‌సేన్‌ కథానాయకుడిగా కేవీ అనుదీప్‌ దర్శకత్వంలో రూపొందిన కామెడీ ఎంటర్‌టైన్‌ ‘ఫంకీ’ ఎలా ఉంది? ఎలాంటి వినోదాన్ని పంచింది?
  • రివ్యూ: హనీ.. మరో క్షుద్ర నేపథ్యంతో వచ్చిన నవీన్‌ చంద్ర థ్రిల్లర్‌ మెప్పించిందా? నవీన్‌ చంద్ర కీలక పాత్రలో నటించిన హారర్‌ థ్రిల్లర్‌ ‘హనీ’ మూవీ ఎలా ఉంది? ఎలాంటి థ్రిల్‌ పంచింది?
  • రివ్యూ: శ్రీ చిదంబ‌రంగారు.. వైవిధ్య కథాంశంతో వచ్చిన మూవీ మెప్పించిందా? ఫిబ్ర‌వ‌రిలో బాక్సాఫీస్‌ వద్ద చిన్న చిత్రాల జోరు కనిపిస్తోంది. అలా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ ‘శ్రీ చిదంబ‌రంగారు’.
  • రివ్యూ: యుఫోరియా.. గుణశేఖర్‌కు విజయాన్ని అందించిందా? ఈసారి విజయమే లక్ష్యంగా యువతరాన్ని దృష్టిలో పెట్టుకుని గుణశేఖర్‌ తీసిన చిత్రం ‘యుఫోరియా’. మరి ఈ చిత్ర కథేంటి? ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని అందించింది?Euphoria Movie Review 
  • రివ్యూ: సర్వం మాయ.. మలయాళంలో రూ.140కోట్లు వసూలు.. మూవీ ఎలా ఉంది? సింపుల్‌ కథకు హృద్యమైన సన్నివేశాలు జోడించి సినిమాను తీర్చిదిద్దుతుంటారు మలయాళ దర్శకులు. అలాంటి చిత్రమే ‘సర్వం మాయ’.
  • రివ్యూ: గాంధీ టాక్స్‌.. మూకీ సినిమా ఎలా ఉంది? ‘గాంధీ టాక్స్‌’ పేరుతో ఓ నిశ్శబ్ద చిత్రాన్ని తెరపైకి తెచ్చి అందరి దృష్టినీ ఆకర్శించారు దర్శకుడు కిశోర్‌. ఈ చిత్ర కథేంటి? మాటల్లేని ఈ సినిమా భావోద్వేగాలతో ప్రేక్షకుల్ని మెప్పించిందా? లేదా?
  • రివ్యూ: ఓం శాంతి శాంతి శాంతిః.. భార్యాభర్తల కామెడీ డ్రామా మెప్పించిందా? ‘ఓం శాంతి శాంతి శాంతిః’.  మ‌ల‌యాళంలో విజ‌య‌వంత‌మైన ‘జ‌య జ‌య జ‌య జ‌య‌హే’కి రీమేక్‌ ఇది. మరి మాతృక‌తో పోలిస్తే  ఇందులో క‌నిపించే కొత్త అంశం ఏంటి? ఎలాంటి వినోదాన్ని ఇచ్చింది?
  • ‘సిరై’.. రూ.3కోట్లతో తీస్తే రూ.30 కోట్లు వసూలు చేసిన క్రైమ్‌ డ్రామా ఎలా ఉంది? తమిళంతో పాటు, తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న నటుడు విక్రమ్‌ ప్రభు. వైవిధ్యమైన కథలతో అలరించే ఆయన నటించిన 25వ చిత్రం ‘సిరై’.
  • రివ్యూ: ‘బోర్డర్‌2’.. దేశభక్తి నేపథ్యం మరోసారి మెప్పించిందా? బాలీవుడ్‌ నుంచి వచ్చిన గొప్ప దేశభక్తి చిత్రాల్లో ‘బోర్డర్‌’కి ప్రత్యేక స్థానముంది. ఇప్పుడు 28ఏళ్ల తర్వాత ‘బోర్డర్‌ 2’ను తెరపైకి తీసుకొచ్చారు దర్శకుడు అనురాగ్‌ సింగ్‌. మరి ఈ చిత్ర కథేంటి? ప్రేక్షకుల్ని అలరించిందా?
  • రివ్యూ: చీకటిలో.. శోభిత ధూళిపాళ్ల క్రైమ్‌ థ్రిల్లర్‌ మెప్పించిందా?  శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వంలో శోభిత ధూళిపాళ్ల కీలక పాత్రలో నటించిన ‘చీకటిలో..’ ఎలా ఉంది?ఎలాంటి థ్రిల్‌ పంచింది?
  • రివ్యూ: తస్కరీ.. ఇమ్రాన్‌ హష్మీ వెబ్‌సిరీస్‌ థ్రిల్ పంచిందా? ఇమ్రాన్‌ హష్మీ ప్రధాన పాత్రలో రూపొందిన క్రైమ్‌ థ్రిల్లర్‌ వెబ్‌సిరీస్‌ ‘తస్కరీ’. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ సిరీస్‌ ఎలా ఉందంటే?
  • రివ్యూ: కలాంకావల్‌.. సైకో కిల్లర్‌గా మమ్ముట్టి.. మలయాళ బ్లాక్‌బస్టర్‌ ఎలా ఉంది? మమ్ముట్టి కీలక పాత్రలో నటించిన ‘కలాంకావల్‌’ మూవీ ఎలా ఉంది? ఎలాంటి థ్రిల్‌ పంచింది?
  • రివ్యూ: నారీ నారీ నడుమ మురారి.. శర్వానంద్‌ మూవీ ఎలా ఉందంటే? శర్వానంద్‌ హీరోగా తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘నారీ నారీ నడుమ మురారి’. సంక్రాంతి సందర్భంగా బుధవారం సాయంత్రం విడుదలైంది.
  • రివ్యూ: అనగనగా ఒక రాజు.. నవీన్‌ పొలిశెట్టి ఎంటర్‌టైనర్‌ ఎలా ఉంది? నవీన్‌ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి కీలక పాత్రల్లో మారి దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌ ఎలా ఉంది? ఎలాంటి వినోదాన్ని పంచింది?
  • రివ్యూ: భర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞప్తి.. రవితేజ ఖాతాలో హిట్‌ పడిందా? రవితేజ కథానాయకుడిగా కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఎలా ఉంది? ఎలాంటి వినోదాన్ని పంచింది?
  • రివ్యూ: మన శంకరవరప్రసాద్‌గారు.. చిరు-అనిల్‌ కాంబో మెప్పించిందా? చిరంజీవి కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘మన శంకరవరప్రసాద్‌గారు’ మూవీ ఎలా ఉంది? ఎలాంటి వినోదాన్ని పంచింది?
  • వెబ్‌సిరీస్‌ రివ్యూ: కానిస్టేబుల్‌ కనకం: సీజన్‌-2.. చంద్రిక బతికే ఉందా? వర్ష బొల్లమ్మ కీలక పాత్రలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్‌కు కొనసాగింపు ఉంటుందని చివరిలో చూపించారు. మరి ఇప్పుడు వచ్చిన సీజన్‌2 ఎలా ఉంది? ఎలాంటి థ్రిల్‌ పంచింది.