కుటుంబ కలహాల కారణంగా ఆ భార్యాభర్తలు విడిపోయారు. భర్త రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. రెండో పెళ్లి చేసుకోవడానికి పర్మీషన్ కోసం కాబోయే భార్యతో కలిసి కోర్టుకు వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న మొదటి భార్య, పిల్లలు కోర్టు దగ్గరకు చేరుకున్నారు. వారందరూ కలిసి ఆ వ్యక్తిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. అతడికి కాబోయే భార్యను కూడా కొట్టారు. ఈ సంఘటన మధ్య ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. కనౌజ్ మిర్జి ప్రాంతానికి చెందిన సంజు సింగ్‌కు పదేళ్ల క్రితం అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళతో పెళ్లయింది.


ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, గత కొన్నేళ్ల నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే విడాకులు తీసుకుని విడిపోయారు. అయితే, విడాకులు ఇవ్వటం సంజు భార్యకు ఏమాత్రం ఇష్టం లేదు. భర్త బలవంతం చేయటంతో మనసు చంపుకుని విడాకులు ఇచ్చింది. విడాకులు ఇచ్చిన తర్వాత సంజు రెండో పెళ్లికి సిద్ధం అయ్యాడు. తాజాగా, తనకు కాబోయే భార్యతో కలిసి రెండో పెళ్లికి పర్మీషన్ తీసుకోవటానికి ఏడీఎమ్ కోర్టుకు వెళ్లాడు. ఈ విషయం సంజు మొదటి భార్య, పిల్లలకు తెలిసింది. వారితో పాటు మరికొంతమంది కోర్టుకు దగ్గరకు వచ్చారు.


సంజుతో గొడవ పెట్టుకున్నారు. సంజును, సంజుకు కాబోయే రెండో భార్యను విచక్షణా రహితంగా కొట్టారు. ఈ గొడవతో ఏడీఎమ్ కోర్టు యుద్ధ భూమిలా మారిపోయింది. కొన్ని నిమిషాల పాటు గొడవ సాగింది. కోర్టులోని వారు గొడవను ఆపారు. తర్వాత గొడవపడ్డ వారందరూ ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘పాపం ఆ రెండో భార్య ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయింది. ఆమెను బాగా కొట్టారు’..‘ఫ్యామిలీ డ్రామా ఫైట్లు ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టవు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి


English Translation

The husband and wife got separated due to family quarrels. The husband is ready for second marriage. He went to the court with his fiancee for permission to get married for the second time. The first wife and children came to the court after learning about this. Together they attacked the man indiscriminately. His future wife was also beaten. This incident came to light in Madhya Pradesh of late. If we go into the complete details given by the police.. Sanju Singh from Mirji area of ​​Kanauj got married to a woman from the same area ten years ago.


The couple also have two children. However, since the last few years there have been quarrels between husband and wife. Divorced and separated in this background. However, Sanju's wife does not want to divorce. Due to her husband's coercion, she lost her mind and divorced. After the divorce, Sanju prepared for his second marriage. Recently, ADM went to the court to seek permission for his second marriage with his future wife. Sanju's first wife and children came to know about this. Along with them some other people came near the court.


They quarreled with Sanju. Sanju and Sanju's future second wife were beaten indiscriminately. The ADM court has turned into a war ground due to this tussle. The fight went on for a few minutes. Those in the court stopped the fight. Then all the quarrelers went their separate ways. Currently, a video of this incident has gone viral on social media. And, the netizens who are reacting to the video.. 'Unfortunately, the second wife got lost and got stuck. They beat her well'..'You never get bored of family drama fights no matter how many times you watch them'.


Also read