అనంతపురం, డిసెంబర్ 24:ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. కనురెప్ప పాటులో ఆమె బ్యాగ్‌లో ఉన్న సుమారు 16 తులాల బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. అనంతపురం నుంచి కదిరికి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది. 16 తులాల బంగారు ఆభరణాలతో షబానా అనే మహిళ బస్సు ఎక్కింది. టికెట్ కోసం బ్యాగులో నుంచి ఆధార్ కార్డు తీసుకునే క్రమంలో బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో షాకైన బాధితురాలు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. అనంతపురం కలెక్టరేట్ వద్ద బస్సుని ఆపిన పోలీసులు ప్రయాణికులను చెక్ చేశారు. పోలీసుల తనిఖీల్లో బంగారు ఆభరణాలు లభించలేదు. దీంతో బాధితురాలు కన్నీటి పర్యంతమయ్యారు.


English Translation

Ananthapuram, December 24:A woman traveling in an RTC bus had a bitter experience. Around 16 talas of gold jewelery in her bag along with her eyelids went missing. The incident took place in an RTC bus going from Anantapur to Kadiri. A woman named Shabana boarded the bus with 16 tolas of gold jewellery. While taking the Aadhaar card from the bag for the ticket, the gold ornaments were not found. The shocked victim immediately informed the police. Police stopped the bus at Anantapur Collectorate and checked the passengers. No gold ornaments were found during police checks. The victim was reduced to tears.