అనకాపల్లి, డిసెంబర్ 24:అనుమానం పెనుభూతం అంటారు. భార్యా/భర్త మనసులో ఒక్కసారి అనుమానం అనే బీజం పడితే.. అప్పటి వరకు సజావుగా సాగిన కాపురాలు కుప్పకూలిపోతాయి. అనుమానంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. చిన్న గొడవ అయితే పర్వాలేదు.. కానీ అది చిలికి చిలికి గాలి వానగా మారితే మాత్రం పెను ఉపద్రవాలకు దారి తీసే అవకాశం ఉంటుంది. అనుమానం అనే రోగంతో కట్టుకున్న భార్యను నానా హింసలకు గురిచేస్తున్న వారు ఎందరో. అలాగే అనుమానంతో భార్యలు చేతిలో నలిగిపోతున్న భర్తలు కూడా ఉన్నారు. మరికొందరు అయితే విచక్షణమరిచి తమ అర్ధాంగిని కడతేర్చిన ఘటనలు కూడా అనేకం ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకపాల్లి జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. కడదాగా తోడుండాల్సిన భర్తే.. భార్యను అతి కిరాతంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే...
జిల్లాలోని ఎలమంచిలి పట్టణంలో అనుమానంతో భార్యను భర్త దారుణంగా హత్య చేశాడు. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన దంపతులు బతుకుతెరువు కోసం ఎలమంచికి వచ్చారు. ఆ దంపతులు పాత ఇనుము దుకాణాన్ని లీజుకు తీసుకుని జీవనం సాగిస్తున్నారు. అయితే భార్య తరచూ ఫోన్‌లో మాట్లాడుతుండాన్ని గమనించిన భర్త ఆమెను మందలించాడు. ఈ విషయంపై తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరిగినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో ఫోన్‌లో మాట్లాడాటాన్ని భార్య కొనసాగించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన భర్త.. ఆమెను అతి కిరాతకంగా స్క్రూ డ్రైవర్‌తో పొడిచి హత్య చేశాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానకంగా సంచలనం సృష్టిస్తోంది.
ఇవి కూడా చదవండి...
Read LatestAP NewsAndTelugu News
English Translation
Anakapalli, December 24:Doubt is called penubhutam. Once a seed of doubt is planted in the mind of the wife/husband. Due to suspicion, quarrels often occur between couples. It is not a problem if it is a small quarrel.. but if it turns into a storm then it can lead to big trouble. There are many people who are subjecting the wife who is afflicted with the disease of doubt to various tortures. Also there are husbands who are being crushed by their wives due to suspicion. But there are also many incidents where some people washed their half without discretion. Now recently a similar incident has taken place in Anacapalli district of Andhra Pradesh state. The husband who was supposed to support him killed his wife in a brutal way. Going into the details...
The husband brutally murdered his wife on suspicion in Elamanchili town of the district. A couple from the state of Uttarakhand came to Elamanchi for a better life. The couple lives by leasing an old iron shop. But the husband noticed that the wife was talking on the phone often and reprimanded her. It seems that there were frequent quarrels between the two on this matter.
The husband got angry when the wife continued to talk on the phone, and stabbed her with a screw driver. As soon as the information was received, the police reached the spot and recovered the body. He was taken to the government hospital for postmortem. The police have registered a case and are investigating. This incident is creating sensation locally.
Also Read...
Read LatestAP NewsAndTelugu News