- సర్పంచ్‌ ఎన్నికల్లో తొలిసారి నోటా

- ఓటర్లకు అవగహన లేక చెల్లకుండా పోయినవి 10,016 ఓట్లు

ఆసిఫాబాద్‌, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నోటాకు (నన్‌ ఆఫ్‌ ది ఎబోవ్‌ ) వేల సంఖ్యలో ఓట్లు లభించాయి. పోటీలో ఉన్న అభ్యర్థుల్లో సర్పంచ్‌లుగా ఇష్టం లేదంటూ 2,091 మంది నోటాకే ఓటు వేశారు. ఓటు వేసే విధానం పైన అవగహన కొరవడి సర్పంచ్‌లకు సంబంధించి 10,016 ఓట్లు చెల్లకుండా పోయాయి. కాగా లింగాపూర్‌ మండలంలో తక్కువగా 51 మంది , కెరమెరి మండలంలో అత్యధికంగా 276 మంది నోటాకు ఓటు వేశారు.

అసెంబ్లీ, పార్లమెంట్‌..

ఎన్నికల కమిషన్‌ మున్సిపల్‌, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలను ఈవీఎంల ద్వారానే నిర్వహించి అందులో నోటాను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈసారి మొదటిసారిగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ ఎన్నికల సంఘం నోటాను ప్రవేశపె ట్టింది. పోటీలో ఉన్న అభ్యర్థులు నచ్చకపోతే ఆ ఓటరు ఎవరు నచ్చలేదంటూ తమ అభిప్రాయం తెలియజేసేలా నోటా గుర్తును సర్పంచ్‌, వార్డు సభ్యుల బ్యాలెట్‌ పేపర్‌ పై ముద్రించింది. దీంతో జిల్లా వ్యాప్తంగా 2,091 మంది ఓటర్లు సర్పంచ్‌ అభ్యర్థులకు సంబంధించి బ్యాలెట్‌ పై నోటాకు ఓటు వేసి తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

- మూడు విడతల్లో ఎన్నికలు:

జిల్లాలో 15 మండలాల పరిధిలో మూడు విడతల్లో ఈనెల 11,14,17 తేదీల్లో ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 335 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో వాంకిడి మండలంలోని తేజగూడ, ఆసిఫాబాద్‌ మండలంలోని రహపల్లి, చిలాటిగూడ గ్రామాలలో సర్పంచ్‌ స్థానాలకు రిజర్వేషన్లు అనుకులించకపోవడంతో అక్కడ సర్పంచ్‌ స్థానాలకు ఎన్నికలు జరుగలేదు. మిగితా 332 గ్రామపంచాయతీల్లో అధికారులు ఎన్నికలు నిర్వహించారు. ఆ గ్రామ పంచాయతీల పరిధిలో 3,53,895 మంది ఓటర్లు ఉన్నారు. కాగా 2,91,216 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలో 2,091 మంది ఓటర్లు నోటాకు ఓటు వేసి తమకు అభ్యర్థులు నచ్చలేదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.

- వేల సంఖ్యలో..

జిల్లాలో వేల మందికి ఓట్లు వేయడం కూడా రాలేదు. ఇన్నాళ్ళూ ఈవీఎంలకు అలవాటు పడిన ప్రజలు సర్పంచ్‌ ఎన్నికల్లో బ్యాలెట్‌ పేపర్‌లో అభ్యర్థి గుర్తు ఉన్న బాక్సులో స్వస్తిక్‌ ముద్ర వేయాల్సి ఉండగా.. అది కూడా సరిగ్గా వేయకపోవడంతో ఓట్లు చెల్లకుండా పోయాయి. అలా జిల్లా వ్యాప్తంగా 10,016 ఓట్లు చెల్లలెదు. ఓటు వే సే విధానం పై ప్రజలకు అవగహన లేకపోవడంతోనే ఓట్లు చెల్లకుండా పోయాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అధికారులు అవగాహన సమావేశాలు నిర్వహించే భవిష్యత్తులో మంచిదని తెలియజేస్తున్నారు.

మండలాల వారీగా వివరాలు ఇలా..

మండలం చెల్లనిఓట్లు నోటాకు

జైనూర్‌ 436 199

కెరమెరి 611 276

లింగాపూర్‌ 187 51

సిర్పూర్‌-యు 344 57

వాంకిడి 1,042 141

బెజ్జూర్‌ 810 105

చింతలమానేపల్లి 821 115

దహెగాం 631 202

కౌటాల 789 140

పెంచికల్‌పేట 329 52

సిర్పూర్‌-టి 645 74

ఆసిఫాబాద్‌ 983 177

కాగజ్‌నగర్‌ 1,164 235

రెబ్బెన 649 150

తిర్యాణి 575 117

--------------------------------------------------------------------

మొత్తం 10,016 2,091

--------------------------------------------------------------------


English Translation

- NOTA for the first time in Sarpanch election

- 10,016 votes were lost due to lack of understanding of the voters

Asifabad, December 24 (Andhra Jyoti): Nota (Nun of the Above) got thousands of votes in Gram Panchayat elections. Among the candidates in the contest, 2,091 people voted for Nota as they did not want to be Sarpanch. 10,016 votes were invalidated in respect of sarpanches due to lack of understanding on the voting procedure. Whereas in Lingapur mandal, the least 51 people voted for NOTA and the highest number of people voted for NOTA was 276 in Kerameri mandal.

Assembly, Parliament..

It is known that the Election Commission conducted municipal, MLA and MP elections through EVMs and introduced NOTA in it. This time, for the first time in the Gram Panchayat elections, the Election Commission has introduced the note. If the candidates in the contest are not liked, the sarpanch and ward members have printed the nota symbol on the ballot paper to express their opinion as to who the voter did not like. As a result, 2,091 voters across the district voted for the sarpanch candidates and expressed their opinions on the ballot.

- Elections in three phases:

Elections were held in three phases in 15 mandals in the district on 11, 14, 17 of this month. There are 335 village panchayats in Tejaguda in Wankidi mandal, Rahapalli and Chilatiguda villages in Asifabad mandal as reservation for sarpanch posts was not made, so elections for sarpanch posts were not held there. Officials conducted elections in remaining 332 Gram Panchayats. There are 3,53,895 voters under those Gram Panchayats. While 2,91,216 voters exercised their right to vote. 2,091 voters in the district voted for NOTA and expressed the opinion that they did not like the candidates. People who are used to EVMs all these years had to put the swastika stamp in the box containing the candidate's symbol in the ballot paper of the sarpanch election. Thus 10,016 votes were invalid across the district. Political analysts say that the votes were invalidated due to the lack of understanding of the people about the voting process. Officials are saying that awareness meetings will be good in the future.

Mandal wise details are as follows..

Mandal Invalid Votes Note

Jainur 436 199

Kerameri 611 276

Lingapur 187 51

Sirpur-U 344 57

Wankidi 1,042 141

Bezzur 810 105

Chintalamanepalli 821 115

Dahegam 631 202

Koutala 789 140

Penchikalpet 329 52

Sirpur-T 645 74

Aasifabad 983 177

Kagaznagar 1,164 235

Rebbena 649 150

Tiryani 575 117

----------------------------------------------------------------

Total 10,016 2,091

--------------------------------------------------------------------------------