ఈ ప్రపంచంలో అతి ఎక్కువ మంది పాములంటేనే భయపడతారు. పాములు ఉన్నాయంటే అటువైపు వెళ్లడానికి కూడా వణికిపోతారు. విషపూరిత సర్పం కాటేస్తే నిమిషాల్లో ప్రాణాలు పోవడం ఖాయం. అందుకే చాలా మంది పాములకు దూరంగా ఉంటారు. సింహాలు, పులులు కూడా పాములకు సాధ్యమైనంత దూరంగా ఉంటాయి. పాము విషం సింహాలను కూడా హతమార్చుతుంది. తాజాగా వడోదరలో అలాంటి ఘటనే జరిగింది. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Vadodara Sayaji Baug Zoo lioness).
వడోదరలోని సాయాజీబాగ్ జూలో ఉన్న సింహం బోనులోకి ఒక నాగుపాము వచ్చింది. ఆ పామును గమనించిన సింహం దానిపై దాడి చేసింది. పాము, సింహం మధ్య హోరాహోరీగా పోరాటం సాగింది. ఈ దాడిలో సింహాన్ని పలు సార్లు పాము కాటు వేసింది. దీంతో పాము విషం మొత్తం సింహం ఒంట్లోకి ప్రవేశించింది. జూ సిబ్బంది అక్కడకు చేరుకుని పామును బయటకు తీసేశారు. సింహానికి వెంటనే చికిత్స ప్రారంభించారు. అయినప్పటికీ సింహం కోలుకోలేదు (lioness cobra bite).
ఐదు రోజుల తర్వాత ఆ సింహం మరణించింది (lioness snake fight video). వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆ సింహాన్ని కాపాడలేకపోయారు. వడోదర జూలోని ఆ సింహం పేరు సమృద్ధి. సమృద్ధి మరణంతో వడోదరలోని జూలో సింహం లేకుండా పోయింది. జూలో ఉన్న చిట్టచివరి సింహం సమృద్ది మాత్రమే. ఇప్పుడు అది కూడా మరణించడంతో ఆ జూలో సింహాల జాడ పూర్తిగా అంతమైంది.
ఇవి కూడా చదవండి..
మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ ఫొటోలో పిల్లి ఎక్కడుందో 7 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలుకోసం క్లిక్ చేయండి..
English Translation
Most people in this world are afraid of snakes. If there are snakes, they are afraid to go there. A venomous snake bite is sure to kill you within minutes. That is why many people avoid snakes. Lions and tigers also stay away from snakes as much as possible. Snake venom also kills lions. Recently a similar incident happened in Vadodara. The video is currently doing the rounds (Vadodara Sayaji Baug Zoo lioness).
A cobra entered the lion's cage at the Sayaji Baug Zoo in Vadodara. The lion noticed the snake and attacked it. A fierce fight took place between the snake and the lion. During this attack, the lion was bitten by the snake several times. All the venom of the snake entered the lion's stomach. The zoo staff reached there and pulled out the snake. The lion was immediately treated. However, the lioness did not recover (lioness cobra bite).
After five days the lioness died (lioness snake fight video). No matter how hard the doctors tried, they could not save the lion. The name of that lion in Vadodara Zoo is Samriddhi. Samriddhi's death leaves the Vadodara zoo without a lion. Abundance is the last lion in the zoo. Now that too has died and the trace of lions in that zoo is completely gone.
Also read..
If your eyes are sharp..where is the cat in this photo within 7 seconds Discover..
Click for more Exclusive News..