రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో 750 మందికి పైగా రైతులు మరణించినా సీఎం రేవంత్ రెడ్డికి కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. బుధవారం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. పంట కొనే దిక్కులేక కొనుగోలు కేంద్రం వద్దే జమ్మన్న అనే రైతు గుండెపోటుతో కుప్పకూలి మరణించడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని కలుకుంట్ల మొక్కజొన్న కేంద్రం వద్ద జరిగిన ఈ ఘటనకు పూర్తి బాధ్యత ముఖ్యమంత్రిదే అని చెప్పారు.
నాలుగు రోజులుగా పడిగాపులు పడుతున్నా కూడా మొక్కజొన్న పంట కొనకుండా కాంగ్రెస్ సర్కారు (Congress Govt) అన్నదాత నిండు ప్రాణాన్ని బలితీసుకుందన్నారు. ఓ వైపు పెట్టుబడి సాయం అందక అప్పుల పాలై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, మరోవైపు భారీ వర్షాలతో పంట నష్టపోయినా కూడా కనీసం పరిహారం అందక కౌలు రైతులు సైతం బలవన్మరణాలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఇంకోవైపు పనికిరాని యాప్‌లతో యూరియా అందక అన్నదాతలు మళ్లీ ఈ సీజన్‌లోనూ అష్టకష్టాలు పడుతున్నారన్నారు.
పదేళ్లపాటు సంతోషంగా సాగిన సాగును కన్నీటి సేద్యంగా మార్చి.. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా సంక్షోభంలోకి నెట్టిన ఈ పాపం ఊరికే పోదని చెప్పారు. కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు పడుతున్న రైతుల కష్టాలు తీర్చేందుకు ఇప్పటికైనా రేవంత్ సర్కార్ మొద్దు నిద్ర వీడాలని అన్నారు. ముఖ్యమంత్రి నిర్వాకంతో ఇవాళ గుండె పగిలి మరణించిన జమ్మన్న కుటుంబానికి రూ.25లక్షల పరిహారం అందిచాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి...
Read LatestTelangana NewsAndTelugu News
English Translation
BRS executive president KTR criticized CM Revanth Reddy for not even having an ant sting even though more than 750 farmers died during the two-year Congress rule. On Wednesday, he responded as an X platform. It is said that it is very sad that a farmer named Jammanna collapsed and died of heart attack at the purchase center while he was not going to buy the crop. He said that the Chief Minister is fully responsible for the incident that took place at Kalkuntla Maize Center in Manavpadu Mandal of Gadwala District.
Even though it has been raining for four days, the Congress Govt has sacrificed its life by not buying the maize crop. On the one hand, farmers are committing suicide due to debts due to lack of investment assistance, on the other hand, tenant farmers are also committing suicide due to the loss of crops due to heavy rains, even if they do not receive at least compensation. On the other hand, rice farmers are facing difficulties again this season as they are not getting urea with useless apps.
This sin which has turned the happy cultivation for ten years into a tearful one. He said that Revanth Sarkar should still sleep fast to solve the problems of the farmers who are struggling at the purchase centers. KTR demanded compensation of Rs.25 lakhs to Jammanna's family, who died of heartbreak today due to Chief Minister's conduct. Read...
Read LatestTelangana NewsAndTelugu News