అటవీ సమీప ప్రాంతాల్లోకి క్రూర మృగాలు చొచ్చుకురావడం తరచూ చూస్తుంటాం. ఇలాంటి సందర్భాల్లో అప్పుడప్పుడూ జంతువులు, మనుషులు కూడా వాటికి బలవుతుంటారు. అయితే కొన్నిసార్లు కొందరు వాటి బారి నుంచి తృటిలో తప్పించుకుంటుంటారు. ఇలాంటి అరుదైన సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. కొందరు భక్తులు కొండపై దైవ దర్శనానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో సడన్‌గా ఓ సింహం అటుగా వచ్చింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో ( Viral Video) తెగ వైరల్ అవుతోంది. గుజరాత్ (Gujarat) పాలిటానాలోని శత్రుంజయ్ పర్వతంపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కొండపై సుమారు100 వరకూ జైన ఆలయాలు ఉన్నాయి. వీటిని దర్శించేందుకు ఏటా భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు. అయితే ఇటీవల భక్తులు కొండపైకి వెళ్తుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
మార్గ మధ్యలో అడవిలో నుంచి ఓ సింహం.. సడన్‌గా మెట్ల (Lion that came up the hill) మార్గం వైపు వచ్చింది. మెట్ల పైకి వచ్చి నిలబడింది. సింహాన్ని చూసిన భక్తులు భయంతో పరుగులు తీశారు. అయితే మెట్ల పైకి వచ్చిన సింహం.. ఆ తర్వాత మార్గానికి అవతలి వైపు ఉన్న అడవిలోకి వెళ్లిపోయింది. దీంతో భక్తులంతా హమ్మయ్య.. అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. సింహం వచ్చిన సందర్భంలో అక్కడున్న వారు వీడియోలు తీశారు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ భక్తులను ఆ దేవుడే కాపాడాడు’.. అంటూ కొందరు, ‘వామ్మో చూస్తుంటేనే భయంగా ఉంది’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1600కి పైగా లైక్‌లు, 1.55 లక్షకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
English Translation
We often see wild animals entering the nearby areas of the forest. In such cases sometimes animals and humans also succumb to them. But sometimes some narrowly escape from their clutches. Videos of such rare incidents are going viral on social media. Recently, a video of a similar incident is doing the rounds. Some devotees are going to see God on the hill. In this sequence suddenly a lion came by. Finally see what happened..
A video ( Viral Video) is going viral on social media. The incident took place on Shatrunjay Mountain in Palitana, Gujarat. There are about 100 Jain temples on this hill. A large number of devotees come to visit them every year. But recently a shocking incident took place while the devotees were going up the hill.
A lion that came up the hill suddenly came from the forest in the middle of the path. She came up the stairs and stood. Seeing the lion, the devotees ran away in fear. But the lion who came up the stairs.. then went into the forest on the other side of the path. With this, all the devotees took a deep breath thinking, "Hammayya". No one was injured in this incident. When the lion came, the people there took videos.
This video is currently going viral on social media. Netizens are reacting to this in different ways. Some people said, 'It is God who saved these devotees', others said, 'It is scary just to see them', and some others commented with various emojis. This video currently has over 1600 likes and over 1.55 lakh views.
These are also Read..
For More Viral News Click Here