Digital Arrest: డిజిటల్‌ అరెస్టు పేరిట.. 85ఏళ్ల వృద్ధుడికి రూ.9 కోట్లకు టోకరా!

Eenadu icon
By National News Team Published : 24 Dec 2025 21:13 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్: డిజిటల్‌ అరెస్టు పేరిట 85 ఏళ్ల వృద్ధుడి నుంచి సైబర్‌ నేరగాళ్లు రూ.9 కోట్ల మేర కాజేశారు. ఈ కేసు మహారాష్ట్రలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబయికి చెందిన ఓ వ్యక్తి (85) ఇంజినీరింగ్‌ కళాశాలలో హెచ్‌వోడీగా పనిచేసి రిటైరయ్యారు. నవంబరు 28న ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆయనకు ఫోన్‌ చేసి.. తనను తాను ఇన్‌స్పెక్టర్‌గా పరిచయం చేసుకున్నాడు. ఓ బ్యాంకులో ఖాతా తెరిచేందుకు బాధితుడి పేరు, ఆధార్‌ ఉపయోగించినట్లు చెప్పాడు. ఆ ఖాతాను మనీలాండరింగ్ కోసం, నిషేధిత సంస్థ ‘పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా’ (పీఎఫ్ఐ) ఆర్థిక లావాదేవీల కోసం ఉపయోగించినట్లు నమ్మబలికాడు. దీనిపై కేసు నమోదు చేస్తున్నామని, సీబీఐ క్రైం బ్రాంచ్‌ సిట్‌ విచారణ జరుపుతోందటూ బెదిరించాడు.

ఈ క్రమంలో డిసెంబరు 1న వృద్ధుడి వాట్సప్‌ నంబర్‌కు ఓ వీడియో కాల్‌ వచ్చింది. పోలీసు యూనిఫాంలో కనిపించిన ఓ వ్యక్తి.. మీ పేరిట అరెస్టు వారెంటు జారీ అయ్యిందని, డిజిటల్‌ అరెస్టు చేసినట్లు చెప్పాడు. దీని గురించి ఎవరికి చెప్పొద్దని బెదిరించి.. ఆయన బ్యాంకు ఖాతాలు, పెట్టుబడుల వివరాలు సేకరించాడు. సేవింగ్స్‌, పెట్టుబడి నిధులను వివిధ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయాలన్నాడు. వెరిఫికేషన్‌ అనంతరం డబ్బును వడ్డీతో సహా తిరిగి ఇస్తామని నమ్మించాడు. దీంతో డిసెంబర్ 1- 22వ తేదీ మధ్య సమయంలో మొత్తంగా రూ.9 కోట్లు బదిలీ చేసినట్లు బాధితుడు పోలీసులకు తెలిపారు. డబ్బు బదిలీ అయ్యాక తనకు ఫోన్లు రావడం ఆగిపోవడం, తాను సంప్రదించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో.. మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/02/2026)  ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
  • ఏప్రిల్‌లో బెంగాల్‌, తమిళనాడు ఎన్నికలు..! బెంగాల్‌, తమిళనాడు సహా 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఏప్రిల్‌లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు ఎలక్షన్‌ కమిషన్‌ వర్గాలు వెల్లడించాయి. 
  • వాష్‌రూమ్‌లో సీక్రెట్‌ కెమెరాలు.. కన్నడ నటి వీడియో రికార్డు చేసి, బ్లాక్‌మెయిల్‌ Kannada actress:  ఒక కన్నడ నటికి చేదు అనుభవం ఎదురైంది. వాష్‌రూమ్‌లో రహస్య కెమెరాలు అమర్చి, ఆ వీడియోతో తనను బ్లాక్‌మెయిల్ చేశారంటూ ఆమె ఆరోపించారు.

English Translation

Digital Arrest: 85-year-old man arrested for Rs.9 crores in the name of digital arrest!

Eenadu icon
By National News Team Published : 24 Dec 2025 21:13 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

Internet Desk: Cybercriminals extorted Rs 9 crore from an 85-year-old man in the name of digital arrest. This case came to light in Maharashtra. According to the police, a person (85) from Mumbai has retired from working as HVOD in an engineering college. On November 28, an unknown person called him and introduced himself as an inspector. He said that he used the victim's name and Aadhaar to open an account in a bank. It is believed that the account was used for money laundering and financial transactions of the banned organization Popular Front of India (PFI). He threatened that a case is being registered and the CBI Crime Branch SIT is conducting an investigation.

On December 1, a video call was received on the old man's WhatsApp number. A man in police uniform said that an arrest warrant has been issued in your name and he has been digitally arrested. Threatening not to tell anyone about this, he collected bank accounts and investment details. He wants to transfer savings and investment funds to different bank accounts. He believed that the money would be returned with interest after verification. The victim told the police that a total of Rs.9 crore was transferred between December 1-22. After the transfer of money, he stopped receiving phone calls and tried to contact him but to no avail. The incident came to light after the victim realized that he was cheated and approached the cyber police.

► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.

More

  • Today's Rasi Results.. 12 Rasi Results are as... (18/02/2026)  How is it for any zodiac sign today? Details of today's horoscope given by Dr. Shankaramanchi Sivasai Srinivas..
  • Bengal and Tamil Nadu elections in April..! Sources of the Election Commission have revealed that elections are likely to be held in April for 4 states including Bengal and Tamil Nadu and one union territory. 
  • Secret cameras in washroom.. Kannada actress video recorded and blackmailed Kannada actress: A Kannada actress had a bitter experience. She alleged that they installed hidden cameras in the washroom and blackmailed her with the video.