తలరాత మార్చుకుందాం!

Eenadu icon
By Editorial Team Published : 24 Dec 2025 03:01 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

‘ఎంతటి మహనీయునకు ఉద్భవించిన/ తలవ్రాత మార్చంగ తరము గాదు...’ అన్నట్టు సృష్టి మొత్తం దైవానుగ్రహంతో నడుస్తుంది. తామనుకున్నట్టే అంతా జరుగుతోందని భ్రమపడతారు మానవులు. తెలియనిదేమంటే జరిగేవన్నీ భగవంతుడి కనుసన్నల్లో, దైవ నిర్ణయం ప్రకారం జరుగుతున్నాయి. ‘శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదన్నట్టు’ ఒక జీవి శ్వాస పోసుకోవాలన్నా, ఆయువు ముగిసి పోవాలన్నా అంతర్యామి నిర్దేశం ప్రధానం. ఆధ్యాత్మిక కోణానికి ఒకవైపు అలా ఉంటే, స్వశక్తితో, సంకల్పబలంతో నుదుటిరాతను సరిదిద్దుకోవచ్చని నిరూపించిన వాళ్లూ ఉన్నారు. పదహారేళ్ల అల్పాయువుతో జన్మించిన మార్కండేయుడు, అకుంఠిత తపోదీక్షతో మరణాన్ని జయించాడు. శివలింగాన్ని కౌగిలించుకుని పరమేశ్వరుని ధ్యానించిన అతణ్ని యమపాశాలు తాకలేకపోయాయి. కైలాసనాథుడే భక్తుడి కోసం దిగివచ్చాడు. కఠిన దీక్షతో ప్రయత్నిస్తే తలరాత మార్చుకోవడం సులభమేనన్న పాఠాన్ని బోధించింది మార్కండేయ చరిత్ర. 
ద్యుమత్సేనుడి పుత్రుడు సత్యవంతుడికి సరిగ్గా ఏడాదే ఆయువుందని తెలిసీ పతిగా స్వీకరించింది సావిత్రి. అనుకున్న దుర్దినాన యమపాశాలతో ప్రత్యక్షమయ్యాడు దండధరుడు. దిగులు పడితే సాధించలేమనే ఎరుక కలిగిన సావిత్రి చురుకుగా ఆలోచించింది. అద్భుతమైన జ్ఞానంతో, వాక్చాతుర్యంతో సమవర్తిని మెప్పించి, మామగారి కంటిచూపును, కోల్పోయిన రాజ్యాన్ని, తండ్రికి పుత్రులను వరాలుగా పొందడమే కాక పతి ప్రాణాలనూ దక్కించుకుంది. అదీ సంకల్పబలమని లోకాలు గర్వపడేలా అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది సావిత్రి. 

నుదుటిరాతని విధికి వదిలేయకుండా తామే లిఖించుకున్న వారున్నారు చరిత్రలో. కొలువుకోసం వెళ్లిన చాణక్యుడిని దారుణంగా అవమానించారు నంద రాజులు. విధి లిఖితమంటూ చింతించకుండా తరుణోపాయం వెదికాడాయన. సరైన బాలుణ్ని చేరదీసి ఉత్తమ వీరుడిగా మలిచాడు. నందరాజులను అంతం చేస్తూ, మౌర్యరాజ్య స్థాపనకు పునాది వేశాడు. గొప్ప ప్రామాణిక గ్రంథంగా పేరొందిన కౌటిల్యుడి అర్థశాస్త్ర సృజనకు బీజం మాత్రం ఆయన హృదయంలో రగిలిన అవమానాల ప్రతీకార జ్వాలలతోనే పడింది.

నుదుటిరాత ప్రకారమే జరుగుతుందని భావిస్తూ కాలం గడిపేస్తారు కొందరు. తలరాత రాసుకుంటానని ధైర్యంగా అడుగేసి విజయం సాధించేవారు ఇంకొందరు. అలాంటివారే సమాజానికి దారిదీపాల్లాంటివారు. కొందరు... సమాజం మారాలంటారు కానీ వాళ్లు మారరు. అక్కడే ఆగిపోతారు. దాంతో వెనకున్న వాళ్లు ముందుకు వెళ్లిపోతారు. లియో టాల్‌ స్టాయ్‌ అన్నట్టు బలమైన సంకల్పం, ఉన్నత ఆశయాలతో ముందడుగేస్తేనే విజయం ముంగిట నిలిచేది. గెలుపు పిలుపు వినపడేది. 

తలరాత కేవలం విధాత ప్రసాదించిన ముడిసరుకు. దాన్ని గొప్పగా మలచుకునే శక్తి మన(సు)లోనే ఉంది. యోగవాశిష్ఠంలో చెప్పినట్టు మనసులో ఆలోచించి సంకల్పించినప్పుడే కార్యాలను సఫలీకృతం చేసుకోగలం. ఏ కార్యం జరగాలన్నా ప్రయత్నం తప్పనిసరి. సంకల్పం, ప్రయత్నం, సత్కర్మలు మాత్రమే భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అది గుర్తుంచుకుంటే విధిని, తలరాతను తిట్టుకుంటూ గడపాల్సిన పరిస్థితి ఏర్పడదు.  

► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • జీవితమే సందేశం పాలూ నీళ్లను వేరు చేసేదిగా హంసకు పేరు. భౌతిక సుఖాలను, కష్టాలను సమ స్థితిలో అనుభవించేలా చేయగలిగే వైరాగ్య భావనలను ప్రబోధించిన వారు పరమహంస. శ్రీరామకృష్ణులు ఆచరణయోగ్యమైన ఆధ్యాత్మిక తత్వానికి నిలువెత్తు నిదర్శనం. కలకత్తాలోని దక్షిణేశ్వర్‌ కాళికా ఆలయంలో పూజారిగా ఉంటూ ఎంతోమందికి జ్ఞానభిక్ష అందించారు.
  • యాదగిరీశా నమోస్తుతే! బ్రహ్మ, విష్ణు, రుద్ర సమన్వయ శక్తులతో సృష్టి, స్థితి, లయాత్మకమైన చైతన్య స్వరూపమే నృసింహాకృతి! శ్రీహరి దశావతారాల్లో నరసింహ రూపం విశేషమైనది. నృసింహావతారం ఎంత ప్రచండమో, అంత ప్రహ్లాదం. ఎంత ప్రళయత్వమో అంత ప్రసన్నం.
  • దూరదృష్టి ‘రాబోవు నాపదలను/ లేబోనీయకయె ముందు తెలిసి మెలంగున్‌/ ప్రాబల్యము గలవాడే/ శోభిలు నిల నతడె’ అంటూ దూరదృష్టితో మెలిగితే ఆపదలను తప్పించుకోగలరని వర్ణించాడొక కవి. దూరదృష్టితో వ్యవహరించడమంటే, భవిష్యత్తును ఊహించగలిగే శక్తిగా భావించకూడదు.
  • శరణం శరణం... శంకరం మహాశివరాత్రి లోతైన ఆధ్యాత్మిక పరమార్థం ఉన్న పండుగ. ‘శివ’ అంటే అక్షరాలా కల్యాణకారి. మహాశివరాత్రి నిరాకార స్వరూపుడైన ఆ మహాశివుడి దివ్య కార్యాలను స్మరించుకుంటూ, పరమేశ్వరుడికి ప్రణమిల్లే సుదినం.
  • తపస్సు భగవంతుడి సాక్షాత్కారం కోసం తపస్సు ప్రధానమైన సాధనమన్నది దైవజ్ఞులు చెప్పే మాట. అది అంత సులభమైనది కాదు. ధ్రువుడు, ప్రహ్లాదుడు వంటి వారు నిష్ఠతో, తదేక దీక్షతో దాన్ని ఆచరించి చిరంజీవులుగా ఖ్యాతి పొందారు.
  • మాటే మంత్రం తల వెనక తలంత బలగం ఉన్నా ఒక్కరూ కష్టకాలంలో ఆదుకోలేదు... అంటారు. ఈ కాలంలో ఎంతటి సంపదనైనా ఆర్జించవచ్చు కానీ కష్టంలో మనకోసం నిలబడేవారిని సంపాదించుకోవడం కష్టమే. అలా సంపాదించుకోవడం మన ప్రవర్తన, సంస్కారం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. కత్తికన్నా పదునైంది నాలుక.
  • మహోన్నత సంస్కర్త ప్రథమ స్వాతంత్య్ర సమరానికి అజ్ఞాతంగా బీజావాపన చేసిన యోధ, భారతీయులు పరపీడన నుంచి బయటపడి ఉజ్వల భవిష్యత్తు గల జాతిగా నిలవడానికి సహస్ర విధాలుగా పరిశ్రమించిన మహామనీషి, సంఘంలోని దురాచారాలను ఖండించి జనంలో ఆత్మవిశ్వాసానికి పాదుకొల్పిన తపస్వి స్వామి దయానందులు.
  • అమూల్య వరం మనిషి ముఖం నుంచి ‘అగ్ని’ వాగ్రూపంలో వెలువడుతోందని ఐతరేయోపనిషత్తు పేర్కొంటోంది. మాట అగ్ని అంతటి పవిత్రమైనదీ ప్రమాదకరమైనదీ కూడా.
  • సంకల్ప బలం మనిషి జీవితంలో సుఖాలు, దుఃఖాలు, విజయాలు, వైఫల్యాలు అనే కొండలను, లోయలను ఎక్కుతూ దిగుతూ ముందుకు పయనించాల్సిందే! నిజానికి ఒక వ్యక్తి తన లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన ప్రాథమిక ఇంధనం ఏమై ఉంటుందీ అంటే- సంకల్ప బలం అని చెప్పొచ్చు.
  • దాన ఫలం! సర్వ ప్రాణుల పట్ల దయ ఉన్నవారిని దైవిక లక్షణాలు కలిగినవారిగా చెబుతారు. పవిత్ర భావనలతో, నిస్వార్థంతో జీవించేవారిని తాను వెన్నంటి ఉంటానంటాడు పరమాత్ముడు గీతలో.
  • ఎవరు గొప్ప? నన్ను మించిన వారెవరూ లేరు అనే అహంభావం వల్ల మనుషుల మధ్య గొడవలు జరగడం సహజమే. కానీ మునులు, మహాపురుషులు, దేవతలు సైతం వాటి ప్రభావంలో పడి, తరవాత పశ్చాత్తాపం చెందడం ఆశ్చర్యపరుస్తుంది.
  • అజ్ఞానాన్ని రూపుమాపాలి! ఆదిశంకరుడు చెప్పిన అజ్ఞానం వేరు. ఈ అజ్ఞానం అది కాదు. అంతటా వ్యాపించి రాజ్యమేలుతున్న ఈ అజ్ఞానమే అధర్మానికి, అన్యాయానికి కూడా కారణం.
  • పంచ సూత్రాలు భూమి నిశ్చలంగా ఉన్నట్లు కనిపించినా, అది ప్రతిక్షణం చలనంలో ఉంటుంది. మరి ఈ స్థిరత్వం ఎక్కడి నుంచి వస్తోంది? పురాణాల ప్రకారం, భూమిని నాలుగు దిగ్గజాలు (ఐరావతాలు) మోస్తున్నాయి.
  • భక్తి - ధర్మం భక్తిభావం, ధర్మగుణం కలిగినవారే మనకు మార్గదర్శకులు, పురాణపురుషులు అయ్యారు. భక్తి వేరు, ధర్మగుణం వేరు. ధర్మగుణంలేని భక్తి శోభించదు, జయించదు.
  • గురుబ్రహ్మ... భౌతిక ప్రపంచంలో వినోద, విహారాలతో సంతృప్తి చెందుతున్నంతవరకు ఆధ్యాత్మిక లోకంలో విహరించాలనే ఆలోచన రాదు. ప్రాపంచిక సుఖాలే శాశ్వతమన్న భ్రమలో ఉండి దారితెన్నులు తెలియని వారికి భగవత్సన్నిధికి దిశానిర్దేశం చేసే వ్యక్తి గురువు. 
  • సృష్టికి మార్గదర్శకుడు సృష్టి... యాదృచ్ఛికంగా నడిచే ప్రక్రియ కాదు. దానికి ఒక క్రమం ఉంది, నియమం ఉంది, ధర్మం ఉంది. ఆ ధర్మానికి దిశానిర్దేశం చేసే శక్తే శ్రీకృష్ణుడు. ఆయన ద్వాపర యుగ అవతార పురుషుడు మాత్రమే కాదు. కాలం, దేశం, పరిస్థితులను దాటి నిలిచిన పరమసత్యానికి సాకార రూపం. సృష్టి ఎలా సాగాలి, జీవితం ఎలా నడవాలి అనే ప్రశ్నలకు సమాధానంగా నిలిచిన తత్వమే కృష్ణుడు.
  • జ్ఞానాయుధం జ్ఞానం మనిషి వికాసానికి మూలాధారం. అది అంధకార మార్గంలో వెలుగులను ప్రకాశింపజేసే దివ్యజ్యోతి. వ్యక్తి ఉనికే ఙ్ఞానం... అంటాడు దక్షిణామూర్తి.
  • ఏది హింస? ‘అహింసా పరమోధర్మః’ అన్నారు పెద్దలు. అంటే హింస చేయకుండా ఉండటమే గొప్ప ధర్మమని అర్థం. హింస అంటే శారీరకంగా బాధించడమో, చంపడమో అని మాత్రమే అర్థంకాదు. ఎదుటివారిని మానసికంగా క్షోభకు గురిచేసినా అది హింస కిందకే వస్తుంది. శరీరానికి బాణాలు గుచ్చుకున్నా ఉపాయంతో తీసి వేయవచ్చు, ఆ గాయాలు మందులతో కొంత కాలానికి మానతాయి.
  • సహనం ఒక వరం ఆధ్యాత్మిక లక్ష్యాలను చేరుకోవాలన్నా, భౌతికమైన కోరికలు తీర్చుకోవాలన్నా మనిషికి సహనం తప్పనిసరి. నిర్దిష్ట లక్ష్యాలను సాధించడానికి భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటూ, నిరంతరం అంకితభావంతో చేసే కృషే- సహనం. అవాంతరాలను ఆత్మస్థైర్యంతో, పట్టుదలతో ఎదుర్కొని; పొగడ్తలకు, విమర్శలకు ప్రాధాన్యమివ్వకుండా చేసే యజ్ఞం అది.
  • కాలం విలువ కాలం ప్రతీ క్షణం ఓ ఇంద్రజాలం. కళ్లముందే మాయమైపోతుంటుంది మరి. కదిలే కాలం అనుకోని విజయాలను, వైభవాలను ఇచ్చినట్లే అప్పుడప్పుడు ఓటమినీ చవిచూపిస్తుంది.

English Translation

Let's change the headline!

Eenadu icon
By Editorial Team Published : 24 Dec 2025 03:01 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

'MThe generation of scribes born to Tati Mahaneyu Gadu...' The entire creation runs with the grace of God. Humans are delusional that everything is happening as they think. The unknown means that everything that happens is happening in God's eyes and according to God's decision. 'Antaryami's instructions are important for a living being to breathe or to die without Shiva's commandment. On the one hand, there are those who have proved that the forehead can be corrected with self-power and willpower. Born at the tender age of sixteen, Markandeya conquered death through Akunthita Tapodiksha. The Yamapasas could not touch him who embraced the Shivalinga and meditated on the Lord. Kailasanath himself came down for the devotee. The history of Markandeya teaches that it is easy to change one's mind if one tries hard. 
Savitri accepted Dyumatsena's son Satyavandu as his wife after knowing that he lived exactly one year. Dandadhara appeared with Yamapasala, who was expected to be miserable. Savitri actively thought that she would not be able to achieve if she was depressed. With her excellent wisdom and eloquence, she won the eyes of her father-in-law, her lost kingdom, her father's sons as boons, but also her father's life. Savitri made the impossible possible so that the world would be proud of that strength of will. 

There are those in history who wrote themselves without leaving the forehand to fate. The Nanda kings insulted Chanakya when he went to look for a pole. He looked for the opportunity without worrying as if destiny was written. He joined the right boy and turned him into the best hero. He put an end to the Nandarajas and laid the foundation for the establishment of the Mauryan Empire. The seed of Kautilya's arthashastra creation, which is known as a great standard text, was planted in the flames of revenge of insults burning in his heart. There are others who boldly ask to be written and succeed. Such people are like the miscreants of the society. Some people want society to change but they don't. They stop there. Those who are behind will go forward. Like Leo Tall Stay, if you move forward with strong will and high ambitions, success is imminent. A victory call was heard. 

Headwriting is just the raw material bestowed by Vidhata. We have the power to make it great. As mentioned in Yogavashishtha, we can accomplish tasks only when we think and resolve in our mind. Effort is mandatory for any work to be done. Only determination, effort and good deeds determine the future. If you remember that, you will not have to spend your time cursing your fate and your head.  

► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. Correspondence has no place in this matter.

More

  • Life is a message. Swan is known as the separator of milk and water. Paramahamsa was the one who preached the concept of dispassion which enables one to experience material pleasures and hardships equally. Sri Ramakrishna is a living example of practical spiritual philosophy. He was a priest in Dakshineshwar Kalika Temple in Calcutta and gave alms of knowledge to many people.
  • Yadagirisha Namostute! Nrisimhakriti is the form of creation, state and rhythmic consciousness with the coordinated forces of Brahma, Vishnu and Rudra! Narasimha's form is unique in Srihari Dashavatars. The Nrisimhavatara is as glorious as it is glorious. The greater the flood, the greater the pleasure.
  • Foresight A poet describes that if you have foresight, you will be able to avoid the dangers. To act with foresight is not to think of the power to predict the future.
  • Sharanam Sharanam... Shankaram Mahashivratri is a festival with deep spiritual significance. 'Shiva' literally means benefactor. Mahashivratri Remembering the divine deeds of the formless form of Lord Shiva, Pranamille Sudinam to the Supreme Lord.
  • Tapas It is said by the sages that penance is the main tool for God realization. It is not that simple. People like Dhruva and Prahlad have practiced it with devotion and gaze and gained fame as immortals.
  • Mate Mantra It is said that even if there is strength behind each head, no one will be supported in difficult times. In this period we can earn any amount of wealth but it is difficult to get people to stand up for us in times of trouble. Acquiring such is possible only because of our behavior and culture. The tongue is sharper than a sword.
  • A great reformer The warrior who anonymously sowed the seeds of the first freedom struggle, the great man who worked in thousands of ways to free the Indians from oppression and become a nation with a bright future, the ascetic Swami Dayanandulu who condemned the vices in the community and instilled self-confidence in the people.
  • Amulya Varam. The Aitareyopanishad states that 'Agni' emanates from the face of man in the form of fire. A word is as sacred as fire and also dangerous.
  • Strength of will In the life of a man, one has to move forward by going up and down the hills and valleys of joys, sorrows, successes and failures! In fact, what is the basic fuel that a person needs to reach his goal is - willpower.
  • The fruit of charity! Those who are kind to all living beings are said to have divine qualities. In the Gita, the Supreme Lord says that he will support those who live with holy thoughts and selflessness.
  • Who is great? Due to the ego that there is no one above me, it is natural for people to quarrel. But it is surprising that even the ancients, great men and gods fell under their influence and later repented.
  • Ignorance should be eradicated! Adi Shankara said ignorance is different. This ignorance is not that. This ignorance which reigns all over is the cause of unrighteousness and injustice.
  • Pancha Sutras Although the earth appears to be stationary, it is constantly in motion. And where is this stability coming from? According to Puranas, the earth is carried by four giants (Airavatas).
  • Bhakti - Dharma Those who have piety and virtue have become our guides and legendary men. Bhakti is different, morality is different. Bhakti without Dharmaguna cannot beautify or conquer.
  • GuruBrahma... As long as one is satisfied with entertainment and excursions in the material world, one cannot think of wandering in the spiritual world. Guru is the one who directs those who are under the eternal illusion of worldly pleasures and do not know the way to the presence of God. 
  • Guide to creation Creation... is not a random process. It has an order, a rule, a virtue. Lord Krishna is the power that directs that dharma. He is not only an incarnation of Dwapara Yuga Purusha. An embodiment of the supreme truth that transcends time, country and conditions. Krishna is the philosophy that answers the questions of how creation should proceed and how life should proceed.
  • Gnanayudham Knowledge is the basis of human development. It is a divine lamp that shines light in the path of darkness. Dakshinamurthy says the knowledge of the individual.
  • What is violence? The elders said 'Ahimsa paramodharmah'. It means that non-violence is the greatest virtue. Violence does not mean only physical harm or killing. Even causing emotional distress to others comes under torture. Arrows pierced through the body can be removed by trickery, and the wounds heal for a while with medicine.
  • Patience is a blessing. Patience is a must for man whether he wants to achieve spiritual goals or fulfill material desires. Patience is constant dedicated work, keeping emotions in check to achieve specific goals. Facing obstacles with self-confidence and perseverance; It is a yajna that does not give priority to compliments and criticism.
  • The value of time. Every moment of time is magic. It will disappear before the eyes. Moving times bring unexpected victories and glories as well as occasional defeats.