Women on wheels: ఆ ఎత్తైన ప్రదేశానికి బైక్‌పై చేరుకుని..!

నాథులా పాస్‌.. దేశంలోనే చైనా సరిహద్దుగా ఉండే ఎత్తైన ప్రదేశాల్లో ఒకటి. సముద్ర మట్టానికి 14 వేల అడుగుల ఎత్తున సిక్కింలో ఉండే ఈ ప్రాంతం.. మలుపులు తిరిగే రహదారులు, పర్వతాలు, మంచుతో కప్పబడి ఉంటుంది.

Eenadu icon
By Vasundhara Team Published : 24 Dec 2025 20:48 IST Ee Font size
  • A
  • A+
  • A++
3 min read

(Photos: Instagram)

నాథులా పాస్‌.. దేశంలోనే చైనా సరిహద్దుగా ఉండే ఎత్తైన ప్రదేశాల్లో ఒకటి. సముద్ర మట్టానికి 14 వేల అడుగుల ఎత్తున సిక్కింలో ఉండే ఈ ప్రాంతం.. మలుపులు తిరిగే రహదారులు, పర్వతాలు, మంచుతో కప్పబడి ఉంటుంది. బైక్‌పై నాథులా పాస్‌ను చేరుకోవాలంటే సాహసమనే చెప్పాలి. అలాంటిది ఐదుగురు మహిళలతో కూడిన ఓ బృందం బెంగళూరు నుంచి బైక్స్‌పై ప్రయాణించి ఇటీవలే ఈ ప్రాంతాన్ని చేరుకుంది. ఇందులో 76 ఏళ్ల ఓ మహిళ కూడా ఉండడం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియోని సామాజిక మాధ్యమాల్లో పంచుకోగా.. అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో వీరి ప్రయాణానికి సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం..

విమెన్‌ ఆన్‌ వీల్స్..!

మహిళలు బైక్‌ నడపడాన్ని ఇప్పటికీ కొంతమంది వింతగా చూస్తుంటారు. సమాజంలో ఇలాంటి మూసధోరణులను బద్దలుకొట్టి.. వారిలో స్వీయ నమ్మకాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో.. ఫైయాస్ అనే రైడర్ ‘సీఆర్‌ఎఫ్ విమెన్‌ ఆన్‌ వీల్స్’ సంస్థను స్థాపించారు. బైక్‌ నడపాలనే మక్కువ ఉంటే చాలు.. వారికి శిక్షణ ఇవ్వడమే కాకుండా రైడర్లుగా మారుస్తున్నారు. ఇప్పటివరకు వెయ్యి మందికి పైగా మహిళలను బైక్ రైడర్లుగా తీర్చిదిద్దిన ఫైయాస్.. వారిని సాహస యాత్రలు చేసేలా కూడా ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలో ఐదుగురు మహిళలతో (సీమ, సుభద్ర, స్వప్న, అనిత, శేష) కూడిన బృందం ఇటీవలే భారత్-చైనా సరిహద్దుగా ఉన్న ఎత్తైన నాథులా పాస్‌కు చేరుకుంది. ఈ క్రమంలో సీమ తల్లి సుభద్ర 76 ఏళ్ల వయసులో కూడా విభిన్న వాతావరణ పరిస్థితులను తట్టుకుని జర్నీని పూర్తి చేయడం విశేషం.

ప్రయాణం సాగిందిలా...

కేవలం సాహసయాత్ర చేసి లక్ష్యాన్ని చేరుకోవడానికి మాత్రమే కాకుండా.. మూసధోరణులను బద్దలుకొట్టడం, మోటార్‌సైక్లింగ్‌లో మహిళాశక్తిని చాటడంతో పాటు ఇతర మహిళల్లో స్ఫూర్తి నింపాలనే లక్ష్యంతో.. ఈ మహిళల బృందం సెప్టెంబర్ 29న బెంగళూరులో తమ ప్రయాణాన్ని మొదలుపెట్టింది. సిక్కిం నుంచి భూటాన్‌, నేపాల్‌ దేశాల మీదుగా భారత్‌-చైనా సరిహద్దు ప్రాంతమైన నాథులా పాస్‌ను చేరుకునే విధంగా ప్రణాళికను రూపొందించుకుందీ బృందం. ఈ క్రమంలోనే కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్‌ మీదుగా వీరి ప్రయాణం సాగింది. విశాఖపట్నం వరకు విశాల రహదార్లపై సాగిన తమ ప్రయాణం.. ఒడిశాకు వచ్చేసరికి ఇరుకైన రోడ్లపై ప్రయాణించాల్సి వచ్చిందని ఈ బృందం పేర్కొంది. అట్నుంచి కోల్‌కతా చేరుకున్న వీరు.. కాళికా మాత ఆశీస్సులు తీసుకుని ముందుకు సాగారు. మధ్యలో పలు అవాంతరాలు ఎదురైనా.. విభిన్న వాతావరణ పరిస్థితులను తట్టుకుని.. భూటాన్‌, నేపాల్‌ సరిహద్దులను దాటుకుంటూ సిక్కింకు చేరుకున్నారు.

ఆ ప్రదేశాలను సందర్శించి..

సిక్కింలో ఎక్కువ రోజులు గడిపిన వీరు.. పలు ప్రాంతాలను సందర్శించారు. మొదటగా అక్కడి సెవెన్‌ సిస్టర్స్ జలపాతపు అందాలను వీక్షించి.. ఆ తర్వాత జీరో పాయింట్‌కు చేరుకున్నారు. ఇది సిక్కింలోనే ఎత్తైన, క్లిష్టమైన ప్రదేశం. ఇక్కడ ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతుంటాయి. ఆక్సిజన్‌ కూడా తక్కువగా ఉంటుంది. అందుకే ఇక్కడకు వచ్చే యాత్రికులు పోర్టబుల్‌ ఆక్సిజన్ సిలిండర్‌ను వెంట తీసుకెళుతుంటారు. ఈ ప్రాంతాన్ని కూడా దాటి బాబా హర్భజన్‌ సింగ్‌ మందిరాన్ని దర్శించుకున్నారు. ఆ తర్వాత తమ లక్ష్యమైన నాథులా పాస్‌ను చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ‘విమెన్‌ ఆన్‌ వీల్స్‌’ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.

‘బెంగళూరు వీధుల నుంచి చైనా సరిహద్దుగా ఉన్న ఎత్తైన నాథులా పాస్‌ వరకు సాగిన ప్రయాణం కేవలం కొంత దూరాన్ని పూర్తి చేయడం కాదు. చరిత్రను లిఖించడం! సీఆర్‌ఎఫ్ విమెన్‌ ఆన్‌ వీల్స్‌ మహిళల బృందం విజయవంతంగా నాథులా పాస్‌ను చేరుకుంది. దేశంలో ఎత్తైన సరిహద్దుల్లో ఒకటైన ఈ ప్రాంతానికి బైక్స్‌పై చేరుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. తెర వెనక మేం ఎదుర్కొన్న ఎన్నో సవాళ్లకు ఈ క్షణం ప్రతీక’ అంటూ తమ సంతోషాన్ని పంచుకుంది ఈ బృందం.



► Read latest Women Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

English Translation

Women on wheels: reach the highest place by bike..!

Nathula pass.. is one of the highest places in the country bordering China. Located in Sikkim at an altitude of 14 thousand feet above sea level, this area is covered with winding roads, mountains and snow. (Photos: Instagram)

Nathula Pass.. is one of the highest places in the country bordering China. Located in Sikkim at an altitude of 14 thousand feet above sea level, this area is covered with winding roads, mountains and snow. Reaching Nathula pass on a bike is an adventure. Such is the case with a group of five women who traveled from Bangalore on bikes and reached this area recently. It is remarkable that a 76-year-old woman is also there. When the video was shared on social media, it went viral. In this background, let's know the features of their journey..

Women on Wheels..!

Some people still see women riding bikes as strange. With the aim of breaking such stereotypes in the society and building self-confidence in them, Faiyas, a rider, founded the organization 'CRF Women on Wheels'. If they have a passion to ride a bike, they are not only trained but also converted into riders. Faiyas, who has trained more than a thousand women as bike riders, is also encouraging them to go on adventure trips. A team of five women (Seema, Subhadra, Swapna, Anita, Sesha) recently reached the high Nathula Pass on the India-China border. In this sequence, it is remarkable that Seema's mother Subhadra completed the journey even at the age of 76 years by enduring various weather conditions. Sagindila...

Not only to embark on an adventure and reach the goal, but also to break stereotypes, show women power in motorcycling and inspire other women, this group of women started their journey on September 29 in Bangalore. The team made a plan to reach Nathula Pass, the India-China border region, from Sikkim through Bhutan and Nepal. In this order, their journey started from Karnataka through Andhra Pradesh. This group said that their journey was on wide roads till Visakhapatnam, but when they came to Odisha, they had to travel on narrow roads. They reached Kolkata from there and took the blessings of Mother Kalika and moved forward. Despite facing many problems in the middle.. they endured different weather conditions.. crossed the borders of Bhutan and Nepal and reached Sikkim. First, after seeing the beauty of the Seven Sisters waterfall there, they reached the Zero Point. It is the highest and most difficult place in Sikkim. Here the temperatures drop suddenly. Oxygen is also low. That is why the pilgrims who come here carry a portable oxygen cylinder along with them. Passing this area also visited the shrine of Baba Harbhajan Singh. After that they reached their target Nathula Pass. The video related to this was shared by 'Women on Wheels' on her Instagram.

'The journey from the streets of Bangalore to the high Nathula Pass on the border with China is not just about completing some distance. Making history! CRF Women on Wheels women's team successfully reached Nathula pass. One of the highest borders in the country, it is a joy to reach this region on bikes. The team shared their happiness saying, 'This moment symbolizes the many challenges we faced behind the scenes.'



► Read latest Women Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :