Christmas: కార్టూన్ చూస్తారు.. కేఎఫ్‌సీ చికెన్ తింటారు.. క్రిస్మస్ వింత వేడుకలివీ!

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఇంటర్నెట్ డెస్క్: డిసెంబర్ అంతా క్రిస్మస్ సందడే కనిపిస్తుంటుంది. ఇక 25న వేడుకలు అంబరాన్ని అంటుతాయి. ఇళ్లంతా డెకరేట్ చేసి, క్రిస్మస్ ట్రీ ఏర్పాటుచేసుకొని, కేక్ కట్ చేస్తారు. పిల్లలకు, బంధువులకు బహుమతులిస్తుంటారు. అయితే, కొన్ని దేశాల్లో క్రిస్మస్ రోజున వింతయిన ఆచారాలు పాటిస్తారు. అవేంటంటే..
నార్వే
క్రైస్తవ సంప్రదాయాల్ని తూచ తప్పకుండా పాటించేవారు క్రిస్మస్ రోజున ఇంట్లో ఉన్న చీపురుకట్టను దాచిపెడతారు. ఆ రోజున మాంత్రికులు, దెయ్యాలు ప్రజలకు హాని తలపెడతాయని వారు విశ్వసిస్తారు. క్షుద్ర పూజలకు చీపురుకట్టను వినియోగిస్తారని.. అవి దొరక్కకుండా భద్రపరుస్తారు. వంట గది చిమ్నీలో నుంచి ఇళ్లలోకి దూరే ప్రమాదముందని చిమ్నీ దగ్గర మంట పెడతారు.
జపాన్
జపాన్‌లో క్రిస్మస్ రోజున పండగ సెలవు ఉండదు. దీంతో 1970ల్లో కేఎఫ్‌సీ తమ ఫ్రైడ్ చికెన్‌తో పండగ చేసుకోండి అంటూ ప్రచారం చేసింది. దీంతో అదో సంప్రదాయంగా మారిపోయింది. ఇప్పటికీ క్రిస్మస్ రోజున ప్రజలు స్థానిక కేఎఫ్‌సీల్లో ఫ్రైడ్ చికెన్ తింటుంటారు.
చెక్ రిపబ్లిక్
ఇక్కడి పెళ్లి కాని యువతులు క్రిస్మస్ వేడుక రోజు ఓ సంప్రదాయ ఆటను ఆడతారు. తమ కాలి చెప్పును భుజాలపై నుంచి ఇంటి గుమ్మం వైపు విసిరేస్తారు. ఆ చెప్పు ముందుభాగం మొదట నేలకు తాకితే కొత్త ఏడాదిలో కచ్చితంగా వివాహమవుతుందట. అదే హీల్ ముందు తాకితే పెళ్లి జరగదట.
ఉక్రెయిన్
సాధారణంగా క్రిస్మస్ ట్రీని లైట్స్, బెలూన్స్, డిజైన్ పేపర్స్‌తో అలంకరిస్తుంటారు. ఉక్రెయిన్‌లో వాటితోపాటు సాలెగూడును తయారుచేసి పెడుతుంటారు. దీని వెనక ఓ కథ ఉంది. ఓ నిరుపేద మహిళ క్రిస్మస్ రోజున ఇంట్లో ఉన్న పండ్లతోనే క్రిస్మస్ ట్రీని అలంకరించిందట. వాటిపై సాలెపురుగు గూడు కట్టింది. మరుసటి రోజు ఉదయం సూర్యరశ్మికి సాలెగూడు బంగారం, వెండిగా మారిపోయిందట. అలా అక్కడి ప్రజలు తమకూ మంచి జరగాలని సాలెగూళ్లతో అలంకరిస్తారు.
స్వీడన్
క్రిస్మస్ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఈ దేశంలో చాలామంది టీవీ ముందు కూర్చొని ‘డొనాల్డ్ డక్’ కార్టూన్ షో చూస్తారు. ఒకప్పుడు స్వీడన్‌లో రెండే ఛానల్స్ ఉండేవి. ఒక ఛానల్‌లో డిస్నీ కార్టూన్లను ప్రసారం చేసేవారు. 1958లో పాపులరైన ‘డొనాల్డ్ డక్ అండ్ హిస్ ఫ్రెండ్స్ విష్ యూ ఏ మేరీ క్రిస్మస్’ షోను ఏటా క్రిస్మస్ రోజున ప్రసారం చేస్తుంటారు. ఇప్పటికీ ఆ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది.
ఫిలిప్పీన్స్
ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా క్రిస్మస్ వేడుకలను ఈ దేశంలో నాలుగు నెలల పాటు నిర్వహిస్తారు. క్రిస్మస్‌కి ముందు శనివారం రోజున లాంతర్ పోటీలు నిర్వహిస్తారు. ఊర్లన్నీ ఈ పోటీల్లో పాల్గొంటాయి. ఆకట్టుకునేలా లాంతర్‌ను ఏ ఊరు ప్రజలు తయారుచేస్తారో వారికే బహుమతి దక్కుతుంది.
► Read latest Explained Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- పేరుకే పెద్దమనిషి.. భారత్ అంటే నిలువెల్లా విద్వేషమే! ఆయన చేసింది బ్యాంకు వ్యాపారం.. గ్రామీణ ప్రాంతాల్లో వడ్డీలు ఇచ్చి అయినకాడికి వసూలు చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి.
- ప్రేమికుల రోజు సరదాలా?ఖర్చే లేకుండా రొమాంటిక్ అనుభవాలు పొందొచ్చు! ప్రేమికుల రోజు.. కేవలం ప్రేమ జంటలే కాదు, భార్యాభర్తలూ చేసుకోదగ్గ వేడుక. సాధరణంగా ఈ రోజున ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు.
- టెండర్లపై ‘ఏఐ’ నిఘా.. అక్రమాలు, సిండికేట్‌లు ఇకపై కుదరవు! రహదారులు, రైల్వే ప్రాజెక్టులు సహా అభివృద్ధి పనులు.. ఇలా ప్రభుత్వంలో ప్రధాన నిర్మాణ ప్రాజెక్టులకు టెండర్లు తప్పనిసరి.
- విహారయాత్ర సరే.. బడ్జెట్ మాటేంటి? నెలవారీ ఖర్చులు, భవిష్యత్తు ఆర్థిక ప్రణాళికల మధ్య విహారయాత్రకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించడం కష్టమే. అయితే, చేసే ఖర్చుల్లోనే కొంత మొత్తం పొదుపు చేస్తే విహారానికి బడ్జెట్ పెద్ద సమస్యే కాదంటున్నారు ఆర్థిక నిపుణులు. మరి దానికి ఏం చేయాలంటే..
- వద్దన్నా వస్తున్నారు.. యూరప్‌లో ట్రావెల్ ఓవర్‌క్రౌడింగ్! చాలా దేశాల ప్రభుత్వాలు తమ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకుంటూ.. మా దేశంలో పర్యటించాలని ప్రకటనలు, ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి.
- ‘మని’ ద్వీపకల్పం.. అక్కడ అంతా ఒకే సమూహం గ్రీసులో ఉన్న ఓ మానవ సమూహం తరతరాలుగా అనేక దాడులను ఎదుర్కొని నిలిచింది.
- పిల్లల్ని కనబోతున్నారా.. మరి వీటి గురించి ఆలోచించారా? పెళ్లి చేసుకున్న యువజంటలతో బంధువులు అనే మొదటి మాట..‘పిల్లల్ని ఎప్పుడు కంటారు? తొందరగా కనేయండి’అని. వైవాహిక జీవితానికి తల్లిదండ్రులు అనే హోదానే పరిపూర్ణత ఇస్తుందని సమాజం నమ్ముతుంది.
- మాటలెందుకు? మీమ్స్ ఉండగా.. జెన్ జీ లైఫ్‌స్టైల్ ఇదీ! ఎవరైనా బొద్దుగా ఉన్న వ్యక్తి తారసపడితే ‘ఒడియమ్మా బంటీ’ అంటున్నారు.. ఏదైనా పనిని ఆశ్చర్యపరిచేలా వేగంగా చేసినా, ఎవరూ చేయలేని పనిని చేసి చూపించినా ‘ఫ్లాష్‌మ్యాన్’ అని పిలుస్తున్నారు. ఎందుకు అంటారా? ఇటీవల సోషల్‌మీడియాలో ట్రెండ్ అయినా మీమ్స్ అవి.
- టైమ్‌కి పని అవ్వాలంటే.. ఈ టెక్నిక్స్ తెలిసుండాలి! అనుకున్న పనులు సమయానికి పూర్తి కావాలంటే సమయ పాలన చాలా ముఖ్యం. దీన్ని పట్టించుకోకపోతే పనులన్నీ గందరగోళంగా, అసంపూర్తిగా ఉంటాయి.
- జిప్ కోడింగ్.. గల్లీ దాటని ప్రేమ! గతంలో ప్రేమ కోసం సప్తసాగారాలు దాటిన కథలు విన్నాం. ఈ టెక్నాలజీ యుగంలో ఎంత దూరమున్నా మొబైల్‌లో మాట్లాడుతూ, వీడియో కాల్స్‌తో నెట్టుకొస్తున్న లాంగ్ డిస్టెన్స్ ప్రేమలనూ చూస్తున్నాం. కానీ, ఇప్పుడు కాలంతోపాటు యువత ఆలోచనలూ మారుతున్నాయి.
- గ్రీన్‌లాండ్‌లో స్థలాన్ని కొనలేం.. ఇల్లు కావాలంటే పదేళ్లు వేచి చూడాలి! గ్రీన్‌లాండ్.. డెన్మార్క్‌కు చెందిన స్వయంప్రతిపత్తి గల ప్రాంతం. ఇక్కడి భూచట్టాల ప్రకారం.. భూమి అనేది ఇక్కడి ప్రజల సామూహిక వనరు. అందుకే, వ్యక్తిగతంగా ఎవరికీ యాజమాన్య హక్కులుండవు.
- నదిలో బంగారం.. అదే వారికి జీవనాధారం! హరియాణాలోని యమునానగర్ జిల్లాలో బోలి నది ప్రవహిస్తుంటుంది. ఆ నదీతీర ప్రాంతంలో నివసించే ప్రజలకు అది కేవలం నీటి వనరే కాదు.. జీవనాధారం కూడా. ఎందుకంటే ఆ నదీలో బంగారం ఉంది.
- ఊరు మొత్తానికి ఒక్కటే వంటశాల.. వృద్ధుల కోసం వినూత్న ఆలోచన! చందంకి.. గుజరాత్‌లోని మారుమూల చిన్న గ్రామం. అన్ని ఊర్లలో ఉన్నట్టుగానే ఇరుకైన వీధులు, సాధారణ ఇళ్లు, గుడి, బడి అన్ని ఉంటాయి. కానీ, ఈ గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది.
- పొట్ట నిండినా ఆహారంపైనే ధ్యాస.. పెరుగుతోన్న ఫుడ్ నాయిస్ ఆకలి వేస్తే భోజనం చేస్తాం. ఎప్పుడైనా అనుకోకుండా మంచి ఫుడ్ కనిపిస్తే జిహ్వా కోరికని తీర్చేస్తాం. కానీ, కొంతమందికి ఆకలి తీరినా, ఎన్ని రకాల రుచులు చూసినా ఇంకా ఏం తినాలి? ఎప్పుడు తినాలి? అని ఆహారం గురించే ఆలోచిస్తుంటారు.
- ఇజ్రాయెల్ ఆర్మీలో అందమైన భామలు! Israeli Army: ప్రపంచంలోనే శక్తిమంతమైన ఆర్మీ కలిగిన దేశాల్లో ఇజ్రాయెల్ ఒకటి. అత్యాధునిక ఆయుధ, సాంకేతిక సంపత్తి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) సొంతం.
- ఇతరుల్ని అర్థం చేసుకునేవారు ఇలా ఉంటారట! మనుషులంతా ఒకేలా ఉండరు. కొందరికి ఎంత చెప్పినా అర్థం కాదు. మరికొందరు చెప్పకుండానే అర్థం చేసుకుంటారు. కానీ, చాలా కొంత మందికే ఇతరులను పూర్తిగా చదవగలిగే సామర్థ్యం ఉంటుంది.
- ఈ ఆలయంలో మొక్కుకుంటే జుట్టు రాలదట! ఏ దేవాలయానికి వెళ్లినా సుఖఃసంతోషాలు కలిగించమని, ఆరోగ్యం కాపాడమని, సంపద పెరగాలని దేవుళ్లకు ప్రార్థించడం సహజం. వాళ్లు కరుణిస్తే మొక్కులు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అయితే, జపాన్‌లో ఓ విచిత్రమైన ఆలయం ఉంది. అక్కడ భక్తులు కేవలం తమ జుట్టు రాలిపోకూడదని, జుట్టు సమస్యలు తొలగిపోవాలని మాత్రమే ప్రార్థిస్తారు.
- ఎగిరే గాలిపటం.. మెరుగయ్యే జీవనం! గాలిపటాలు ఎగరవేయడం అనేది కేవలం సంప్రదాయం, సరదా మాత్రమే కాదు.. మనుషులకు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చడమే కాదు, ఎన్నో లాభాలు చేకూరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.
- ఒంటరితనానికి కారణం ఇతరులు కాదు, మన అలవాట్లే! కొంత మంది ఒంటరిగా మిగిలిపోయామని మథనపడుతుంటారు. తనకంటూ ఎవరూ లేరని, చుట్టూ ఉన్నవారు దూరం చేస్తున్నారని భావిస్తారు. నిజానికి మనలోని అలవాట్లు, ఆలోచన తీరు, మనస్తత్వాలే మనుషుల్ని మనకు దూరం చేస్తాయని మానసిక నిపుణులు చెబుతున్నారు.
- అనగనగా ఓ గ్రామం.. అక్కడ ఒకే ఒక్క ఇల్లు! నిర్మానుష్య ప్రాంతంలో కాసేపు ఉండాలంటేనే భయంతో వణుకు వచ్చేస్తుంటుంది. అలాంటిది, కనుచూపుమేరలో మనుషులే కనిపించని ఓ మారుమూల గ్రామంలో ఓ కుటుంబం కొన్నేళ్లుగా నివసిస్తోంది.
English Translation
Christmas: watching cartoons.. eating KFC chicken.. Christmas is a strange celebration!

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

Internet Desk: Christmas all December. The noise is visible. And on the 25th, the celebrations will be in full swing. All the houses are decorated, the Christmas tree is set up and the cake is cut. Gifts are given to children and relatives. However, some countries observe strange customs on Christmas day. That is..
Norway
Those who strictly follow Christian traditions hide the broom in the house on Christmas day. They believe that sorcerers and demons will harm people on that day. Broomsticks are used for occult worship. A fire is lit near the chimney because there is a danger of the kitchen chimney coming into the house.
Japan
There is no holiday on Christmas Day in Japan. In the 1970s, KFC advertised to celebrate with their fried chicken. This has become a tradition. People still eat fried chicken at the local KFCs on Christmas Day.
Czech Republic
Here unmarried young women play a traditional game on Christmas Day. They throw their sandals over their shoulders towards the doorstep. If the front of the sandal touches the ground first, there will definitely be a marriage in the new year. If the same heel touches the front, the marriage will not happen.
Ukraine
Usually Christmas tree is decorated with lights, balloons and design papers. In Ukraine, spider webs are made with them. There is a story behind this. On Christmas day, a poor woman decorated the Christmas tree with the fruits she had at home. A spider built a nest on them. The next day morning sunlight turned the web into gold and silver. So the people there decorate with cobwebs to wish good things to happen to them.
Sweden
At 3pm on Christmas Day, many people in this country sit in front of the TV and watch the 'Donald Duck' cartoon show. Once there were two channels in Sweden. A channel used to air Disney cartoons. In 1958, the popular show 'Donald Duck and His Friends Wish You a Merry Christmas' was aired every year on Christmas Day. The tradition is still going on.
Philippines
Christmas celebrations are held for four months in this country like nowhere else in the world. Lantern competitions are held on the Saturday before Christmas. All the cities participate in these competitions. The people of the village who make an impressive lantern will win the prize.
► Read latest Explained Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.
more
- Gentleman in the name.. India is constant hatred! What he did was bank business.. There are allegations that he gave interest in rural areas and collected it. Valentine's Day is a celebration not only for couples but also for husband and wife. Usually on this day they exchange gifts to each other.
- AI surveillance on tenders..Irregularities and syndicates are no longer possible! Development works including roads and railway projects...Tenders are mandatory for major construction projects in the government. Between monthly expenses and future financial plans, it can be difficult to budget specifically for a vacation. However, financial experts say that the vacation budget is not a big problem if you save some amount in the expenses. And what to do about it..
- Vaddanna is coming.. Travel overcrowding in Europe! Governments of many countries are developing their tourism sector and are making advertisements and campaigns to visit our country.
- ‘Mani’ peninsula.. there everything is one group A human group in Greece has faced many attacks for generations.
- Are you going to have children.. and have you thought about these? The first word of relatives with the married couple..'When will the children be born? Hurry up.' Society believes that the status of parenthood is what makes a married life perfect.
- Why? While there are memes.. This is the lifestyle of Jen Z! If someone is chubby, they say 'Odiamma bunty'. Why do you say? Memes are the latest trend in social media.
- If you want to work on time.. you should know these techniques! Time management is very important to complete the planned tasks on time. If you don't pay attention to this, all the work will be confused and incomplete.
- Zip Coding.. Love that does not cross the street! In the past we have heard stories of crossing the seven oceans for love. In this age of technology, we are seeing long-distance love through video calls and talking on mobile phones. But, now the youth's thoughts are changing along with the times.
- Can't buy land in Greenland.. If you want a house, you have to wait ten years! Greenland is an autonomous region of Denmark. According to the land laws here.. land is the collective resource of the people here. That is why, no one has ownership rights individually.
- Gold in the river.. that is their livelihood! Boli river flows in Yamunanagar district of Haryana. It is not only a source of water for the people living in that riverside area, but also a source of livelihood. Because there is gold in that river.
- Only one kitchen for the whole town.. An innovative idea for the elderly! Chandanki.. a remote small village in Gujarat. As in all towns, there are narrow streets, simple houses, temples and schools. But, this village has something special.
- Dhyasa on food even if stomach is full. If we are hungry, we will eat. Whenever we find good food by chance, we satisfy the desire of Jihwa. But, even if some people are hungry, what else should they eat, no matter how many different flavors they see? When to eat? They think about food.
- Beautiful women in the Israeli army! Israeli Army: Israel is one of the countries with the most powerful army in the world. Israel Defense Force (IDF) owns the latest weapons and technology.
- People who understand others are like this! All people are not the same. No matter how much you say to some, it doesn't make sense. Others understand without being told. But, very few people have the ability to read others completely.
- If you plant in this temple hair will fall! It is natural to pray to the gods to bring happiness, health and wealth to any temple. Devotees believe that if they show mercy, their prayers will be fulfilled. However, there is a strange temple in Japan. There the devotees only pray that their hair does not fall and hair problems get rid of it.
- Flying Kite.. Better Life! Flying kites is not just a tradition, it is not just fun.. Experts say that it not only improves the physical and mental health of people, but also brings many benefits.
- The cause of loneliness is not others, but our habits! Some people say that they are left alone. He feels that there is no one like him and that those around him are alienating him. In fact, psychologists say that it is our habits, thinking and mentality that keep people away from us.
- A village is like a village. Staying in a deserted area for a while makes you shiver with fear. For example, a family has been living for years in a remote village where there are no people in sight.