Virat Kohli: విజయ్‌ హజారే ట్రోఫీ: విరాట్‌ కోహ్లీ సెంచరీ.. దిల్లీ విజయం

Eenadu icon
By Sports News Team Updated : 24 Dec 2025 17:25 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: విజయ్‌ హజారే ట్రోఫీలో భాగంగా బెంగళూరు వేదికగా దిల్లీ, ఆంధ్ర జట్లు తలపడ్డాయి. దిల్లీ తరఫున బరిలోకి దిగిన విరాట్‌ కోహ్లీ 83 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆంధ్ర నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన దిల్లీ జట్టు 37.4 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 300 పరుగులు చేసింది. దీంతో ఈ మ్యాచ్‌లో దిల్లీ 4 వికెట్ల తేడాతో ఆంధ్రపై విజయం సాధించింది.

విరాట్‌ కోహ్లీ (131; 101 బంతుల్లో, 14 ఫోర్లు, 3 సిక్స్‌లు) భారీ శతకం సాధించాడు. నితీశ్‌ రాణా (77; 55 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), ప్రియాంశ్‌ ఆర్య (74; 44 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) హాఫ్‌ సెంచరీలతో సత్తా చాటారు. అర్పిత్‌ రాణా (0), రిషభ్‌పంత్‌ (5), ఆయుష్‌ బదోని (1) నిరాశపరిచారు. హర్ష్‌ త్యాగి (4*), నవదీప్‌ సైనీ (5*) నాటౌట్‌గా నిలిచారు. ఆంధ్ర బౌలర్లలో సత్యనారాయణ రాజు, హేమంత్‌ రెడ్డి చెరో రెండు, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, కె.ఎస్‌.నరసింహ రాజు తలో వికెట్‌ తీసుకున్నారు. 

  • విజయ్‌ హజారేకు స్టార్‌ కళ

అంతకు ముందు ఆంధ్ర బ్యాటర్లలో రికీ భుయ్‌ సెంచరీతో (122; 105 బంతుల్లో, 11 ఫోర్లు, 7 సిక్స్‌లు) ఆకట్టుకున్నాడు. షేక్‌ రషీద్‌ (31), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (23), హేమంత్‌ రెడ్డి (27), సింగుపురం ప్రసాద్‌ (28) ఫర్వాలేదనిపించారు. దిల్లీ బౌలర్లలో సిమర్జీత్‌ సింగ్ 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. ప్రిన్స్‌ యాదవ్‌ 3 వికెట్లు తీసుకున్నాడు. ముంబయి, సిక్కిం మధ్య జైపుర్‌ వేదికగా జరిగిన మరో మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ సెంచరీతో అలరించాడు. ఓ వైపు విరాట్‌, మరో వైపు రోహిత్‌ శతకాలు బాదడంతో రో-కో అభిమానులు సంబరాలు చేసుకున్నారు.

► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 24 Dec 2025 16:16 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • వచ్చాడో బేబీ యువరాజ్‌ అతడి దేశంలో క్రికెట్‌కు అనుకూలమైన పరిస్థితుల్లేవ్‌.. ఏడాదికి మూడు నెలలే ఆట. అలాంటి చోట నుంచి క్రికెట్లో ఎదిగి జాతీయ జట్టుకు ఆడడమే గొప్ప. అలాంటిది ప్రపంచకప్‌లో బరిలో దిగే అవకాశం వచ్చింది.
  • అజేయమేనా? హ్యాట్రిక్‌ విజయాలు.. గత మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారీ గెలుపు.. టోర్నీలో మరే జట్టుకూ సాధ్యం కాని విధంగా అత్యధిక నెట్‌ రన్‌రేట్‌.. ఇలా టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా హవా మామూలుగా లేదు.
  • ఆస్ట్రేలియా ఔట్‌ మాజీ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాకు షాక్‌. మంగళవారం జింబాబ్వే, ఐర్లాండ్‌ మధ్య గ్రూప్‌-బి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కావడంతో కంగారూ జట్టు టీ20 ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు ఓడిన ఆసీస్‌..
  • కివీసూ ముందుకు టీ20 ప్రపంచకప్‌లో సమీకరణాలతో పని లేకుండా న్యూజిలాండ్‌ సూపర్‌-8కు దూసుకెళ్లింది. మంగళవారం గ్రూప్‌-డి పోరులో కివీస్‌ 8 వికెట్ల తేడాతో కెనడాను చిత్తు చేసింది. మొదట కెనడా 4 వికెట్లకు 173 పరుగులు చేసింది.
  • కంగారు పడింది.. ఎన్నోసార్లు ఐసీసీ టోర్నీలు గెలిచిన ఆస్ట్రేలియా, ప్రపంచకప్‌ అనగానే టాప్‌ ఫామ్‌ను అందుకునే జట్టు టీ20 ప్రపంచకప్‌ నుంచి ఇంత త్వరగా నిష్క్రమించడం ఏమాత్రం ఊహించనిదే.
  • పాక్‌ నిలుస్తుందా? టీ20 ప్రపంచకప్‌ నుంచి ఇప్పటికే ఆస్ట్రేలియా నిష్క్రమించింది. మరో పెద్ద జట్టు భవితవ్యం బుధవారం తేలిపోనుంది. గత మ్యాచ్‌లో భారత్‌ చేతిలో గట్టి దెబ్బ తిన్న పాకిస్థాన్‌.. తన చివరి గ్రూప్‌ పోరులో నమీబియాను ఢీకొనబోతోంది.
  • ముగింపులో నేపాల్‌ మెరుపు పెద్ద జట్టు ఇంగ్లాండ్‌పై విజయానికి అత్యంత చేరువగా వెళ్లి, త్రుటిలో ఓడిన నేపాల్‌.. టీ20 ప్రపంచకప్‌ను అదిరే విజయంతో ముగించింది. గ్రూప్‌-సిలో తొలి మూడు మ్యాచ్‌లూ ఓడి సూపర్‌-8 రేసు నుంచి నిష్క్రమించిన ఆ జట్టు.. స్కాట్లాండ్‌తో మంగళవారం చివరి పోరులో 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
  • సంక్షిప్త వార్తలు (5) రంజీ ట్రోఫీలో జమ్ముకశ్మీర్‌ చరిత్రకు చేరువైంది. బ్యాటింగ్‌.. బౌలింగ్‌లో స్ఫూర్తిమంతమైన ప్రదర్శనతో సత్తాచాటుతున్న ఆ జట్టు రంజీ చరిత్రలో తొలిసారిగా ఫైనల్‌ దిశగా అడుగులేస్తోంది.
  • శర్మా.. మొదట నువ్వు సింగిల్‌ తీసుకో: సునీల్‌ గావస్కర్‌ టీమ్ఇండియా (Team India) టీ20 స్పెషలిస్ట్‌ బ్యాటర్‌ అభిషేక్‌ శర్మ (Abhishek Sharma) బ్యాటింగ్‌లో తడబడుతున్నాడు. టీ20 వరల్డ్‌కప్‌లో అతడు ఇప్పటి వరకు రెండు మ్యాచులు ఆడితే రెండింట్లోనూ డకౌట్‌గా వెనుదిరిగాడు.
  • యువరాజ్‌ సింగ్‌ పేరు.. శతకంతో రికార్డ్‌: కెనడా ‘యువీ’ సెన్సేషన్‌ Yuvraj Samra: ప్రస్తుతం పొట్టి ప్రపంచకప్‌లో ఓ కుర్రాడి పేరు నెట్టింట మార్మోగుతోంది. అతి చిన్న వయసులో టీ20 ప్రపంచకప్‌లో శతకంతో అదరగొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు.