Vaibhav Suryavanshi: వైభవ్ వీర బాదుడు.. తృటిలో డబుల్ సెంచరీ మిస్

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఇంటర్నెట్ డెస్క్: వైభవ్ సూర్యవంశీ ( Vaibhav Suryavanshi) చరిత్ర సృష్టించాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్‌తో రాంచీ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో బిహార్ తరఫున సూపర్ సెంచరీతో చెలరేగిపోయాడు. కేవలం 36 బంతుల్లోనే శతకం బాది రికార్డ్ సృష్టించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్ (190; 84 బంతుల్లో; 16 ఫోర్లు, 15 సిక్స్‌లు) తృటిలో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. క్రీజులో ఉన్నంత వరకు సిక్స్‌లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు.
- విజయ్ హజారేకు స్టార్ కళ
వైభవ్ వీరబాదుడుతో 30 ఓవర్లు ముగిసే సమయానికి బిహార్ జట్టు 2 వికెట్లు కోల్పోయి 282 పరుగులు చేసింది. మరో ఓపెనర్ మంగళ్ మహరూర్ 33 (43 బంతుల్లో, 4 ఫోర్లు) పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం క్రీజులో పీయూష్ సింగ్ (37*; 40 బంతుల్లో, 4 ఫోర్లు), ఆయుష్ లోహరుక (13*; 14 బంతుల్లో, 2 ఫోర్లు) కొనసాగుతున్నారు. అరుణాచల్ ప్రదేశ్ బౌలర్లలో టెక్కీ నేరి రెండు వికెట్లు తీసుకున్నాడు.
ఏబీ డివిలియర్స్ రికార్డ్ బ్రేక్..
దక్షిణాఫ్రికా బ్యాటర్ ఏబీ డివిలియర్స్ వెస్టిండీస్‌పై 2015లో 64 బంతుల్లో 150 పరుగులు చేశాడు. వైభవ్ సూర్యవంశీ తాజాగా లిస్ట్ ఏ క్రికెట్‌లో కేవలం 59 బంతుల్లోనే 150 పరుగులు చేసి, డివిలియర్స్ ప్రపంచ రికార్డ్‌ను బ్రేక్ చేశాడు. అలాగే లిస్ట్ ఏ క్రికెట్‌లో అత్యంత పిన్న వయసులో (14 సంవత్సరాల 272 రోజులు) సెంచరీ చేసిన బ్యాటర్‌గా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు.
► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 24 Dec 2025 10:38 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- యువరాజ్ సమ్రా సూపర్ సెంచరీ.. న్యూజిలాండ్ విజయ లక్ష్యం 174 టీ20 వరల్డ్‌కప్ 2026లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా న్యూజిలాండ్, కెనడా జట్లు తలపడుతున్నాయి. తొలుత టాస్ గెలిచిన కెనడా బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 173 పరుగులు చేసింది.
- గౌతమ్ గంభీర్‌కు కీలక పదవిని ఆఫర్ చేసిన రాజస్థాన్ రాయల్స్! ప్రస్తుతం టీమ్ఇండియా (Team India) హెడ్‌కోచ్‌గా వ్యవహరిస్తున్న గౌతమ్ గంభీర్‌కు (Gautam Gambhir) ఐపీఎల్ (IPL) ఫ్రాంఛైజీ రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) కీలక పదవిని ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
- తిరుమల శ్రీవారి సేవలో అమెరికా క్రికెటర్లు తిరుమల శ్రీవారిని అమెరికా క్రికెటర్లు దర్శించుకున్నారు.
- తూచ్.. నేను నఖ్వీని అలా అనలేదు..: మాట మార్చిన షోయబ్ అక్తర్! పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ 24 గంటలైనా గడవక ముందే మాట మార్చాడు. తాను పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (PCB) అధ్యక్షుడు నఖ్వీని అసమర్థుడు, నిరక్షరాస్యుడు అనలేదని యూటర్న్ తీసుకున్నాడు.
- పది పరీక్షలకు వైభవ్ దూరం భారత అండర్-19 ప్రపంచకప్ స్టార్.. రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఈ ఏడాది సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలకు దూరంగా ఉండనున్నాడు.
- కోపం వదిలెయ్ సోదరా! పాకిస్థాన్‌తో ఆదివారం మ్యాచ్ అనంతరం భారత స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ చాలా కోపంగా కనిపించడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.
- అక్కడ మెరుపుల్లేవ్ టీ20 అనగానే గుర్తొచ్చేది సిక్సర్లు, ఫోర్లే! ఎంత బాదితే అభిమానులకు అంత ఆనందం. ఈసారి టీ20 ప్రపంచకప్‌లో చాలా మ్యాచ్‌ల్లో బ్యాటర్లు అదరగొడుతున్నారు.
- కంగారూలు మళ్లీ పడ్డారు లంకేయులు అదరహో.. కంగారూలకు మళ్లీ షాక్! శ్రీలంక వరుసగా మూడో విజయంతో టీ20 ప్రపంచకప్‌లో సూపర్ 8కు దూసుకెళ్లింది.
- పెళ్లి పీటలెక్కనున్న ఇషాన్! భారత స్టార్ ఆటగాడు ఇషాన్ కిషన్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నాడా? అంటే అవుననే అంటున్నాడు అతని తాత రామ్ అనుగ్రహ పాండే. మోడల్ అదితి హుండియాతో ఇషాన్ వివాహం జరగొచ్చని పాండే సూత్రప్రాయంగా చెప్పాడు.
- అజ్మతుల్లా ఆల్‌రౌండ్ ప్రదర్శన చిన్న జట్లలోకెల్లా బలమైన జట్టే అయినా, అదృష్టం కలిసిరాక తొలి రెండు మ్యాచ్‌ల్లో బోణీ కొట్టలేకపోయిన అఫ్గానిస్థాన్.. టీ20 ప్రపంచకప్‌లో తొలి విజయాన్ని సాధించింది.
- ఇంగ్లాండ్ సూపర్-8కు టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ సూపర్-8కు అర్హత సాధించింది. సోమవారం గ్రూప్-సి పోరులో ఆ జట్టు ఇటలీపై 24 పరుగుల తేడాతో గెలిచింది.
- అతడో అసమర్థుడు టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ నఖ్వి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. పాక్ మంత్రి కూడా అయిన అతడు.. తన ఇష్టానుసారంగా బోర్డును నడిపించాడు.
- పాక్‌తో మ్యాచ్‌లో కాస్త ఎక్కువ ఒత్తిడి: అక్షర్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్ అంటే సహజంగానే ఒత్తిడి ఉంటుందని భారత ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ అన్నాడు. అయితే మైదానంలోకి దిగాక తమ దృష్టంతా ఆటపైనే ఉంటుందని అతను చెప్పాడు.
- బాబర్, షాహీన్‌లపై వేటు? టీ20 ప్రపంచకప్‌లో భారత్ చేతిలో పాకిస్థాన్ పరాజయ ప్రభావం.. సీనియర్ ఆటగాళ్లు బాబర్ ఆజాం, షాహీన్ అఫ్రిదిలపై పడేలా ఉంది.
- సంక్షిప్త వార్తలు (4) ఆస్ట్రేలియాకు షాకిచ్చిన జింబాబ్వే టీ20 ప్రపంచకప్‌లో కీలక సమరానికి సిద్ధమైంది. ఆ జట్టు.. మంగళవారం గ్రూప్-బి పోరులో ఐర్లాండ్‌ను ఢీకొంటుంది.
- వరల్డ్ కప్ తర్వాత.. ఆ మోడల్‌తో మా మనవడి పెళ్లి: ఇషాన్ తాతయ్య ఇషాన్ కిషన్ పెళ్లిపై ఓ స్పష్టత వచ్చేసింది. ఎప్పుడు జరగబోతుందో కూడా ఇషాన్ తాతయ్య అనురాగ్ పాండే వెల్లడించారు.
- ఇషాన్ అద్భుతం.. రోహిత్ మాకు ఏం చెప్పాడంటే?: సంజనతో బుమ్రా చిట్‌చాట్ పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన చేశాడు. మ్యాచ్ తర్వాత తన భార్య, క్రికెట్ వ్యాఖ్యాత సంజనా గణేశన్‌తో చిట్‌చాట్‌లో బుమ్రా మాట్లాడాడు.