Loan Apps: ఇష్టానుసారం రుణాలు.. ‘స్కోరు’ పడుద్ది

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 24 Dec 2025 18:42 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read
  • హైదరాబాద్‌కు చెందిన ఓ ఇంజినీరింగ్‌ కళాశాల యువకుడు లోన్‌యాప్‌లో రూ.10వేల రుణం తీసుకుంటే రూ.30వేలు కట్టించుకోవడమే కాకుండా ఇంకా చెల్లించాలని వేధించడంతో ఆత్మహత్యాయత్నం చేసి చివరకు చికిత్స పొందుతూ మరణించాడు.
  • గుంటూరుకు చెందిన పవన్‌ బీటెక్‌ చేసి విదేశాలకు వెళ్లాలనే ప్రయత్నంలో.. సిబిల్‌ స్కోర్‌ 350 కంటే తక్కువ ఉందని మెరుగయ్యాకే విద్యా రుణం వస్తుందని కన్సల్టెన్సీ వాళ్లు సూచించారు. సంవత్సరం కిందట లోన్‌యాప్‌లో చేసిన అప్పే దీనికి కారణమని వాపోయాడు.

చేతిలో సెల్‌ఫోన్‌.. అందులో లోన్‌యాప్‌లు ఇక అడ్డేముంది... ఇష్టానుసారం రుణాలు తీసుకోవడం! ఆ తర్వాత ఆలస్యంగా ఈఎంఐలు చెల్లించడం.. ఆ తప్పే సిబిల్‌ స్కోర్‌ను తగ్గించి భవిష్యత్తుకు ముప్పుగా మారుతోంది.

భవిష్యత్తుపై ప్రభావం...

  • బీటెక్, ఇతర డిగ్రీలు పూర్తయ్యాక ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునేవారు కన్సల్టెన్సీలను ఆశ్రయిస్తున్నారు.
  • విద్యారుణం కోసం దరఖాస్తు చేసినపుడు సిబిల్‌ స్కోర్‌ తక్కువ ఉండడంతో అవి   తిరస్కరణకు గురవుతున్నట్లు గుర్తిస్తున్నారు.
  • అది పెరిగితే తప్ప మళ్లీ దరఖాస్తు చేసుకోవడం సాధ్యం కావడంలేదు. ఇలా వారికి ఒక సంవత్సరం వృథా అవుతోంది. 
  • ఈ రుణాలు తీసుకునే ప్రతి 10 మందిలో ఆరుగురు కాలేజీ విద్యార్థులే ఉంటున్నారని కన్సల్టెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. 
  • గేమింగ్, ఫోన్‌ రీఛార్జి, షాపింగ్‌ల కోసం ఎక్కువగా ఈ యాప్‌ల్లో రుణాలు తీసుకుంటున్నారు. 
  • ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లు, స్నేహితులతో కలిసి వీకెండ్‌ పార్టీల కోసం అప్పటికప్పుడు ఖాతాలో పడే డబ్బు కోసం కూడా వీటిని ఆశ్రయిస్తున్నారు.

సులభతర నిబంధనలు..

  • లోన్‌ యాప్‌ల్లో నిబంధనలు సులభతరంగా ఉండటంతో యువత వాటి వైపు ఆకర్షితులవుతున్నారు. 
  • ఫేక్‌ యాప్‌ల్లో మన కాంటాక్ట్స్, గ్యాలరీ పర్మిషన్, స్టోరేజ్, లొకేషన్‌ పర్మిషన్‌ అడుగుతుంటారు. 
  • ఆర్‌బీఐ అనుమతి ఉన్న వాటిలో ఇవేవి అడగకుండా.. సిబిల్‌ స్కోర్, ఇదివరకు ఈఎంఐలు చెల్లించినప్పుడు చెక్‌బౌన్స్‌ కావడం వంటివి చూసుకుని ఇస్తాయి. 
  • ఆధార్, పాన్‌కార్డు ఉంటే ఎటువంటి ఆదాయ వనరులు లేకపోయినా, సిబిల్‌ స్కోర్‌ తక్కువ ఉన్నా విద్యార్థులకు రుణాలు ఇచ్చేస్తున్నాయి.

వడ్డీల మోత.. 

  • విద్యార్థులు రూ.3,000 నుంచి రూ.10,000 మధ్య తీసుకునే రుణాలకే 10 నుంచి 36శాతం వడ్డీలు వసూలు చేస్తున్నారు. 
  • ఇవి ఒక్కో యాప్‌లో ఒక్కో రకంగా ఉంటాయి. 
  • ఉదాహరణకు రూ.2,000 తీసుకుంటే మొత్తం చెల్లించేసరికి రూ.4,000 అవుతుంది. 
  • ఈఎంఐ తేదీ దాటిపోతే రోజుకు రూ.100 చొప్పున అదనపు ఛార్జీలు పడుతుంటాయి.
  • మొదట మనకు కాల్‌ వస్తుంది. తర్వాత మన కుటుంబ సభ్యులకు.. ఆ తర్వాత మన కాంటాక్టుల్లోని  అందరికీ ఫోన్లు వెళతాయి. 
  • ఎన్ని నంబర్లు బ్లాక్‌ చేసినా వేర్వేరు నంబర్లతో ఫోన్లు చేస్తూ వేధిస్తారు.
  • ఆర్‌బీఐ అనుమతి ఉన్నవాటిల్లో ఇలాంటి వేధింపులు లేకపోయినా.. ఎప్పుడైనా మన ఖాతాలో నగదు పడితే మరుక్షణమే మొత్తం కట్‌ చేసుకుంటారు. 
  • ఏ అవసరమున్నా ఇంట్లో అమ్మానాన్నలనో.. స్నేహితులనో అడగాలే కానీ ఆన్‌లైన్‌లో అప్పు తీయకూడదు.
  • లోన్‌ యాప్‌లు సురక్షితం కాదని గుర్తించాలి.
  • గ్యాలరీ, కాంటాక్ట్‌ అనుమతులిచ్చామంటే మన సమస్తం సైబర్‌ నేరగాళ్ల చేతికి వెళ్లినట్లే.
  • అత్యవసరమైతే ఆర్‌బీఐ అనుమతి ఉన్న లోన్‌ యాప్‌ల్లో రుణం తీసుకోవచ్చు. అదికూడా రేటింగ్‌ చూసి సురక్షితం అనుకున్నాకే ముందుకెళ్లాలి. 
  • తీసుకున్న అప్పును క్రమపద్ధతిలో చెల్లించేలా జాగ్రత్తపడాలి.
  • బెట్టింగ్, ఆన్‌లైన్‌ రమ్మీలాంటివి ఆడటం ఆపేయాలి. అసలు సమస్య అక్కడి నుంచే మొదలవుతుంది.
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • రాజావారి కోట కాదిది.. పోలీసు ఠాణానే రాజుల కాలంలోని కోట తరహాలో కనిపిస్తున్న ఈ భవనం పోలీస్‌స్టేషన్‌ అంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. కాకినాడ జిల్లాలోని కోటనందూరు ఠాణా ఇది.
  • క్లిక్‌ చేసేముందు కాస్త ఆలోచించు బ్రో! ట్రాఫిక్‌ ఉల్లంఘనల పేరుతో నకిలీ చలానాలు పంపిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు సైబర్‌ కేటుగాళ్లు. వీరు పంపించే చలానాలు అసలు వాటికి ఏమాత్రం తీసిపోని రీతిలో ఉండడంతో ఎక్కువ మంది బోల్తా పడుతున్నారు.
  • ‘యువగళం’ గుర్తు.. సైకిల్‌! ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేశ్‌ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రను ప్రారంభించి మూడేళ్లు పూర్తి కావడంతో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తెదేపా ఎమ్మెల్యేలు ఆ సందర్భం గుర్తుండిపోయేలా చేస్తున్నారు.
  • నాటి వైభోగం.. నేటి జ్ఞాపకం గోకర్ణం, గంగాళం, ముక్కుపొడుం మీనా, ధూమం అరలు, శకుంతలపాత్ర, పూలబుట్టలు, కావడి పెట్టె, మర చెంబులు.. ఏంటివన్నీ అనుకుంటున్నారా?
  • నేడు రాజధానికి బిల్‌గేట్స్‌ బృందం గేట్స్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌ బిల్‌గేట్స్‌ సోమవారం అమరావతిలో పర్యటించనున్నారు.
  • రాకింగ్‌.. రామసుబ్బమ్మా! జీవితంలో గెలవాలంటే ఏ వయసులోనైనా ప్రయత్నించి, విజయం సాధించొచ్చు అనడానికి ఈ బామ్మే ఉదాహరణ.
  • గిరులన్నీ.. భక్త జన సిరులు ఎటు చూసినా పారవశ్యం... భక్తజన కోలాహలం..  మహా శివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని శివాలయాలు రద్దీగా మారాయి.. ఆధ్యాత్మికతను పంచాయి.
  • సుబ్బారెడ్డి సేవలోనే చిన్నప్పన్న వైకాపా హయాంలో తిరుమలకు లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా కేసులో కీలక నిందితుడైన కదురు చిన్నప్పన్న.. అప్పటి తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డికి కేవలం పీఏ మాత్రమే కాదు అంతకు మించి నమ్మినబంటని ఇప్పటికే తిరుగులేని ఆధారాలతో తేటతెల్లమయ్యింది.
  • శివరాత్రి వేళ.. పుష్కరాలకు సన్నాహాలు వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నిర్వహణకు సన్నాహక చర్యల్లో భాగంగా.. ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా రాజమహేంద్రవరంలో గోదావరి తీరాన భక్తుల రద్దీని అధికారులు శాస్త్రీయంగా అంచనా కట్టారు.
  • ఆదిత్యుని సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌ ఆదివారం శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని సూర్యనారాయణస్వామి ఆయలం, విశాఖపట్నంలోని సింహాద్రి అప్పన్న స్వామి దేవస్థానాన్ని సందర్శించారు.
  • కాలచక్ర మ్యూజియానికి నిర్లక్ష్యపు గ్రహణం బౌద్ధారామాల చరిత్ర భావితరాలకు తెలియజేసేందుకు పల్నాడు జిల్లా అమరావతిలో ఏర్పాటు చేసిన కాలచక్ర మ్యూజియంపై నిర్లక్ష్యం కమ్ముకుంది.
  • కర్నూలులో నల్లరెక్కల తెల్లడేగ కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణ శివారులోని పంట పొలాల్లో నల్లటి రెక్కల తెల్ల డేగ కనిపించింది. రైతులు దీన్ని తమ నేస్తంలా భావిస్తారు.
  • 4 నగరాలు.. రూ. 2 వేల కోట్ల లక్ష్యం కొత్త ఆర్థిక సంవత్సరంలో ‘అర్బన్‌ ఛాలెంజ్‌ ఫండ్‌’ (యూసీఎఫ్‌) కింద రూ.2వేల కోట్లు సమీకరించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
  • ర్యామ్, చిప్‌ల కొరతతో.. ఎలక్ట్రానిక్‌ పరికరాల ధరలకు రెక్కలు మీరు మొబైల్‌ మార్చాలని.. కొత్త ల్యాప్‌టాప్‌ కొనాలని.. కంప్యూటర్‌ను అప్‌గ్రేడ్‌ చేసుకోవాలని ఆలోచిస్తున్నారా..? ఒక్క నిమిషం ఆగండి.
  • ఈ బడ్జెట్‌.. రాష్ట్రాభివృద్ధికి సరైన రోడ్‌మ్యాప్‌ అసెంబ్లీలో శనివారం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్‌ రాష్ట్రాభివృద్ధికి స్పష్టమైన రోడ్‌ మ్యాప్‌ను సిద్ధం చేసిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ పేర్కొన్నారు.
  • ఏప్రిల్‌ 1 నుంచి కొత్త రైల్వే జోన్‌? దక్షిణమధ్య రైల్వే పునర్విభజన ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. కొత్త రైల్వే జోన్‌కు అపాయింటెడ్‌ డేను కేంద్ర ప్రభుత్వం తొందరలోనే ప్రకటించనున్నట్టు తెలిసింది.
  • ‘అగ్నివీర్‌’ నియామకాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ఆహ్వానం సైన్యంలో నియామకాల కోసం ఆన్‌లైన్‌ నమోదు, దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించినట్లు రిక్రూట్‌మెంట్‌ అధికారి, గుంటూరు డైరెక్టర్‌ కర్నల్‌ రజత్‌ సువర్ణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
  • కార్యకర్తల కష్టాన్ని గుర్తించేవారే సంపూర్ణ నాయకులు క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తల కష్టాన్ని గుర్తించేవారు.. పార్టీ ఉన్నతి కోసం ఉద్యమి, సాధక్, ప్రదాతలుగా మారి పనిచేసేవారే సంపూర్ణ నాయకులుగా ఎదుగుతారని జనసేన అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు.
  • కలవరపెడుతున్న టీనేజ్‌ ప్రెగ్నెన్సీ రాష్ట్రంలో కౌమార బాలికల్లో గర్భధారణ (టీనేజ్‌ ప్రెగ్నెన్సీ) ఆందోళన కలిగిస్తోంది. 25 జిల్లాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది.
  • దీర్ఘకాలిక లక్ష్యాలకు ప్రత్యేక నిధి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని రూ.100 కోట్లతో ఏపీ వెల్త్‌ఫండ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

English Translation

Loan Apps: Loans at will.. 'Score'

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 24 Dec 2025 18:42 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read
  • An engineering college youth from Hyderabad tried to commit suicide after taking a loan of Rs.10,000 on loan app and was harassed to pay Rs.30,000. Consultancy suggested. He complained that the reason for this was the app he made in Loneapp a year ago.

Cellphone in hand. Borrowing at will! After that paying late EMIs.. that wrong CIBIL score is reducing and becoming a threat to the future.

Impact on the future...

  • Those who want to go abroad for higher studies after completing B.Tech and other degrees are resorting to consultancies.
  • Lower CIBIL score when applying for education loan. It is recognized that they are facing rejection.
  • It is not possible to apply again unless it increases. They are wasting a year like this. 
  • Consultancy managers say that out of every 10 borrowers, six are college students. 
  • Loans are mostly taken in these apps for gaming, phone recharge and shopping. 
  • These are also used for online betting and weekend parties with friends.

Easy terms..

  • Young people are attracted towards loan apps as the terms are easy. 
  • Fake apps ask for our contacts, gallery permission, storage, location permission. 
  • In RBI approved, they will check Bounce of EMIs, CIBIL score without asking. 
  • If they have Aadhaar and PAN card, they give loans to students even if they have no source of income or even if their CIBIL score is low. 
  • These are different for each app. 
  • For example if you take Rs.2,000 then the total amount will be Rs.4,000. 
  • Extra date of EMI will incur additional charges of Rs.100 per day.
  • First we get a call. Then to our family members.. and then to all our contacts. 
  • No matter how many numbers we block, they call us with different numbers and harass us.
  • Even if there is no such harassment in the ones that are allowed by RBI. 
  • Whatever you need, stay at home. Ask friends but don't take loans online.
  • Loan apps should be recognized as unsafe.
  • Allowing gallery and contact permission means all of us are in the hands of cyber criminals.
  • If necessary, loans can be taken from RBI approved loan apps. That too should be considered safe after seeing the rating. 
The real problem starts from there.► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.

More

  • Rajavari Kota is not.. Police station This building, which looks like a fort in the days of the kings, is a police station, and no one will be surprised. This is Kotanandur thana in Kakinada district.
  • Think before you click bro! Cyber ​​criminals are robbing the recipient by sending fake challans in the name of traffic violations. As the bills sent by them are not at all different from the original ones, more people are falling over. As it has been three years since Nara Lokesh started the 'Yuvagalam' padayatra while he was in the opposition, Sripotti Sriramulu Nellore district TDP MLAs are making the occasion memorable. Gokarnam, Gangalam, Nukapodum Meena, Dhumam Aralu, Shakuntalapatra, Flower Baskets, Kavadi Pette, Mara Chembulu... What do you want?
  • Billgates team to the capital today. Founder Chairman of Gates Foundation Bill Gates will visit Amaravati on Monday.
  • Rocking.. Ramasubbamma! This lady is an example that if you want to win in life, you can try and succeed at any age. No matter where you look, it's ecstasy... Devotees' uproar... On the occasion of Maha Shivratri, Shiva temples in the state have become crowded. Kaduru Chinnappanna, the key accused in the case of supply of lakhs of kg adulterated ghee to Tirumala during Vaikapa's reign.. The then Thithide Chairman YV Subbareddy is not only a PA but more than that, it has already become clear with irrefutable evidence. As part of the preparations for the management of Godavari pushkaras next year.. Officials have scientifically estimated the crowd of devotees on the banks of the Godavari at Rajamahendravaram on the occasion of Mahashivaratri on Sunday.
  • Supreme Judge in the service of Aditya Supreme Court judge Justice Sanjay Karol on Sunday visited Suryanarayanaswamy Ayalam in Arasavalli, Srikakulam district and Simhadri Appanna Swamy Devasthanam in Visakhapatnam. The Kalachakra Museum set up in Amaravati of Palnadu district to convey the history of Buddhist Rama to posterity has been neglected.
  • Black-winged white eagle in Kurnool. A black-winged white eagle was spotted in the crop fields on the outskirts of Kodumuru town in Kurnool district. Farmers consider this as their friend.
  • 4 cities.. Rs. 2 thousand crore target In the new financial year, the government is planning to raise Rs.2 thousand crores under the Urban Challenge Fund (UCF). Are you thinking of changing your mobile..buying a new laptop..upgrading your computer..? Wait a minute.
  • This budget is the right roadmap for the development of the state. BJP state president Madhav stated that the budget 2026-27 presented in the assembly on Saturday has prepared a clear road map for the development of the state.
  • New railway zone from April 1? The process of realignment of South Central Railway has reached its final stage. It is learned that the central government will soon announce the appointed day for the new railway zone. Recruitment Officer, Guntur Director Colonel Rajat Suwarna said in a statement on Sunday that online registration and acceptance of applications for army recruitment has been started. Jana Sena President and Deputy Chief Minister Pawan Kalyan said that those who recognize the hardships of workers working at the field level. Teenage pregnancy in the state is a cause for concern. This problem is acute in 25 districts.
  • Special fund for long term goals Keeping in view the long-term economic goals, the government has set up the AP Wealth Fund with Rs.100 crores.