Anasuya Bharadwaj: శివాజీగారు మర్యాదగా చెబుతున్నా.. మీ సాయం అస్సలు అక్కర్లేదు: అనసూయ

Eenadu icon
By Entertainment Team Published : 25 Dec 2025 00:03 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘త్వరలోనే మీ రుణం తీర్చుకునే అవకాశం నాకు కూడా రావాలని కోరుకుంటున్నా’ అని తనని ఉద్దేశిస్తూ నటుడు శివాజీ చేసిన తాజా వ్యాఖ్యలపై (actor sivaji comments) నటి అనసూయ ( Anasuya Bharadwaj) ఘాటుగా స్పందించారు. ‘‘చాలా సందర్భాల్లో చాలా దాటుకుని వచ్చాను. మీ సపోర్ట్‌ నాకు అక్కర్లేదు. నన్ను నేను ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసు’’ అని అన్నారు. హీరోయిన్‌ల దుస్తులపై శివాజీ వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపింది. దీనిపై సామాజిక మాధ్యమాల వేదికగా కామెంట్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో బుధవారం శివాజీ ప్రెస్‌మీట్‌ పెట్టి, తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తూ, తాను నటి అనసూయను ఏమీ అనలేదని ఆమె అనవసరంగా ఇందులోకి వచ్చారని అన్నారు. దీనిపై అనసూయ స్పందించారు. ఈ మేరకు సోషల్‌మీడియాలో వీడియోను పంచుకున్నారు.

‘‘ఇటీవల నేను ఓ వస్త్ర దుకాణం ఓపెనింగ్‌కు వెళ్లాను. అక్కడ విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చాను. ఆయనకు అనిపించింది చెప్పినప్పుడు నాకు అనిపించింది నేను చెప్పా. ఈరోజు ఒక్కరే కూర్చొని. బాధితుడిగా నటిస్తున్నారు. ఆయన వ్యవహారశైలి ‘నార్సిసిస్ట్’లా ఉంది. దీన్నే అతి తెలివి అంటారు. ఒక్క మాటలతో చెప్పాలంటే, చేతగానితనంతో మాట్లాడుతున్నారు. అదేమంటే ఫేక్‌ ఫెమినిస్ట్‌లని మాపై ముద్రవేస్తారు. అసలు ఫెమినిజం అనేది లేదు. ఇక్కడ అందరికీ సమాన హక్కులు ఉండాలి. స్త్రీ, పురుషులు ఉంటేనే ప్రకృతి ముందుకు వెళ్తుంది. ఈ కాలంలో కూడా దుస్తుల గురించి మాట్లాడటం చేతగానితనం. స్వీయ నియంత్రణ లేని వాళ్లు, అభద్రతాభావంతో బతికే వాళ్లు మాత్రమే ఎదుటి వాళ్లపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తారు. ఈ రోజు సానుభూతి పోగు చేసుకుని ఒక్కరే మీడియా ముందు కూర్చొన్నారు. పాపం ఆయనకు అదే కావాలి.  నేను కూడా హీరోయిన్‌నే. ఒకట్రెండు సినిమాల్లో లీడ్‌ రోల్‌చేశా. హీరోయిన్లు మంచిగా దుస్తులు వేసుకోవాలని ఆయన చెబుతున్నారు. మీరు ఏం వేసుకోవాలో నేను చెబుతున్నానా? మేము చిన్నపిల్లలం కాదు. మా హక్కులు మాకు తెలుసు. మా ఇష్టానికి మమ్మల్ని బతకనీయండి. నా పేరు ఎత్తలేదు కానీ, అందరినీ ఉద్దేశించి అన్నారు కదా! చాలా మంది హీరోయిన్స్‌ లాగే నేనూ గ్లామర్‌గా ఉండాలనుకుంటున్నా’’

  • ఆడబిడ్డలకు క్షమాపణలు.. ఆ రెండు పదాలు వాడటం తప్పే: శివాజీ

‘‘మీరు మాత్రమే తెలివిగల వాళ్లు అనుకుంటే, సృష్టికర్తలైన మాకు ఇంకెంత తెలివి ఉంటుంది. మీ స్థాయి ఏంటో చూపించడానికి మేమంతా కంకణం కట్టుకుంటే ఏమవుతుంది. ప్రీ-రిలీజ్‌ వేడుకలో మీరు మాట్లాడిందే మీ అసలు స్వరూపం. ఇప్పుడు సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. హీరోయిన్స్‌ ఇబ్బంది పడుతున్నారని మీరు భావిస్తే, ‘ఒరేయ్‌ జంతువుల్లా అలా మీద పడటం ఏంటి? మహిళలను గౌరవించండి’ అని అక్కడకు వచ్చే యువకులకు చెప్పండి. దుస్తులు ఎలా వేసుకోవాలో ఎక్కడైనా రాసి ఉందా? శివాజీగారు మర్యాదగా చెబుతున్నా, మీరు త్వరగా మేలుకోండి. చాలా సందర్భాల్లో చాలా దాటుకుని వచ్చాను. నాకు మీ సపోర్ట్‌ అక్కర్లేదు. నన్ను నేను ఎలా రక్షించుకోవాలో తెలుసు. నన్ను బాగా చూసుకునే భర్త, స్నేహితులు ఉన్నారు. మీలాంటి వాళ్ల సాయం అస్సలు అక్కర్లేదు. ఇప్పుడు నాపై కామెంట్‌లు చేసిన వారితో పాటు ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన పెద్ద మనిషికి కూడా చట్టపరంగా నోటీసులు వస్తాయి’’ అని అన్నారు. మరోవైపు నటి నిధి అగర్వాల్‌ కూడా ఇన్‌స్టా వేదికగా పోస్ట్‌ పెట్టారు. ‘బాధితులపై తప్పు నెట్టడాన్నే అతి తెలివి అంటారు’ అంటూ పోస్ట్‌ పెట్టారు.

► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 రూల్స్.. క్షమాపణలు చెప్పిన కావేరి స్టార్‌ హీరో అల్లు అర్జున్‌ను (Allu Arjun) కలవాలంటే 42 నిబంధనలు తప్పకుండా పాటించాలంటూ బ్రాండ్‌ స్ట్రాటజర్‌ కావేరి బరూవా చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్‌ అయిన సంగతి తెలిసిందే.
  • ‘వారణాసి’లో ప్రకాశ్‌రాజ్‌ పాత్ర ఇదే.. వీడియో వైరల్‌ ‘వారణాసి’లోని తన పాత్రపై ప్రకాశ్‌రాజ్‌ స్పందించారు.
  • చిరంజీవి భుజానికి సర్జరీ.. కోలుకుంటున్నానంటూ పోస్ట్ అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) భుజానికి సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు.
  • నయినార్‌ నాగేంద్రన్‌ విమర్శలు.. స్పందించిన త్రిష ప్రముఖ నటుడు, టీవీకే అధ్యక్షకుడు విజయ్‌ (Vijay)ను విమర్శిస్తూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు నైనార్‌నాగేంద్రన్ (Nainar Nagendran) చేసిన విమర్శలు చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.
  • అల్లు వారి పెళ్లిసందడి.. తొలి శుభలేఖ చిరంజీవికే.. అల్లు వారి ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఇందుకు సంబంధించిన పనులను వేగవంతం చేశారు. ఈ క్రమంలో పెళ్లి పిలుపులు షురూ చేశారు.
  • బుచ్చిబాబుకు చరణ్‌ విషెస్‌.. ఫొటో పంచుకున్న హీరో దర్శకుడు బుచ్చిబాబుకు హీరో రామ్‌చరణ్‌ విషెస్‌ తెలిపారు. ఆయనతో కలిసి దిగిన ఫొటోను పంచుకున్నారు.
  • ‘ధురంధర్‌’లో విలన్‌ రోల్‌ మిస్సయారా?.. నాగార్జున క్లారిటీ..! కథానాయకుడిగానే కాదు, ప్రత్యేక పాత్రల్లోనూ మెరుస్తున్నారు నాగార్జున (Nagarjuna). ఇటీవల ‘కూలీ’లో ప్రతినాయకుడు సిమన్‌ పాత్రలో నటించి మెప్పించారు.
  • నేను ‘సాగర సంగమం’ తీశానని చెప్పలేదుగా: నాగవంశీ తాను నిర్మించిన కొత్త సినిమా ‘ఫంకీ’ ఫలితంపై నాగవంశీ స్పందించారు.
  • రూ.120 కోట్లకు ‘టాక్సిక్‌’ మూవీ హక్కులు: దిల్‌ రాజు ఏమన్నారంటే? ‘టాక్సిక్‌’ మూవీ హక్కుల గురించి ప్రశ్నించగా నిర్మాత దిల్‌ రాజు స్పందించారు.
  • మిమ్మల్ని కూడా హగ్‌ చేయాలనే వచ్చా.. కానీ..: నరేశ్‌ ఇటీవల ఓ వ్యవహారం తర్వాత సినిమా వేడుకల్లో మహిళలందరూ చీరలోనే కనిపిస్తున్నారని సీనియర్‌ నటుడు నరేశ్‌ అన్నారు.
  • ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌.. నామినేషన్స్‌ జాబితా ఇదే! ప్రేక్షకులతో పాటు, సినీ తారలు సైతం ఆసక్తిగా ఎదురుచూసే అవార్డుల వేడుక ‘ఫిల్మ్‌ఫేర్‌’. 
  • అప్పుడు నిరుత్సాహంలో ఉన్నా.. క్లిష్ట సమయంలో ‘ఫంకీ’: విశ్వక్‌సేన్‌ విశ్వక్‌సేన్‌ హీరోగా నటించిన లేటెస్ట్‌ మూవీ ‘ఫంకీ’. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఖమ్మంలో నిర్వహించారు.
  • అర్జున్‌ ఉదారత.. ఈ రియల్‌ హీరోలకు సన్మానం.. రూ.లక్ష కానుక ప్రముఖ నటుడు అర్జున్‌ (Arjun Sarja) మంచి మనసు చాటుకున్నారు.
  • అల్లు అర్జున్‌తో యాడ్‌ షూట్‌.. ఆ నిబంధనలు పాటించాలట! ఒకవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు వివిధ ఉత్పత్తులకు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తుంటారు సినీ నటులు.
  • విజయ్‌ దేవరకొండ పెళ్లికి వెళుతున్నారా?: తరుణ్‌ భాస్కర్‌ ఏమన్నారంటే విజయ్‌ దేవరకొండ పెళ్లిపై ప్రశ్న ఎదురవగా దర్శక, నటుడు తరుణ్‌ భాస్కర్‌ స్పందించారు.
  • ‘దృశ్యం 3’ క్లైమాక్స్‌.. ప్రతి ఒక్కరూ షాక్‌ అవ్వాల్సిందేనట! ‘దృశ్యం’ క్లైమాక్స్‌ ట్విస్ట్‌ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. దానికి కొనసాగింపుగా వచ్చిన ‘దృశ్యం 2’ ట్విస్ట్‌ గురించి అయితే మాటల్లో చెప్పాల్సిన పనిలేదు.
  • ‘రామాయణ’లో విక్రాంత్‌ మాస్సే?.. నటుడి రియాక్షన్‌ ఇదీ ‘రామాయణ’లో తాను భాగమైనట్లు వచ్చిన రూమర్స్‌పై నటుడు విక్రాంత్‌ మాస్సే స్పందించారు.
  • రాజమౌళి మరో ట్విస్ట్‌.. ‘వారణాసి’ మొత్తం ఐమ్యాక్స్‌ ఫార్మాట్‌ కాదట! ‘వారణాసి’ (Varanasi) మూవీ మొత్తం ట్రూ ఐమ్యాక్స్‌ ఫార్మాట్‌లో ఉండదని, కేవలం కీలక సన్నివేశాల్లో మాత్రమే ఆ అనుభూతిని ఆస్వాదిస్తారని దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి అన్నారు.
  • సినిమా టికెట్లు.. అలా మోసపోయా: విశ్వక్‌సేన్‌ ‘ఫంకీ’తో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు విశ్వక్‌సేన్‌. ఈ మూవీ ప్రమోషన్స్‌లో నాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ నవ్వులు పంచారు.
  • నా భార్య ఇంటి నుంచి గెంటేసింది: సరదా విషయం పంచుకున్న మాధవన్‌ కొవిడ్‌ సమయంలో తన ఇంట్లో జరిగిన ఒక విషయాన్ని నటుడు మాధవన్‌ తాజాగా గుర్తుచేసుకున్నారు.

English Translation

Anasuya Bharadwaj: Shivajigaru is polite.. he doesn't want your help at all: Anasuya

Eenadu icon
By Entertainment Team Published : 25 Dec 2025 00:03 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

Internet Desk: Actress Anasuya ( Anasuya Bharadwaj) reacted strongly to actor Sivaji's latest comments by actor Sivaji saying, 'I want to get a chance to clear your debt soon'. "I have come across many occasions. I don't want your support. "I know how to protect myself," he said. Shivaji's comments on the heroines' clothes caused a furore. Comments have been pouring in on the social media platform. In this regard, Shivaji held a press meet on Wednesday and tried to explain his comments, saying that he did not say anything to actress Anasuya and she got into it unnecessarily. Anasuya responded to this. A video was shared on social media to this effect.

''Recently I went to the opening of a clothing store. I answered the question asked by the reporters there. When I told him I felt it, I said it. Sitting alone today. Acting as a victim. His behavior is like a 'narcissist'. This is known as super intelligence. In a word, they speak with incompetence. That is why they label us as fake feminists. There is no real feminism. Everyone should have equal rights here. Nature can move forward only if there are men and women. Even in these times it is unwise to talk about clothing. Only those who lack self-control and live in insecurity seek to dominate others. Today, only one is sitting in front of the media after gathering sympathy. Unfortunately, that's what he wants.  I am also a heroine. I played the lead role in one or two movies. He says that heroines should dress well. Am I telling you what to wear? We are not children. We know our rights. Live us to our will. My name was not mentioned, but it was addressed to everyone! I want to be glamorous like many heroines''

  • Apologies to girls.. those two words are wrong to use: Shivaji

''If you are the only intelligent people, how much more intelligent will we creators be. What if we all wear bracelets to show what your level is? Your real self is what you talked about at the pre-release event. Now trying to get sympathy. If you think that heroines are in trouble, why are they falling like animals? Respect women' and tell the young people who come there. Is it written anywhere on how to dress? Shivajigaru politely says, wake up early. I have come across many occasions. I don't need your support. I know how to protect myself. I have a husband and friends who take good care of me. People like you don't need help at all. Now those who have made comments on me as well as the big man who spoke in the press meet will also get legal notices," he said. On the other hand, actress Nidhi Agarwal also posted on Instagram. They posted that 'Putting blame on the victims is the most intelligent'.

► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.

More

  • 42 rules to meet Allu Arjun.. Kaveri apologized It is known that the comments made by the brand strategist Kaveri Barua saying that to meet the star hero Allu Arjun (Allu Arjun) must follow 42 rules has gone viral on social media platform.
  • This is the role of Prakashraj in 'Varanasi'. Prakashraj reacts on his role in 'Varanasi'.
  • Chiranjeevi's shoulder surgery.. post saying he is recovering Top hero Chiranjeevi underwent shoulder surgery. He is currently recovering.
  • Nainar Nagendran's criticism.. Trisha responded It is known that BJP state president Nainar Nagendran's criticism of famous actor and TVK president Vijay has become a topic of discussion.
  • Allu's wedding buzz.. First good letter to Chiranjeevi.. Allu's house has started a wedding buzz. The work related to this has been expedited. In this order, the marriage calls have started.
  • Charan wishes for Buchibabu.. the hero shared the photo. Hero Ram Charan wishes to director Buchi Babu. He shared a picture with him.
  • Did he miss the villain role in 'Dhurandhar'?.. Nagarjuna Clarity..! Nagarjuna shines not only as the protagonist but also in special roles. Recently, he played the role of the villain Simman in 'Coolie'. Nagavanshi reacts to the result of his new movie 'Funky'.
  • Rs 120 Crores 'Toxic' Movie Rights: What is Dil Raju? When asked about the rights of the movie 'Toxic', producer Dil Raju responded. Senior actor Naresh said that after an affair recently, all women are seen in sarees at film festivals.
  • Filmfare Awards. Filmfare is an awards ceremony that is eagerly awaited by the audience as well as movie stars. 
  • Despite being depressed.. 'Funky' in difficult times: Vishwaksen Vishwaksen's latest movie is 'Funky'. The pre-release event of this movie was held in Khammam.
  • Arjun's generosity.. a tribute to these real heroes.. a gift of Rs. Famous actor Arjun (Arjun Sarja) showed a good heart.
  • Ad shoot with Allu Arjun.. those rules must be followed! Film actors act as promoters of various products while making films on the one hand.
  • Is Vijay Devarakonda going to get married?: What does Tarun Bhaskar think? Director and actor Tarun Bhaskar responded to a question about Vijay Devarakonda's marriage. Everyone was surprised by the climax twist of 'Drisham'. There is no need to say about the twist of 'Drisham 2' which came as a continuation.
  • Vikrant Massey in 'Ramayana'?.. This is the actor's reaction. Actor Vikrant Massey has responded to the rumors that he is a part of 'Ramayana'.
  • Rajamouli's another twist.. 'Varanasi' is not the entire IMAX format! Director S.S.Rajamouli said that the entire movie 'Varanasi' will not be in true IMAX format, only the key scenes will be enjoyed. Vishwaksen is ready to make noise with 'Funky'. Laughter was spread by recalling the memories of the movie promotions.
  • My wife ran out of the house: Madhavan shared a funny story. Actor Madhavan recently recalled something that happened in his house during the Covid.