Ukraine Drones: రష్యాను కుడుతున్న.. ఉక్రెయిన్ ‘కందిరీగ’లు!

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఇంటర్నెట్ డెస్క్: ఉక్రెయిన్‌పై రష్యా డ్రోన్లతో విరుచుకుపడుతోంది. పెద్దఎత్తున షాహెద్ ఆత్మాహుతి డ్రోన్లను ప్రయోగిస్తోంది. మరోవైపు.. వీటిని మార్గమధ్యంలోనే కట్టడి చేసేందుకు ఉక్రెయిన్ ఇంటర్‌సెప్టర్ డ్రోన్లను తయారు చేస్తోంది. తక్కువ ఖర్చుతో చిన్న పరిమాణంలో, ఎక్కువ ఎత్తులో ప్రయాణించేలా రూపొందిస్తోంది. ‘వైల్డ్ హార్నెట్స్’ అనే ఉక్రెయిన్ ఆయుధ తయారీ సంస్థ తాము నిర్మించిన ‘స్టింగ్’ డ్రోన్లు గగనతలంలో రష్యా షాహెద్‌లపై దాడులు చేసిన దృశ్యాలను ‘ఎక్స్’ వేదికగా విడుదల చేసింది.
ఉక్రెయిన్ నగరాలు, విద్యుత్ వ్యవస్థలే లక్ష్యంగా మాస్కో తన దాడులను తీవ్రతరం చేసింది. దీంతో ప్రత్యర్థిని నిలువరించేందుకు ఇంటర్‌సెప్టర్ డ్రోన్ల మోహరింపును కీవ్ ముమ్మరం చేసింది. సంప్రదాయ గగనతల రక్షణ క్షిపణుల ప్రయోగానికి మిలియన్ల డాలర్లు ఖర్చవుతుంది. ఈ నేపథ్యంలో తక్కువ ఖర్చుతో తయారయ్యే డ్రోన్లపై దృష్టి సారించింది. ‘‘చిన్నగా, స్తూపాకారంలో ఉండే ఈ స్టింగ్ డ్రోన్లు.. 11 కి.మీ ఎత్తువరకు చేరుకోగలవు. జెట్ ఇంజిన్‌తో నడిచే ‘షాహెద్’ల రేంజ్‌లో ప్రయాణించగలవు’’ అని హార్నెట్స్ సంస్థ చెబుతోంది. హార్నెట్స్ అంటే తెలుగులో కందిరీగలని అర్థం.
రష్యా మంగళవారం సైతం 650కుపైగా డ్రోన్లు, 30కిపైగా క్షిపణులను ఉక్రెయిన్‌పై ప్రయోగించింది. ఈ ఘటనల్లో నాలుగేళ్ల చిన్నారి సహా ముగ్గురు మృతి చెందారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థలే లక్ష్యంగా ఈ ఏడాదిలో ఇది తొమ్మిదో అతిపెద్ద దాడి అని అధికారులు తెలిపారు. యుద్ధం ముగింపుపై చర్చలు కొనసాగుతున్న వేళ ఈ దాడులు జరిగాయని, మారణహోమాన్ని ఆపాలనే విషయాన్ని పుతిన్ అంగీకరించలేకపోతున్నారని జెలెన్‌స్కీ విమర్శించారు.
► Read latest World Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 25 Dec 2025 00:06 IST
గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- శ్రీలంక సర్కారు కీలక నిర్ణయం.. ఎంపీల పెన్షన్లు రద్దు SriLanka: పొరుగు దేశం శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపీల పెన్షన్లను పూర్తిగా రద్దు చేసింది. దీనికి సంబంధించిన బిల్లు పార్లమెంట్‌లో మంగళవారం ఆమోదం పొందింది.
- ఆ యుద్ధ నౌకలు మునిగిపోవచ్చు! ట్రంప్‌నకు ఖమేనీ హెచ్చరికలు అమెరికా-ఇరాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కీలక వ్యాఖ్యలు చేశారు.
English Translation
Ukraine Drones: Destroying Russia..Ukraine 'wasps'!

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

Internet Desk: Russia with drones over Ukraine is bursting. Shaheed is launching suicide drones on a large scale. On the other hand, Ukraine is making interceptor drones to stop them in the middle of the road. Designing for small size, high altitude flight at low cost. "Wild Hornets" Ukrainian arms manufacturing company has released the footage of the "Sting" drones they built attacking Russian Shaheds in the air space as "X". With this, Kiev has intensified the deployment of interceptor drones to stop the opponent. Conventional air defense missiles cost millions of dollars to launch. In this background, the focus is on drones that are made at a low cost. These small, cylindrical sting drones can reach a height of 11 km. Hornets company says that they can fly in the range of 'Shahed' powered by a jet engine. Hornets means wasps in Telugu.
Russia launched more than 650 drones and more than 30 missiles on Ukraine on Tuesday. Three people, including a four-year-old child, died in these incidents. Power supply has been disrupted in many areas. Officials said it was the ninth major attack this year targeting Ukraine's power systems. Zelensky criticized Putin's inability to agree to stop the genocide, saying the attacks were carried out while talks on ending the war were ongoing. href="https://www.facebook.com/eenaduonline/" target="_blank" rel="noopener">Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 25 Dec 2025 00:06 IST
Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.
More
- Key decision of the Sri Lankan government.. Cancellation of pensions of MPs SriLanka: The government of the neighboring country Sri Lanka has taken a crucial decision. Pensions of MPs have been completely cancelled. The bill in this regard was approved in Parliament on Tuesday.
- Those warships may sink! Khamenei's Warnings to Trump Ayatollah Ali Khamenei, the supreme leader of Iran, made important comments while the tension between America and Iran continues.