సిరిసిల్ల టౌన్‌, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రం బీవైనగర్‌ బేతెస్థా బాఫ్టిస్ట్‌ చర్చి ఆవరణలో ప్రభుత్వ ఆధ్వ ర్యంలో మంగళవారం ముందస్తు క్రిస్మ స్‌ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఇన్‌చార్జి కలె క్టర్‌ గరిమా అగ్రవాల్‌ కేక్‌ కట్‌ చేసి అందరికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్‌ మాట్లాడు తూ క్రిస్మస్‌ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గానికి రూ.2లక్షలు మంజూ రు చేసిందన్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన చర్చీల్లో రంగులు, విద్యుత్‌ దీపాల అలంకరణల కు రూ.30వేలు మంజూరుచేస్తుందన్నారు. క్రిస్మస్‌ నేపథ్యం లో అందరు ప్రేమ, సంతోషం పంచుకోవాలని సూచిం చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకటేశ్వర్లు, మైనార్టీ సెల్‌ సంక్షేమ శాఖ అధికారి భారతి, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ స్వప్న, చర్చిల ఫాదర్స్‌, క్రైస్తవులు పాల్గొన్నారు.


English Translation

Sirisilla Town, December 23 (Andhra Jyoti): Pre-Christmas celebrations were grandly organized on Tuesday under the auspices of the government in the precincts of Bethestha Baptist Church in Biynagar district headquarters. Incharge Collector Garima Agrawal, who was present as the chief guest, cut the cake and wished everyone. Speaking on this occasion, the in-charge collector said that the state government has sanctioned Rs.2 lakhs to the constituency for the Christmas celebrations. He said that Rs. 30 thousand will be sanctioned for the decoration of colors and electric lamps in churches recognized by the government. It is suggested that everyone should share love and happiness in the background of Christmas. RDO Venkateshwarlu, Minority Cell Welfare Department Officer Bharti, SC Corporation ED Swapna, Church Fathers and Christians participated in this programme.