బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను నిరసిస్తూ ఢిల్లీ, కోల్‌కతాల్లో మంగళవారం భారీ నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఢిల్లీలో బంగ్లాదేశ్‌ హైకమిషన్‌ కార్యాలయం ముందు వందలాది నిరసనకారులు తమ ఆగ్రహాన్ని ప్రకటిస్తూ, ప్రతీ హిందూ రక్తపుబొట్టునూ లెక్కిస్తామని నినదించారు. కోల్‌కతాలో బీజేపీ అగ్రనాయకుడు సువేందు అధికారి సారథ్యంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. పరివార్‌ సంఘాల కార్యకర్తలు బంగ్లా దౌత్యకార్యాలయంవైపు వెళ్ళకుండా నిరోధించడానికి పోలీసులు లాఠీచార్జి చేయవలసి వచ్చింది. విజ్ఞాపనపత్రం సమర్పించిపోతామని హామీ ఇచ్చినా పోలీసులు తమపై దురుసుగా ప్రవర్తించారని బీజేపీ నాయకుల ఆరోపణ. మూకదాడి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన చంద్రదాస్‌ కుటుంబానికి ప్రతీ నెలా ఆర్థికసాయం అందచేయబోతున్నట్టు కూడా సువేందు అధికారి ప్రకటించారు. ఎన్నికలు ముగిసేవరకూ బంగ్లాదేశ్‌లో హింస తగ్గదని అక్కడి విశ్లేషకులు అంటుంటే, ఎన్నికలు సమీపిస్తున్న పశ్చిమబెంగాల్‌నూ సరిహద్దు ఆవలి పరిణామాలు ప్రభావితం చేయడం సహజం.

బంగ్లాతో దౌత్యానికి సమయం దాటిపోయిందని, ఇక శస్త్రచికిత్స చేయాల్సిందేనని అసోం ముఖ్యమంత్రి హేమంత బిశ్వశర్మ అంటున్నారు. జాతీయ మీడియాతో ఆయన చేసిన ఈ వ్యాఖ్యల్లో అంతరార్థం పొరుగుదేశంవారికి అర్థంకాకపోదు. భారత్‌ వ్యతిరేకతమీదే ఆధారపడిన బంగ్లాదేశ్‌ రాజకీయజీవులకు ఇక్కడి మాటలు, చర్యలు ఆక్సిజన్‌లాగా ఉపకరిస్తాయి. మరో రెండునెలల్లో ఎన్నికలు జరగబోతున్న ఆ దేశంలో పరిస్థితులు అతివేగంగా దిగజారిపోతున్నాయి. హసీనా వ్యతిరేక ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన షరీఫ్‌ ఉస్మాన్‌ హదీ హత్యతో ఇటీవల రేగిన హింస పలురీతులుగా విస్తరించింది. గార్మెంట్‌ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న హిందూ యువకుడు దీపు చంద్రదాస్‌ను హత్యచేసి, తగలబెట్టేశారు. భారత్‌కు భజన చేస్తున్నాయనీ, హసీనా అనుకూల సంస్థలన్న ఆరోపణతో కొన్ని పత్రికలమీద దాడులు జరిగాయి. ప్రతీ క్షణం ప్రాణభయంతో, ఆత్మరక్షణలో బతుకుతున్నామని మీడియా ప్రముఖులు వాపోతున్నారు. చంద్రదాస్‌ మతదూషణకు పాల్పడ్డాడన్న వాదనలో వీసమెత్తు నిజం లేదని నిర్థారణ అయిపోయింది. అతడిని రక్షించే ప్రయత్నం చేయకుండా ఫ్యాక్టరీ బయటకు తోసివేసి భక్షకులకు అప్పగించడం వంటి పరిణామాలు తీవ్ర ఆవేదన కలిగిస్తున్నాయి.


షేక్ హసీనా అత్యంత అప్రజాస్వామికంగా, నిరంకుశంగా దేశాన్ని ఏలినమాట నిజం. ఆమెకు వ్యతిరేకంగా ఉద్యమించి, ప్రభుత్వాన్ని కూల్చి, చివరకు ఆమె దేశం విడిచిపోయేవరకూ జూలై తిరుగుబాటుదారులు విశ్రమించలేదు. విదేశాల్లో ఉన్న యూనిస్‌ను తాత్కాలిక అధినేతగా తెచ్చిపెట్టుకున్న ఈ విద్యార్థిలోకం దేశాన్ని చక్కగా గాడినపెట్టుకొని, ప్రజాస్వామికంగా తీర్చిదిద్దుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ, షేక్‌ ముజ్‌బూర్‌ రహ్మాన్‌ మూలాలను చెరిపివేయడం మీద ఉన్న శ్రద్ధ పరిస్థితులను చక్కదిద్దుకోవడం మీద లేకపోయింది. అవామీలీగ్‌ను ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధించడంతోపాటు, ప్రత్యేకకోర్టు తీర్పుతో హసీనాను తిరిగి దేశంలోకి అడుగుపెట్టనివ్వకుండా జాగ్రత్తపడ్డారు. మరోపక్క ఆమె ప్రత్యర్థి ఖలేదాజియాను స్వదేశానికి రప్పించి, రాబోయే ఎన్నికల్లో ఆమె పార్టీ విజయానికి ద్వారాలు తెరిచారు. జమాతే ఇస్లామీ సహా వివిధ మతసంస్థలమీద ఉన్న నిషేధాన్ని ఎత్తివేసి, జైళ్ళలో ఉన్న ఆయా శక్తులను యూనిస్‌ ప్రభుత్వం వీధుల్లోకి వదిలేసిన ఫలితమే ప్రస్తుత అగ్గి. భారత్‌ వ్యతిరేకత ఆధారంగా ఎన్నికల్లో ఎక్కువస్థానాలు నెగ్గాలని కొన్ని పక్షాలు ప్రయత్నిస్తుంటే, మతవిద్వేషాలు రేపి పైచేయి సాధించాలని ఇస్లామిక్‌ శక్తులు చూస్తున్నాయి. పొరుగుదేశంలో అతివేగంగా మారుతున్న పరిణామాలకు జమాతే వంటి ఇస్లామిక్‌ సంస్థలు ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణం. యాభైమూడుశాతం ఓటర్లు వీటిపక్షాన ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి. ఆరునూరైనా ఫిబ్రవరి 12నే ఎన్నికలు నిర్వహిస్తామని యూనిస్‌ గట్టిగా చెబుతున్నారు. అనుకున్నట్టు జరుగుతాయా లేదా అన్నకంటే అప్పటివరకూ దేశం ఎంత హింస చవిచూడాల్సి వస్తుందన్నది ప్రశ్న. పొరుగుదేశం పరిణామాలు ప్రమాదకరంగా మారుతున్నాయి. హసీనాకోసం ఆ దేశాన్నే వదులుకున్నామన్న విమర్శలను అటుంచితే, అక్కడి ప్రమాదకర పరిణామాలపై అదుపులేని వ్యాఖ్యలు చేయడం, వారిని అవమానించేట్టుగా, రెచ్చగొట్టేట్టుగా మాట్లాడటం మనకు ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు.

ఇవి కూడా చదవండి...

Read LatestAP NewsAndTelugu News


English Translation

Massive protests were held in Delhi and Kolkata on Tuesday against the attacks on Hindus in Bangladesh. Hundreds of protesters protested in front of the Bangladesh High Commission office in Delhi, protesting that every drop of Hindu blood would be counted. A large-scale protest was held in Kolkata under the leadership of senior BJP leader Suvendu Adhikari. The police had to resort to lathi charge to prevent activists of Parivar Sanghas from marching towards the Bangla embassy. The BJP leaders alleged that the police misbehaved with them despite the assurance that they would submit the petition. The Suvendu official also announced that the family of Chandradas, who lost his life in the mob attack, is going to be given financial assistance every month. If the analysts there say that the violence in Bangladesh will not decrease until the elections are over, it is natural that the developments across the border will affect West Bengal as the elections are approaching.

Assam Chief Minister Hemanta Biswasharma says that the time for diplomacy with Bangladesh has passed and surgery is needed. Neighboring countries do not understand the meaning of his comments to the national media. The words and actions here are like oxygen for the Bangladeshi politicians who depend on anti-India. The situation is rapidly deteriorating in that country where elections are going to be held in two months. The violence that erupted recently with the killing of Sharif Usman Hadi, who played a key role in the anti-Hasina movement, has spread in many ways. Deepu Chandradas, a Hindu youth working in a garment factory, was murdered and burnt. There were attacks on some newspapers on the allegation of worshiping India and having pro-Hasina organizations. Media personalities complain that we live in fear of life and self-defense every moment. It has been confirmed that the claim that Chandradas committed blasphemy is not true. The consequences like throwing him out of the factory without trying to save him and handing him over to the cannibals are causing great pain. The July rebels did not rest until they rose up against her, toppling the government and finally leaving the country. Everyone thought that this student body, which brought Yunis from abroad as its temporary head, would shape the country well and make it democratic. But Sheikh Muzbur Rahman's focus on erasing the roots was not on improving the situation. Besides banning the Awami League from contesting the elections, they were careful not to allow Hasina to re-enter the country with the verdict of the special court. On the other hand, her rival Khaledazia was repatriated, opening the door for her party's victory in the upcoming elections. The current fire is the result of the Younis government lifting the ban on various religious organizations including Jamaat-e-Islami and releasing the forces in jails into the streets. While some parties are trying to win more seats in the elections on the basis of anti-India, the Islamic forces are looking to get the upper hand by spreading religious hatred. Islamic organizations like Jamaat are directly and indirectly responsible for the rapidly changing developments in the neighboring country. Surveys show that fifty-three percent of voters are in favor of these. Yunis insists that the elections will be held on February 12. The question is whether it will happen as planned or how much violence the country will have to suffer till then. Neighboring developments are becoming dangerous. Apart from the criticism that we abandoned the country for Hasina, it is not good for us to make uncontrollable comments on the dangerous developments there, to insult them and to provoke them. NewsAndTelugu News