హైదరాబాద్, డిసెంబర్ 23:ఉప సర్పంచ్‌లకు ఉన్న చెక్ పవర్‌ను రద్దు చేస్తున్న వార్తలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఈ వార్తల్లో మాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. కాసేపటిక్రితం.. రాష్ట్ర ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్‌ను రద్దు చేసినట్లు, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఒక సర్క్యూలర్ కూడా బాగా వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో వెంటనే స్పందించిన తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ.. ఉప సర్పంచ్‌ల చెక్ పవర్ రద్దు అంశంపై స్పందించింది. ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఈ అంశంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని క్లారిటీ ఇచ్చింది.
English Translation
Hyderabad, December 23:The Telangana government has reacted to the news of revoking the check power of deputy sarpanches. It is clear that there is no truth in this news. Some time ago, there were reports that the check power of the sub sarpanches of the state has been canceled and the state government has issued a special notification to this effect. A circular also went viral. In this context, Telangana Panchayat Raj Department responded immediately. It is clear that there is no truth in the news. It has been clarified that the government has not taken any decision on this issue so far.