తిరువనంతపురం:దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో జరుపుతున్న రెండో విడత ఎన్నికల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో భాగంగా కేరళ (Karala), ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) ముసాయిదా ఎన్నికల జాబితాను ఎన్నికల కమిషన్ మంగళవారంనాడు ప్రచురించింది. కేరళలో 24 లక్షల మంది పేర్లను ఎన్నికల జాబితా నుంచి తొలగించింది. ఛత్తీస్‌గఢ్‌లో 27 లక్షల మంది పేర్లను తొలగించింది. ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్‌లో ముసాయిదా జాబాతాను ప్రకటించామని, అన్ని రాజకీయ పార్టీలకు ప్రతులను షేర్ చేశామని ప్రధాన ఎన్నికల కమిషనర్లు ప్రకటించారు.


కేరళలో..

కేరళ ముసాయిదా ఓటర్ల జాబితాలో 2 కోట్ల 54 లక్షల 42 వేల 352 ఓటర్లు నమోదయ్యారు. 24 లక్షల 8 వేల 503 మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. వీరిలో 6,49,885 మంది ఓటర్లు మృతి చెందగా, 6,45,548 మంది ఓటర్ల చిరునామా గల్లంతైంది. 8,16,221 మంది రిజిస్టర్డ్ అడ్రస్ నుంచి శాశ్వతంగా షిఫ్ట్ అయ్యారు. అదనంగా 1,36,028 మంది ఓటర్లను డూప్లికేట్ ఎంట్రీల కారణంగా, 1,60,830 మంది ఓటర్లను ఇతర కేటగిరిల కింద గుర్తించి తొలగించారు. ఎన్నికలకు ముందు కేరళ ఎన్నికల జాబితాలో 2,75,50,855 మంది ఓటర్లు ఉండగా, 8.65 శాతం ఓటర్లను ఎస్ఐఆర్ అనంతరం తొలగించారు. ముసాయిదా జాబితాకు సంబంధించి ఎలాంటి అభ్యంతరాలు, సమస్యలు ఉన్నా 2026 జనవరి 22 వరకూ ఈసీ దృష్టికి తీసుకువచ్చే వెసులుబాటు కల్పించారు. ఫిబ్రవరి 21న తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తారు.


ఛత్తీస్‌గఢ్‌లో..

ఛత్తీస్‌గఢ్‌లో ఎస్ఐఆర్ అనంతరం ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేశారు. 27 లక్షల మందికి పైగా ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. మొత్తం 2 కోట్ల 12 లక్షల 30 వేల 737 ఓటర్లలో 1 కోటి 84 లక్షల 95 వేల 920 మంది ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫారంలు సమర్పించారు. జాబితా నుంచి తొలగించిన వారిలో 6,42,243 మంది ఓటర్లు మృతి చెందగా, 19,13,540 మంది బదిలీ కావడం, ఆబ్జెంట్ కావడం జరిగింది. 1,79,043 మంది పలు చోట్ల ఓటర్లుగా నమోదు చేసుకోవడంతో వారి పేర్లు తొలగించారు.


అండమాన్ నికోబార్ ఐలాండ్స్‌లో..

అండమాన్ నికోబార్ ఐలాండ్స్‌లో ముసాయిదా ఎన్నికల జాబితాను కూడా మంగళవారంనాడు ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. 2 లక్షల 46 వేల 390 మంది ఓటర్లు ముసాయిదా జాబితాలో చోటుచేసుకున్నారు. 64,014 మంది పేర్లను ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. రివిజన్ ఎక్సర్‌సైజ్‌కు ముందు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఎన్నికల జాబితాలో 3,10,404 మంది ఓటర్లు ఉన్నారు.


ఇవి కూడా చదవండి..

మరిన్నిజాతీయ,అంతర్జాతీయవార్తల కోసం క్లిక్ చేయండి


English Translation

Thiruvananthapuram:The Election Commission on Tuesday published the draft election list of Kerala (Karala) and Chhattisgarh (Chhattisgarh) as part of the Special Intensive Revision (SIR) process of the second round of election list being conducted in several states/UTs across the country. In Kerala, 24 lakh names were removed from the electoral roll. In Chhattisgarh, 27 lakh names were deleted. The Chief Election Commissioners have announced that the draft campaign has been announced on the website of the Election Commission and copies have been shared with all political parties.


In Kerala...

2 crore 54 lakh 42 thousand 352 voters have been registered in the Kerala draft voter list. The names of 24 lakh 8 thousand 503 people were removed from the voter list. Of these, 6,49,885 voters died and 6,45,548 voters lost their addresses. 8,16,221 people shifted permanently from their registered address. Additionally 1,36,028 voters were identified and removed due to duplicate entries and 1,60,830 voters under other categories. There were 2,75,50,855 voters in the electoral roll of Kerala before the election, 8.65 percent of the voters were removed after the SIR. If there are any objections and problems related to the draft list, they have been given the flexibility to bring it to the attention of the EC till January 22, 2026. Final voter list will be published on February 21.


In Chhattisgarh..

Draft voter list released after SIR in Chhattisgarh. More than 27 lakh voters were deleted from the list. Out of total 2 crore 12 lakh 30 thousand 737 voters, 1 crore 84 lakh 95 thousand 920 voters have submitted their enumeration forms. Out of those removed from the list, 6,42,243 voters died and 19,13,540 were transferred and absent. As many as 1,79,043 people were registered as voters at various places and their names were removed.


In Andaman and Nicobar Islands..

The Election Commission also released the draft electoral roll in Andaman and Nicobar Islands on Tuesday. 2 lakh 46 thousand 390 voters were included in the draft list. 64,014 names were removed from the voter list. There were 3,10,404 voters in the electoral roll of Andaman and Nicobar Islands before the revision exercise.


These are also Read..

MoreNational,Click for InternationalNews