ఈ నెల 10వ తేదీన తెలంగాణ బీజేపీ ఎంపీలతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమావేశమయ్యారు. వచ్చీ రాగానే ఆయన అత్యంత ఆగ్రహంతో మాట్లాడారు. ఎంపీల గుండెలు బితుకుబితుకుమన్నాయి. ఎంపీల్లో ప్రతి ఒక్కరికీ తగిలే విధంగా మోదీ తీవ్రంగా మందలించారు. ‘1984 లోక్‌సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా బీజేపీకి కేవలం రెండే సీట్లు లభించాయి. గుజరాత్ లోని మెహసానా సీటు నుంచి ఏకే పాటిల్ ఎన్నికయ్యారు. హనుమకొండ సీటు నుంచి జంగారెడ్డి గెలిచారు. నాడు రాజీవ్‌గాంధీ బీజేపీని హమ్ దో, హమారే దో అని ఎద్దేవా చేశారు. ఇవాళ గుజరాత్‌లో బీజేపీ పరిస్థితి ఎలా ఉన్నది, తెలంగాణలో పరిస్థితి ఎలా ఉన్నది?’ అని ఆయన ప్రశ్నించారు. ఆయన మాటలకు ఎవరికీ నోరు పెగల్లేదు. ‘మీ కంటే ఒవైసీ బెటర్’ అని మోదీ నిష్ఠూరమాడడం అన్నిటి కంటే అవమానకమని ఒక ఎంపీ అన్నారు.

తెలంగాణ ఎంపీలను మోదీ ఎందుకు టార్గెట్ చేశారు? ఎంపీలకు మోదీ క్లాస్ తీసుకునేందుకు అయిదు రోజుల ముందు పార్టీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ హైదరాబాద్ వెళ్లి వచ్చారు. పార్టీలో అంతర్గత వ్యవహారాల గురించి మాట్లాడుతున్న నేతలను ఆయన తీవ్రంగా మందలించారు. ‘ఉంటే ఉండండి. పోతే పోండి’ అని ఆయన హెచ్చరించారు. బహుశా సంతోష్ ద్వారా నివేదిక అందిన తర్వాతే మోదీ ఇలా విరుచుకుపడ్డట్లు సమాచారం.

మోదీ అంతటితో ఆగలేదు. పార్లమెంటు సమావేశాలు ముగిసేందుకు రెండు రోజుల ముందు బీఆర్ఎస్ ఎంపీలను పిలిచి మాట్లాడారు. ఆయన పిలిపించి మాట్లాడారా, లేక వారే కలుసుకునే ప్రయత్నం చేశారా అన్నది స్పష్టంగా తెలియదు. కరీంనగర్, వరంగల్ సమస్యల గురించి మాట్లాడేందుకు మంత్రుల ద్వారా అపాయింట్‌మెంట్ కోరితే మోదీ వెంటనే పిలిపించారని బీఆర్ఎస్ ఎంపీ ఒకరు చెప్పారు. విచిత్రమేమంటే మోదీ ఈ సమావేశంలో కేసీఆర్ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. తాను ఏదో సోషల్ మీడియాలో చూశానని, కేసీఆర్ బాగా బరువు తగ్గినట్లు కనపడ్డా కోలుకుంటున్నట్లు తెలిసిందని మోదీ వారికి చెప్పారు. కేసీఆర్ కోలుకోవడం చాల మంచి పరిణామం అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించినట్లు తెలిసింది.


కేసీఆర్ గురించి మోదీ మాట్లాడిన మరో మూడు రోజులకు కేసీఆర్ అనూహ్యంగా మీడియా ముందుకు వచ్చారు. తన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లు అన్నిటినీ తుత్తునియలు చేస్తూ దాదాపు గంటన్నరకు పైగా తన ఒరిజినల్ శైలిలో కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. దీనితో ఇంతకాలం స్తబ్దంగా ఉన్న బీఆర్ఎస్ కేడర్ చాలా ఉత్సాహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఏ విషయాలు ప్రస్తావించారు, అన్నీ నిజాలే మాట్లాడారా అన్నది ప్రశ్న కాదు. మళ్లీ విజృంభిస్తానని కేసీఆర్‌ చెప్పడం చర్చనీయాంశమైంది. జూబిలీహిల్స్ ఓటమి తర్వాత క్రుంగిపోయిన పార్టీకి మరోసారి ఆశలు రేకెత్తాయి.

తెలంగాణకు బీఎల్‌ సంతోష్‌ వెళ్లిరావడం, మోదీ తమ పార్టీ ఎంపీలను విమర్శించడం, బీఆర్ఎస్ ఎంపీలను పిలిచి మాట్లాడడం, ఆ తర్వాత కేసీఆర్ రంగప్రవేశం చేయడం... ఈ నాలుగు ఘటనలకు ఏమైనా అంతస్సంబంధం ఉన్నదా? అంతకు ముందే తెరవెనుక ఇంకా ఏమైనా పరిణామాలు జరిగాయా?

ఏమైనా ఒక విషయం మాత్రం స్పష్టం: మోదీ పూర్తిగా తెలంగాణపై దృష్టి కేంద్రీకరించారు. ఒకవైపు వచ్చే ఏడాది ప్రథమార్థంలో పశ్చిమబెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ఎన్నికలు జరగాల్సి ఉండగా, తెలంగాణపై మోదీ ఎందుకు దృష్టి కేంద్రీకరిస్తున్నారు? పక్కనే ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పరస్పర వ్యతిరేక విమర్శలు గుప్పించుకుంటుండగా, ఆ రాష్టాన్ని వదిలి తెలంగాణను పట్టించుకోవాల్సిన తక్షణ అవసరం ఏమున్నది? తెలంగాణలో రేవంత్‌రెడ్డి రోజురోజుకూ బలోపేతం కావడం, కాంగ్రెస్ అధిష్ఠానానికి కూడా ఆయన అన్ని విధాలా అండదండలివ్వడం మోదీ దృష్టికి వచ్చే ఉంటుంది. తెలంగాణ బీజేపీ నేతలు పరస్పరం ఘర్షించుకోవడం, స్థానిక పార్టీ అధ్యక్షుడు రామచందర్‌రావుపై ఆధిపత్యం చలాయించే ప్రయత్నం చేయడం మొదలైన వాటిని మోదీ హర్షించడం లేదు. కేసీఆర్ ఆరోగ్యం గురించి చాలా మందికి తెలియని సమాచారం మోదీకి ఉన్నప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో జరిగే పరిణామాలు, రేవంత్‌రెడ్డి ఎదుగుతున్న తీరు ఆయన గమనించకుండా ఉంటారా? అయితే మోదీ తదుపరి ఎత్తుగడ ఏమిటో ఎవరు అంచనా వేయగలరు? మోదీ గురి ఎక్కడో ఉన్నట్లు కనిపించినా అది ఎక్కడ తగులుతుందో ఆయనకు మాత్రమే తెలుసు. ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానానికి ఇలాంటి పరిణామాలు పట్టకపోవచ్చు కానీ రేవంత్‌రెడ్డి మాత్రం అంచనా వేయకుండా ఉంటారా?


ఈ పరిణామాలన్నిటి వెనుక ఒక విషయం స్పష్టమవుతోంది. కేంద్ర ప్రభుత్వంలోనే కాదు, భారతీయ జనతా పార్టీలో కూడా కర్త, కర్మ, క్రియ నరేంద్రమోదీ యే, సందేహం లేదు. ఆయనే అన్నీ. మోదీయే పార్టీ అధ్యక్షుడు, దేశ ప్రధానమంత్రి కూడా. బీజేపీలో సాధారణంగా పార్టీ జాతీయ అధ్యక్షుడి స్థానంలో ఉన్నవారు పార్టీ వ్యవహారాలను నిర్వహిస్తూ పార్టీ అంతర్గత సమావేశాల్లో కీలక నాయకులతో చర్చించి వ్యూహరచన చేసేవారు. లాల్ కృష్ణ ఆడ్వాణీ, అటల్‌బిహారీ వాజపేయి, మురళీమనోహర్ జోషి, కుశాభావు థాక్రే, జానా కృష్ణమూర్తి, వెంకయ్యనాయుడు, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరి వంటి హేమాహేమీలు పార్టీ అధ్యక్షులుగా ఉన్నంతవరకూ బీజేపీ కార్యాలయంలో ఒక రకమైన ప్రజాస్వామిక రాజకీయ వాతావరణం ఉండేది. వెంకయ్యనాయుడు పార్టీకి, ప్రభుత్వానికీ మధ్య వారధిలా ఉంటూ పార్టీని నిర్వహించేవారు. చాలా మంది కేంద్రమంత్రులు పార్టీ కార్యాలయానికి తమ శాఖలో తీసుకుంటున్న నిర్ణయాల గురించి తెలియజేసేవారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుల నియామకంలో జాతీయ అధ్యక్షులే నిర్ణయం తీసుకునేవారు. ‘ఒక చేతిలో ఎన్డీఏ ఎజెండా, మరో చేతిలో బీజేపీ జెండా’ ఇత్యాది నినాదాలను వెంకయ్యే రూపొందించేవారు.

అయితే 2020లో పార్టీ జాతీయ అధ్యక్షుడుగా జగత్ ప్రకాశ్ నడ్డా నియామకం తర్వాత పూర్తి నిర్ణయాధికారాలు మోదీ, అమిత్ షా చేతుల్లోకి వచ్చేశాయి. ఎవరిని ముఖ్యమంత్రిగా, రాష్ట్ర అధ్యక్షుడుగా నియమించాలనేది నడ్డా చేతుల్లో లేకపోవడమే కాదు, కనీసం ఆయనను సంప్రదిస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. రెండేళ్ల క్రితం బాగా పనిచేస్తున్న ఒక రాష్ట్ర అధ్యక్షుడిని అకస్మాత్తుగా తొలగించారు. ఆయన ఢిల్లీకి వచ్చి పార్టీ జాతీయ అధ్యక్షుడిని కలుసుకున్నారు. ‘నన్నెందుకు తొలగించారు సార్ చెప్పండి’ అని టీవీ చూస్తున్న ఆ జాతీయ అధ్యక్షుడిని అడిగారు. ఆయన ముఖం తిప్పకుండా రిమోట్తో ఛానెల్స్ మారుస్తూ. ‘నన్ను తొలగించమన్నారు.. నేను తొలగించాను. అంతే..’ అని జవాబిచ్చారట!


ఇదే విధంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులను, ముఖ్యమంత్రులను నియమించే విషయం మోదీ, అమిత్ షాలకు తప్ప మరెవరికీ తెలియని పరిస్థితి ఏర్పడింది. కొందరు బీజేపీ నేతలకు తమను ముఖ్యమంత్రులుగా నియమిస్తున్న విషయం చివరి వరకూ తెలియదట. ‘పార్టీ శాసన సభాపక్ష సమావేశంలో నా పేరు నిర్ణయిస్తారని ముందే తెలుస్తే షర్టు మార్చుకుని వచ్చేవాడిని కదా!’ అని ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఒక నేత ఆశ్చర్యపోయారట. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న 14 మంది బీజేపీ ముఖ్యమంత్రుల్లో జాతీయ స్థాయిలో తెలిసిన వారి పేర్లు తక్కువే.

ఆసక్తికరమైన విషయం ఏమంటే ఇప్పుడు జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడుగా కూడా ఎవరూ ఊహించని, ఇప్పటి వరకూ ఎవరికి తెలియని 45 సంవత్సరాల నితిన్ నబిన్‌ను నియమించారు. పార్టీలో ఆయన కంటే సీనియర్లు, అనుభవజ్ఞులైన నేతలు ఎందరో ఉన్నారు. ఇప్పుడు మోదీ, అమిత్ షాలు ఒక జూనియర్ నేత ద్వారా వారందరికీ పనులు అప్పగిస్తారన్నమాట. ఈ నెల 16న నితిన్ నబీన్‌ తన కొత్త పదవీ పార్టీ వర్కింగ్ అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించేందుకు వచ్చినప్పడు హోంమంత్రి అమిత్ షా స్వయంగా ఆయనకు స్వాగతం పలికారు. తద్వారా తాము నియమించిన వ్యక్తిని అందరూ ఆమోదించాల్సిందేనని నిక్కచ్చిగా సంకేతాలు పంపారు. అయినప్పటికీ ఒకరిద్దరు పార్టీ ప్రధాన కార్యదర్శులతో పాటు మరికొందరు నేతలు కొత్త అధ్యక్షుడికి స్వాగతం చెప్పకుండా ముఖం చాటేశారని సమాచారం. ఈ నియామకంపై జిల్లా అధ్యక్షులు కూడా కొందరు అసంతృప్తిగా ఉన్నట్లు తెలిసింది. కాని వారు ఏమి చేయగలరు?


బిహార్ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీ తనకు తిరుగులేదన్నట్లుగా వ్యవహరించడం స్పష్టంగా తెలుస్తోంది. ఆర్ఎస్ఎస్‌తో ఏకాభిప్రాయం కుదురక పార్టీ జాతీయ అధ్యక్షుడి నియామకం ఏడాదిగా వాయిదాపడుతూ వస్తోంది. నితిన్ నబీన్‌ నియామకంతో ఎవరినీ సంప్రదించాల్సిన అవసరం లేదనే సంకేతాలు మోదీ స్పష్టంగా పంపారు. ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను సంప్రదించకుండానే కేంద్రమంత్రి పంకజ్ చౌదరిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా నియమించారు. దీనిపై ఆదిత్యనాథ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమాచారం. ఒకరకంగా కాంగ్రెస్ సంస్కృతి బీజేపీలో ప్రవేశించింది. పార్లమెంటులో బిల్లుల విషయంలో కూడా మునుపెన్నడూ లేని రీతిలో దూకుడు కనిపిస్తోంది. ప్రతిపక్షాలు ఎంత తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నా రాష్ట్రాల్లో ఓటర్‌ జాబితాల సమగ్ర ప్రత్యేక సవరణ (సర్)ను ఉధృతంగా అమలు చేస్తున్నారు. త్వరలో కేంద్ర కేబినెట్‌లో అనేకమందికి ఉద్వాసన చెప్పనున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో ఆడ్వాణీ వివిధ రాష్ట్రాల్లో అరుణ్ జైట్లీ, అనంతకుమార్, వెంకయ్యనాయుడు, సుష్మాస్వరాజ్, గోవిందాచార్య, ఉమాభారతి వంటి నేతలను ప్రోత్సహించి జాతీయ స్థాయికి తీసుకువచ్చారు. ఇప్పుడు అలాంటి రెండోతరం నేతలెవరూ కనపడడం లేదు. ఆసక్తికరమైన విషయం ఏమంటే బీజేపీలో ఇతర పార్టీల్లో లాగా లుకలుకలు పైకి కనపడవు. నాయకుడు గెలిపిస్తున్నంతవరకూ ఎవరూ ఏమి మాట్లాడరు. మరి కొత్త సంవత్సరంలో పరిణామాలు ఎలా ఉంటాయో ఎవరు చెప్పగలరు?

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

ఇవి కూడా చదవండి...

Read LatestAP NewsAndTelugu News


English Translation

Prime Minister Narendra Modi met Telangana BJP MPs on 10th of this month. When he came he spoke very angrily. The hearts of the MPs sank. Modi reprimanded each and every one of the MPs. In the 1984 Lok Sabha elections, the BJP won only two seats across the country. AK Patil was elected from Mehsana seat in Gujarat. Jangareddy won from Hanumakonda seat. On that day, Rajiv Gandhi called BJP "Hum Do, Hamare Do". What is the situation of BJP today in Gujarat and how is the situation in Telangana?', he asked. No one could say anything to his words. An MP said that Modi's insistence that 'Owaisi is better than you' is more insulting than anything else.

Why did Modi target Telangana MPs? Five days before Modi's class for MPs, party general secretary BL Santosh had come to Hyderabad. He severely reprimanded the leaders who were talking about the internal affairs of the party. Stay if you are. If you go, go,' he warned. It is reported that Modi lashed out after receiving the report from Santhosh.

Modi did not stop there. BRS MPs were called and talked to two days before the end of the Parliament sessions. It is not clear whether he called and talked or they tried to meet. A BRS MP said that if an appointment was sought by the ministers to talk about the Karimnagar and Warangal issues, Modi would immediately call him. Strangely, Modi inquired about KCR's health in this meeting. Modi told them that he had seen something on social media and knew that KCR had lost a lot of weight but was recovering. It is known that the Prime Minister commented that KCR's recovery is a very good development.


KCR unexpectedly came before the media three days after Modi spoke about KCR. He lashed out at the Congress in his original style for more than an hour and a half, rubbishing all the rumors about his health. With this, it seems that the BRS cadre, which has been stagnant for a long time, is very excited. It is not a question of what things he mentioned, whether they were all true. KCR's statement that he will boom again has become a topic of discussion. After the defeat of Jubilee Hills, hope has once again been raised for the party that was depressed.

BL Santosh going to Telangana, Modi criticizing his party MPs, calling BRS MPs and then KCR entering the arena... Is there any connection between these four events? Were there any developments behind the scenes before that?

However, one thing is clear: Modi is fully focused on Telangana. On the one hand, when the elections in West Bengal, Kerala, Tamil Nadu and Puducherry are to be held in the first half of next year, why is Modi concentrating on Telangana? While the Congress Chief Minister and Deputy Chief Minister are criticizing each other in neighboring Karnataka, what is the urgent need to leave that state and take care of Telangana? Modi will notice that Revanth Reddy is getting stronger day by day in Telangana and he is supporting the Congress leadership in every way. Modi is not happy with Telangana BJP leaders clashing with each other, trying to dominate local party president Ramchandra Rao etc. When Modi has information about KCR's health that many people don't know, will he not notice the developments in the Telangana Congress and the way Revanth Reddy is growing? But who can predict Modi's next move? Modi's aim seems to be somewhere but only he knows where it will hit. The Congress leadership in Delhi may not have such consequences but will Revanth Reddy be unpredicted?


One thing is clear behind all these developments. Not only in the central government, but also in the Bharatiya Janata Party, there is no doubt that Narendra Modi is the doer, the deed, the deed. He is everything. Modi is the president of the party and also the prime minister of the country. In BJP, the national president of the party usually manages the affairs of the party and discusses and strategizes with the key leaders in internal meetings of the party. As long as Hemahemis like Lal Krishna Advani, Atal Bihari Vajpayee, Murali Manohar Joshi, Kusabhavu Thackeray, Jana Krishnamurthy, Venkaiah Naidu, Rajnath Singh and Nitin Gadkari were party presidents, there was a kind of democratic political atmosphere in the BJP office. Venkaiah Naidu used to manage the party as a bridge between the party and the government. Many Union Ministers used to inform the party office about the decisions taken in their department. National presidents are the decision makers in the appointment of party state presidents. They used to create slogans like 'NDA agenda in one hand and BJP flag in the other'.

However, after the appointment of Jagat Prakash Nadda as the party's national president in 2020, full decision-making powers came into the hands of Modi and Amit Shah. Not only is it not in Nadda's hands who should be appointed as Chief Minister and President of the State, there are suspicions that at least he is being consulted. A state president who was doing well two years ago was suddenly removed. He came to Delhi and met the national president of the party. He asked the national president who was watching TV, 'Tell me why I was removed sir'. He was changing channels with the remote without turning his face. They asked me to be fired.. I was fired. That's it..' was the reply!


Similarly, the matter of appointing the party's state presidents and chief ministers has come to a situation where no one but Modi and Amit Shah know about it. Some BJP leaders do not know till the end that they are being appointed as Chief Ministers. A leader who was elected as the chief minister wondered if he had known in advance that my name would be decided in the legislative assembly meeting of the party. Among the 14 BJP Chief Ministers across the country, few are known at the national level.

The interesting thing is that 45-year-old Nitin Nabin, whom no one expected and who was unknown until now, has been appointed as the National Executive President. There are many senior and experienced leaders in the party. It is said that now Modi and Amit Shah will hand over the work to all of them through a junior leader. On 16th of this month, Nitin Nabeen was welcomed by Home Minister Amit Shah himself when he arrived to take charge of his new tenure as the working president of the party. Thus they sent a clear signal that everyone should accept the person they appointed. However, it is reported that one or two party general secretaries and some other leaders did not welcome the new president. It is known that some district presidents are also unhappy with this appointment. But what can they do?


After the resounding victory in the Bihar elections, it is clear that Prime Minister Narendra Modi is acting like he has no back. The appointment of the party's national president has been postponed for a year due to lack of consensus with the RSS. With the appointment of Nitin Nabeen, Modi has sent a clear signal that there is no need to consult anyone. In Uttar Pradesh, Union Minister Pankaj Chaudhary was appointed as the party's state president without consulting Chief Minister Yogi Adityanath. It is reported that Adityanath is very unhappy about this. Somehow the Congress culture has entered the BJP. Even in the matter of bills in the Parliament, aggression is seen like never before. No matter how strongly the opposition parties are protesting, comprehensive special revision of voter lists (SIR) is being implemented vigorously in the states. There are whispers that many people will be sacked from the central cabinet soon. In the past, Advani promoted leaders like Arun Jaitley, Anantakumar, Venkaiah Naidu, Sushmaswaraj, Govindacharya and Uma Bharati in various states and brought them to the national level. Now there is no such second generation leader. The interesting thing is that in the BJP, the slurs are not visible like in other parties. No one talks as long as the leader is winning. And who can say what the developments will be in the new year?

A. Krishna Rao

(Andhra Jyoti Delhi Correspondent)

Also Read...

Read LatestAP NewsAndTelugu News