shambala movie: ‘శంబాల’.. అసలైన సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుంది: ఆది సాయి కుమార్

Eenadu icon
By Entertainment Team Published : 24 Dec 2025 00:08 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుతం ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ కావాలని, అది ‘శంబాల’లో కావాల్సినంత ఉన్నట్లు యువ కథానాయకుడు ఆది సాయికుమార్‌ అన్నారు. ఆయన కీలక పాత్రలో యుగంధర్‌ ముని దర్శకత్వంలో రూపొందిన హారర్‌.. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ఇది. అర్చన అయ్యర్, స్వసిక, రవి వర్మ కీలక పాత్రలు పోషించారు. డిసెంబరు 25న (shambhala release date) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ గురించి ఆది పంచుకున్న విశేషాలు మీకోసం..

క్లైమాక్స్‌ సినిమాకే హైలైట్‌..

‘‘శంబాల’ ఫస్ట్‌ స్టిల్‌ నుంచి సినిమాకు మంచి బజ్ ఏర్పడింది. టీజర్‌, ట్రైలర్‌లు సినిమాపై అందరిలోనూ ఆసక్తిని పెంచాయి. వీటిలో పొందిన అనుభూతికి మించి మీరు సినిమాలో చూస్తారు. ఇందులో అద్భుతమైన పోరాట సన్నివేశాలున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌ సీక్వెన్స్‌ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంది. 80వ దశకంలో వచ్చే కథ గనక.. లుక్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఇందులో ఎక్కువ వీఎఫ్ఎక్స్ షాట్స్ కూడా ఉండవు. శ్రీ చరణ్ పాకాల నేపథ్య సంగీతం సినిమాను మరింత ఎలివేట్‌ చేస్తుంది. ఈ సినిమాను విపరీతమైన చలిలో నైట్ షూట్ చేశాం. ఎంత కష్టమైనా కూడా అందరం ఇష్టంతో కలిసి పని చేశాం’’

‘కల్కి’ తర్వాత మంచి బజ్‌ వచ్చింది

‘‘శంబాల’ అనేది ఉందా? లేదా? అనేది ఎవరికీ తెలియదు. మన పురాణాల ప్రకారం శంబాలకి ఓ మంచి గుర్తింపు ఉంది. టైటిల్ చెప్పినప్పుడే నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. ఈ కథ విన్న కొన్ని రోజులకే ‘కల్కి’ రిలీజ్ అయింది. ఆ తరువాత శంబాల పేరు మరింత ఎక్కువగా ట్రెండ్ అయింది. ప్రస్తుతం ఆడియెన్స్‌కు అద్భుతమైన సినిమాటిక్ అనుభూతి కావాలి. ఇలాంటి జానర్‌లనే ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు’’

హిందీలోనూ విడుదల చేస్తాం

‘‘దర్శకుడు యుగంధర్‌కి సినిమా పట్ల చాలా ప్యాషన్ ఉంది. నిర్మాతలూ ఆ తరహా ఆలోచన కలిగిన వారే. అందుకే సినిమా మేకింగ్‌లో ఎక్కడా వెనకడుగు వేయలేదు. దీనిని హిందీలో విడుదల చేయబోతోన్నాం. ఇప్పటికే ప్రీమియర్లకు మంచి స్పందన వస్తోంది. ‘శంబాల’ని ప్రేక్షకులు హిట్ చేస్తే.. పార్ట్ -2 ప్లాన్ చేస్తాం (నవ్వుతూ). ప్రస్తుతం ‘ఈటీవీ విన్‌’కి ‘సబ్ ఇన్‌స్పెక్టర్ యుగంధర్’ చేశా. ఆ సినిమా చాలా బాగా వచ్చింది. త్వరలోనే ఆడియెన్స్ ముందుకు తీసుకువస్తాం’’

ఛాంపియన్‌ కూడా హిట్‌ కావాలి..

‘‘ఈ క్రిస్మస్‌కు మా మూవీతో పాటు ‘ఛాంపియన్‌’ కూడా వస్తోంది. శ్రీకాంత్ గారి ఫ్యామిలీతో మాకు మంచి అనుబంధం ఉంది. రోషన్‌తో నాకు మంచి పరిచయం ఉంది. మా క్రికెట్‌ టీంలో రోషన్ చురుకుగా ఉంటాడు.  ‘ఛాంపియన్’ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.


► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • ‘వరుస సినిమాలు చేయకపోతే కనిపించకుండా పోతావు’ అన్నారు: శివానీ తనకు 100 సినిమాలు చేసేయాలని లేదని, ప్రేక్షకులు తనకు ఇచ్చిన విలువను కాపాడుకోవడమే ముఖ్యమని అంటున్నారు కథానాయిక శివానీ నాగరం (Shivani Nagaram). అందుకే కథ, పాత్ర నచ్చితేనే సినిమాలు చేస్తున్నానని అన్నారు.
  • ‘వారణాసి’ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీనా?.. క్లారిటీ ఇచ్చిన రాజమౌళి ‘వారణాసి’ జానర్‌పై దర్శకుడు రాజమౌళి క్లారిటీ ఇచ్చారు.
  • వైబ్‌ మ్యాచ్‌ అయితేనే పెళ్లి.. జెన్‌-జీకి లావణ్య త్రిపాఠి సలహా ప్రెగ్నెన్సీతోనే ‘సతీ లీలావతి’ సినిమా మొత్తం పూర్తి చేశానని లావణ్య త్రిపాఠి అన్నారు. 
  • వీఎఫ్‌ఎక్స్‌.. తొందరపడితే ప్రేక్షకులు క్షమించడం లేదు: నిఖిల్‌ ‘‘పేర్లు చెప్పను కానీ, వీఎఫ్‌ఎక్స్‌ విషయంలో కొన్ని సినిమాలు తొందరపడ్డాయి. వాటికి చాలా నష్టం జరిగింది. ‘స్వయంభు’ (Swayambhu) చిత్రానికి అలా జరగకూడదనే ఆలస్యమైనా మంచి అవుట్‌ఫుట్‌తో వస్తున్నాం’’
  • ‘ప్రిన్స్‌’ అందుకే ఆడలేదు.. ‘ఫంకీ’ విషయంలో అలా జరగదు: కేవీ అనుదీప్‌ ‘‘మన సృష్టించే ప్రపంచం, పాత్రలు నిజ జీవితానికి దగ్గరగా ఉండాలి. హాస్య సన్నివేశాల్లో సహజత్వం ఉట్టిపడాలి. అప్పుడే ప్రేక్షకులకు చేరువ అవుతాం’’అంటున్నారు దర్శకుడు కేవీ అనుదీప్‌.
  • అందుకే.. మరో జన్మంటూ ఉంటే దర్శకుడిగా పుట్టను అని చెప్పాను: గుణశేఖర్‌ గుణశేఖర్‌ తెరకెక్కించిన లేటెస్ట్‌ మూవీ ‘యుఫోరియా’. శుక్రవారం విడుదల కానున్న సందర్భంగా చిత్ర బృందం ప్రెస్‌మీట్‌లో పాల్గొంది.
  • రాముడిగా కనిపిస్తాను..: ‘వారణాసి’లో తన పాత్ర గురించి చెప్పిన మహేశ్‌ ‘వారణాసి’లో నటించడానికి మొదట భయపడినట్లు మహేశ్‌ బాబు వివరించారు.
  • పొలిటికల్‌ ఎంట్రీపై రజనీకాంత్‌ నిర్ణయం.. కుమార్తె స్పందన ఇదీ! సౌందర్యా రజనీకాంత్‌ నిర్మించిన సినిమా ‘విత్‌ లవ్‌’. ఈ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో.. తన తండ్రి తీసుకున్న ఓ నిర్ణయంపై ఆమె స్పందించారు.
  • తరుణ్‌ భాస్కర్‌ ఆ సీన్‌లో నిజంగానే చెంపదెబ్బ కొట్టారు: ఈషా రెబ్బా కెరీర్‌లో ఒక్కసారైనా శాంతిలాంటి పాత్ర చేయాలని అనుకునేదాన్నని.. ‘ఓం శాంతి శాంతి శాంతిః’తో (Om Shanti Shanti Shantihi) ఆ కోరిక నెరవేరిందని అంటోంది ఈషా రెబ్బా (Eesha Rebba).
  • ‘ఖైదీ 2’ అప్పుడే.. ‘ఎల్‌సీయూ’ ఆగిపోలేదు..: లోకేశ్‌ కనగరాజ్‌ క్లారిటీ ‘ఖైదీ 2’పై వచ్చిన రూమర్స్‌పై దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ స్పందించారు.
  • పవన్‌కల్యాణ్‌తో మూవీపై క్లారిటీ.. టైటిలే విచిత్రంగా ఉంటుంది: అనిల్‌ రావిపూడి తన తర్వాతి చిత్రం కూడా 200శాతం ఎంటర్‌టైనరేనని దర్శకుడు అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) స్పష్టం చేశారు. ఆయన దర్శకత్వంలో చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా నటించిన తాజా మూవీ ‘మన శంకరవరప్రసాద్‌గారు’ (Mana Shankara Vara Prasad Garu).
  • అలాంటి లెక్కలు వేసుకోను! ‘గూఢచారి’, ‘మేజర్‌’ విజయాలతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిన నటి శోభితా ధూళిపాళ్ల. ఇప్పుడామె తొలిసారి తెలుగులో ‘చీకటిలో’ అనే ఓటీటీ చిత్రంతో అలరించేందుకు సిద్ధమైంది. దీన్ని శరణ్‌ కొప్పిశెట్టి తెరకెక్కించగా.. డి సురేశ్‌బాబు నిర్మించారు.
  • ‘యుఫోరియా’.. అందుకే నాపై కోపం వస్తుంది: గుణశేఖర్‌ తన కొత్త సినిమా ‘యుఫోరియా’ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో దర్శకుడు గుణశేఖర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
  • ‘మన శంకరవరప్రసాద్‌గారు’కు చిరంజీవి పారితోషికం.. అనిల్‌ ఏమన్నారంటే? చిరంజీవితో సినిమా అనుకున్న తర్వాత ఆయనకు తనకూ ఓ మినీ ఛాలెంజ్‌ జరిగిందని దర్శకుడు అనిల్‌ రావిపూడి అన్నారు.
  • తొలిరోజే సెట్‌లో ఏడ్చేశా.. ‘ ‘గతేడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’తో మరిచిపోలేని పండగ విజయాన్ని అందుకున్నా. ఇప్పుడు ‘అనగనగా ఒక రాజు’తో మరోసారి ప్రేక్షకుల మనసుల్ని దోచుకుంటాననే నమ్మకముంది’’ అంటోంది నటి మీనాక్షి చౌదరి.
  • అందుకేనేమో నయన్‌ ప్రమోషన్స్‌ చేశారు.. అది మెగా మ్యాజిక్‌: అనిల్‌ రావిపూడి సంక్రాంతికి వస్తే తిరుగు లేదనే ట్రాక్ రికార్డు ఉన్నా, అలా ముద్ర పడటం మంచిది కాదని, దాని వల్ల ఒత్తిడి పెరుగుతుందని అంటున్నారు క్రేజీ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి.
  • నేను కారణజన్మురాలిని.. ఫ్యాన్స్‌ అసోసియేషన్‌పై అనసూయ కామెంట్‌.. స్వేచ్ఛ మనకు మనం ఇచ్చుకునేదని, స్వాతంత్ర్యం బయట నుంచి వచ్చేదని నటి, వ్యాఖ్యాత అనసూయ అభిప్రాయపడ్డారు. ఇన్‌స్టా వేదికగా ఆమె అభిమానులతో ముచ్చటించారు.
  • మెగాస్టార్‌తో పోటీ.. నవీన్‌ పొలిశెట్టి ఏమన్నారంటే! తనకు సినిమాల్లోనే పెళ్లి చేసుకోవాలని రాసి ఉన్నట్లుందని నవీన్‌ పొలిశెట్టి సరదాగా అన్నారు.
  • దిష్టి తీయించుకోమని చిరంజీవికి చెప్పా: అనిల్‌ రావిపూడి ‘మన శంకరవరప్రసాద్‌ గారు’ సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌ గుంటూరులో జరగనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో అనిల్‌ రావిపూడి మాట్లాడారు.
  • ఆ రోల్‌కు సందీప్‌ రెడ్డి వంగాను అనుకున్నా.. కానీ: ‘పతంగ్‌’ డైరెక్టర్‌ ‘పతంగ్‌’ సినిమా దర్శకుడు పలు విశేషాలు పంచుకున్నారు.