INDW vs SLW: చెలరేగిన షెఫాలీ వర్మ.. శ్రీలంకను చిత్తుగా ఓడించిన భారత్‌

Eenadu icon
By Sports News Team Updated : 23 Dec 2025 21:56 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

విశాఖ: శ్రీలంకతో అయిదు టీ20ల సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌లో (India Women vs Srilanka Women) భారత్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. షెఫాలీ వర్మ (69*: 34 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్స్‌) చెలరేగడంతో 129 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 11.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. జెమీమా రోడ్రిగ్స్‌ (26), స్మృతి మంధాన (14), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (10) పరుగులు చేశారు. ఈ గెలుపుతో భారత్‌ 2-0 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. 

అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక.. భారత బౌలర్లు విజృంభించడంతో 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. ఆ జట్టులో హర్షిత (33) టాప్‌ స్కోరర్‌. చమరి ఆటపట్టు (31), హాసిని పెరీరా (22) పరుగులు చేశారు. భారత బౌలర్లలో శ్రీచరణి 2, వైష్ణవి శర్మ 2, క్రాంతి గౌడ్‌, స్నేహ్‌ రాణా ఒక్కో వికెట్‌ తీశారు. 

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు తొలి ఓవర్లోనే షాక్‌ తగిలింది. క్రాంతిగౌడ్‌ బౌలింగ్‌లో తొలి ఓవర్‌ చివరి బంతికి విష్మి గుణరత్నే బౌలర్‌కే క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగింది. మరోవైపు క్రీజులో ఉన్న కెప్టెన్‌ చమరి ఆటపట్టు (31: 3 ఫోర్లు, 2 సిక్స్‌లు).. క్రాంతి గౌడ్‌ వేసిన మూడో ఓవర్లో ఒక ఫోర్‌, సిక్స్, అరుంధతీ రెడ్డి బౌలింగ్‌లో ఒక ఫోర్‌, సిక్స్‌ కొట్టి దూకుడు ప్రదర్శించింది. అయితే స్నేహ్‌ రాణా వేసిన ఆరో ఓవర్‌ మూడో బంతికి ఆటపట్టు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరింది. వైష్ణవి వేసిన ఎనిమిదో ఓవర్లో హర్షిత హ్యాట్రిక్‌ ఫోర్లతో విరుచుకుపడింది. 10 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక రెండు వికెట్ల నష్టానికి 66 పరుగులతో నిలిచింది. బౌలర్లు పొదుపుగా బౌలింగ్‌ చేయడంతో ఆ జట్టు పరుగులు తీయడానికి కష్టపడింది. ఈ క్రమంలో శ్రీ చరణి బౌలింగ్‌లో హాసిని పెరీరా క్యాచ్‌ ఇచ్చి ఔటైంది. శ్రీ చరణి బౌలింగ్‌లోనే హర్షిత (33: 32 బంతుల్లో 4 ఫోర్లు) రనౌట్‌ అయింది. 18వ ఓవర్‌ తొలి బంతికి నీలాక్షి డిసిల్వా (2) ఔట్‌ కాగా, ఆతర్వాతి ఓవర్‌లో శ్రీచరణి బౌలింగ్‌లో కవిశా పెవిలియన్‌ చేరింది. ఇక చివరి ఓవర్‌లో శ్రీలంక మూడు వికెట్లు కోల్పోయింది. ఇందులో రెండు రనౌట్లు ఉన్నాయి. 

► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 23 Dec 2025 21:48 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • వచ్చాడో బేబీ యువరాజ్‌ అతడి దేశంలో క్రికెట్‌కు అనుకూలమైన పరిస్థితుల్లేవ్‌.. ఏడాదికి మూడు నెలలే ఆట. అలాంటి చోట నుంచి క్రికెట్లో ఎదిగి జాతీయ జట్టుకు ఆడడమే గొప్ప. అలాంటిది ప్రపంచకప్‌లో బరిలో దిగే అవకాశం వచ్చింది.
  • అజేయమేనా? హ్యాట్రిక్‌ విజయాలు.. గత మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారీ గెలుపు.. టోర్నీలో మరే జట్టుకూ సాధ్యం కాని విధంగా అత్యధిక నెట్‌ రన్‌రేట్‌.. ఇలా టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా హవా మామూలుగా లేదు.
  • ఆస్ట్రేలియా ఔట్‌ మాజీ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాకు షాక్‌. మంగళవారం జింబాబ్వే, ఐర్లాండ్‌ మధ్య గ్రూప్‌-బి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కావడంతో కంగారూ జట్టు టీ20 ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు ఓడిన ఆసీస్‌..
  • కివీసూ ముందుకు టీ20 ప్రపంచకప్‌లో సమీకరణాలతో పని లేకుండా న్యూజిలాండ్‌ సూపర్‌-8కు దూసుకెళ్లింది. మంగళవారం గ్రూప్‌-డి పోరులో కివీస్‌ 8 వికెట్ల తేడాతో కెనడాను చిత్తు చేసింది. మొదట కెనడా 4 వికెట్లకు 173 పరుగులు చేసింది.
  • కంగారు పడింది.. ఎన్నోసార్లు ఐసీసీ టోర్నీలు గెలిచిన ఆస్ట్రేలియా, ప్రపంచకప్‌ అనగానే టాప్‌ ఫామ్‌ను అందుకునే జట్టు టీ20 ప్రపంచకప్‌ నుంచి ఇంత త్వరగా నిష్క్రమించడం ఏమాత్రం ఊహించనిదే.
  • పాక్‌ నిలుస్తుందా? టీ20 ప్రపంచకప్‌ నుంచి ఇప్పటికే ఆస్ట్రేలియా నిష్క్రమించింది. మరో పెద్ద జట్టు భవితవ్యం బుధవారం తేలిపోనుంది. గత మ్యాచ్‌లో భారత్‌ చేతిలో గట్టి దెబ్బ తిన్న పాకిస్థాన్‌.. తన చివరి గ్రూప్‌ పోరులో నమీబియాను ఢీకొనబోతోంది.
  • ముగింపులో నేపాల్‌ మెరుపు పెద్ద జట్టు ఇంగ్లాండ్‌పై విజయానికి అత్యంత చేరువగా వెళ్లి, త్రుటిలో ఓడిన నేపాల్‌.. టీ20 ప్రపంచకప్‌ను అదిరే విజయంతో ముగించింది. గ్రూప్‌-సిలో తొలి మూడు మ్యాచ్‌లూ ఓడి సూపర్‌-8 రేసు నుంచి నిష్క్రమించిన ఆ జట్టు.. స్కాట్లాండ్‌తో మంగళవారం చివరి పోరులో 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
  • సంక్షిప్త వార్తలు (5) రంజీ ట్రోఫీలో జమ్ముకశ్మీర్‌ చరిత్రకు చేరువైంది. బ్యాటింగ్‌.. బౌలింగ్‌లో స్ఫూర్తిమంతమైన ప్రదర్శనతో సత్తాచాటుతున్న ఆ జట్టు రంజీ చరిత్రలో తొలిసారిగా ఫైనల్‌ దిశగా అడుగులేస్తోంది.
  • శర్మా.. మొదట నువ్వు సింగిల్‌ తీసుకో: సునీల్‌ గావస్కర్‌ టీమ్ఇండియా (Team India) టీ20 స్పెషలిస్ట్‌ బ్యాటర్‌ అభిషేక్‌ శర్మ (Abhishek Sharma) బ్యాటింగ్‌లో తడబడుతున్నాడు. టీ20 వరల్డ్‌కప్‌లో అతడు ఇప్పటి వరకు రెండు మ్యాచులు ఆడితే రెండింట్లోనూ డకౌట్‌గా వెనుదిరిగాడు.
  • యువరాజ్‌ సింగ్‌ పేరు.. శతకంతో రికార్డ్‌: కెనడా ‘యువీ’ సెన్సేషన్‌ Yuvraj Samra: ప్రస్తుతం పొట్టి ప్రపంచకప్‌లో ఓ కుర్రాడి పేరు నెట్టింట మార్మోగుతోంది. అతి చిన్న వయసులో టీ20 ప్రపంచకప్‌లో శతకంతో అదరగొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు.