Women Fire on Actor Sivaji Over His Comments on Women

‘‘చాలా బాగుందమ్మా (యాంకర్‌ని ఉద్దేశించి) ముఖ్యంగా నీ డ్రెస్‌ సెన్స్‌ చాలా బాగుంది. ఇంకో విషయం చెబుతున్నాను. హీరోయిన్లు ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసుకునిపోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తుందమ్మా... ఏమీ అనుకోవద్దు హీరోయిన్లందరూ. మీరు అనుకున్నా నాకు భయం లేదు. లాగి పెట్టి, పీకుతాం మనం. అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనూ, నిండుగా కట్టుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే  ‘సామాను’ కనబడే వాటిలో ఏమీ ఉండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన  చాలామంది చూసినప్పుడు నవ్వుతూ ఉంటారు... కానీ ‘దరిద్రపు... (రాయడానికి వీలు లేని పదం)’ ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకుంది? కాస్త మంచివి వేసుకోవచ్చు కదా... బాగుంటావు  అని అనాలనిపిస్తుంది కానీ అనలేం. అంటే... స్త్రీకి స్వేచ్ఛ లేదా అంటారు.

నేనిలా మాట్లాడితే... పెద్ద పెద్దోళ్లంతా సీక్త్రి స్వేచ్ఛ లేదని అంటారు. స్వేచ్ఛ అనేది అదృష్టం. మన గౌరవం మన దేశ భాషల నుంచే పెరుగుతుంది. ప్రపంచ వేదికల్లో కూడా చీర కట్టుకున్నవారికే విశ్వ సుందరి కిరీటం వచ్చింది’’ అంటూ సోమవారం సాయంత్రం జరిగిన ‘దండోరా’ సినిమా ప్రచార కార్యక్రమాల్లో శివాజీ చేసిన వ్యాఖ్యలు వివాదం అయ్యాయి. అమ్మాయిల దేహాన్ని ‘సామాను’ అనడం... ‘దరిద్రపు...’ అంటూ బహిరంగంగా అనడం పట్ల పాపులర్‌ యాంకర్‌–నటి అనసూయ, గాయని–అనువాద కళాకారిణి చిన్మయి, ప్రముఖ స్త్రీవాది కొండవీటి సత్యవతి స్పందించారు.

అలాగే, దర్శకురాలు నందినీ రెడ్డి, నిర్మాతలు స్వప్న దత్, సుప్రియ, నటి–నిర్మాత లక్ష్మీ మంచు, దర్శకురాలు నందినీ రెడ్డి, పాపులర్‌ యాంకర్‌ ఝాన్సీ తదితరులు శివాజీ నుంచి క్షమాపణ కోరాలంటూ ‘మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌’కి లేఖ రాశారు. ‘‘శివాజీ... ఏమిటా చెత్తవాగుడు’’ అంటూ సత్యవతి నిప్పులు చెరిగారు. ‘‘ఏంటా ధైర్యం? రాజకీయాల్లో ఉన్నామనా’’ అంటూ అనసూయ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘శివాజీ హీరోయిన్లకు అనవసరమైన సలహా ఇచ్చాడు. వాళ్ల సామాను కవర్‌ చేసుకోవడానికి చీరలు కట్టుకోమంటున్నాడు.

అతనేమో జీన్స్, హుడీలు వేసుకుంటాడు. మరి... భారతీయ సంప్రదాయాన్ని అనుసరించి, ధోతీలు కట్టుకోవచ్చుగా’’ అని చిన్మయి అతని మాటలను ఖండించారు.  ‘‘శివాజీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం... ఒకరి ప్రవర్తనతో గౌరవం లభిస్తుంది కానీ ధరించే దుస్తులతో కాదు... మహిళలు గౌరవించబడాలి’’ అంటూ ప్రముఖ హీరో మంచు మనోజ్‌ ఓ లేఖ వెలువరించారు. ఇలా శివాజీ చేసిన వ్యాఖ్యలకు పెద్ద ఎత్తున దుమారం రేగడంతో మంగళవారం సాయంత్రం ‘క్షమాపణ’ చెబుతూ ఆయన ఓ వీడియో విడుదల చేశారు.

శివాజీ మట్టెలు ధరించాలి: చిన్మయి
‘‘తెలుగు నటుడు శివాజీ నటీమణులను ‘దరిద్రపు... (రాయడానికి వీలు లేని పదం)’ వంటి అసభ్య పదజాలంతో దూషిస్తూ, వారు తమ ‘సామాను’ను కప్పుకోవడానికి చీరలు ధరించాలని అనవసరమైన సలహాలు ఇస్తున్నాడు. శివాజీ ఒక అద్భుతమైన సినిమాలో విలన్ గా నటించి, చివరికి ఇన్సెల్‌ బాయ్స్‌కు హీరోగా మారిపోయాడు. గమనించాల్సిన విషయం ఏంటంటే... వృత్తిపరమైన ప్రదేశాల్లో శివాజీ ‘దరిద్రపు...’ వంటి పదాలను ఉపయోగిస్తున్నాడు. శివాజీ జీన్స్, హుడీ ధరిస్తాడు. అయితే అతను ధోతీలు మాత్రమే ధరించి, భారతీయ సంస్కృతిని పాటించాలి... బొట్టు పెట్టుకోవాలి. అతను వివాహితుడని తెలిసేలా కంకణం, మెట్టెలు ధరించాలి. ఇక్కడ (ఫిల్మ్‌ ఇండస్ట్రీని ఉద్దేశించి కావొచ్చు) మహిళలను చూసే విధానం బాగాలేదు’’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా గాయని చిన్మయి స్పందించారు.

పరిశ్రమ మౌనం వహించడం ఆందోళనకరం

‘‘తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీలో పని చేస్తున్న వంద మందికిపైగా మహిళా నిపుణుల తరఫున మేము ఈ లేఖ రాస్తున్నాం’’ అంటూ నందినీ రెడ్డి, సుప్రియా యార్లగడ్డ, స్వప్న దత్, లక్ష్మీ మంచు, ఝాన్సీ లక్ష్మీ అంటూ ‘మా’కి  లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం ఈ విధంగా... 

‘మా’ సభ్యునిగా ఉన్న శివాజీ ‘దండోర’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో, బహిరంగ వేదికపై హీరోయిన్ల దుస్తుల గురించి చేసిన వ్యాఖ్యల్ని చాలా తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది. ఇటువంటి వ్యాఖ్యలు అనుచితమైనవి మాత్రమే కాదు... ముఖ్యంగా సినిమా పరిశ్రమ నుండి ప్రయోజనం పొందుతున్నవాళ్లూ సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులూ చేసినప్పుడు చాలా హానికరం. అతను ఉపయోగించిన ‘సామాన్లు, దరిద్రపు’ వంటివి అవమానకరమైన వి. అంతేకాదు... నటీమణులను బెదిరించినట్లు అయింది. ఇది బీఎన్‌ఎస్‌ 509 సెక్షన్‌ ప్రకారం మహిళలను అవమానించడంగా పరిగణించబడుతుంది. ఇది శిక్షార్హమైన నేరం. 

శివాజీ నుంచి బహిరంగ, షరతులు లేని క్షమాపణ కోరుతున్నాం.. లేకుంటే మేం తీవ్ర చట్టపరమైన మార్గాన్ని ఆశ్రయించాల్సి వస్తుంది. మహిళల దుస్తులు, చీర లేదా ఇతరత్రా డ్రెస్సింగ్‌పై ఆంక్షలు విధించడం ఆమోదయోగ్యం కాదు. ఆధునిక, సృజనాత్మక పరిశ్రమలో దీనికి స్థానం లేదు. మహిళలు నిజమైన బెదిరింపులను ఎదుర్కొంటున్నప్పుడు పరిశ్రమ మౌనం వహించడం కూడా ఆందోళనకరమైనది. నటీమణులు నిధీ అగర్వాల్, సమంత ఇటీవల మూక దాడులకు గురైనప్పుడు సామూహిక ఆగ్రహం, జవాబుదారీతనం లేకపోవడం ఆందోళనకరమైనది.

మహిళల భద్రతను గౌరవాన్ని ఉల్లంఘించినప్పుడు నిశ్శబ్ద ప్రతిస్పందన ఎందుకు ఉంది? క్షమాపణకు మించి మేము ‘మా’ నుండి స్పష్టమైన, జవాబుదారీతనం, చర్యను కోరుతున్నాం. ‘మా’ అసోసియేషన్‌ వెంటనే ఈ కింది చర్యలను రూపొందించి అమలు చేయాలని అభ్యర్థిస్తున్నాం.

కేవలం క్షమాపణలు మాత్రమే కాదు. ఈ విషయాలపై కూడా ‘మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ’ జవాబుదారీతనం వహిస్తుందని అనుకుంటున్నాము. అలాగే ‘మా’ అసోసియేషన్  ఈ క్రింది అంశాలను అమలు చేసేందుకు చర్యలు చేపడుతుందని ఆశిస్తున్నాం’’ అంటూ కొన్ని అంశాలను ప్రస్తావించారు. 
వాయిస్‌ ఆఫ్‌ ఉమెన్  ప్రతినిధులు – నందినీ రెడ్డి, సుప్రియా యార్లగడ్డ, స్వప్న దత్, లక్ష్మీ మంచు, ఝాన్సీలక్ష్మి

ఇదిలా వుంటే... శివాజీ క్షమాపణలు చెప్పిన నేపథ్యంలో ఈ వివాదం సద్దుమణిగింది అన్నట్లుగా ‘మా’ ఓ ప్రకటన విడుదల చేసింది.

నీ ఒంట్లో ఇంత కొవ్వేంది
ఏమిటా చెత్త వాగుడు శివాజీ? 
నువ్వేమో అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ 
మా మా గురించి అవాకులు చవాకులు పేలతావా 
నీ ఒంట్లో ఇంత కొవ్వేంది 
మా బట్టల గురించి వాగడానికి నువ్వెవడివి
చెప్పులు తేవాలా
చెర్నాకోలా తేవాలా
నిన్ను తన్ని తగలెయ్యడానికి
అడ్డమైన వాళ్ళూ చెడ్డీలేసుకుని బయలుదేరుతారు 
సిగ్గూ ఎగ్గూ వదిలేసి అయినా నువ్వెవడివి 
మా గురించి తీర్పులు చెప్పడానికి 
మర్యాదగా చెంపలేసుకుని సారీ చెప్పు 
గుంజీళ్ళు తీసి మోకాళ్ళ మీద కూర్చుని క్షమాపణ అడుగు 
ఇంకెప్పుడూ ఇలా వాగనని నీకు నువ్వు ప్రమాణం చేసుకో 
మా జోలికొస్తే ఖబడ్దార్‌ 
బండకేసి ఉతికి ఆరేస్తాం. 
– కొండవీటి సత్యవతి ఎడిటర్, భూమిక, స్త్రీవాద పత్రిక

అలా అనడానికి ఎంత ధైర్యం?: అనసూయ
శివాజీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అనసూయ ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక  ఇంటర్వ్యూలోని ముఖ్య విశేషాలు ...
నా లైఫ్‌లో హీరోల ఫ్యాన్స్‌ పేరుతో చేసిన ట్రోల్స్‌లో ముఖ్యంగా మూడు ఉన్నాయి. ఒకటి ‘అత్తారింటి దారేది’ (ఆ సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ని గ్రూపుతో చేయలేనని రిజెక్ట్‌  చేశారు), రెండోది ‘అర్జున్‌ రెడ్డి’ (ఈ మూవీ పబ్లిక్‌ ఫంక్షన్‌లో ఆడవాళ్లపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు), మూడోది అంతకుముందు ‘గంగోత్రి’ (ఆ సినిమాలో అల్లు అర్జున్‌ తనకు నచ్చలేదని చెప్పడం). అయితే అప్పట్లో మెచ్యుర్టీ లేకుండా, లౌక్యం లేకుండా మనసులో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడిన మాటలు అవి.

కానీ ఎవరి మీదా అయిష్టంతోనో, హిడెన్‌ ఎజెండాతోనో మాట్లాడిన మాటలు కావు. అప్పుడు నన్ను చాలా అగౌరవపరిచారు... పర్సనల్‌గా టార్గెట్‌ చేస్తూ, మెసేజ్‌లు పెట్టారు. అయితే నన్ను బాధపెట్టే విషయం ఏంటంటే... ఫ్యాన్స్‌ పేరుతో ట్రోల్స్‌ చేస్తున్నప్పుడు, అరాచకాలు చేస్తున్నప్పుడు ఎవరి ఫ్యాన్‌ అని వారు చెప్పుకుంటారో ఆ స్టార్‌ ఒక్క మాట చెబితే బాగుండేది. కానీ అలా ఎప్పుడూ జరగలేదు.

⇒ తొలి ప్రాధాన్యం కుటుంబానికే...
నాకు సినిమానే జీవితం కాదు... యాక్టింగ్‌ అంటే ఇష్టం... అంతే. నా తొలి ప్రాధాన్యం నా కుటుంబానికే. అందరూ ఆదర్శంగా తీసుకునేలా నా ఫ్యామిలీ లైఫ్‌ లీడ్‌ చేయాలనుకుంటాను. అందుకే కెరీర్‌కన్నా ఫ్యామిలీకి ప్రాధాన్యం ఇస్తాను. అవకాశాల కోసం ఎవరి మోచేతి నీళ్లు తాగాల్సిన అవసరం నాకు లేదు. ఒకవేళ అలా చేసి, అవకాశాలు తెచ్చుకుంటే నాకు తృప్తిగా ఉండదు.

⇒ రెబల్‌ అనుకున్నా ఫర్వాలేదు
పిరికిగా ఉండే స్త్రీలనే మగవాళ్లు టార్గెట్‌ చేస్తారు. బోల్డ్‌గా ఉండే అమ్మాయిల గురించి నెగెటివ్‌గా ప్రచారం చేస్తారు. ‘ఫేక్‌ ఫెమినిజమ్‌’ అని, ‘అటెన్షన్‌ సీకింగ్‌’లో భాగంగా ఇలా మాట్లాడుతున్నానని కూడా అంటారు. అయినా ‘నో ప్రాబ్లమ్‌’. నేను ఉమెన్‌ని కోరేది ఒక్కటే. పిరికిగా ఉండొద్దు. ధైర్యంగా బతకాలి. ‘రెబల్‌’ అనుకున్నా ఫర్వాలేదు... మన జోలికి ఎవరూ రారు.

⇒ ఆ జంతువులతో జాగ్రత్త
మనం అడవికి వెళ్లామనుకోండి... జంతువుల నుంచి మనల్ని మనం కాపాడుకోవడం కోసం జాగ్రత్తలు తీసుకుంటా కదా. అలాగే సమాజంలోని మగాళ్ల రూపంలో ఉండే కొన్ని జంతువులు ఉన్న చోట మనం (మహిళలు) ఉండాల్సినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మగవాళ్లల్లో మంచివాళ్లు చాలామంది ఉన్నారు. కానీ జంతువుల్లా ఉండేవాళ్లతో జాగ్రత్త. ఎందుకంటే వాళ్లు మనుషులు కాదు... సంస్కారం ఉండదు. జంతువులు కాబట్టి రెచ్చిపోతారు. అలాంటివాళ్లు ఉన్న చోట నా జాగ్రత్తలో నేను ఉంటాను.

 

⇒ మా అత్తగారింట్లో నన్ను అర్థం చేసుకున్నారు
మా ఆయన బిహారీ. మా పెళ్లప్పటికి నేను సినిమా ఇండస్ట్రీలో లేను. మా అత్తగారింట్లో ‘గూంఘట్‌’ (ముసుగు) కల్చర్‌ ఉంది. కానీ నేను అలా ముసుగు వేసుకోవాలని వాళ్లు ఆశించలేదు. నేను మోడ్రన్‌గా ఉంటాను. అయితే నా వస్త్రధారణకు, నా మనస్తత్వానికి ఏమాత్రం సంబంధం లేదని మా మామగారు గ్రహించారు. నన్ను కూతురిలా చూసుకుంటారు. మా ఆయన నాకు చాలా సపోర్టివ్‌గా ఉంటారు. మా ఇంట్లో నా చుట్టూ అలాంటి మగవాళ్లు ఉన్నారు. వేరే అమ్మాయిల జీవితాల్లోనూ ఇలా మంచి మగవాళ్లు ఉండాలన్నది నా ఆశ.

⇒ ధోతీ కట్టుకుని ఉండగలరా?
వస్త్రధారణ అనేది కంపర్ట్‌ కోసమే. ఇప్పుడు మగవాళ్ల దుస్తులు గురించి మాట్లాడుకుందాం. ఇంట్లో పూజలు చేసినప్పుడు పట్టు ధోతీ కట్టుకుని చేస్తారు కదా... పూజ అయిపోగానే తీసేసి, ‘షార్ట్స్‌’ వేసుకుంటారు. మరి... ధోతీ కట్టుకుని గంటలు గంటలు ఉండమంటే వాళ్లు ఉంటారా? ఉండరు... ఎందుకంటే ధోతీ వారికి సౌకర్యం కాదు. మరి అమ్మాయిలు వాళ్ల కంఫర్ట్‌ గురించి ఆలోచించకూడదా? అయినా చీర కట్టుకో అంటారు... అసలు చీర కంటే ‘ఎక్స్‌పోజింగ్‌’ వేరే ఏ డ్రెస్‌లో ఉంటుంది?

⇒ అసలు ఆ పదం ఏంటి?
‘సామాను’ అనే పదం ఏంటి? ఆడవాళ్ల శరీర భాగాలను అలాపోల్చడానికి ఎంత ధైర్యం ఉండాలి? పైగా బహిరంగ వేదిక మీద ‘దరిదప్రు....’, ‘సామాను’ అనే పదాలు వాడటం ఎంత ధైర్యం? రాజకీయాల్లో ఉన్నామనే ధైర్యమా? వాళ్లకి కూతుళ్లు లేరా? అయినా వేరేవాళ్లకు తగ్గట్టుగా మన వస్త్రధారణ ఉండాలా? నేనేదో రెబలియస్‌గా మాట్లాడటం లేదు. అమ్మాయిలు కుక్కిన పేనులా ఉండాలని సీక్రెట్‌ ఎజెండాతో కొందరు మగవాళ్లు రూల్స్‌ పెట్టారు. కానీ, అమ్మాయిలను గౌరవించే మగవాళ్లు మన సమాజంలో చాలామంది ఉన్నారు. ప్రపంచంలో మంచి భాగస్వాములుగా ఉండే మగవాళ్లు చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్లని చూసినప్పుడల్లా ఆ జంతువుల్లాంటి మగవాళ్లు ఇలా ఎందుకు ఉండటంలేదు అనిపిస్తుంటుంది.

⇒ అక్కడ క్రైమ్‌ రేట్‌ తక్కువ
అమ్మాయిలు ధరించే దుస్తులే వారికిప్రోటెక్షన్‌ అంటే... అస్సలు కానే కాదు. నా కుటుంబంలో ఉన్న మగవాళ్లు ప్రోటెక్ట్‌ చేస్తారు... కానీ రక్షణ పేరుతో కంట్రోల్‌ చేయాలనుకోలేదు. కొన్ని దేశాలు ఉన్నాయి... అక్కడ క్రైమ్‌ రేట్‌ చాలా తక్కువ. ధరించే దుస్తులతో సంబంధం లేదు. ఆ దేశాల్లో అందరికీ సమాన హక్కులు ఉంటాయి. మరి... మనకు ఎందుకీ పక్షపాతం?

నాకు ఇద్దరు మగపిల్లలున్నారు. ఒక తల్లిగా వాళ్లకి మంచి ప్రపంచం ఉండాలని కోరుకుంటాను. చేతకాని మగవాళ్లందరూ ఆడవాళ్లను హర్ట్‌ చేస్తుంటారు. అందుకే మా అబ్బాయిలు నాకంటే ధైర్యంగా ఉండాలని కోరుకుంటాను. ఎందుకంటే ధైర్యంగా ఉండే మగవాళ్లు హర్ట్‌ చేయాలనుకోరు. వాళ్లకి ఇన్‌సెక్యూర్టీ ఉండదు కాబట్టి. 


English Translation
Women Fire on Actor Sivaji Over His Comments on Women

''Very good (addressing the anchor) especially your dress. Sense is very good. I am telling you one more thing. If the heroines wear those clothes, we ourselves will have to experience poverty... don't think anything, all the heroines. I'm not afraid of what you think. We will drag and drop. That's a different matter. But your beauty lies in the sari and the richly draped clothes, so don't have anything that looks like 'baggage'. As much as they are worn, many people laugh when they see them... But why did the 'poor... (unable to write word)' wear such clothes? I want to say that I can wear something better... but I can't. That is... it is said that women do not have freedom.

If I speak like this... all the elders say that women do not have freedom. Freedom is fortune. Our respect grows from the languages ​​of our country. Shivaji's comments at the promotional events of the film Dandora on Monday evening, saying that only those who wear a sari on the world stage have been crowned Miss Universe. Popular anchor-actress Anasuya, singer-translation artiste Chinmayi, prominent feminist Kondaveeti Satyavathi reacted to the public calling of girls' bodies as 'baggage'... 'poor...'.

Also, director Nandini Reddy, producers Swapna Dutt, Supriya, actress-producer Lakshmi Manchu, director Nandini Reddy, popular anchor Jhansi and others have written a letter to 'Movie Artistes Association' seeking an apology from Shivaji. "Shivaji...what a scumbag" Satyavati burst into flames. "What courage? Are we in politics?'' Anasuya expressed her anger. Shivaji gave unnecessary advice to the heroines. He wants to tie sarees to cover their belongings.

He wears jeans and hoodies. Chinmai denied his words saying, "Dhotis can be tied as per Indian tradition".  "It is very sad that Shivaji made such comments... respect is earned by one's behavior but not by the clothes one wears... women should be respected" said popular hero Manchu Manoj in a letter. Shivaji released a video on Tuesday evening apologizing for his comments, which sparked a huge backlash.

Shivaji should wear mattelu: Chinmai
Telugu actor Shivaji insulted actresses with vulgar language like 'poor... (unspelling word)' and asked them to wear sarees to cover their 'baggage'. He is giving unnecessary advice. Sivaji played the villain in a brilliant film and eventually became the hero of the incel boys. It is worth noting that... in professional places Shivaji uses words like 'poor...'. Shivaji wears jeans and a hoodie. But he should wear only dhotis and follow the Indian culture... wear a blob. He should wear bracelets and bangles to show that he is married. The way women are treated here (perhaps referring to the film industry) is not good'', singer Chinmayi responded on social media. Dutt, Lakshmi Manchu, Jhansi Lakshmi wrote a letter to 'Ma'. The gist of the letter is as follows...

Shivaji who is a member of 'Maa' at the pre-release event of the movie 'Dandora', made comments about the heroines' clothes on a public platform should be taken very seriously. Such comments are not only inappropriate... especially harmful when made by those who benefit from the film industry and influence the society. He used 'goods, poor' like insulting v. Moreover... the actresses were threatened. This is considered insulting to women under Section 509 of the BNS. It is a punishable offence. 

We demand an open and unconditional apology from Shivaji.. otherwise we will have to resort to extreme legal action. Restrictions on women's dress, saree or otherwise, are not acceptable. It has no place in a modern, creative industry. The industry's silence when women face real threats is also alarming. The collective outrage and lack of accountability when actresses Nidhi Aggarwal and Samantha were recently mobbed is alarming.

Why is there a silent response when women's safety and dignity are violated? Beyond an apology we demand clear, accountable, action from 'us'. We request 'our' association to immediately formulate and implement the following measures.

Not just an apology. We hope that 'Movie Artist Association' will be held accountable for these matters as well. Also, we hope that our association will take steps to implement the following points. 
Voice of Women Representatives – Nandini Reddy, Supriya Yarlagadda, Swapna Dutt, Lakshmi Manchu, Jhanseelakshmi

If this... In the wake of Shivaji's apology, 'Ma' released a statement saying that the controversy was settled. 
Are you performing half-naked?
Who are you even if you leave it alone
To make judgments about us? 
– Kondaveeti Satyavati Editor, Bhumika, Stryvada Patrika

How dare you say that?: Anasuya
In the wake of Shivaji’s comments, Anasuya gave a special interview to ‘Sakshi’. One is 'Attarinti Daredi' (he rejected a special song in that movie as he could not do it with the group), the second is 'Arjun Reddy' (he condemned the comments he made on women in the public function of this movie), and the third was earlier 'Gangotri' (he said he didn't like Allu Arjun in that movie). But at that time, they were the words spoken as if they were in the mind without maturity and without secularism.

But they were not words spoken out of dislike for anyone or with a hidden agenda. Then they disrespected me a lot...personally targeting me and sending me messages. But what bothers me is... It would have been better if the star said a word about whose fan they claim to be when they are trolling and causing anarchy in the name of fans. But that never happened.

⇒ First priority is family...
For me film is not life... I like acting... that's all. My first priority is my family. I want to lead my family life so that everyone can take it as an example. That's why I give priority to family over career. I don't need to drink at anyone's elbow for opportunities. If I do that and get opportunities, I will not be satisfied.

⇒ It doesn't matter if you think rebel
Men target women who are shy. Bold girls are advertised negatively. It is also called 'fake feminism' and speaking like this as part of 'attention seeking'. But 'no problem'. All I want is a woman. Don't be shy. Live bravely. It doesn't matter if we think 'rebel'... no one will come to us.

⇒ Be careful with those animals
Suppose we go to the forest... we will take precautions to protect ourselves from animals. Also we (women) have to take some precautions when we have to be where there are some animals in the form of men in the society. There are many good men. But beware of animals. Because they are not human... there is no culture. Animals are so excited. Where there are such people, I am in my care. Even after our marriage I was not in the film industry. Our mother-in-law has a 'goonghat' (mask) culture. But they didn't expect me to wear a mask like that. I will be modern. But my father-in-law realized that my dress and my mentality had nothing to do with it. They treat me like a daughter. He is very supportive of me. I have such men around me in my house. My hope is to have good men like this in the lives of other girls.

⇒ Can you wear a dhoti?
Dressing is for comfort. Now let's talk about men's clothing. When doing puja at home, they wear a silk dhoti... when the puja is over, they take it off and wear 'shorts'. And...will they stay there for hours wearing dhoti? No... because dhoti is not comfortable for them. And girls should not think about their comfort? But it is called saree kattuko... What dress is more 'exposing' than the actual saree?

⇒ What is the original word?
What is the word 'samanu'? How dare you compare female body parts like that? Moreover, how dare you use the words 'poor...' and 'baggage' on a public platform? Are you brave enough to be in politics? Don't they have daughters? But should we dress according to others? I am not talking about something rebellious. Some men have made rules with a secret agenda that girls should be like dog lice. But, there are many men in our society who respect girls. There are many men in the world who are good partners. Whenever I see people like this, I feel why there are no men like these animals.

⇒ Crime rate is low there
The clothes worn by girls means protection for them... not at all. Men in my family protect...but don't want to control in the name of protection. There are some countries... where the crime rate is very low. It has nothing to do with the clothes worn. In those countries everyone has equal rights. And... Why are we biased?

I have two boys. As a mother I want them to have a better world. All helpless men hurt women. That's why I want our boys to be braver than me. Because brave men don't want to get hurt. Because they have no insecurity.