సుల్తానాబాద్, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు ఒక ఆశయాన్ని ఏర్పరచుకొని కష్టపడి చదివి తల్లిదండ్రుల ఆశయాలను సాకారం చేయాలని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల కోసం ఎమ్మెల్యే సొంత ఖర్చుతో 45 రోజుల పాటు మధ్యాహ్న భోజనాన్ని సోమవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతు ఉదయమే కళాశాలకు చేరుకుని సాయంత్రం వరకు ఉంటారని, వారు ఆక లితో అలమటించకుండా ఉండేందుకు మధ్యాహ్న భోజనం అందిస్తా నన్నారు. పరీక్షలు సమీపిస్తుండడంతో విద్యార్థులకు కడుపునిండా భోజనం పెట్టాలన్న అలోచనతో కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రిన్సిపాల్ నల్లా రాం చంద్రరెడ్డి, హైస్కూల్ హెచ్‌ఎం రత్నాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, గాజుల రాజమల్లు, పన్నాల రాములు, మాజీ సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ టి రమేష్, ఆధ్యాపకులు, స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు రవీందర్, తిరుపతి, గణేష్, నాయకులు పాల్గొన్నారు.
English Translation
Sultanabad, December 22 (Andhra Jyoti): MLA Vijayaramana Rao said that students should set an ambition, study hard and realize the ambitions of their parents. On Monday, the MLA started mid-day meal for the students of Sultanabad Government Junior College for 45 days at his own expense. The MLA spoke said that they will reach the college in the morning and stay till the evening and they will be provided with midday meal so that they don't starve. As the exams are approaching, the program has been taken up with the idea of giving full meals to the students. Principal Nalla Ram Chandra Reddy, High School HM Ratnakar Reddy, Market Committee Chairman Minupala Prakash Rao, Gajula Rajamallu, Pannala Ramulu, Former Single Window Chairman Srigiri Srinivas, Municipal Commissioner T Ramesh, Teachers, Sports Club President Secretaries Ravinder, Tirupati, Ganesh and leaders participated.