Ajay Devgn Drishyam 3 announces October 2 release date

హీరో మోహన్ లాల్, దర్శకుడు జీతూజోసెఫ్‌ కాంబినేషన్ లో రూపొందిన మలయాళ ‘దృశ్యం’ ఫ్రాంచైజీకి ఆడియన్స్ లో మంచి క్రేజ్‌ ఉంది. ఇటీవలే వీరి కాంబినేషన్ లోనే ‘దృశ్యం 3’ సినిమా చిత్రీకరణ పూర్తయింది. వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదల కానుంది. అయితే ‘దృశ్యం’ ఫ్రాంచైజీలోని సినిమాలు ఇతర భాషల్లోనూ రీమేక్‌ అవుతున్న సంగతి తెలిసిందే. హిందీలో అజయ్‌ దేవగన్  హీరోగా నటిస్తున్నారు.

కాగా, హిందీ వెర్షన్  ‘దృశ్యం 3’ షూటింగ్‌ మొదలైంది. అజయ్‌ దేవగన్  హీరోగా నటిస్తున్న ఈ ‘దృశ్యం 3’ చిత్రానికి అభిషేక్‌పాఠక్‌ డైరెక్టర్‌. టబు, శ్రియా శరణ్‌ ఇతరపాత్రల్లో నటిస్తున్నారు. అలోక్‌ జైన్ , అజిత్‌ అంథారే నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది అక్టోబరు 2న థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. ‘దృశ్యం 3’ తెలుగు వెర్షన్ లో వెంకటేశ్‌ హీరోగా నటించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ్రపారంభం కావాల్సి ఉంది.


English Translation
Ajay Devgn Drishyam 3 announces October 2 release date

Hero Mohanlal, director Jeetu Joseph The Malayalam 'Drishyam' franchise made in combination has a good craze among the audience. Recently, the shooting of the movie 'Drisham 3' was completed in their combination. The film will release next year. But it is known that the movies in the 'Drishyam' franchise are being remade in other languages ​​as well. Ajay Devgan is playing the hero in Hindi.

So, the shooting of the Hindi version of 'Drisham 3' has started. Abhishek Pathak is the director of this movie 'Drisham 3' starring Ajay Devgan as the hero. Tabu and Shriya Saran are acting in other roles. Produced by Alok Jain and Ajith Antare, this film will release in theaters on October 2 next year. Venkatesh will play the hero in the Telugu version of 'Drisham 3'. The shooting of this movie is about to start.