Sivakarthikeyan and Sreeleela Latest Movie Parasakthi New Release Date

సంక్రాంతి సినిమాల పోటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏడాది ముందుగానే కర్చీఫ్‌ వేయాల్సిందే. పొంగల్ బాక్సాఫీస్‌కు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. అందుకే స్టార్స్ అంతా సంక్రాంతి రిలీజ్‌కు సిద్ధంగా ఉంటారు. ఇప్పటికే టాలీవుడ్ నుంచి వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాల డేట్స్ ఖరారయ్యాయి. వీటిలో ది రాజాసాబ్ జనవరి 9న, మనశంకరవరప్రసాద్‌ గారు జనవరి 12న, భర్త మహాశయులకు విజ్ఞప్తి జనవరి 13న, నారీ నారీ నడుమ మురారి, అనగనగా ఒక రాజు జనవరి 14న థియేటర్లలో సందడి చేయనున్నాయి.

వీటికి తోడు కోలీవుడ్ సినిమాలు సైతం సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో నిలిచాయి. అయితే కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్, శ్రీలీల నటించిన పరాశక్తి కూడా పొంగల్‌కే రానుంది. ఇప్పటికే ఈ మూవీ రిలీజ్‌ తేదీని కూడా ప్రకటించారు. జనవరి 14న విడుదల చేస్తామని ఫిక్సయ్యారు. అయితే తాజాగా రిలీజ్ తేదీ విషయంలో బిగ్‌ ట్విస్ట్ ఇచ్చారు మేకర్స్. జనవరి 10న టాలీవుడ్ సినిమాలేవీ రిలీజ్‌ లేకపోవడంతో ఆ రోజే పరాశక్తి విడుదల కానుందని ప్రకటించారు. 

దీంతో ది రాజాసాబ్‌ రిలీజైన మరుసటి రోజే పరాశక్తి థియేటర్లకు రానుంది. విపరీతమైన పోటీ ఉన్న పొంగల్ బాక్సాఫీస్‌ వద్ద పరాశక్తికి థియేటర్లు ఎంతవరకు దొరుకుతాయో అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు కోలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద ఆసక్తికర పోటీ నెలకొంది. హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో విజయ్‌ నటిస్తున్న దళపతి విజయ్ జన నాయగన్‌ జనవరి 9న విడుదల కానుంది. కాగా.. ఈ సినిమాకు సుధా కొంగర దర్శకత్వం వహించారు.


English Translation
Sivakarthikeyan and Sreeleela Latest Movie Parasakthi New Release Date

There is nothing special to say about Sankranti movies competition. Kerchief should be done a year in advance. Pongal box office has a huge craze in Telugu states. That's why all the stars are ready for the Sankranti release. The dates of the movies for next year's Sankranti have already been finalized from Tollywood. Among these, The Rajasaab on January 9, Manashankaravaraprasad garu on January 12, Bhartar Mahashayyu Utjela on January 13, Nari Nari Naduma Murari, Aanganaga Ok Raju will hit the theaters on January 14.

Apart from these, Kollywood films also stood at the Sankranti box office. But Kollywood star Siva Karthikeyan and Srileela starrer Parashakti is also coming to Pongal. The release date of this movie has already been announced. It is fixed to be released on January 14. But the latest release date has been given a big twist by the makers. As no Tollywood movies were released on January 10, it was announced that Parashakti would be released on that day. 

With this, Parashakti will hit theaters the day after The Rajasaab release. At the highly competitive Pongal box office, it has become questionable how well Parashakti will get theaters. On the other hand, there is an interesting competition at the Kollywood box office. Dalapati Vijay Jana Nayagan starring Vijay under the direction of H. Vinod will release on January 9. While.. This movie is directed by Sudha Kongara.