ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 సందడి ఇప్పటికే మొదలైంది. ఇటీవలే దీనికి సంబంధించిన మినీ వేలం కూడా పూర్తయింది. ఐపీఎల్‌కి సంబంధించి ఏ వార్త అయిన ఇట్టే వైరల్ అవుతూ ఉంటుంది. తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్(DC) ఫ్రాంచైజీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతేడాది ఆ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అక్షర్ పటేల్‌(Axar Patel)ను ఈ సీజన్‌లో ఆ బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు సమాచారం.


గత సీజన్‌లో ఢిల్లీకి రిషభ్ పంత్ స్థానంలో అక్షర్ పటేల్‌కు కెప్టెన్సీ పగ్గాలు దక్కాయి. ఆ ఫ్రాంచైజీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టలేకపోయింది. మరోవైపు కేఎల్ రాహుల్ వంటి సీనియర్ ప్లేయర్లు జట్టులో ఉన్నాడు. దీంతో కేఎల్ రాహుల్(KL Rahul) నాయకత్వంలో జట్టును మరింత బలోపేతం చేసేందుకు ఢిల్లీ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. గతంలో పంజాబ్ కింగ్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కి కేఎల్ రాహుల్ నాయకత్వం వహించిన విషయం తెలిసిందే.


అక్షర్ పటేల్ విషయానికొస్తే..

అక్షర్ పటేల్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో అత్యంత కీలకమైన ఆటగాడు. గత ఆరేళ్లుగా జట్టుకు ప్రధాన బలంగా కొనసాగుతున్నాడు. ఒకవేళ కెప్టెన్సీ నుంచి తప్పించినప్పటికీ.. కీలక ప్లేయర్‌గా జట్టులోనే కొనసాగుతాడు. కెప్టెన్సీ ఒత్తిడి లేకుండా అక్షర్ కేవలం తన ఆల్‌రౌండ్ ప్రదర్శనపై దృష్టి పెడితే జట్టుకు మరింత ప్రయోజనం ఉంటుందని కోచింగ్ స్టాఫ్ భావిస్తున్నట్లు టాక్. కాగా ఈ విషయంపై ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.


English Translation

Internet Desk: IPL 2026 buzz has already started. Recently the mini auction was also completed. Any news related to IPL goes viral. A recent news is doing the rounds on social media. Delhi Capitals (DC) franchise seems to have taken a crucial decision. It is reported that Akshar Patel, who was the captain of the team last year, will be removed from that responsibility this season.


In the last season, Akshar Patel got the reins of captaincy in place of Rishabh Pant for Delhi. The franchise did not perform as expected. On the other hand, there are senior players like KL Rahul in the team. With this, the Delhi management hopes to strengthen the team under the leadership of KL Rahul. It is known that KL Rahul led Punjab Kings and Lucknow Super Giants in the past.


As for Akshar Patel...

Axar Patel is the most important player in the Delhi Capitals team. He has been the main strength of the team for the last six years. Even if he is removed from the captaincy, he will continue to be a key player in the team. It is said that the coaching staff feels that if Akshar just focuses on his all-round performance without the pressure of captaincy, the team will benefit more. It seems that the Delhi Capitals franchise will soon make an official announcement on this matter.