
Cm chandrababu: ఈ ఆరు విధానాలు..గేమ్ ఛేంజర్‌లు

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE
పరిపాలనలో వినూత్న విధానాలు క్షేత్రస్థాయి నుంచే రావాలని, ఇందుకు కలెక్టర్లే చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఈసారి కలెక్టర్ల సదస్సులో సీఎం కొత్త పద్ధతిని అనుసరించారు. వివిధ జిల్లాల్లో అమలవుతున్న వినూత్న విధానాల్ని పరిశీలించేందుకు కమిటీ నియమించి, వాటిలో ఆరింటిని ఉత్తమమైనవిగా ఎంపిక చేశారు. గురువారం సదస్సులో వాటి గురించి వివరించే అవకాశం ఆయా కలెక్టర్లకే ఇచ్చారు. ఈ ఆరు విధానాలు ‘గేమ్ ఛేంజర్‌లు’ అవుతాయని ముఖ్యమంత్రి ప్రశంసించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు అక్కడికి వెళ్లి వాటిని పరిశీలించి, వారి జిల్లాల్లోనూ అమలు చేయాలని ఆదేశించారు. మేలైన విధానాలు రూపొందించిన కలెక్టర్లే.. రాష్ట్రవ్యాప్తంగా అమలుకు ఛాంపియన్స్‌గా ఉంటూ, మార్గదర్శనం చేస్తారని తెలిపారు. వచ్చే సదస్సు నాటికి ఉత్తమ విధానాల సంఖ్య పదికి పెరగాలన్నారు. ఉత్తమ విధానాల వల్ల మనం నమూనాగా మారుతామని, ఇతర రాష్ట్రాల వారు వచ్చి ఇక్కడ నేర్చుకుంటారని తెలిపారు. ‘రిజిస్ట్రేషన్ల శాఖలో చాలా మార్పు వచ్చింది. మంగళగిరిలో పవన్ అనే వ్యక్తికి 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ చేయగా, అతనికి వచ్చిన మెసేజ్‌ను సీఎంవోకు పంపించారు’ అని సీఎం చదివి వినిపించారు. ఈ తరహాలో పనిచేస్తే దేశమంతా మన నుంచే నేర్చుకుంటుందని ఉదహరించారు.

లక్ష్యం:గిరిజన ప్రాంతాల్లోని ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు ప్రాథమిక దశ నుంచే పటిష్ఠ పునాది వేసి, మంచి గ్రేడ్ సాధించేలా చూడటం. ప్రతిభావంతులను సూపర్-50 పేరుతో ఎంపికచేసి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధం చేయడం. మార్గదర్శిని పేరుతో విద్యార్థులకు కెరీర్ గైడెన్స్.
అమలు విధానం:ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్థులకు ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్) పేరుతో ఈ కార్యక్రమం చేపట్టారు. తెలుగు, ఇంగ్లిష్, గణితంలో మే నెలలో పరీక్ష నిర్వహించి, ఫలితాల మేరకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. పదో తరగతి విద్యార్థులకు జిల్లాస్థాయిలో పరీక్షపెట్టి, సూపర్-50లో భాగంగా 50 మందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వారిలో ఒక విద్యార్థి ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో 577 మార్కులతో రాష్ట్రంలోని ఆశ్రమ పాఠశాలల విభాగంలో మొదటి స్థానంలో నిలిచాడు. 2023-24, 2014-25లో సూపర్-50లో శిక్షణ పొందిన విద్యార్థులంతా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు.
సీఎం సూచన:కుప్పం నియోజకవర్గంలో ‘విలువల బడి’ పేరుతో నిత్యం గంటన్నర పాటు పిల్లలకు స్ఫూర్తిదాయక అంశాలు బోధిస్తున్నారు. దాన్నికూడా అన్నిచోట్లా అమలు చేయాలి.
లక్ష్యం:విద్యార్థుల్లో వ్యక్తిగత శుభ్రత, జబ్బు పడకుండా చూడటం. మంచి అలవాట్లు, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెంచడం.
అమలు విధానం:ప్రతి తరగతి గదిలో ‘ముస్తాబు కార్నర్’ ఏర్పాటు చేశారు. వాటిలో అద్దం, దువ్వెన, తువాలు, సబ్బు, నెయిల్ కట్టర్, హ్యాండ్ వాష్, బకెట్ తదితరాలు ఉంచారు. ఇంటి దగ్గర సరిగ్గా తయారై రానివాళ్లను ముస్తాబు కార్నర్‌కి పంపించి ముఖం కడుక్కొని, తల దువ్వుకుని వచ్చాకే తరగతి గదిలోకి అనుమతిస్తున్నారు.
సీఎం సూచన:అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో ‘ముస్తాబు’ను ప్రవేశపెడతాం. మొత్తం 79 లక్షల మంది విద్యార్థులున్నారు. వారి తల్లిదండ్రులను కూడా కలిపితే సుమారు 2 కోట్ల మందిని ఇది ప్రభావితం చేస్తుంది.
లక్ష్యం:నాటు సారా తయారుచేసే కుటుంబాలతో ఆ వృత్తి మాన్పించి, ప్రత్యామ్నాయ ఉపాధి చూపించడం. గౌరవప్రదంగా బతికేలా చేయడం.
అమలు విధానం:గత పదేళ్లుగా సారా తయారీలో ఉంటూ, కేసులు ఎదుర్కొంటున్న 226 కుటుంబాలను ఎంపికచేసి కౌన్సెలింగ్ ఇచ్చారు. 40 కుటుంబాలు ముందుకురాగా, వారికి రూ.31.40 లక్షల రుణం ఇప్పించారు. వారు పశువుల పెంపకం, మాంసం దుకాణం, కుండల తయారీ వంటి యూనిట్లు పెట్టుకొని, నెలకు రూ.8-15 వేల ఆదాయం పొందుతున్నారు.
సీఎం సూచన:మాదకద్రవ్యాలకు బానిసలైన వారికి కూడా ఉపాధి అవకాశాలు చూపిస్తే, వ్యసనాల నుంచి బయటపడతారు.రైతులే ఛాంపియన్లు
లక్ష్యం:అందుబాటులో ఉన్న జల వనరులతోనే సాగు విస్తీర్ణం పెంచడం. వరికి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించడం. ఎరువులు, క్రిమిసంహారకాల వాడకం తగ్గించడం.
అమలు విధానం:727 పంచాయతీల నుంచి ఒక్కో ఛాంపియన్ ఫార్మర్‌ను ఎంపిక చేశారు. జిల్లాలోని మధ్య ప్రాంతంలో మొక్కజొన్న, పశ్చిమ ప్రాంతంలో వేరుశనగ, నిమ్మ, డెల్టాలో వరికి బదులు సీవీడ్, ఆక్వా, అరటి, పొలం గట్లపై ఆయిల్‌పాం సాగును ప్రోత్సహించారు. యాంత్రీకరణ కింద 45 పరికరాలను రాయితీపై అందిస్తున్నారు.
సీఎం సూచన:రైతులు మూణ్నాలుగు రకాల పంటలు వేస్తారు. వాటిని వేర్వేరు విభాగాలు పర్యవేక్షిస్తాయి. వాటి మధ్య సమన్వయం లోపిస్తోంది. ఆ సమస్యకు ఇదొక పరిష్కారం. జిల్లా కేంద్రంగా వ్యవసాయ పరికరాల బ్యాంక్ ఏర్పాటుచేసి, రైతులు వాడుకునేలా పర్యవేక్షించాలి.
లక్ష్యం:మధ్యాహ్న భోజన పథకంలో శుచి, శుభ్రత, నాణ్యత, ప్రమాణాలు పెంచడం. పిల్లలకు పోషకాహారాన్ని అందించడం. పర్యావరణహిత వంటశాలలు.
అమలు విధానం:మండలానికి ఒక ఆధునిక వంటశాల ఏర్పాటు చేశారు. అక్కడే సౌర విద్యుత్, బయోగ్యాస్‌పై ఆహార పదార్థాలు వండి, పాఠశాలలకు పంపిస్తున్నారు. వంటవారికి పౌష్టికాహార నిపుణులతో శిక్షణ ఇప్పించారు. ప్రకృతి సేద్యం చేస్తున్న రైతుల నుంచే సరకులు కొంటున్నారు. గతంలో రేషన్ బియ్యం సరఫరాకు వాడిన వాహనాలను స్కూళ్లకు ఆహార పదార్థాల సరఫరాకు వినియోగిస్తున్నారు. ప్రస్తుతం రోజూ 136 స్కూళ్లలోని పది వేల మందికి భోజనం అందిస్తున్నారు. మరో 33 వంటశాలలు నిర్మాణంలో ఉన్నాయి. జనవరి 26 నాటికి జిల్లాలోని అన్ని పాఠశాలలకు ఈ వంటశాలల నుంచే ఆహారం పంపిస్తారు. దీన్ని నీతి ఆయోగ్ మెచ్చుకుని వంటశాలల నిర్మాణానికి రూ.2.5 కోట్లు ఇచ్చింది. ఒక్కో వంటశాల నిర్మాణానికి రూ.62 లక్షలు ఖర్చవుతోంది.
సీఎం సూచన:వంట దినుసుల్లో అన్యపదార్థాల్ని తొలిగించేందుకు తితిదేలో వాడుతున్న ఏఐ ఆధారిత పరిజ్ఞానాన్ని పరిశీలించండి. పిల్లలకు ఆరోగ్య పరీక్షలు చేయించండి. అవసరమైన సప్లిమెంట్లను ఆహారం ద్వారా ఇవ్వాలి. రక్తహీనతను నివారించాలి.
రాష్ట్రమంతా వంటశాలలు:ఈ స్మార్ట్ కిచెన్ ప్రాజెక్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు బాగా నచ్చిందని, దీనికి కేంద్రం సహకరిస్తుందని విద్యాశాఖ మంత్రి లోకేశ్ తెలిపారు. కలెక్టర్లు క్లస్టర్ల వారీగా స్థలం గుర్తిస్తే, రాష్ట్రమంతా వంటశాలలు నిర్మిద్దామని సూచించారు.
లక్ష్యం:10(1), 1బి, ఆర్‌హెచ్ కాపీ, సీలింగ్, డీకేటీ, డిస్ప్యూట్ రిజిస్టర్లు, కోర్టు వివాదాలు వంటి రికార్డుల డిజిటలీకరణ. వాటన్నింటినీ ఒకే వెబ్‌సైట్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తేవడం.
అమలు విధానం:మాన్యువల్ రికార్డులన్నింటినీ కేవలం రూ.3 లక్షల ఖర్చుతో స్కాన్ చేసి ఆన్‌లైన్‌లో ఉంచారు. సర్వే నంబరు నమోదు చేయగానే డిజిటల్ కాపీలు అందుబాటులోకి వస్తాయి. ఫేజ్-2 ప్రాజెక్టు రూపొందిస్తున్నారు. ఇది రెవెన్యూ ఆఫీస్ టూల్. దీనిలో అధికారులు ఉత్తర్వులిచ్చిన వెంటనే వెబ్‌ల్యాండ్‌లో అప్‌డేట్ అవుతాయి.
సీఎం సూచన:రెవెన్యూ రికార్డుల్లో పారదర్శకత తెచ్చేందుకు ఇది దోహదం చేస్తుంది. రికార్డుల్ని ఎవరూ ట్యాంపరింగ్ చేయకుండా ఉపయోగపడుతుంది.
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- విలువలు, విధానాలపై కుటుంబ సభ్యులకు స్పష్టత ఉండాలి వ్యాపార సంస్థల నిర్మాణంలో అనుసరించాల్సిన విధానాలు, పాటించాల్సిన విలువలపై కుటుంబ సభ్యులందరికీ స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే.. కుటుంబ వ్యాపారాలు దీర్ఘకాలం మనగలుగుతాయని మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ శైలజా కిరణ్ అన్నారు.
- రాంబిల్లిలో మెగా ఔషధ కంపెనీ అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో మెగా ఔషధ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు సన్నాహాలు సాగుతున్నాయి.
- విలేజ్ టు విరాట్ మీరు క్రికెట్ బాగా ఆడతారా..? మీ ప్రతిభకు తగిన గుర్తింపు, వేదిక కోసం చూస్తున్నారా..? అయితే.. మీ కోసమే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ‘విలేజ్ టు విరాట్’ ట్యాగ్‌తో ‘రూరల్ టాలెంట్ సెర్చ్ ప్రోగ్రాం’కు రూపకల్పన చేస్తోంది.
- ‘ఆరెంజ్ ఎకానమీ’ అభివృద్ధికి త్వరలో వర్క్‌షాపులు సాంస్కృతిక, పర్యాటక, ఫిల్మ్ టూరిజం విభాగాల్ని సమన్వయం చేస్తూ ‘ఆరెంజ్ ఎకానమీ’ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆ శాఖల మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఇందుకోసం జూన్ లేదా జులై నెలల్లో ప్రత్యేక వర్క్‌షాపులు నిర్వహిస్తామని తెలిపారు.
- పర్యాటకానికి ‘స్వర్ణ’ కళ! వైకాపా హయాంలో నిర్లక్ష్యానికి గురైన రాష్ట్ర పర్యాటక రంగం తిరిగి గాడిలో పడుతోంది. కూటమి ప్రభుత్వం దానికి పారిశ్రామిక హోదా కల్పించి ప్రోత్సాహకాలు ప్రకటించడంతో పెద్ద ఎత్తున పెట్టుబడులొస్తున్నాయి.
- వైద్యులకు ఏఐ ప్రత్యామ్నాయం కాదు ‘వైద్యరంగంలో కృత్రిమ మేధ విప్లవాత్మక మార్పులు తెస్తోంది. వ్యాధుల నిర్ధారణ, ఆరోగ్య సేవల్లో క్లిష్ట సమస్యలకు ఏఐ టూల్స్ పరిష్కారాలు చూపిస్తున్నాయి.
- వైభవంగా నూకతాత జాతర అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని రాజయ్యపేటలో మంగళవారం నూకతాత జాతర వైభవంగా సాగింది. నూకతాత ప్రతిమకు పూజారులు, భక్తులు బోయపాడు తీరంలో ఉదయం స్నానం చేయించి పూజలు నిర్వహించారు.
- నందీశ్వరుడిపై సర్వాంతర్యామి సర్వాంతర్యామి అయిన సోమస్కందమూర్తి ఆయనకు ప్రియమైన నందీశ్వరుడిపై, జ్ఞానప్రసూనాంబిక అమ్మవారు కామధేనువుపై కొలువుదీరి శ్రీకాళహస్తి తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.
- శ్రీశైలంలో శాస్త్రోక్తంగా పూర్ణాహుతి శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం పూర్ణాహుతి, చండీశ్వరునికి అవబృధ స్నానం, వసంతోత్సవ క్రతువులు ఘనంగా నిర్వహించారు.
- తుది దశలో మూలపేట పోర్టు నిర్మాణం ఉత్తరాంధ్రకు గేమ్ ఛేంజర్‌గా శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేట వద్ద నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ పోర్టు పనులు చురుగ్గా సాగుతున్నాయి. నిర్మాణ పనులు 75 శాతం మేర పూర్తయినట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది.
- 12వ పీఆర్సీ ప్రకటించకపోతే ‘చలో సచివాలయం’ వేతన సవరణ కోసం 12వ పీఆర్సీ కమిషన్‌ను తక్షణమే నియమించి, ఐఆర్‌ను 29 శాతం ప్రకటించాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్.వెంకటేశ్వర్లు, కె.ఎస్.ఎన్.ప్రసాద్ డిమాండ్ చేశారు.
- అమరావతిలో క్యాట్ శాశ్వత బెంచ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వ చర్యలు అమరావతిలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ సర్క్యూట్(క్యాట్) శాశ్వత బెంచ్ ఏర్పాటుకు భూ కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించిందని ఆ సంస్థ తెలిపింది.
- బిల్‌గేట్స్ పర్యటన.. సీఎం విజన్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపు గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్‌గేట్స్ అమరావతి పర్యటన.. సీఎం చంద్రబాబు విజన్‌కు ప్రపంచ స్థాయి గుర్తింపని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు.
- 21 రోజుల్లో జనన మరణాల నమోదు తప్పనిసరి రాష్ట్రంలో జనన మరణాల నమోదుకు కొత్త నిబంధనలను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. 21 రోజుల్లో నమోదు తప్పనిసరి చేసింది.
- అమర్‌నాథ్ బృందాన్ని కలవని అంబటి! రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి, వైకాపా నేత అంబటి రాంబాబు తమ పార్టీకే చెందిన కొందరు నేతలను ములాఖత్‌లో కలిసేందుకు ఇష్టపడలేదు.
- ఏపీలో వేగవంతమైన అభివృద్ధి ‘ఎక్స్’లో బిల్‌గేట్స్ ఏఐ, సాంకేతికతను ఉపయోగించుకుని వ్యవసాయం, విద్య, ఆరోగ్యరంగాల్లో ఆవిష్కరణలతో ఆంధ్రప్రదేశ్ వేగవంతంగా అభివృద్ధి చెందుతోందని గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్‌గేట్స్ పేర్కొన్నారు.
- మూలుగ మార్పిడి చికిత్స ఎప్పటికి వస్తుంది? రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో మూలుగ (బోన్‌మారో) మార్పిడి చికిత్స అందుబాటులో లేకపోవడాన్ని హైకోర్టు ఆక్షేపించింది.
- అసెంబ్లీలో పని చేయని మైక్ సిస్టమ్ అసెంబ్లీలో మంగళవారం మైక్ సిస్టమ్ మొరాయించింది. శాసనసభలో ఉదయం 9 గంటలకు సమావేశాన్ని ప్రారంభించే సమయానికి ముందు సిబ్బంది పరిశీలించినపుడు మైకులు పని చేయడం లేదని గుర్తించారు. సాంకేతిక విభాగం హడావుడిగా సరిచేసే ప్రయత్నం చేసినా ఫలించలేదు.
- ప్రాజెక్టు కొట్టుకుపోయినా పట్టించుకోని జగన్ మామిడి రైతులకు కష్టం వస్తే స్థిరీకరణ నిధి ద్వారా నిధులు కేటాయించి ఆదుకున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందని తెదేపా ఎమ్మెల్యే కె.మురళీమోహన్ పేర్కొన్నారు. అందులో పూతలపట్టు నియోజకవర్గానికి అధిక మొత్తం నిధులు దక్కాయని చెప్పారు.
- వైకాపా పాలనలో ఇష్టారీతిన విద్యుత్తు రాయితీ విధానం వైకాపా హయాంలో ఆక్వా రంగంలో విద్యుత్తు రాయితీని ఇష్టానుసారంగా ఒక్కో రైతుకు ఒక్కో విధంగా అమలు చేశారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మండిపడ్డారు. వైకాపా సర్కారు దుర్మార్గాలను సరిచేయాల్సిన అవసరముందని పేర్కొన్నారు.
English Translation

Cm chandrababu: these six approaches..game changers

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE
Chief Minister Chandrababu suggested that innovative policies in governance should come from the field level and the collectors should take the initiative for this. This time the CM followed a new method in the collectors' conference. A committee was appointed to examine the innovative policies being implemented in different districts and six of them were selected as the best. The respective collectors were given an opportunity to explain about them in the conference on Thursday. The Chief Minister praised these six policies as 'game changers'. The Collectors of all the districts have been directed to go there and examine them and implement them in their districts as well. He said that the collectors who have formulated the best policies will be the champions and guide the implementation across the state. The number of best practices should increase to ten by the next conference. He said that due to the best policies, we will become a model and other states will come and learn from here. A lot has changed in the registration department. A person named Pawan was registered in Mangalagiri within 10 minutes and the message received by him was sent to the CMO,' the CM read out. He mentioned that if we work in this way, the whole country will learn from us.

Aim:To lay a solid foundation for the students of ashram schools in tribal areas from the primary stage and achieve good grades. to see To prepare talented people for state and national level competitive examinations by selecting them in the name of Super-50. Career guidance for students in the name of Margadarshini.
Implementation Procedure:This program was undertaken under the name of Foundation Literacy and Numeracy (FLN) for the students of Ashram schools. Examination in Telugu, English and Mathematics was conducted in the month of May and special training was given according to the results. District-level examination was given to tenth class students and 50 were given special training as part of Super-50. One of them stood first in Ashram schools category in the state with 577 marks in class 10 exams this year. All the students trained in Super-50 in 2023-24 and 2014-25 have passed first class.
CM's instruction:In Kuppam constituency, children are being taught inspirational things for an hour and a half regularly under the name of 'Viluwala Badi'. It should also be implemented everywhere.
Objective:To ensure personal cleanliness and disease prevention among students. To increase good habits, self-confidence and discipline.
Implementation method:A 'Mustabu Corner' has been set up in every classroom. Mirror, comb, towels, soap, nail cutter, hand wash, bucket etc. are kept in them. Those who do not prepare properly at home are sent to Mustabu Corner and are allowed to enter the classroom only after washing their face and combing their hair.
CM Instruction:We will introduce 'Mustabu' in all government and private schools. There are a total of 79 lakh students. It affects about 2 crore people including their parents.
Aim:To provide alternative employment to the families who make up the country. To live with dignity.
Implementation method:For the last ten years Sara has been in preparation and 226 families facing cases have been selected and given counselling. When 40 families came forward, they were given a loan of Rs.31.40 lakh. They have set up units like cattle rearing, meat shop, pottery manufacturing and are earning Rs.8-15 thousand per month. CM Suggestion: If drug addicts are shown employment opportunities, they will get rid of addictions. Farmers are the champions. Promotion of alternative crops to rice. Reducing the use of fertilizers and pesticides.
Implementation Procedure:One Champion Farmer was selected from 727 Panchayats. Instead of maize in the central part of the district, groundnut, lime and paddy in the western part, seaweed, aqua, banana and oil palm on the farm ridges were encouraged. Under mechanization, 45 equipments are being provided on concessional basis. They are monitored by different departments. There is lack of coordination between them. This is a solution to that problem. An agricultural equipment bank should be set up at the district center and monitored so that the farmers use it.
Aim:To increase cleanliness, cleanliness, quality and standards in the mid-day meal scheme. Providing nutrition to children. Environment Friendly Kitchens.
Implementation Method:A modern kitchen has been set up for the ward. Food is cooked there on solar power and biogas and sent to schools. The cooks were trained by nutritionists. They are buying goods from farmers who are doing natural farming. The vehicles used to supply ration rice in the past are being used to supply food items to schools. Currently, 10,000 people in 136 schools are being served meals daily. Another 33 kitchens are under construction. By January 26, food will be sent to all the schools in the district from these kitchens. NITI Aayog appreciated this and gave Rs.2.5 crores for the construction of kitchens. The cost of constructing each kitchen is Rs.62 lakhs.
CM Suggestion:Check out the AI-based technology being used in Tithide to remove foreign matter from cooking. Get children tested. Necessary supplements should be given through food. Anemia should be avoided.
Kitchens all over the state:The Education Minister Lokesh said that the Union Education Minister Dharmendra Pradhan liked this smart kitchen project and the Center will cooperate with it. It is suggested that kitchens will be set up across the state if the Collectors identify cluster wise locations.
Objective: Digitization of records like 10(1), 1B, RH copy, sealing, DKT, dispute registers, court disputes. Making them all available to the public through a single website.
Implementation Procedure:All manual records were scanned and put online at a cost of just Rs.3 lakh. Digital copies will be available on entering the survey number. Phase-2 project is being designed. It is a revenue office tool. It will be updated on the website as soon as the authorities issue an order.
CM Suggestion:This will help bring transparency in revenue records. It is useful without anyone tampering with the records.
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.
More
- Family members should be clear about values and policies. Margadarshi Chitfunds MD Shailaja Kiran said that when all the family members have a clear understanding of the values and procedures to be followed in the construction of business enterprises, family businesses can survive for a long time. Preparations are underway for setting up a mega pharmaceutical manufacturing industry in Rambilli mandal of Anakapalli district.
- Village to Virat Do you play cricket well? Are you looking for a platform and recognition for your talent? However.. Andhra Cricket Association (ACA) is designing a 'Rural Talent Search Program' with the tag 'Village to Virat' for you.
- Workshops for the development of 'Orange Economy' will be held soon. Kandula Durgesh, Minister of Culture, Tourism and Film Tourism, said that the aim of the government is to develop 'Orange Economy' by coordinating the departments of culture, tourism and film tourism. He said that special workshops will be held in June or July for this purpose.
- 'Golden' art for tourism! The state's tourism sector, which was neglected during Vaikapa's regime, is back in the groove. With the alliance government giving it industrial status and announcing incentives, large scale investments are being made.
- AI is not a substitute for doctors. Artificial intelligence is revolutionizing the field of medicine. AI tools are showing solutions to difficult problems in disease diagnosis and health services. On Tuesday, Nukatatha fair was held in Rajayyapet of Nakkapalli mandal of Anakapalli district. The priests and devotees bathed in the morning at Boyapadu beach and performed puja to the image of Nukatatha. Sarvantyami Somaskandamurthy appeared to the devotees on his beloved Nandishvara and Gnanaprasunambika on Kamadhenu while strolling through the streets of Srikalahasti in Koluvudiri. As part of the Mahashivratri Brahmotsavam in Srisaila Mahakshetra, Poornahuti, Avabrdha bathing and Vasantotsava rituals of Chandiswara were held on Tuesday. As a game changer for Uttarandhra, the greenfield port being constructed at Moolpet of Santabommali mandal of Srikakulam district is going on actively. The construction company announced that 75 percent of the construction work has been completed. UTF state president and general secretaries N.Venkateshwarlu and K.S.N.Prasad demanded that the 12th PRC commission be appointed immediately for wage revision and declare the IR as 29 percent. The organization said that the state government has already started the process of allotment of land for the establishment of a permanent bench of the Central Administrative Tribunal Circuit (CAT) in Amaravati. Gates Foundation Chairman Bill Gates's visit to Amaravati..Tedpa State President Palla Srinivasa Rao said that CM Chandrababu's vision is a world class recognition.
- Registration of births and deaths within 21 days is mandatory The government has brought new rules for registration of births and deaths in the state. Registration is mandatory within 21 days.
- Ambati who did not meet Amarnath team! Former minister and Vikapa leader Ambati Rambabu, who is a remand prisoner in Rajamahendravaram Central Jail, did not want to meet some leaders of his own party in Mulakat. Gates Foundation Chairman Bill Gates said that Andhra Pradesh is developing rapidly with innovations in agriculture, education and health sectors using AI and technology.
- When will transplant therapy come? The High Court objected to non-availability of bone marrow transplant treatment in government hospitals and medical colleges in the state.
- Non-functioning mic system in assembly. The mic system blared in the assembly on Tuesday. When the staff checked before the session started at 9 am in the Legislative Assembly, they found that the microphones were not working. The technical department hastily tried to fix it but to no avail. TDEPA MLA K. Murali Mohan said that Chandrababu should be credited with allocating funds through the stabilization fund when mango farmers face difficulties. He said that Puthalapattu Constituency got the highest amount of funds. Sarvepalli MLA Somireddy Chandramohan Reddy said that during the Vaikapa regime, electricity subsidy was implemented in the aqua sector according to the will of each farmer. Vaikapa stated that it is necessary to correct the wrongdoings of the government.