అమరావతి, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి):క్వాంటం టాక్’ కార్యక్రమం రేపు(సోమవారం) జరగనుంది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu)పాల్గొననున్నారు. వేలమంది టెక్ విద్యార్థులతో ఆన్‌లైన్‌లో సీఎం ‘క్వాంటం టాక్’లో మాట్లాడనున్నారు. రేపు ఉదయం 9:30 గంటలకు ఆన్‌లైన్ ద్వారా విద్యార్థులతో మాట్లాడనున్నారు సీఎం. దేశంలోనే తొలిసారి అతిపెద్ద క్వాంటం విద్యా సదస్సు ద్వారా విద్యార్థుల్లో నైపుణ్య కల్పనకు శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం.


క్యూబిట్, వైసర్ సంస్థలతో కలిసి ఏపీలో తొలిసారి క్వాంటం ప్రోగ్రామ్ నిర్వహిస్తోంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే ఈ రెండు సంస్థలతో ఒప్పందం చేసుకుంది ప్రభుత్వం. ట్రైనింగ్ ప్రోగ్రాంలో 50 వేల మంది విద్యార్థులు, ఐటీ రంగ ఉద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ క్వాంటం ప్రోగ్రామ్‌కు 51 శాతానికి పైగా మహిళా టెక్ విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో క్వాంటం టెక్నాలజీ అభివృద్ధికి సంబంధించిన దీర్ఘకాలిక రోడ్‌ మ్యాప్‌ను విద్యార్థులకు వివరించనున్నారు సీఎం చంద్రబాబు.


క్వాంటం టెక్నాలజీ లక్ష్యాల గురించి సదస్సులో ముఖ్యమంత్రి వివరించనున్నారు. రాష్ట్రంలో క్వాంటం నైపుణ్యాలను తీర్చిదిద్దేలా క్యూబిట్, వైసర్ సంస్థలతో కలిసి క్వాంటం ప్రోగ్రామ్ నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అత్యుత్తమ ప్రతిభ కనపర్చిన మూడువేల మందికి తదుపరి స్థాయి శిక్షణ, 100 మందికి ఐబీఎం, టీసీఎస్, సహా సీడాక్‌లలో శిక్షణ అవకాశాలు ఉన్నాయి. ఏపీ నుంచి లక్షలాది మంది క్వాంటం నిపుణులను తయారు చేయటమే లక్ష్యంగా క్వాంటం ప్రోగ్రామ్ జరగనుంది.


ఈ వార్తలు కూడా చదవండి...

Read LatestAP NewsAndTelugu News


English Translation

Amaravati, December 22 (Andhra Jyoti):The 'Quantum Talk' program will be held tomorrow (Monday). Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu (CM Chandrababu Naidu) will participate in this program. CM will talk to thousands of tech students online in 'Quantum Talk'. The CM will talk to the students online tomorrow at 9:30 am. The state government has launched the first ever quantum education conference in the country to create skills among the students.


The AP government is organizing the quantum program for the first time in AP along with Cubit and Visor. The government has already signed an agreement with these two companies. 50 thousand students and IT sector employees have registered in the training program. Over 51 percent of women tech students have registered for this quantum program. CM Chandrababu will explain the long-term road map for the development of quantum technology in Andhra Pradesh to the students.


The Chief Minister will explain the goals of quantum technology in the conference. The state government is running a quantum program in association with Qubit and Visor to develop quantum skills in the state. 3,000 people who have shown outstanding talent have the next level of training and 100 people have training opportunities in IBM, TCS, etc. Quantum program will be conducted with the aim of producing lakhs of quantum experts from AP.


Also read this news...

Read LatestAP NewsAndTelugu News