Rich Dad Poor Dad Author Robert Kiyosaki 10 Economics Lesson

ప్రపంచ ఆర్థిక అంశాలు, పెట్టుబడులపై సూచనలు ఇచ్చే రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి'.. తన ఎక్స్ ఖాతాలో యాక్టివ్‌గా  ఉంటూ.. ధనవంతులు అవ్వడం ఎలా?, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనే విషయాలను పేర్కొంటూ ఉంటారు. ఇందులో భాగంగానే.. ఈ మధ్య కాలంలో కొన్ని ఆర్ధిక పాఠాలను వెల్లడించారు.

👉కియోసాకి మొదటి సూచన చమురు, సహజ వాయువు వంటి ఇంధనాలపై పెట్టుబడులు పెట్టడం. కృత్రిమ మేధస్సులో వేగవంతమైన పురోగతి, ప్రపంచ ఇంధన డిమాండ్‌ను గణనీయంగా పెంచుతుందని, సాంప్రదాయ ఇంధన ఉత్పత్తిదారులు ప్రయోజనం పొందుతారన్న ఆయన తాను ఇంధన రంగంలోనే పెట్టుబడుతున్నట్లు వెల్లడించారు.

👉ఓడిపోయినవారు ఎప్పుడూ పాత ఆలోచనలు పట్టుకుంటారు. విజేతలా ఆలోచించడం ప్రారంభించండి. డబ్బును పట్టుకోవడం మానేసి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పుడు విజేతగా మారండి. 1996లో ప్రచురించబడిన రిచ్ డాడ్ పూర్ డాడ్‌లో.. నేను “పొదుపు చేసేవారు ఓడిపోతారు” అని హెచ్చరించాను.

👉ఆర్థిక సంక్షోభానికి చిక్కకుండా ఉండాలంటే ‘నెట్ వర్క్ మార్కెటింగ్’లో చేరాలని సూచించారు. ఆర్థిక రచయిత రాబర్ట్ కియోసాకి నెట్ వర్క్ మార్కెటింగ్ వ్యాపారాల ద్వారా వ్యవస్థాపక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా ప్రపంచ ఆర్థిక పతనానికి సిద్ధం కావాలని అన్నారు.

👉ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పుడు ధనవంతులు ఎలా జీవిస్తారో అలాగే మీరూ జీవించండి. మాంద్యం ప్రభావం నుంచి బయటపడటానికి తక్షణమే ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను ఆయన సూచించారు. సొంత కారు ఉన్నవారు వెంటనే ఉబర్ (Uber) వంటి సేవల్లో చేరి అదనపు ఆదాయాన్ని సంపాదించాలని సూచించారు.

👉ప్రపంచ ఆర్థిక సంక్షోభం సమయంలో, అనేక ఆస్తుల ధరలు తగ్గుతాయి. తక్కువ ధరకు మంచి ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు వస్తాయి. ఈ సమయంలో రియల్ ఎస్టేట్ వంటి ఆస్తులు కొనుగోలు చేస్తే.. భవిష్యత్తులో మరింత ధనవంతులు అవ్వొచ్చు. నేను మూడు ఆర్థిక సంక్షోభాల సమయంలో ఈ సూత్రాన్నే పాటించాను.

👉ఆర్థిక పతనాలు ఒక్కరోజులో జరగవని, దశాబ్దాల పాటు నిర్మాణం చెందుతాయని కియోసాకి పేర్కొన్నారు. 1965లో అమెరికా నాణేల్లో వెండిని తొలగించడం, 1971లో నిక్సన్ ప్రభుత్వం డాలర్‌ను బంగారం ప్రమాణం నుంచి వైదొలగించడం వంటి చరిత్రాత్మక సంఘటనలు ప్రపంచ ఆర్థిక నిర్మాణాన్ని మార్చేశాయని చెప్పారు.

👉ప్రభుత్వాలు అతిగా డబ్బు ముద్రిస్తే దాని ఫలితం అధిక ద్రవ్యోల్బణం (Hyper-Inflation) అని అంటారు. ఇదే జరిగితే డబ్బు విలువ బాగా పడిపోతుంది. అవసరమైన వస్తువుల ధరలు భారీగా పెరుగుతాయి. ప్రజల జీవితం చాలా ఖరీదవుతుంది. కాబట్టి నా సూచన ఏమిటంటే.. బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఇథీరియం కొనండి.

👉మాటలను నియంత్రించుకోవాలి. ''మీరు మాట్లాడే మాటలే మీరు'' అవుతారని కియోసాకి అన్నారు. రిచ్ డాడ్ (ధనిక తండ్రి).. తన కొడుకు నుంచి చేతకాదు, చేయలేను.. అనే మాటలను ఒప్పుకోరు. ఎందుకంటే మాటలే మనల్ని నియంత్రిస్తాయని అంటారు. పూర్ డాడ్ (పేద తండ్రి).. పదేపదే నేను చేయలేను అని చెప్పేవారు. ఆయన ఆ మాటలకే కట్టుబడిపోయారు. దీంతో ఆయన ఎంత డబ్బు సంపాదించినా జీవితాంతం పేదవాడిగానే ఉండిపోయారని కియోసాకి పేర్కొన్నారు.


English Translation
Rich Dad Poor Dad Author Robert Kiyosaki 10 Economics Lesson

Rich Dad giving advice on world economy, investment The author of Poor Dad 'Robert Kiyosaki'.. is active on his ex's account.. How to become rich?, where to invest. As a part of this, some economic lessons have been revealed in recent times.

👉 Kiyosaki's first suggestion is to invest in fuels like oil and natural gas. Rapid advances in artificial intelligence will significantly increase global energy demand and traditional energy producers will benefit, he revealed, investing in the energy sector itself.

👉Losers always cling to old ideas. Start thinking like a winner. Stop holding onto money and become a winner when the world economy collapses. In Rich Dad Poor Dad published in 1996.. I warned that “thrifters will lose”. Financial writer Robert Kiyosaki says to prepare for the global financial collapse by developing entrepreneurial skills through network marketing businesses.

👉Live as the rich do when the economy collapses. He suggested ways to increase income immediately to overcome the impact of recession. Those who own a car are advised to immediately join services like Uber and earn extra income.

👉During the global financial crisis, many property prices fall. There will be opportunities to buy good properties at low prices. If you buy assets like real estate at this time, you can become richer in the future. I followed this principle during the three financial crises.

👉 Kiyosaki stated that financial collapses do not happen overnight, but build up over decades. He said that historical events such as the removal of silver from American coins in 1965 and the withdrawal of the dollar from the gold standard by the Nixon government in 1971 changed the world economic structure. If this happens, the value of money will drop drastically. The prices of essential commodities will increase drastically. People's lives are very expensive. So my suggestion is.. buy gold, silver, bitcoin, ethereum.

👉Control words. Kiyosaki said, "You become what you say." Rich Dad (Rich Dad).. will not accept the words "I can't" or "I can't" from his son. Because it is said that words control us. Poor dad (poor father).. repeatedly said I can't do it. He adhered to those words. Kiyosaki stated that no matter how much money he earned, he remained poor for the rest of his life.