హైదరాబాద్ సిటీ, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి):హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లలో పోలీసులు వీకెండ్ స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్‌లో మద్యం తాగి వాహనాలు నడుపుతూ 403 మంది, సైబరాబాద్‌లో 409 మంది పట్టుబడ్డారని, వారిపై కేసులు నమోదు చేశామని అధికారులు వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు. హైదరాబాద్ లో పట్టుబడిన వారిలో 320 మంది ద్విచక్రవాహనదారులు, 23 మంది ఆటో డ్రైవర్లు, 59 మంది కార్లు, భారీ వాహనాల డ్రైవర్లు ఉన్నారు. సైబరాబాద్ లో 290మంది ద్విచక్రవాహనదారులు, 23మంది ఆటో డ్రైవర్లు, 95 మంది కార్లు నడుపుతున్న వారు, భారీ వాహనం డ్రైవర్ ఉన్నారని పేర్కొన్నారు. సైబరాబాద్ కేసులను విచారించిన న్యాయస్థానం ఇద్దరికి జరిమానా, జైలు శిక్ష, సామాజిక సేవ చేయాలని తీర్పు చెప్పిందని పోలీసులు తెలిపారు.
English Translation
Hyderabad City, December 21 (Andhra Jyoti):Police conducted weekend special drunken drive checks in Hyderabad and Cyberabad Commissionerates. In separate statements, the officials revealed that 403 people were caught driving under the influence of alcohol in Hyderabad and 409 people were caught in Cyberabad and cases were registered against them. Among those caught in Hyderabad are 320 two-wheeler drivers, 23 auto drivers, 59 car and heavy vehicle drivers. It is stated that there are 290 two-wheeler riders, 23 auto drivers, 95 car drivers and heavy vehicle drivers in Cyberabad. Police said that the court which heard the cases in Cyberabad has sentenced the two to fine, imprisonment and social service.