హైదరాబాద్, డిసెంబర్ 22:సీఎం రేవంత్ రెడ్డిపై (CM Revanth Reddy) మాజీ మంత్రి హరీష్ రావు హాట్ కామెంట్స్ చేశారు. సోమవారం నాడు మీడియాతో మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి... రేపు ఏ పార్టీలో ఉంటాడో తెలియదని అన్నారు. రేవంత్ రెడ్డికి నీతి జాతి ఏమైనా ఉందా అని నిలదీశారు. కేసీఆర్ స్టేట్స్‌మెన్‌లా మాట్లాడితే.. రేవంత్ స్ట్రీట్ రౌడీ మాదిరి మాట్లాడారని విమర్శించారు. త్యాగాల చరిత్ర తమది అని.. వెన్నుపోటుకు మారు పేరు రేవంత్ రెడ్డి అని కామెంట్స్ చేశారు. సంకుచిత, మరగుజ్జు మనస్తత్వంతో ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌ను తెలంగాణ ద్రోహిగా కేసీఆర్ ప్రజల ముందు నిలబెట్టారని అన్నారు.
కేసీఆర్ ప్రజల పక్షాన ప్రశ్నిస్తే.. సీఎం, నీళ్ళ మంత్రికి ఎందుకంత నొప్పి అని నిలదీశారు. ఎవరి ఒత్తిడితో నీటి వాటాను తగ్గించుకున్నారని ప్రశ్నించారు. 45 టీఎంసీలకు.. మంత్రి ఉత్తమ్ స్వయంగా తన దస్తూరితో కేంద్రానికి లేఖ రాశారని చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఉత్తర కుమారుడిలా మిగిలిపోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అనుభవమంతా దోపిడికి, లూటీకి పనికొస్తుందంటూ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేను కొంటూ రూ.50 లక్షలతో పట్టపగలు దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని అన్నారు.
రూ.50 కోట్లకు రేవంత్ పీసీసీ పదవి కొనుకున్నాడని కోమటిరెడ్డి వెంకటరెడ్డే చెప్పారని గుర్తుచేశారు. రేవంత్‌కు ఒక స్టాండ్, సిద్దాంతం, పద్ధతి లేదన్నారు. ధాన్యం, డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణను నంబర్ వన్ చేసిందే కేసీఆర్ అని అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఇప్పుడైనా ప్రిపేర్ అయ్యి ప్రెస్‌మీట్స్ నిర్వహించాలని ఎద్దేవా చేశారు. నీళ్ళ మంత్రి ఉత్తమ్‌కు సగం సగం నాలెడ్జ్ మాత్రమే ఉందంటూ మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్స్ చేశారు.
ఇవి కూడా చదవండి...
Read LatestTelangana NewsAndTelugu News
English Translation
Hyderabad, December 22:Former minister Harish Rao made hot comments on CM Revanth Reddy. Speaking to the media on Monday... Revanth Reddy... said that he does not know which party he will be in tomorrow. Revanth Reddy denied whether he has any ethics. If KCR spoke like a statesman, Revanth criticized that he spoke like a street rowdy. They commented that the history of sacrifices is theirs.. Vennupotu's nickname is Revanth Reddy. He commented that the Chief Minister is acting with a narrow and dwarf mentality. He said that Revanth was held in front of the people by KCR as a traitor of Telangana.
If KCR is questioned on behalf of the people.. He deposed that the CM and Water Minister are in pain. He asked under whose pressure the share of water was reduced. For 45 TMCs.. Minister Uttam himself said that he wrote a letter to the center with his secretary. Uttam Kumar Reddy. He commented that all the experience of Congress is used for looting and looting. He said that it was Revanth Reddy who was found in broad daylight with Rs.50 lakh for buying the MLA.
Komatireddy Venkataredde said that Revanth had bought the post of PCC for Rs.50 crore. He said that Revanth does not have a stand, theory or method. He said that it was KCR who made Telangana number one in the production of grain and doctors. Uttam Kumar Reddy.. He urged to prepare now and hold press meets. Former Minister Harish Rao commented that Water Minister Uttam has only half knowledge.
Also Read...
Read LatestTelangana NewsAndTelugu News