మతిస్థిమితం సరిగా లేని ఓ వ్యక్తి రైలులో అలజడి సృష్టించాడు. లేడీస్ కోచ్‌లోకి ఎక్కిన ఆ వ్యక్తి మహిళలతో గొడవపెట్టుకున్నాడు. ఓ యువతిని రైలులో నుంచి కిందకు తోసేశాడు. దీంతో ఆ యువతి తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన మహారాష్ట్రలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన శ్వేత మహాదిక్ అనే యువతి డిసెంబర్ 18వ తేదీ(గురువారం)న ఖార్‌ఘర్‌లో ఉన్న కాలేజీకి వెళ్లడానికి ఉదయం 8 గంటల ప్రాంతంలో పన్వేల్ టు సీఎస్ఎమ్‌టీ వెళ్లే లోకల్ ట్రైన్ ఎక్కింది. కొద్దిదూరం వెళ్లిన తర్వాత షేక్ అక్తర్ నవాజ్ అనే వ్యక్తి లేడీస్ కోచ్‌లోకి వచ్చాడు.


ఇది గమనించిన మహిళలు అతడిని అడ్డుకున్నారు. కిందకు దిగమని చెప్పారు. అతడు వారి మాటలు వినలేదు. వారితో గొడవ పెట్టుకున్నాడు. వారిని ఇష్టం వచ్చినట్లుగా తిట్టాడు. మహిళలపై దాడి చేయటం మొదలెట్టాడు. ఈ నేపథ్యంలో అక్తర్.. శ్వేతను ట్రైన్‌నుంచి కిందకు తోసేశాడు. తోటి ప్రయాణీకులు వెంటనే రైల్వే హెల్ప్ లైన్ నెంబర్‌కు ఫోన్ చేశారు. హుటాహుటిన స్పందించిన రైల్వే పోలీసులు శ్వేత కోసం వెతుకులాట మొదలుపెట్టారు. ఆమె ఎక్కడా కనిపించలేదు. అయితే, పన్వెల్‌కు 1.5 కిలోమీటర్ల దూరంలో రైల్వే ట్రాక్‌పై శ్వేత పడిపోయి ఉండటం స్థానికులు చూశారు. పోలీసులు అక్కడికి రాకముందే స్పృహ లేకుండా పడి ఉన్న ఆమెను దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.


ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, ఖందేశ్వర్ పోలీసులు అక్తర్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అతడిపై అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వైద్య పరీక్షల కోసం అక్తర్‌ను జేజే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతడ్ని పరీక్షించిన వైద్యులు మతి స్థిమితం సరిగా లేదని గుర్తించారు. పోలీసులు డిసెంబర్ 19వ తేదీన అక్తర్‌ను పన్వెల్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతడికి మూడు రోజుల పోలీస్ కస్టడీ విధించింది.


ఇవి కూడా చదవండి


English Translation

A demented person created a commotion in a train. The man boarded the ladies coach and got into a fight with the ladies. He pushed a young woman down from the train. As a result, the young woman was seriously injured. This incident came to light in Maharashtra of late. If we go into the full details about this... a young woman named Shweta Mahadik from Mumbai boarded a local train going from Panvel to CSMT at around 8 am to go to her college in Kharghar on 18th December (Thursday). After going a short distance, a man named Sheikh Akhtar Nawaz entered the ladies' coach.


The women noticed this and stopped him. They told me to get down. He did not listen to them. He quarreled with them. He cursed them at will. He started attacking women. In this background, Akhtar pushed Shweta down from the train. Fellow passengers immediately called the railway helpline number. The railway police immediately responded and started searching for Shweta. She was nowhere to be seen. However, the locals saw Shweta falling on the railway track about 1.5 km from Panvel. Before the police arrived, she was taken to the nearest hospital, lying unconscious.


Currently, her health condition seems to be stable. Khandeshwar police took Akhtar into custody and took him to the station. A case of attempt to murder has been registered against him and investigation has been started. Akhtar was taken to JJ Hospital for medical examination. The doctors who examined him found that he was not mentally stable. The police produced Akhtar in the Panvel court on December 19. The court remanded him in police custody for three days.


Also read