ఇంటర్నెట్ డెస్క్: మన దేశంలో మహిళల క్రికెట్‌ ఒకప్పటిలా లేదు. చాలా మారింది. ఇంకా మారుతుంది కూడా. అభిమానులు మైదానాలకు వస్తున్నారు. ఆటను ఆస్వాదిస్తున్నారు. ఎన్నడూ లేని ప్రోత్సాహమూ లభిస్తోంది. కానీ ఎంత పురోగతి సాధించినా ఏదో వెలితి. ఏదో తెలియని అసంతృప్తి. దేశంలో క్రికెట్‌ రూపురేఖల్ని మార్చేసిన కపిల్స్‌ డెవిల్స్‌ ‘83’ విజయంలా.. భారత మహిళల క్రికెట్‌కు ఓ కిక్కిచ్చే భారీ విజయం దక్కలేదన్న వేదన అది. కానీ ఆ అసంతృప్తికీ.. ఆ నిరాశకు ఈ ఏడాది తెర పడింది. దశాబ్దాల నిరీక్షణ ముగిసింది. భారత మహిళల స్వప్నం సాకారమైంది. సౌతాఫ్రికాతో ఆఖరి పోరాటంలో చిరస్మరణీయ ప్రదర్శన చేసిన వేళ.. కలల కప్పు అందింది. సొంతగడ్డపై, వేలాది ప్రేక్షకుల మధ్య హర్మన్‌సేన ప్రపంచ కప్పును ముద్దాడింది సంబరంగా.. సగర్వంగా!


ఫైనల్లో భారత అమ్మాయిల ఆట అదరహో! అనూహ్యంగా జట్టులోకి వచ్చిన షెఫాలి వర్మ ఆశించినట్లే బ్యాటుతో చెలరేగిపోయింది. అనుకోని విధంగా బంతితోనూ మాయ చేసింది. ఇంకో అద్భుతం దీప్తి. అమూల్యమైన అర్ధసెంచరీ చేయడమే కాదు.. అయిదు వికెట్లతో ప్రత్యర్థి పతనాన్ని శాసించింది. స్మృతి, రిచా కూడా విలువైన ఇన్నింగ్స్‌ ఆడగా.. నిలకడైన ప్రదర్శనను కొనసాగించిన తెలుగమ్మాయి శ్రీచరణి ఫైనల్లోనూ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టిపడేసింది. ఫలితం దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో మట్టికరిపించిన భారత మహిళల జట్టు.. మొట్టమొదటిసారి జగజ్జేతగా నిలిచింది.


షెఫాలీ.. ది క్రికెట్ బ్యూటీ!

దక్షిణాఫ్రికా జట్టు కలలో కూడా అనుకోని ఉండదు.. షెఫా(Shafali Verma)లీ బౌలింగ్‌లో దెబ్బతింటానని! అనూహ్యంగా జట్టులోకి రావడమే ఆశ్చర్యకరం అనుకుంటున్న సమయంలో ఆల్‌రౌండర్ షోతో అద్భుత ప్రదర్శన చేసింది. ఆది నుంచి చక్కని బ్యాటింగ్‌ను కొనసాగించిన ప్రొటీస్ కెప్టెన్ లారా.. లుజ్‌ (25)తో కలిసి ఇన్నింగ్స్‌ను నడపించడంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ సాఫీగా సాగింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ అనూహ్యంగా షెఫాలికి బంతినివ్వడంతో ఆ మ్యాచ్‌ స్వరూపమే మారిపోయింది. షెఫాలి తన వరుస ఓవర్లలో లుజ్, కాప్‌ను ఔట్‌ చేసి ప్రత్యర్థికి షాకిచ్చింది. అటు బ్యాట్‌తోనూ చెలరేగి ఆడిన షెఫాలీ(82).. భారత్‌కు శుభారంభాన్ని అందించింది.


దీప్తి మ్యాజిక్!

ఫైనల్లో షెఫాలి అద్భుత ఆరంభాన్నిచ్చింది. కానీ ఆమె ఔటైపోయాక ఇన్నింగ్స్‌ గాడి తప్పింది. సెమీస్‌లో గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడిన జెమీమా, హర్మన్‌ విఫలమయ్యారు. అయినా స్కోరు 300కు చేరువైందంటే కారణం.. దీప్తి శర్మ. విలువైన అర్ధశతకంతో ఆమె(Deepti Sharma) మధ్య ఓవర్లలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లింది. టోర్నీలో ఇలాగే మరి కొన్ని మ్యాచ్‌ల్లోనూ దీప్తి విలువైన ఇన్నింగ్స్‌లు ఆడింది. మొత్తంగా 9 మ్యాచ్‌ల్లో 215 పరుగులు చేసింది. ఇక బంతితో అయితే ఫైనల్లో దీప్తి గొప్ప ప్రదర్శనే చేసింది. ఏకంగా 5 వికెట్లు పడగొట్టింది.


సీనియర్లు కప్పును ముద్దాడిన వేళ..

ఝులన్ గోస్వామి, మిథాలీ రాజ్ వంటి దిగ్గజాలు వేసిన బాటలోనే పయనిస్తూ.. వారు కన్న కలను ప్రస్తుత టీమిండియా అమ్మాయిలను సాకారం చేశారు. మైదానంలో సీనియర్లు కప్పు అందుకున్న వేళ.. వారి కళ్లతో పాటు ప్రతి అభిమాని హృదయం ధ్రవించింది.


సెమీ ఫైనల్‌లో బలమైన ఆస్ట్రేలియాను మట్టికరిపించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన జెమీమా రోడ్రిగ్స్.. జట్టును ఈ స్థాయిలో నిలబెట్టిన కోచ్ అమోల్ మజుందార్.. చెప్పుకుంటూ పోతే ఈ విజయంలో హీరోలెందరో! మొత్తానికి రాబోయే తరానికి మన అమ్మాయిలే ఆదర్శం అనడంలో సందేహమే లేదు!


English Translation

Internet Desk: Women's cricket in our country is not what it used to be. A lot has changed. It also changes. Fans are coming to the grounds. Enjoying the game. There is encouragement like never before. But no matter how much progress is made, something emerges. Something unknown unhappiness. Like Kapil's Devils '83's victory which changed the face of cricket in the country... It is the agony that Indian women's cricket did not get a huge victory. But that dissatisfaction... that disappointment has come to an end this year. The wait of decades is over. The dream of Indian women has come true. When he gave a memorable performance in the final match against South Africa.. the cup of dreams came true. On home ground, Harmansena kissed the world cup amidst thousands of spectators. Shefali Verma, who came into the team unexpectedly, exploded with the bat as expected. Unexpectedly, she did tricks with the ball. Deepti is another miracle. Not only scored a priceless half-century, but ruled the opponent's downfall with five wickets. While Smriti and Richa also played valuable innings, Telugammai Sricharani, who continued her consistent performance, tied the opponent with her tight bowling in the final as well. The result was the Indian women's team who defeated South Africa by 52 runs.. won the title for the first time.


Shefali.. The Cricket Beauty!

The South African team never thought that Shafali Verma would be hurt by Lee's bowling! The all-rounder put on a brilliant show at a time when it was a surprise to come into the team unexpectedly. South Africa's innings went smoothly as Proteas captain Laura, who continued to bat well from the start, led the innings along with Luz (25). Captain Harmanpreet unexpectedly gave the ball to Shefali which changed the nature of the match. Shefali shocked the opponent by dismissing Luz and Kap in his consecutive overs. And Shefali (82), who played brilliantly with the bat, gave India a good start. Magic!

Shefali made a fantastic start in the finals. But when she got out, the innings got lost. Jemima and Harman, who played great innings in the semis, failed. But the reason why the score is close to 300 is.. Deepti Sharma. She (Deepti Sharma) took the innings forward in the middle overs with a valuable half-century. Deepthi played valuable innings in some matches in the tournament as well. She scored 215 runs in 9 matches. But with the ball, Deepti did a great job in the final. 5 wickets taken simultaneously.


When seniors kiss the cup..

Jhulan Goswami, Mithali Walking in the path laid by giants like Raj.. they made the dream of the current team India girls come true. When the seniors received the cup on the field.. their eyes and every fan's heart broke.


Jemima Rodrigues who played a key role in the team's victory by defeating the strong Australia in the semi-final.. Coach Amol Mazumdar who kept the team at this level.. If you say so, there are many heroes in this victory! There is no doubt that our girls are role models for the coming generation!